Horoscope: ఈ రోజు మీ రాశిఫలం ఎలా ఉందో చెక్ చేసుకున్నారా?
Horoscope: ఈ రోజు మీ రాశిఫలం ఎలా ఉందో చెక్ చేసుకున్నారా?
(తేది : 03-06-2024, సోమవారం)
కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత రుతువు, కృష్ణ పక్షం
తిధి : ద్వాదశి అర్ధరాత్రి గం.12.18 ని.ల వరకు ఆ తర్వాత త్రయోదశి
నక్షత్రం: అశ్వని అర్ధరాత్రి గం.12.05 ని.ల వరకు ఆ తర్వాత భరణి
అమృతఘడియలు: సా.గం.5.21 ని.ల నుంచి గం.6.51 ని.ల వరకు
వర్జ్యం: రాత్రి గం.8.21 ని.ల నుంచి గం.9.53 ని.ల వరకు
దుర్ముహూర్తం : మధ్యాహ్నం గం.12.41 ని.ల నుంచి గం.1.33 ని.ల వరకు మళ్లీ గం.3.18 ని.ల నుంచి గం.4.11 ని.ల వరకు
రాహుకాలం : ఉదయం గం.7.19 ని.ల నుంచి గం.8.59 ని.ల వరకు
సూర్యోదయం : ఉ.గం. 5.41 ని.లకు
సూర్యాస్తమయం : సా.గం. 6.48 ని.లకు
మేషం :
పనులు అనుకున్నట్లుగానే జరుగుతాయి. ఉద్యోగస్తులకు శుభప్రదంగా ఉంటుంది. ఇంటి వాతావరణం ఆనందాన్నిస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి. విందుల్లో పాల్గొంటారు. పెద్దల ప్రశంసలు అందుకుంటారు.
వృషభం :
వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. ఉద్యోగస్తులు అధికారుల ఆగ్రహానికి గురయ్యే సూచన ఉంది. అసూయ మంచిది కాదు. కలహాలకు ఆస్కారం ఉంది. అనవసర జోక్యాలకు దూరంగా ఉండండి.
మిథునం :
సంతానం వృద్ధిలోకి రావడం ఆనందాన్నిస్తుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. మిత్రులు తోడుగా నిలుస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. అవసరమైన డబ్బు సమకూరుతుంది. చక్కటి సౌకర్యాలు సమకూరతాయి.
కర్కాటకం:
ఉద్యోగులు అధికారుల ఆదరాభిమానాలను పొందుతారు. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. బంధుమిత్రులతో వినోదంగా గడుపుతారు. చక్కటి అవకాశాలు అందివస్తాయి. ఇంట్లో శాంతి ఉంటుంది. సుఖప్రాప్తి ఉంది.
సింహం :
కార్యనష్టాలు అశాంతికి కారణమవుతాయి. భాగస్వామి సోదరవర్గంతో సఖ్యత చెడుతుంది. శత్రువులదే పైచేయిగా ఉంటుంది. ఇంటికి దూరంగా వెళ్లాల్సి వుంటుంది. బలహీనతలను బయటపెట్టకండి.
కన్య :
పనులు చురుగ్గా సాగవు. జీవిత భాగస్వామి ఆర్థిక లావాదేవీలు చికాకు పెడతాయి. కొన్ని ఇష్టంలేని పనులు చేయాల్సి వస్తుంది. జీర్ణ సంబంధ సమస్యలుంటాయి. తగాదాలకు కారణమయ్యే ఉద్రేకాన్ని అణచుకోండి.
తుల :
అన్ని ప్రయత్నాలూ సఫలం అవుతాయి. అందరితోనూ సత్సంబంధాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామితో సఖ్యత ఉంటుంది. శారీరక, మానసిక శాంతిని పొందుతారు. ప్రయాణాలు ఆనందకరంగా సాగుతాయి.
వృశ్చికం :
కార్యజయం ఉంది. అన్ని వర్గాల నుంచీ సహాయం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. శత్రువులపై మీదే పైచేయి అవుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
ధనుస్సు :
తొందరపాటు నిర్ణయాలు వద్దు. కీలక నిర్ణయాలకు ముందు ఆత్మీయులను సంప్రదించండి. సంతాన వ్యవహారాలు చికాకు పెడతాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. వాత సంబంధ సమస్యలు ఉంటాయి.
మకరం :
మనసు నిలకడగా ఉండదు. పనులు సవ్యంగా జరగకపోవడం చికాకును పెంచుతుంది. బంధువుల వ్యవహారశైలీ ఆవేదనకు కారణమవుతుంది. అవమానాలు ఒత్తిడిని పెంచుతాయి. ఖర్చులు తగ్గించుకోవాలి.
కుంభం :
మానసిక ప్రశాంతతను పొందుతారు. చేపట్టిన కార్యాలన్నీ సఫలమవుతాయి. మిత్రుల తోడ్పాటు ఉంటుంది. ఆత్మధైర్యం పెరుగుతుంది. ఆత్మీయులతో సంభాషణ ఉత్తేజాన్ని పెంచుతుంది. కుటుంబసౌఖ్యం లభిస్తుంది.
మీనం :
పలుకుబడి చెల్లదు. ఆర్థిక లావాదేవీలు కూడా నిరాశను కలిగిస్తాయి. ఇతరుల కారణంగా ఇబ్బందులు పడే సూచనలు ఉన్నాయి. వేళకు భోజనం ఉండదు. మానసిక అశాంతికి గురవుతారు. ఇష్టదైవాన్ని ప్రార్థించండి.