Horoscope: పనుల్లో ఆటంకం.. మానసిక ఒత్తిడితో ఆందోళన.. ఈ రాశి వారికి గడ్డుకాలం..
Horoscope: పనుల్లో ఆటంకం.. మానసిక ఒత్తిడితో ఆందోళన.. ఈ రాశి వారికి గడ్డుకాలం..
(తేది: 28-05-2024, మంగళ వారం)
కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత రుతువు, కృష్ణ పక్షం
తిధి : పంచమి మధ్యాహ్నం గం.3.23 ని.ల వరకు ఆ తర్వాత షష్ఠి
నక్షత్రం: ఉత్తరాషాఢ ఉదయం గం.9.33 ని.ల వరకు ఆ తర్వాత శ్రవణం
అమృతఘడియలు: రాత్రి గం. 10.38 ని.ల నుంచి అర్ధరాత్రి గం.12.10 ని.ల వరకు
వర్జ్యం: మధ్యాహ్నం గం.1.24 ని.ల నుంచి గం. 2.56 ని.ల వరకు
దుర్ముహూర్తం: ఉ.గం.8.18 ని.ల నుంచి గం.9.11 ని.లకు మళ్లీ రా.11.08 ని.ల నుంచి గం.11.52 ని.లకు
రాహుకాలం : మధ్నాహ్నం గం.3.30 ని,.ల నుంచి సా.గం. 5.08 ని.ల వరకు
సూర్యోదయం : తె.వా. గం.5.41 ని.లకు
సూర్యాస్తమయం : సా.గం.6.46ని.లకు
మేషం :
వృత్తి, ఉద్యోగాల్లోని వారు శుభవార్తను వింటారు. అభీష్టం నెరవేరుతుంది. బాధ్యతలు పెరుగుతాయి. గౌరవం వృద్ధి చెందుతుంది. స్థిరనిర్ణయంతో అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. ఇంట్లో శాంతి నెలకొంటుంది.
వృషభం :
పనులకు ఆటంకాలు ఉంటాయి. జీవిత భాగస్వామి సోదరవర్గంతో తగవులు గోచరిస్తున్నాయి. ఇంటికి దూరంగా ఉండాల్సి రావచ్చు. మానసిక శాంతి లోపిస్తుంది. శత్రువులు పెరుగుతారు. నవగ్రహారాధన మేలు.
మిథునం :
తగాదాలకు అవకాశం ఉంది. ఉద్రేకాన్ని అదుపు చేసుకోండి. ఇతరులపై చెడు అభిప్రాయాలు ఏర్పడతాయి. అధికారుల ఆగ్రహానికి గురవుతారు. పైత్య సంబంధ సమస్యలుంటాయి. పార్వతీదేవిని పూజించండి.
కర్కాటకం:
తలపెట్టిన పని విజయవంతం అవుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. బంధువులను కలుస్తారు. జీవిత భాగస్వామి వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. కొత్త విషయాలు తెలుస్తాయి.
సింహం :
శుభప్రదంగా ఉంటుంది. స్వస్థాన ప్రాప్తి సూచిస్తోంది. ధనలాభం ఉంది. కొత్త వస్తువులను కొంటారు. అవసరమైన వేళ మిత్రుల సహకారం లభిస్తుంది. పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
కన్య :
ఆలోచనలు సవ్యంగా సాగవు. అనుమానాలు ఎక్కువవుతాయి. నిర్ణయాల్లో ఆత్మీయుల సూచనలను పాటించండి. వృథా ఖర్చులుంటాయి. తగాదాలకు దూరంగా ఉండండి. శివారాధన మేలు చేస్తుంది.
తుల :
పనుల్లో ఆటంకాలు మానసిక ఒత్తిడిని పెంచుతాయి. బుద్ధి నిలకడగా ఉండదు. డబ్బుకి కూడా కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ఆస్తిని అమ్మే ప్రయత్నాలు ఫలించవు. సుబ్రహ్మణ్యస్వామిని పూజించడం మేలు.
వృశ్చికం :
పనులు సవ్యంగా సాగుతాయి. శుభ ఫలితాలను అందుకుంటారు. ఆదాయం మెరుగవుతుంది. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. ఆత్మీయుల కలయిక మనోధైర్యాన్ని పెంచుతుంది. సోదరులు తోడుగా ఉంటారు.
ధనుస్సు :
గొప్పలకు పోయి హామీలు ఇవ్వకండి. కుటుంబంలో చికాకులు వస్తాయి. పనులకు విఘ్నాలు పెరుగుతాయి. అకారణ విరోధాలూ గోచరిస్తున్నాయి. ఆర్థిక లావాదేవీలు సవ్యంగా సాగవు. అమ్మవారిని పూజించండి.
మకరం :
అన్ని విధాలా బావుంటుంది. బాధ్యతలు పెరుగుతాయి. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది. గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. ధనలాభం ఉంది. అవసరానికి అదృష్టం తోడవుతుంది.
కుంభం :
పనులకు ఆటంకాలు పెరుగుతాయి. అప్రమత్తంగా ఉండండి. అనవసర వ్యవహారాల్లో జోక్యం వద్దు. తగాదాలు వస్తాయి. దూర ప్రయాణాలు గోచరిస్తున్నాయి. వేళకు భోజనం ఉండదు. గణపతిని పూజించండి.
మీనం :
ఆనందంగా గడుపుతారు. దగ్గరుండి శుభకార్యాలను జరిపిస్తారు. చక్కటి సౌకర్యాలు సమకూరతాయి. సంతాన వ్యవహారాలు మానసిక శాంతిని కలిగిస్తాయి. ఆరోగ్యం బావుంటుంది. అందరి తోడ్పాటు లభిస్తుంది.