Luxury MPV: 48-అంగుళాల టీవీ.. 23 వాట్స్ స్పీకర్.. సోఫా లాంటి బలమైన సీట్లు.. కళ్లు చెదిరే ఫీచర్లతో రానున్న లగ్జరీ ఎంపీవీ.. ధరెంతో తెలుసా?
Lexus LM: జపనీస్ వాహన తయారీ సంస్థ లెక్సస్ త్వరలో కొత్త లగ్జరీ MPV- LM ను భారత మార్కెట్లో విడుదల చేయబోతోంది. ఈ మేరకు బుకింగ్‌లు కూడా ప్రారంభించింది.
Lexus LM MPV Bookings Open: జపనీస్ వాహన తయారీ సంస్థ లెక్సస్ త్వరలో కొత్త లగ్జరీ MPV- LM ను భారత మార్కెట్లో విడుదల చేయబోతోంది. ఈ మేరకు బుకింగ్‌లు కూడా ప్రారంభించింది. ఇందులో అల్ట్రా లగ్జరీ ఫీచర్లు అందించింది. MPV అనుభవాన్ని మెరుగుపరచడానికి 48-అంగుళాల టీవీ, 23-స్పీకర్ సౌండ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఈ టీవీ వెనుక కూర్చున్న వారి కోసం ప్రత్యేకంగా అందిచింది. డ్రైవర్ కోసం ముందు రెండు పెద్ద స్క్రీన్లు ఉన్నాయి. ఒకటి డ్రైవర్ డిస్ప్లే, మరొకటి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ = డిస్ప్లే. క్యాబిన్ క్రీమ్ కలర్ థీమ్‌ను పొందుతుంది. ఈ కారు 4, 6, 7-సీట్ల లేఅవుట్‌లలో (ప్రపంచవ్యాప్తంగా) అందుబాటులో ఉంది. అయితే 4, 6-సీట్ల వేరియంట్‌లు మాత్రమే భారతీయ మార్కెట్ కోసం ప్లాన్ చేసింది.
lexus lm ఇంజిన్..
ప్రపంచవ్యాప్తంగా, లెక్సస్ LM రెండు పవర్‌ట్రెయిన్ ఎంపికలను పొందుతుంది. అవి 2.4-లీటర్ టర్బో మైల్డ్-హైబ్రిడ్, 2.5-లీటర్ స్ట్రాంగ్-హైబ్రిడ్. ప్రస్తుతానికి, కంపెనీ భారతదేశానికి తీసుకురానున్న మోడల్ ఇంజిన్ గురించి సమాచారం ఇవ్వలేదు. కానీ, భారతీయ మోడల్‌ను 2.5 లీటర్, 4 సిలిండర్ డ్యూయల్ VVT-i ఇంజిన్‌తో తీసుకురావచ్చని అంచనా వేస్తున్నారు. ఇది 142 kW పవర్, 242 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.
ఎంత ఖర్చు అవుతుంది?
రెండవ తరం లెక్సస్ LM కూడా టయోటా వెల్‌ఫైర్ కంటే ఎక్కువ ధరను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీని ధర రూ. 1.20 కోట్ల నుంచి రూ. 1.30 కోట్ల మధ్య ఉంటుంది (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది టయోటా వెల్‌ఫైర్‌తో పోటీ పడనుంది. ధర, ఫీచర్ల ప్రకారం, ఇది BMW X7, Mercedes-Benz GLS వంటి 3-వరుస లగ్జరీ SUVలతో కూడా పోటీపడుతుంది.