Horoscope: ఈ రోజు మీ రాశిఫలం ఎలా ఉందో చెక్ చేసుకున్నారా?

Horoscope: ఈ రోజు మీ రాశిఫలం ఎలా ఉందో చెక్ చేసుకున్నారా?

Update: 2024-06-05 00:30 GMT

Horoscope: ఈ రోజు మీ రాశిఫలం ఎలా ఉందో చెక్ చేసుకున్నారా?

(తేది 05-06-2024 : బుధవారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత రుతువు, కృష్ణ పక్షం

తిధి : చతుర్దశి సాయంత్రం గం.7.54 ని.ల వరకు ఆ తర్వాత అమావాస్య

నక్షత్రం: కృత్తిక రాత్రి గం.9.16 ని.ల వరకు ఆ తర్వాత రోహిణి

అమృతఘడియలు: రాత్రి గం.7.00 ని.ల నుంచి గం.8.31 ని.ల వరకు

వర్జ్యం: ఉదయం గం.9.55 ని.ల నుంచి గం.11.26 ని.ల వరకు

దుర్ముహూర్తం : ఉదయం గం.11.49 ని.ల నుంచి గం.12.41 ని.ల వరకు

రాహుకాలం : మధ్యాహ్నం గం. 12.15 ని.ల నుంచి గం. 1.53 ని.ల వరకు

సూర్యోదయం : ఉ. గం.5.41 ని.లకు

సూర్యాస్తమయం : సా. గం.6.49 ని.లకు


మేషం :

మాట తూలితే అనవసర తగాదాలు వస్తాయి. ఆర్థిక లావాదేవీల్లో అతి జాగ్రత్త అవసరం. ఇతరుల వల్ల ఇబ్బందులుంటాయి. వేళకు భోజనం ఉండదు. హామీల వైఫల్యం వల్ల నిందలొస్తాయి. సూర్యారాధన మేలు. 


వృషభం :

అనుకున్నట్లుగానే పనులు సాగుతాయి. వ్యవహార జయం ఉంది. ఉద్యోగులకు ఆశాజనకంగా ఉంటుంది. విద్యార్థులు రాణిస్తారు. వాహనయోగం ఉంది. ఖర్చులు అదుపు చేయాలి. వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. 


మిథునం :

బంధువులతో సఖ్యత చెడుతుంది. కొన్ని ఘటనలు మనసుని కలవర పరుస్తాయి. ఉద్యోగస్తులు మాట పడే సూచనలున్నాయి. వృథాఖర్చులు మతిమీరతాయి. ప్రతిష్ట కూడా దెబ్బతింటుంది. గణపతిని పూజించండి.  


కర్కాటకం:

రోజంతా సంతోషంగా గడుపుతారు. ఆర్థిక చికాకులు ఉండవు. కొత్త వస్తువులను కొంటారు. అన్ని వర్గాల నుంచి సహకారం లభిస్తుంది. సంతానానికి సంబంధించిన శుభవార్త వింటారు. ఆరోగ్యం బావుంటుంది.


సింహం :

ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. వృత్తికి సంబంధించిన అభీష్టం నెరవేరుతుంది. శత్రువులు తోకముడుస్తారు. అవకాశాలు కలిసొస్తాయి. కుటుంబ వ్యవహారాలు సజావుగా సాగుతాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. 


కన్య :

ఉద్యోగంలో స్వల్ప చికాకులు ఎదురవుతాయి. దూర ప్రాంతానికి వెళ్లాల్సి వస్తుంది. సంతాన వ్యవహారం చికాకు పరుస్తుంది. బలహీనతపై దెబ్బ పడుతుంది. ఆచితూచి వ్యవహరించండి. వేంకటేశుని పూజించండి. 


తుల :

ఇతరులపై దురభిప్రాయాలు చేటు తెస్తాయి. కీలక వ్యవహారాల్లో ఆత్మీయులను సంప్రదించండి. ఖర్చులు మితిమీరతాయి. ఉద్యోగులకు అధికారుల వల్ల సమస్యలుంటాయి. శ్రీనివాసుని పూజించడం మేలు…


వృశ్చికం :

ఇరుగు పొరుగుతో సత్సంబంధాలు ఏర్పడతాయి. అభీష్టం నెరవేరుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. జీవిత భాగస్వామి తోడ్పాటు మేలు చేస్తుంది. విందుల్లో పాల్గొంటారు. శారీరక, మానసిక శాంతిని పొందుతారు.  


ధనుస్సు :

పనులు విజయవంతం అవుతాయి. ఆర్థిక చిక్కులు తొలగుతాయి.రుణ విముక్తి యత్నాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రులు సహకరిస్తారు. కొత్త వస్తువులు కొంటారు. ఆరోగ్యం మెరుగవుతుంది. ప్రతిష్ట పెరుగుతుంది. 


మకరం :

శత్రుపీడ పెరుగుతుంది. అనుమానాలు వీడండి. బద్ధకం మంచిది కాదు. మిత్రుల సూచనలను పాటించండి. సంతాన సంబంధ వ్యవహారాల్లో పురోభివృద్ధి ఉండదు. నిరాశ చెందవద్దు. సుబ్రమ్మణ్యేశ్వరుని పూజించండి.


కుంభం :

పనికి అడ్డంకులుంటాయి. ఇంటి వ్యవహారాలు చికాకు పెడతాయి. డబ్బుకీ కాస్త ఇబ్బందిగా ఉంటుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. నవగ్రహారాధన మేలు.


మీనం :

అన్ని విధాలా శుభప్రదంగా ఉంటుంది. ధనలాభం ఉంది. అగ్రిమెంట్లకు అనువైన రోజిది. ఆశించిన సమాచారం అందుతుంది. మిత్రులు ఉపకరిస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యముంది.

Tags:    

Similar News