Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (28/11/2024)

Telugu Horoscope Today, November 28, 2024: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి గురువారం నాటి రాశిఫలాలు.

Update: 2024-11-27 19:51 GMT

Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (28/11/2024)

Telugu Horoscope Today, November 28, 2024: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి గురువారం నాటి రాశిఫలాలు.

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, కార్తీక మాసం, దక్షిణాయనం, శరదృతువు, కృష్ణ పక్షం

తిధి: త్రయోదశి పూర్తి

నక్షత్రం: చిత్త ఉదయం గం.7.36 ని.ల వరకు ఆ తర్వాత స్వాతి

అమృతఘడియలు: అర్ధరాత్రి గం.12.30 ని.ల నుంచి గం.3.26 ని.ల వరకు

వర్జ్యం: మధ్యాహ్నం గం.1.51 ని.ల నుంచి గం.3.37 ని.ల వరకు

దుర్ముహూర్తం: ఉదయం గం.10.11 ని.ల నుంచి గం.10.59 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.2.40 ని.ల నుంచి గం.3.27 ని.ల వరకు

రాహుకాలం: మధ్యాహ్నం గం.1.27 ని.ల నుంచి గం. 2.54 ని.ల వరకు

సూర్యోదయం: తె.వా. గం. 6.29 ని.లకు

సూర్యాస్తమయం: సా. గం. 5.40 ని.లకు

మేషం

నిజాయితీకి గుర్తింపు లభిస్తుంది. స్వేచ్ఛాజీవితంపై ఆసక్తి పెరుగుతుంది. బంధువులను కలుస్తారు. ఆనందాన్ని పొందుతు. ప్రయాణం లాభిస్తుంది. ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. విందులో పాల్గొంటారు.

వృషభం

వ్యవహారాలన్నీ విజయవంతం అవుతాయి. పోటీదారులపై విజయం సాధిస్తారు. కీలక వివాదం పరిష్కారం అవుతుంది. పోయిన వస్తువు తిరిగి దొరుకుతుంది. మనసు ఉల్లాసంగా ఉంటుంది. ఆరోగ్యం బావుంటుంది.

మిథునం

ఆటంకాలు పెరుగుతాయి. ఆలోచనలు వక్రమార్గంలో సాగుతాయి. ఖర్చులు పెరుగుతాయి. తెలివి తేటలకు గుర్తింపుండదు. గొడవలు వస్తాయి. సంతానం శైలి మనోవ్యధకు కారణమవుతుంది. వాత సమస్య ఉంటుంది.

కర్కాటకం

ప్రయత్నాలు ఫలించవు. బుద్ధి నిలకడగా ఉండదు. అవమానం ఎదురవుతుంది. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. నీటి ప్రవాహాలు, కుంటల దగ్గర జాగ్రత్తగా ఉండాలి. సహచరులే శత్రువులుగా మారతారు.

సింహం

అభీష్టం నెరవేరుతుంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. నాయకత్వ లక్షణాలకు గుర్తింపు లభిస్తుంది. కొత్త బాధ్యతలు చేపడతారు. సోదరులతో సఖ్యత పెరుగుతుంది. మనశ్శాంతిని పొందుతారు.

కన్య

ఇతరుల కారణంగా ఇబ్బందుల్లో పడతారు. ప్రయత్నాలకు ఆటంకాలొస్తాయి. మనసుకి కష్టంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల తీరు బాధిస్తుంది. విడాకుల వ్యవహారం వాయిదా పడుతుంది. వేళకు భోజనముండదు.

తుల 

అన్ని పనులు సజావుగా సాగుతాయి. ధనాదాయం పెరుగుతుంది. విందులకు హాజరవుతారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కొత్త వస్తువులు కొంటారు. కీర్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది.

వృశ్చికం 

అన్ని విషయాల్లోనూ అప్రమత్తంగా ఉండాలి. బంధువులతో విరోధం ఏర్పడుతుంది. అనవసర ఖర్చులు ఉంటాయి. ఇంటికి దూరంగా వెళతారు. కోర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం చేయకండి. బద్ధకాన్ని వదలండి.

ధనుస్సు 

ప్రయత్నం ఫలిస్తుంది. ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. కుటుంబంలో శుభ కార్యం గురించిన పనులు సాగుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆత్మీయులతో విందుకు హాజరవుతారు. ఆకాంక్ష నెరవేరుతుంది.

మకరం

వ్యవహార జయం ఉంది. ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లోని వారు పురోభివృద్ధిని సాధిస్తారు. నిపుణతకు తగ్గ బాధ్యత లభిస్తుంది. విందుకు హాజరవుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

కుంభం

కార్యసాధనకు బాగా శ్రమించాల్సి వుంటుంది. కలహాలకు ఆస్కారముంది. నోటిదురుసు తగ్గించండి. దూర ప్రయాణం గోచరిస్తోంది. కడుపులో ఏదైనా ఇబ్బంది కలగొచ్చు. ఆధ్యాత్మిక చింతన వృద్ధి చెందుతుంది.

మీనం

ఇష్టం లేని పని చేయాల్సి వస్తుంది. చెడు ఆలోచనలను అదుపు చేసుకోవాలి. వేళకు భోజనముండదు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. కీలు సంబంధ సమస్యలుంటాయి.

Tags:    

Similar News