Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారు మిత్రుల సూచనలు పాటిస్తే.. అన్నీ విజయాలు..
Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారు మిత్రుల సూచనలు పాటిస్తే.. అన్నీ విజయాలు..
(తేది: 31-05-2024, శుక్రవారం)
కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత రుతువు, కృష్ణ పక్షం
తిధి : అష్టమి ఉదయం గం.9.38 ని.లకు ఆతర్వాత నవమి
నక్షత్రం: శతభిషం ఉదయం గం.6.14 ని.ల వరకు ఆ తర్వాత పూర్వాభాద్ర
అమృతఘడియలు: రాత్రి గం.9.16 ని.ల నుంచి గం.10.47 ని.ల వరకు
వర్జ్యం: మధ్యాహ్నం గం.12.15 ని.ల నుంచి గం.1.45 ని.ల వరకు
దుర్ముహూర్తం : ఉ. గం.8.18 ని.ల నుంచి గం.9.11 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం.గం.12.40 ని.ల నుంచి గం.1.33 ని.ల వరకు
రాహుకాలం : ఉదయం గం.10.36 ని.ల నుంచి మ.గం. 12.14 ని.ల వరకు
సూర్యోదయం : తె.వా. గం. 5.41 ని.లకు
సూర్యాస్తమయం : సా. గం. 6.47 ని.లకు
మేషం : పనుల పూర్తికి బాగా శ్రమించాల్సి ఉంటుంది. దూర ప్రాంతానికి వెళ్లాల్సి వస్తుంది. వేళకు భోజనం ఉండదు. మిత్రవిరోధం గోచరిస్తోంది. మానసికశాంతి లోపిస్తుంది. ప్రయాణాలు వద్దు. శ్రీనివాసుడిని పూజించండి.
వృషభం : శుభప్రదంగా ఉంటుంది. ఆకాంక్ష నెరవేరుతుంది. అందరి సహకారమూ లభిస్తుంది. కొత్త బాధ్యతలు చేపడతారు. సంతాన సంబంధ శుభవార్త వింటారు. మానసిక శాంతి లభిస్తుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
మిథునం : అభీష్టం నెరవేరుతుంది. యత్నకార్యాలు సఫలమవుతాయి. బంధువులతో వినోదాల్లో పాల్గొంటారు. ఇంట్లో శాంతి ఉంటుంది. పెద్దల అభిమానాన్ని పొందుతారు. గౌరవం పెరుగుతుంది. శత్రువులను గెలుస్తారు.
కర్కాటకం : వృత్తి నిర్వహణలో స్వల్ప ఇబ్బందులుంటాయి. సంతానం ధోరణి చికాకు పెడుతుంది. ఉదర సంబంధ సమస్యలుంటాయి. వృథా ఖర్చులుంటాయి. శత్రుపీడ పెరుగుతుంది. లక్ష్మీనృసింహస్వామిని పూజించండి.
సింహం : దురభిప్రాయలు ఏర్పరచుకోకండి. అపోహల వల్ల విరోధాలు పెరుగుతాయి. తగాదాలకు దూరంగా ఉండండి. ప్రయాణాల్లో, ముఖ్యంగా వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. సుబ్రహ్మణ్యస్వామిని పూజించండి.
కన్య : ఉత్సాహంగా ఉంటారు. లక్ష్యాలకు చేరవవుతారు. ధనలాభం ఉంది. బంధువులను కలుస్తారు. గృహోపకరణాలకు వెచ్చిస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. సంతానం వృద్ధిలోకి వస్తుంది.
తుల : ఆశించిన విజయం లభిస్తుంది. డబ్బుకి ఇబ్బంది ఉండదు. వృత్తి ఉద్యోగాల్లో మేలిమి ఫలితాలు అందుకుంటారు. మిత్రుల సహకారంతో శుభఫలితాలు పొందుతారు. పుణ్యకార్యాల్లో పాల్గొంటారు.
వృశ్చికం : ఆటంకాలుంటాయి. సొంత నిర్ణయాలను అమలు చేయకండి. మిత్రుల సూచనలు పాటించండి. ముఖ్యంగా బద్ధకాన్ని వదిలించుకోండి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం వద్దు. శ్రీ దత్తాత్రేయుడిని పూజించండి.
ధనుస్సు : భూ సంబంధ వ్యవహారాలు వాయిదా వేసుకోండి. డబ్బుకి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. పనుల్లోనూ అడ్డంకులు వస్తాయి. స్వజనులతోనే విరోధం గోచరిస్తోంది. జాగ్రత్త. సాయిబాబాను దర్శించండి.
మకరం: అన్ని విధాలా బాగుంటుంది. అభీష్టం నెరవేరుతుంది. కీలక సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. కుటుంబంలో శాంతి ఉంటుంది. శారీరక, మానసిక సౌఖ్యాన్ని పొందుతారు. ఆత్మీయులను కలుస్తారు.
కుంభం : పనులు అనుకున్నట్లుగా సాగవు. మనసుకి కాస్త కష్టమనిపిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు చికాకు పరుస్తాయి. కుటుంబంలో చికాకులకు ఆస్కారం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి. నవగ్రహాలను దర్శించండి.
మీనం : అదృష్టం కలిసొస్తుంది. కార్యాలు విజయవంతం అవుతాయి. ధనలాభం ఉంది. విందుల్లో పాల్గొంటారు. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. కుటుంబ సౌఖ్యం అంతులేని ఆనందాన్నిస్తుంది.