Best Selling Scooter In India: అమ్మకాల్లో కింగ్.. మైలేజ్‌లో టాప్.. ఈ స్కూటీని ఎగబడి కొంటున్న జనం..!

Best Selling Scooter In India: యాక్టివా స్కూటర్ బెస్ట్ సెల్లింగ్ టూవీలర్‌గా నిలిచింది. దీని ధర రూ.76 వేల నుంచి ప్రారంభమవుతుంది.

Update: 2024-09-27 12:52 GMT

honda Activa

Best Selling Scooter In India: దేశంలో స్కూటర్ల అమ్మకాలు వేగంగా పెరుగుతున్నాయి. అలానే కొన్ని స్కూటర్లు కూడా బలమైన మార్కెట్‌ను కలిగి ఉన్నాయి. 120 సీసీ నుంచి 125 సీసీ వరకు స్కూటర్ల విక్రయాలు వేగంగా పెరిగాయి. అలానే ఆటో ఇండస్ట్రీలో కొత్త ఫేస్‌లిఫ్టెడ్ మోడల్‌ల రాకతో కస్టమర్‌లకు ఇకపై ఎంపికలకు కొరత లేదు. మార్కెట్లో చాలా వేరియంట్లు ఉన్నప్పటికీ ప్రతి నెలా అమ్మకాల పరంగా అగ్రస్థానంలో ఉండే ఒక స్కూటర్ ఉంది. ప్రతి నెలా ఈ స్కూటర్ అమ్మకాలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి.

గత నెలలో హోండా యాక్టివా 2,27,458 యూనిట్లు విక్రయించగా, గతేడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 2,14,458 యూనిట్లు అమ్ముడయ్యాయి.ఈసారి కంపెనీ మరో 12,586 యూనిట్లను విక్రయించింది. టీవీఎస్ జూపిటర్ రెండో స్థానంలో నిలిచింది. గత నెలలో 89,327 యూనిట్ల జూపిటర్ బైక్ లు  విక్రయించగా, సుజుకి యాక్సెస్ 62,433 యూనిట్లు అమ్ముడయ్యాయి. యాక్టివా స్కూటర్ అమ్మకాలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఈ స్కూటర్ ధర రూ.76 వేల నుంచి ప్రారంభమవుతుంది.

దీని ఇంజన్ గురించి మాట్లాడితే హోండా యాక్టివాలో 110cc 4 స్ట్రోక్ ఇంజన్ ఉంది. ఇది 5.77 KW పవర్, 8.90Nm టార్క్ ఇస్తుంది. ఈ ఇంజన్ సహాయంతో మెరుగైన పవర్, మంచి మైలేజీ కూడా లభిస్తుంది. ఈ స్కూటర్ ఒక లీటర్‌లో 50 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.

ఈ స్కూటర్‌లో 12 అంగుళాల టైర్లు అందుబాటులో ఉన్నాయి. ఇది కాకుండా సామాను నిల్వ చేయడానికి 5.3 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంది. రోజువారీ వినియోగానికి, ఆఫీసుకు వెళ్లేందుకు ఇది మంచి స్కూటర్. ఇది సిటీ, జాతీయ రహదారిపై మంచి స్కూటర్ అని నిరూపించకుంటుంది. కానీ నగరంలో తక్కువ దూరాలకు ఉపయోగించడం మాత్రమే ప్రయోజనకరంగా ఉంటుంది.

TVS జూపిటర్‌తో హోండా యాక్టివా ప్రత్యక్ష పోటీని ఎదుర్కోంటుంది. జూపిటర్ ఇప్పుడు కొత్త అవతార్‌లో వచ్చింది. దాని డిజైన్, ఇంజిన్‌లో పెద్ద మార్పులు చేయబడ్డాయి. ఇంజన్ గురించి మాట్లాడితే కొత్త జూపిటర్ 110 స్కూటర్‌లో ఇప్పుడు కొత్త ఇంజన్‌ని ఏర్పాటు చేశారు. ఈ స్కూటర్‌లో 113.3cc సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఉంది.

ఇది ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీతో వస్తుంది. 5.9kw పవర్, 9.8 NM టార్క్‌ను అందిస్తుంది. ఇందులో సివిటి గేర్‌బాక్స్ సౌకర్యం ఉంది. కొత్త జూపిటర్ 110 ఎక్స్-షోరూమ్ ధర రూ.73,700. ఇన్ఫినిటీ ఎల్‌ఈడీ ల్యాంప్, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్‌ఈడీ టైల్‌లైట్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ దియా, మొబైల్ ఛార్జింగ్, ఫైండ్ మై వెహికల్, డిస్టెన్స్ టు ఎంప్టీ, యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ, వాయిస్ అసిస్ట్, హజార్డ్ లైట్స్ వంటి ఫీచర్లు జూపిటర్ ముందు భాగంలో అందుబాటులో ఉన్నాయి.

Tags:    

Similar News