Horoscope Today: ఈ రోజు మీ రాశిఫలం ఎలా ఉందో చెక్ చేసుకున్నారా?

Horoscope Today: ఈ రోజు మీ రాశిఫలం ఎలా ఉందో చెక్ చేసుకున్నారా?

Update: 2024-06-02 01:30 GMT

Horoscope Today: ఈ రోజు మీ రాశిఫలం ఎలా ఉందో చెక్ చేసుకున్నారా?

(తేది 02-06-2024 : ఆదివారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత రుతువు, కృష్ణ పక్షం

తిధి : ఏకాదశి (రేపు తె.వా.గం.2.41 ని.ల వరకు) ఆ తర్వాత ద్వాదశి

నక్షత్రం: రేవతి (రేపు తె.వా. గం. 1.40 ని.ల వరకు) ఆ తర్వాత అశ్వని

అమృతఘడియలు: రాత్రి గం.11.26 ని.ల నుంచి అర్ధరాత్రి గం.12.55 ని.ల వరకు

వర్జ్యం: మధ్యాహ్నం గం.2.28 ని.ల నుంచి గం.3.58 ని.ల వరకు

దుర్ముహూర్తం : సా. గం. 5.03 ని.ల నుంచి గం.5.55 ని.ల వరకు

రాహుకాలం : సా. గం.5.09 ని.ల నుంచి గం. 6.48 ని.ల వరకు

సూర్యోదయం : ఉ.గం.5.41 ని.లకు

సూర్యాస్తమయం : సా. గం.6.48 ని.లకు


మేషం :

అననుకూలతల వల్ల మనసుకి కాస్త కష్టంగా ఉంటుంది. ఆసుపత్రిని సందర్శించాల్సి రావచ్చు. మిత్రుల వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించండి. వృథా ఖర్చులుంటాయి. ఇంటికి దూరంగా వెళ్లాల్సి వస్తుంది. 


వృషభం :

అవసరమైన సౌకర్యాలను సమకూర్చుకుంటారు. విందుల్లో పాల్గొంటారు. ఆత్మీయులను కలుస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు లాభిస్తాయి. మానసికశాంతి ఉంటుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. 


మిథునం :

రోజంతా సంతోషంగా గడుపుతారు. నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఇంట్లో శాంతి నెలకొంటుంది. పెద్దవాళ్ల ఆశీస్సులను పొందుతారు. బంధువులను కలుస్తారు. శారీరక సౌఖ్యాన్ని పొందుతారు.


కర్కాటకం:

సంతాన వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించండి. కలహాలకు ఆస్కారం ఉంది. ఆత్మీయులే శత్రువులుగా ప్రవర్తించడం ఆందోళన కలిగిస్తుంది. మీ బలహీనతలపై దెబ్బ కొడతారు. ఆదిత్యుణ్ణి పూజించండి. 


సింహం :

పనులు నిర్దేశిత సమయానికి పూర్తి కాకపోవడం చిరాకును తెప్పిస్తుంది. ఆలోచనలు సవ్యంగా సాగవు. ఉద్రేకం వల్ల తగాదాలకు దిగే సూచన ఉంది. పైత్య సంబంధ సమస్యలుంటాయి. గణపతిని పూజించండి.


కన్య :

ఉల్లాసంగా ఉంటారు. ఆకస్మిక ధనలాభం ఉంది. స్నేహబంధాలు దృఢపడతాయి. మానసిక, శారీరక శాంతిని పొందుతారు. బంధువులను కలుస్తారు. కొత్త పని ప్రారంభానికి అనుకూలం. ప్రయాణాలు లాభిస్తాయి.


తుల :

కార్యాల్లో శుభ ఫలితాలను అందుకుంటారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. అవసరమైన సందర్భంలో స్నేహితులు తోడ్పడతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.


వృశ్చికం :

సోమరితనాన్ని వదిలి పెట్టకుంటే చిక్కుల్లో పడతారు. సొంత తెలివితేటలను వాడకండి. మిత్రుల తోడ్పాటు లభిస్తుంది. వృథాఖర్చులు చికాకు పరుస్తాయి. వాత సంబంధ సమస్యలుంటాయి. అనుమానాలను వీడండి.  


ధనుస్సు :

పనులు అనుకున్నట్లుగా సాగవు. ఆటంకాలు పెరుగుతాయి. డబ్బుకి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఆస్తి అమ్మే ప్రయత్నాలు అనుకూలించవు. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. దుర్గమ్మను పూజించండి.  


మకరం :

చేపట్టిన పనులు ఆశాజనకంగా సాగుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అవసరానికి సరిపడా డబ్బు సమకూరుతుంది. కుటుంబంలో శాంతి ఉంటుంది. ఆత్మీయులను కలుస్తారు. విందుల్లో పాల్గొంటారు.


కుంభం :

కుటుంబంలో ఏ చిన్న సమస్యనూ నిర్లక్ష్యం చేయకండి. ఇతరుల వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకోకండి. ఖర్చులు పెరుగుతాయి. మాటకు విలువ దక్కక పోవడం ఆవేదనను కలిగిస్తుంది. ఇష్టదైవాన్ని పూజించండి. 


మీనం :

ఆనందంగా గడుపుతారు. అదృష్టం వరిస్తుంది. డబ్బుకి ఇబ్బంది ఉండదు. కుటుంబ గౌరవం పెరుగుతుంది. శారీరక, మానసిక సౌఖ్యాన్ని పొందుతారు. వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. మీ కృషికి ప్రశంసలు లభిస్తాయి.

Tags:    

Similar News