Ather Energy Offers: ఏథర్ దీపావళి సేల్.. ఈ స్కూటర్లపై వేలల్లో డిస్కౌంట్లు, ఆఫర్లు..!

Ather Energy Offers: దీపావళి సందర్భంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ తన కొన్ని ఉత్పత్తులపై డిస్కౌంట్లను ప్రకటించింది.

Update: 2024-10-26 14:30 GMT

Ather Energy Offers: ఏథర్ దీపావళి సేల్.. ఈ స్కూటర్లపై వేలల్లో డిస్కౌంట్లు, ఆఫర్లు..!

Ather Energy Offers: దీపావళి సందర్భంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ తన కొన్ని ఉత్పత్తులపై డిస్కౌంట్లను ప్రకటించింది. కొన్ని పాపులర్ మోడళ్లపై ఊహించని తగ్గింపులను తీసుకొచ్చింది. ఏథర్ ఎనర్జీ దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ కంపెనీ. వీటిలో చాలా ఉత్పత్తులు భారతీయ మార్కెట్లో విడుదలయ్యాయి. ఈ కంపెనీ 450X,  450 అపెక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై దీపావళి ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. నగదు తగ్గింపు, వారంటీపై ఆఫర్‌లు, ఉచిత ఏథర్ గ్రిడ్ ఛార్జింగ్ వంటి అనేక రకాల ఫీచర్‌లను కంపెనీ అందిస్తోంది. మీరు దీపావళికి ఒక ప్రత్యేక ఎలక్ట్రిక్ స్కూటర్‌ని కొనాలనే ప్లాన్ చేస్తుంటే మీరు ఏథర్ ఎనర్జీ  ఈ మోడళ్లను చెక్ చేయండి.

Ather 450X

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై కంపెనీ రూ. 25000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో ప్రో ప్యాక్ యాక్సెసరీలు ఉన్నాయి. దీని విలువ రూ. 15000. ఇది కాకుండా కంపెనీ గ్యారెంటీ బెనిఫిట్స్ కూడా అందిస్తోంది. ఇందులో 8 సంవత్సరాల వారంటీ కూడా ఉంటుంది. దీనికి అదనంగా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. 

ఇది కాకుండా ఒక సంవత్సరం పాటు ఏథర్ గ్రిడ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. దీని విలువ రూ. 5000. దీపావళికి ముందు ఏథర్ ఎనర్జీ  ఏదైనా ఎలక్ట్రిక్ స్కూటర్‌ని కొంటే రూ. 5000 వరకు ఫ్లాట్ క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది. మీరు EMI  ద్వారా కొంటే ఎంపిక చేసిన క్రెడిట్ కార్డ్‌లపై రూ. 10,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందచ్చు.

కంపెనీ ఇటీవలే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ. 25,000 వరకు మొత్తం ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని పండుగ సీజన్‌లో రీడీమ్ చేసుకోవచ్చు. ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లకు మార్కెట్‌లో ఈ స్కూటర్లకు మంచి డిమాండ్ ఉంది.

Ather 450X - Ather 450 Apex

అపెక్స్ 450X 2.9 kWh, 3.7 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. రేంజ్ గురించి చెప్పాలంటే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు వివిధ బ్యాటరీలపై 111 నుండి 150 కి.మీల రేంజ్ అందిస్తాయి. వీటి గరిష్ట వేగం గంటకు 90 కిమీ. ఇది కాకుండా ఏథర్ 450 అపెక్స్ 157 కిమీ రేంజ్ కలిగి ఉంది. దాని గరిష్ట వేగం 100 కిమీ.

స్కూటర్‌లో 7 అంగుళాల TFT స్క్రీన్ ఉంది. ఆటో హోల్డ్, ఫాల్ సేఫ్, గూగుల్ మ్యాప్ ప్లాట్‌ఫామ్ ఇంటిగ్రేషన్ అందుబాటులో ఉంది. ఇది కాకుండా మ్యాజిక్ ట్విస్ట్ ఫీచర్ Ather 450 Apexలో ఉంది.

Tags:    

Similar News