Weekly Horoscope: వారఫలాలు.. జూన్ 2 నుంచి 8 వరకూ రాశిఫలాలు

Weekly Horoscope: వారఫలాలు.. జూన్ 2 నుంచి 8 వరకూ రాశిఫలాలు

Update: 2024-06-02 00:30 GMT

Weekly Horoscope: వారఫలాలు.. జూన్ 2 నుంచి 8 వరకూ రాశిఫలాలు

(02-06-2024 నుంచి 08-06-2024 వరకు)


మేషం

అనుకూలమైన వారం. ఆటంకాలను తేలిగ్గా అధిగమిస్తారు. ధనలాభం ఉంది. గృహోపకరణాలను సమీకరించుకుంటారు. వాహనయోగం ఉంది. ముఖ్యమైన సమాచారం ఆనందాన్నిస్తుంది. విందుల్లో పాల్గొంటారు. బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు శుభప్రదంగా ఉంటుంది. ఇంటి వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ప్రియమైన వారి కలయిక ఉత్సాహాన్ని పెంచుతుంది. ఆత్మవిశ్వాసం వృద్ధి చెందుతుంది. అనవసర జోక్యాలు వద్దు. ఎవరికీ పూచీలు ఇవ్వకండి. కంటి సమస్యలు నిర్లక్ష్యం చేయకండి.


వృషభం

చేపట్టిన పనులకు ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో నష్టాలూ సంభవిస్తాయి. పరిణామాలు మనసుకి కష్టం కలిగిస్తాయి. కీలక సమయంలో అదృష్టం తోడుగా నిలుస్తుంది. అవసరానికి సరిపడా డబ్బు అందుతుంది. ఇతరుల వ్యవహారాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండండి. బంధువుల్లో ఒకరి ఆరోగ్యం కలవర పరుస్తుంది. ఆస్తి అమ్మే ప్రయత్నాలు వాయిదా వేయండి. కుటుంబ పరిస్థితులు క్రమంగా చక్కబడతాయి. కంటి సంబంధ సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. వేళకు సరైన భోజనం ఉండదు.  


మిథునం

ఆనందదాయక కాలమిది. చేపట్టిన పనులన్నీ విజయవంతం అవుతాయి. అన్నివైపులా సహాయ సహకారాలు లభిస్తాయి. ధనలాభం ఉంది. అభీష్టాలను నెరవేర్చుకుంటారు. విందుల్లో పాల్గొంటారు. సంతానానికి సంబంధించిన శుభవార్త వింటారు. మిత్రులు అన్నివేళలా తోడుగా ఉంటారు. నూతన విజ్ఞాన సముపార్జనకు సరైన సమయమిది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యక్తిగతంగా శారీరక, మానసిక ప్రశాంతతను పొందుతారు. అనూహ్యమైన ఖర్చులుంటాయి. దూర ప్రాంతాలకు వెళ్లే సూచనలు ఉన్నాయి.


కర్కాటకం

అభీష్టం నెరవేరుతుంది. స్థిర చిత్తంతో కార్యాలన్నింట్లో విజయాన్ని అందుకుంటారు. చక్కటి అవకాశాలు వస్తాయి. శత్రువులు తోక ముడుస్తారు. బంధువులను కలుస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. అధికారులు, పెద్దల ఆశీస్సులు అందుతాయి. ఉద్యోగస్తులకు మేలిమి కాలం. నూతన పరిచయాలు ఉపయోగకరంగా ఉంటాయి. బాధ్యతలు పెరుగుతాయి. ఇంట్లో శాంతి నెలకొంటుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.


సింహం

చేపట్టిన కార్యాల్లో సఫలత ఉంటుంది. అభీష్టం నెరవేరుతుంది. వైరి వర్గాలపై విజయం సాధిస్తారు. అధికారులు, పెద్దల అభిమానాన్ని పొందుతారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. పలువురి నుంచి ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక సమస్యలు తీరతాయి. అప్పులు చెల్లించే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంతానం వృద్ధిలోకి రావడం సంతృప్తినిస్తుంది. శుభకార్యాల నిర్వహణ గురించి ఆలోచిస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.  


కన్య

కష్టపడితేనే పనులు సాధ్యపడతాయి. మీ తెలివితేటలతో ఆటంకాలను అధిగమిస్తారు. అభీష్టాన్ని నెరవేర్చుకుంటారు. బంధుమిత్రులతో విందు, వినోదాల్లో పాల్గొంటారు. పెద్దల ఆశీస్సులతో కీలక సమస్యను పరిష్కరించుకుంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ప్రశంసలను పొందుతారు. అవకాశాలను చేజార్చుకోకండి. ఇంట్లో శాంతి నెలకొంటుంది. చెప్పుడు మాటలు వినకండి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి. సంతాన వ్యవహారాలు చికాకుపరుస్తాయి. దూర ప్రదేశాలకు వెళ్లే సూచన ఉంది.  


తుల

శ్రమానంతరం కార్యాలు సఫలం అవుతాయి. డబ్బుకి ఇబ్బంది ఉండదు కానీ, వృథాఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కీలక వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సూచనలను పాటించండి. విజ్ఞానాన్ని పెంచుకునేందుకు అనువైన సమయమిది. బంధువులతోనే కాకుండా ఇతరులతోనూ సత్సంబంధాలు ఏర్పడతాయి. వినోదాల్లో పాల్గొంటారు. వారం ద్వితీయార్థంలో అనుకున్నట్లుగా సౌకర్యాలు సమకూరవు. అధికారుల కోపానికి గురయ్యే సూచనా ఉంది. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అజీర్తి వల్ల చికాకు కలగవచ్చు.  


వృశ్చికం

ఆత్మీయులను కలుస్తారు. విందు వినోదాల్లో ఆనందంగా గడుపుతారు. ధన సంబంధ విషయాలు ఓ కొలిక్కి వస్తాయి. నూతన వస్తువులను కొంటారు. వాహన యోగం ఉంది. జీవిత భాగస్వామి తోడ్పాటుతో కుటుంబ చికాకులను తొలగించుకుంటారు. బంధువులు తోడుగా నిలుస్తారు. ప్రయాణాలు తృప్తినిస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇతరులపై అసూయ, దురభిప్రాయాలను వీడండి. వారం చివరలో తగాదాలు గోచరిస్తున్నాయి. అనవసర వ్యవహారాల్లో తలదూర్చకండి. ఉద్రేకాన్న అణచుకోండి.  


ధనుస్సు

యోగదాయకంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయం సిద్ధిస్తుంది. పూర్వవైభవం సాధించే దిశగా అడుగులు పడతాయి. బంధుమిత్రులు సహకరిస్తారు. ధనసంబంధ చికాకులు తొలగుతాయి. నూతన వస్తుప్రాప్తి ఉంది. విందుల్లో పాల్గొంటారు. శారీరక, మానసిక ప్రశాంతతను పొందుతారు. కీర్తి పెరుగుతుంది. జీవిత భాగస్వామి తోడ్పాటుతో కుటుంబ వ్యవహారాలను చక్కదిద్దుతారు. ప్రయాణాలు వినోదాత్మకంగా సాగుతాయి. కొత్తవారితో సత్సంబంధాలు ఏర్పడతాయి. కీలక వేళల్లో సన్నిహితుల సూచనలు పాటించండి.  


మకరం

అభీష్టం నెరవేర్చుకునేందుకు బాగా శ్రమించాల్సి ఉంటుంది. బుద్ధి నిలకడ లోపించడం ప్రధాన సమస్యగా మారనుంది. ఆర్థిక వ్యవహారాలు కూడా అనుకున్నట్లుగా సాగక పోవడం అశాంతిని కలిగిస్తుంది. సంతానం వ్యవహారాలూ చికాకును కలిగిస్తాయి. మీ తెలివితేటలకు సరైన గుర్తింపు లభించదు. వారాంతానికి పరిస్థితి మెరుగవుతుంది. బంధుమిత్రుల తోడ్పాటుతో కీలక వ్యవహారంలో విజయం సాధిస్తారు. ఆరోగ్యం మెరుగవుతుంది. పుణ్యాకార్యాల్లో పాల్గొంటారు. విలువైన వస్తువులు, డాక్యుమెంట్లను భద్రంగా దాచిపెట్టండి.


కుంభం

పనుల పూర్తికి ఆటంకాలను అధిగమించాల్సి వస్తుంది. ధన సంబంధ సమస్య ఉండదు. నూతన వస్త్రాలను కొంటారు. మానసిక సౌఖ్యం ఉంటుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. ప్రియతముల కలయిక అంతులేని ఆనందాన్నిస్తుంది. ఎదురు చూస్తున్న కీలక సమాచారం అందుతుంది. దాయాదులతో సఖ్యత ఏర్పడుతుంది. వృథా ఖర్చులను తగ్గించండి. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. కీలక వ్యవహారాల్లో సొంత తెలివితేటలను వాడకండి. సన్నిహితుల సూచనలు పాటించండి. వాత సంబంధ సమస్యలొచ్చే వీలుంది.


మీనం

కార్యసాధనలో ఆటంకాలు తప్పవు. వ్యవహార నష్టం ఉంది. ఆచితూచి వ్యవహరించండి. అవసరానికి సరిపడా డబ్బు సమకూరుతుంది. ఆత్మీయుల కలయిక ఊరటనిస్తుంది. మిత్రులు తోడుగా ఉంటారు. వారం మధ్యలో కీలక సమాచారం అందుతుంది. సోదర వర్గం సహకారంతో కుటుంబ వ్యవహారాలు పరిష్కరిస్తారు. ఆస్తి అమ్మే ప్రయత్నాలు అనుకూలించవు. బంధువుల వ్యవహారాల్లో నిర్లక్ష్యం వద్దు. మాట చెల్లుబాటు కాదు. ఎవరికీ పూచీకత్తు ఇవ్వకండి. నిందలు వస్తాయి. కంటి సంబంధ సమస్యలను నిర్లక్ష్యం చేయకండి.

Tags:    

Similar News