Horoscope: ఈ రోజు మీ రాశిఫలం ఎలా ఉందో చెక్ చేసుకున్నారా?

Horoscope: ఈ రోజు మీ రాశిఫలం ఎలా ఉందో చెక్ చేసుకున్నారా?

Update: 2024-06-06 00:30 GMT

Horoscope: ఈ రోజు మీ రాశిఫలం ఎలా ఉందో చెక్ చేసుకున్నారా?

(తేది 06-06-2024 : గురువారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత రుతువు, కృష్ణ పక్షం

తిధి : అమావాస్య సాయంత్రం గం.6.07 ని.ల వరకు తర్వాత పాడ్యమి

నక్షత్రం: రోహిణి రాత్రి గం.8.16 ని.ల వరకు

అమృతఘడియలు: సాయంత్రం గం.5.12 ని.ల నుంచి గం.6.44 ని.ల వరకు

వర్జ్యం: అర్ధరాత్రి దాటాక గం.1.44 ని.ల నుంచి రేపు తె.వా. గం.3.18 ని.ల వరకు

దుర్ముహూర్తం : ఉదయం గం.10.04 ని.ల నుంచి గం.10.56 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.3.19 ని.ల నుంచి గం.4.11 ని.ల వరకు

రాహుకాలం : మధ్యాహన్ గం.1.54 ని.ల నంచి గం.3.32 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం. 5.41 ని.లకు

సూర్యాస్తమయం : సా. గం.6.49 ని.లకు


మేషం :

కుటుంబ వ్యవహారాలు చికాకు పెడతాయి. ఇతరుల జోక్యం వల్ల ఇంట్లో ఇబ్బందులు పెరుగుతాయి. ప్రతి ఒక్కరితోనూ ఆచితూచి మాట్లాడండి. నిందలు భరించాల్సి వస్తుంది. పార్వతీదేవిని పూజించడం మేలు. 


వృషభం :

చేపట్టిన కార్యాలు సఫలమవుతాయి. ఉద్యోగస్తుల ఆకాంక్ష నెరవేరుతుంది. ఆకస్మిక ధనలాభం గోచరిస్తోంది. గృహోపకరణాలకు వెచ్చిస్తారు. వాహనయోగం ఉంది. కుటుంబ వ్యవహారాలు సజావుగా సాగుతాయి.


మిథునం :

కార్యనష్టం గోచరిస్తోంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. విదేశీ సంబంధాలు బలపడతాయి. అనూహ్య ఖర్చులు చికాకు పెడతాయి. మిత్రుల వ్యవహారాల్లో తొందరపాటు వద్దు.


కర్కాటకం:

ఉల్లాసంగా గడుపుతారు. ఆకాంక్షలు నెరవేరతాయి. ఇష్టమైన వారి కలయిక ఆనందాన్నిస్తుంది. ఆత్మీయులతో పాటు ఇతరులూ సహకరిస్తారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యం బావుంటుంది.


సింహం :

స్థిరనిర్ణయంతో చేపట్టిన పని విజయవంతం అవుతుంది. అధికార వృద్ధి ఉంది. అవకాశాలను వృథా చేసుకోకండి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంట్లో శాంతి ఉంటుంది. మనోవాంఛ సిద్ధిస్తుంది.


కన్య :

ఒడుదుడుకులను అధిగమించి కార్యాలను సాధిస్తారు. ఆత్మీయులే శత్రువులుగా ప్రవర్తించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. బాగా అలసి పోతారు. ప్రతిష్ట పెరుగుతుంది. భవిష్యత్ ప్రణాళికలను రూపొందిస్తారు.


తుల :

పనులు అనుకున్నట్లుగా సాగవు. భాగస్వాములతో సఖ్యత లోపిస్తుంది. తగాదాలూ గోచరిస్తున్నాయి. అధికారుల ఆగ్రహానికి గురయ్యే వీలుంది. కష్టాలు చుట్టుముట్టిన భావన కలుగుతుంది. దుర్గను పూజించండి.


వృశ్చికం :

బంధుమిత్రులతో సమస్యను జీవిత భాగస్వామి తోడ్పాటుతో పరిష్కరిస్తారు. డబ్బుకి ఇబ్బంది ఉండదు. మానసిక ప్రశాంతతను పొందుతారు. అందిరతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ప్రయాణాలు లాభిస్తాయి.


ధనుస్సు :

పనులు సవ్యంగా సాగుతాయి. స్వస్థాన ప్రాప్తి ఉంది. ధనలాభం గోచరిస్తోంది. నూతన వస్తువులను కొంటారు. బంధుమిత్రులు సహకరిస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. శత్రుపీడ తగ్గుతుంది.


మకరం :

అనవసర వివాదాలకు ఆస్కారం ఉంది. అప్రమత్తంగా ఉండాలి. మీ తెలివితేటలకు సరైన గుర్తింపు లభించదు. ఆలోచనలు సవ్యంగా సాగవు. ఖర్చులు మితిమీరతాయి. ఆంజనేయుడిని పూజించండి.


కుంభం :

పనుల పూర్తికి జాప్యం ఏర్పడుతుంది. ధన సంబంధ సమస్యలుంటాయి. గృహ సమస్యలు చికాకు పెడతాయి. అనూహ్య ఖర్చులొస్తాయి. మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి. దత్తాత్రేయుడిని పూజించండి.


మీనం :

కార్యాలన్నీ సఫలం అవుతాయి. విశేష లాభం గోచరిస్తోంది. అభీష్టం నెరవేరుతుంది. వస్త్రాభరణాలను కొనే సూచనలున్నాయి. కుటుంబ వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఆత్మీయుల కలయిక ఆనందాన్నిస్తుంది.

Tags:    

Similar News