Car Tips: కారుకి సంబంధించి ఈ విషయంలో 99% మంది తప్పు చేస్తున్నారు.. అదేంటంటే..?

Car Tips: కొంతమంది లక్షలు ఖర్చుపెట్టి కార్లని కొంటారు కానీ వాటికి సంబంధించిన కొన్ని జాగ్రత్తలని విస్మరిస్తారు. ఇప్పటికీ చాలామందికి కారు డోర్‌ తెరిచే విధానం తెలియదు.

Update: 2023-07-30 15:30 GMT

Car Tips: కారుకి సంబంధించి ఈ విషయంలో 99% మంది తప్పు చేస్తున్నారు.. అదేంటంటే..?

Car Tips: కొంతమంది లక్షలు ఖర్చుపెట్టి కార్లని కొంటారు కానీ వాటికి సంబంధించిన కొన్ని జాగ్రత్తలని విస్మరిస్తారు. ఇప్పటికీ చాలామందికి కారు డోర్‌ తెరిచే విధానం తెలియదు. దీనివల్ల చాలాసార్లు రద్దీగా ఉండే ప్రదేశాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. వీరి అజాగ్రత్త వల్ల నిండు ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. అందుకే కారు డోర్‌ తెరిచే విధానం గురించి ఈ రోజు తెలుసుకుందాం.

కారు డోర్ చాలా జాగ్రత్తగా తెరవాలి. ఎందుకంటే చిన్న అజాగ్రత్త పెద్ద ప్రమాదానికి దారి తీస్తుంది. ఇప్పటికీ కారు డోర్ ఏ చేత్తో తెరవాలో చాలా మందికి తెలియదు. వాస్తవానికి డ్రైవర్ తన ఎడమ చేతితో కారు డోర్‌ ఓపెన్‌ చేయాలి. దీనివల్ల కారు నుంచి బయటకు వెళ్లేటప్పుడు బ్యాలెన్సింగ్‌గా ఉంటుంది. అంతేకాకుండా కారు డోర్‌ను సురక్షితమైన పద్ధతిలో ఓపెన్‌ చేస్తారు. ఎందుకంటే డోర్ తెరవడానికి శరీరాన్ని కారు నుంచి బయటకు వంచవలసి ఉంటుంది.

కారు డోర్ తెరవడానికి డ్రైవర్ తన ఎడమ చేతిని ముందుకు కదిలించినప్పుడు అతను డోర్ వైపు కొద్దిగా వంగాలి. ఈ సమయంలో డ్రైవర్ కళ్లు ఆటోమేటిక్‌గా కారు ఓఆర్‌వీఎంపై పడుతాయి. దీనివల్ల వెనుక నుంచి వచ్చే వాహనాలని గమనిస్తాడు. ఏదైనా వాహనం లేదా మనుషులు వస్తున్నట్లయితే డోర్‌ ఓపెన్‌ చేయకుండా ఆగుతాడు. దీనివల్ల ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉంటుంది. అలాగే డ్రైవర్‌ కుడిచేత్తో డోర్‌ తెరవలేడు. ఎందుకంటే అటు వైపున చేయి ఇరుకుగా ఉంటుంది. దీనివల్ల డోర్‌ ఓపెన్‌ చేయడం కష్టంగా మారుతుంది.

ఈ విషయాలను గుర్తుంచుకోండి

1. కారు తలుపును జాగ్రత్తగా తెరవాలి. ఎందుకంటే చిన్న అజాగ్రత్త ప్రమాదానికి దారి తీస్తుంది.

2. డ్రైవర్ తన ఎడమ చేతితో కారు డోర్‌ తెరవాలి.

3. ఎడమ చేతితో తలుపు తెరిచినప్పుడు డోర్ వైపు వంగాలి. దీని కారణంగా కళ్ళు ఆటోమేటిక్‌గా కారు ORVMపై పడతాయి.

4. కారు వెనుక నుంచి వాహనం లేదా వ్యక్తి రావడం లేదని తెలుస్తుంది.

Tags:    

Similar News