Horoscope: ఈ రోజు మీ రాశిఫలం ఎలా ఉందో చెక్ చేసుకున్నారా?

Horoscope: ఈ రోజు మీ రాశిఫలం ఎలా ఉందో చెక్ చేసుకున్నారా?

Update: 2024-06-04 00:30 GMT

Horoscope: ఈ రోజు మీ రాశిఫలం ఎలా ఉందో చెక్ చేసుకున్నారా?

(తేది 04-06-2024 : మంగళ వారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత రుతువు, కృష్ణ పక్షం

తిధి: త్రయోదశి (రాత్రి గం.10.01 ని.ల వరకు)

నక్షత్రం: భరణి రాత్రి గం. 10.35 ని.ల వరకు ఆ తర్వాత కృత్తిక

అమృతఘడియలు: సా. గం.6.05 ని.ల నుంచి గం.7.35 ని.లకు

వర్జ్యం: ఉ. గం.9.05 ని.ల నుంచి గం.10.35 ని.ల వరకు

దుర్ముహూర్తం: ఉ. గం.8.18 ని.ల నుంచి గం.9.11 ని.ల వరకు మళ్లీ రాత్రి గం. 11.09 ని.ల నుంచి గం. 11.53 ని.ల వరకు

రాహుకాలం: సా. గం.3.31 ని.ల నుంచి గం.5.10 ని.ల వరకు

సూర్యోదయం: తె.వా. గం. 5.41 ని.లకు

సూర్యాస్తమయం: సా. గం. 6.48 ని.లకు


మేషం :

శుభ ఫలితాలుంటాయి. మానసిక స్థితి ఉత్సాహంగా ఉంటుంది. వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. ధనలాభం ఉంది. ఉద్యోగస్తులకు అదృష్టం కలిసొస్తుంది. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. ఆరోగ్యం మెరుగవుతుంది.  


వృషభం :

వ్యవహార నష్టం ఉంది. ఆచితూచి వ్యవహరించండి. బంధువులతో విరోధం గోచరిస్తోంది. వృథాఖర్చులను తగ్గించుకోవాలి. జీవిత భాగస్వామి ఉద్యోగం చిక్కుల్లో పడుతుంది. బద్ధకాన్ని వదిలి పెట్టడం మంచిది.


మిథునం :

రోజంతా ఆనందంగా సాగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. బయటివారి నుంచి సహకారం అందుతుంది. కొత్త పరిచయాలు లాభదాయకంగా ఉంటాయి. సంతానం గురించిన శుభవార్తలు వింటారు.  


కర్కాటకం:

కొత్త బాధ్యతలు చేపట్టాల్సి వుంటుంది. జీవిత భాగస్వామి వైపు నుంచి ఆర్థిక లాభం ఉంది. అభీష్టం నెరవేరుతుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఇంట్లో ప్రశాంతత, మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతాయి.


సింహం :

అనుకున్న స్థాయిలో పనులు పూర్తి కావు. అవసరానికి సరిపడా డబ్బే సమకూరుతుంది. ఉద్యోగస్తులు అధికారులతో సఖ్యంగా ఉండాలి. కడుపు సంబంధ సమస్యలు చికాకు పెడతాయి. త్వరగా అలసిపోతారు.


కన్య :

నిర్దేశిత సమయానికి పనులు కాక పోవడం చికాకును పెంచుతుంది. కొన్నింటిని అయిష్టంగానే భరించాల్సి వస్తుంది. ఎవరిపైనా వ్యతిరేక అభిప్రాయాన్ని ఏర్పరచుకోకండి. జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగకండి.  


తుల :

పరిచయాలు పెరుగుతాయి. ప్రయత్నాలన్నీ సానుకూలమవుతాయి. డబ్బుకి ఇబ్బంది ఉండదు. ప్రయాణాలు శుభప్రదంగా సాగుతాయి. బంధువులను కలుస్తారు. జీవిత భాగస్వామి తోడ్పాటు ఉంటుంది. 


వృశ్చికం :

చేపట్టిన పని పూర్తవుతుంది. ఆత్మసంతృప్తి కలుగుతుంది. వైరి వర్గాలపై మీదే పైచేయి అవుతుంది. కీలకమైన కార్యంలో బంధువులు తోడుగా నిలుస్తారు. కొత్త వస్తువులను కొంటారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.  


ధనుస్సు :

సంతానానికి సంబంధించిన చికాకులొస్తాయి. కీలక వ్యవహారాల్లో ఆత్మీయుల సూచనలు పాటించండి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చడం వల్ల తగాదాలు పెరుగుతాయి. అమ్మవారిని పూజించడం మేలు.


మకరం :

అప్రమత్తంగా ఉండాలి. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. భూములపై ఆదాయం ఆశించినరీతిలో అందదు. విద్యారంగంలోని వారికి ప్రతికూలత ఉంటుంది. మానసిక అశాంతి తొలగేందుకు దుర్గమ్మను పూజించండి.  


కుంభం :

విశేష కార్యలాభం ఉంది. శుభఫలితాలను అందుకుంటారు. ఆదాయం మెరుగవుతుంది. కీలకమైన సమాచారం ఆనందాన్నిస్తుంది. ఆత్మధైర్యం పెరుగుతుంది. ఆత్మీయుల ఆకస్మిక కలయిక ఉత్తేజాన్నిస్తుంది.  


మీనం :

చికాకులు తలెత్తుతాయి. చెప్పుడు మాటలు వినకండి. ఇతరులతో ఆచితూచి వ్యవహరించండి. ఇంట్లో సమస్యల పరిష్కారంపై శ్రద్ధ పెట్టండి. ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తత అవసరం. గణపతిని పూజించండి.

Tags:    

Similar News