Horoscope: ఈ రాశి వారు రుణాల నుంచి విముక్తి పొందినట్లే...
Horoscope: ఈ రాశి వారు రుణాల నుంచి విముక్తి పొందినట్లే...
(తేది: 27-05-2024, సోమవారం)
కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత రుతువు, కృష్ణ పక్షం
తిధి : చవితి సాయంత్రం గం.4.53 ని.ల వరకు ఆ తర్వాత పంచమి
నక్షత్రం: పూర్వాషాఢ ఉదయం గం.10.13 నిల వరకు ఆ తర్వాత ఉత్తరాషాఢ
అమృతఘడియలు: 28వ తేదీ తె.వా.గం.3.20 ని.ల నుంచి గం.4.53 ని.ల వరకు
వర్జ్యం: సా.గం.6.00 ని.ల నుంచి గం.7.33 ని.ల వరకు
దుర్ముహూర్తం : మ. గం.12.40 ని.ల నుంచి గం.1.32 ని.ల వరకు మళ్లీ మ.గం.3.16 ని. లనుంచి సా.గం.4.09 ని.ల వరకు
రాహుకాలం : ఉదయం గం. 7.19 ని.ల నుంచి గం.8.57 ని.ల వరకు
సూర్యోదయం : తె.వా. గం 5.41 ని.లకు
సూర్యాస్తమయం : సా. గం. 6.45 ని.లకు
మేషం :
తలపెట్టిన కార్యం నెరవేరుతుంది. ఉద్యోగులకు అనువుగా ఉంటుంది. అధికారుల అండతో అదనపు బాధ్యతలు స్వీకరిస్తారు. ఇంట్లో శాంతి ఉంటుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. గౌరవం పెరుగుతుంది.
వృషభం :
ఇంటికి దూరంగా వెళ్లాల్సి రావచ్చు. నమ్మినవారే వంచిస్తారు. అవసరానికి సరిపడినంత డబ్బు సమకూరుతుంది. సంతానం వల్ల చిక్కులొస్తాయి. ఆరోగ్యం జాగ్రత్త. సూర్యారాధన మేలు చేస్తుంది.
మిథునం :
ఆటంకాలను దాటాల్సివుంటుంది. మానసిక ప్రశాంతత దూరమవుతుంది. గొడవలకు దూరంగా ఉండండి. అధికారుల ఆగ్రహానికి గురవుతారు. జీర్ణ సంబంధ సమస్యలుంటాయి. వేంకటేశ్వరుని పూజించండి.
కర్కాటకం:
బంధువులను కలుస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఉల్లాసంగా గడుపుతారు. కార్యాలన్నీ సఫలం అవుతాయి. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. జీవిత భాగస్వామి సూచనలు ఉపయోగపడతాయి.
సింహం :
శుభ ఫలితాలను అందుకుంటారు. ఆకస్మిక ధనలాభం ఉంది. కొత్త వస్తువులను కొంటారు. ఆరోరగ్యం మెరుగ్గా ఉంటుంది. కీలకమైన వేళ బంధువులు తోడుగా ఉంటారు. పుణ్యకార్యాల్లో పాల్గొంటారు.
కన్య :
సంతానం గురించి ఆలోచిస్తారు. పనులు అనుకున్నట్లుగా సాగకపోవడం చికాకు కలిగిస్తుంది. సొంత నిర్ణయాలు వద్దు. అకారణ విరోధాలు గోచరిస్తున్నాయి. కీలక డాక్యుమెంట్లు జాగ్రత్త. గణపతిని పూజించండి.
తుల :
పనులు సవ్యంగా సాగవు. స్వజనులతోనే విరోధం గోచరిస్తోంది. రియల్ వ్యవహారాలు అనుకూలించవు. వృథా ఖర్చులుంటాయి. ఆస్తి వ్యవహారాలు వాయిదా వేయండి. కుమారస్వామిని పూజించండి.
వృశ్చికం :
ఆదాయ మార్గాలు పెరుగుతాయి. విశేష లాభం ఉంటుంది. మిత్రుల తోడ్పాటు మేలు చేస్తుంది. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. ఆత్మీయులను కలుస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కీర్తి వృద్ధి చెందుతుంది.
ధనుస్సు :
ఆర్థిక ఇబ్బందులు మనోవేదనను కలిగిస్తాయి. బ్యాంకు లావాదేవీలు అనుకూలించవు. ఇతరుల వల్ల వ్యవహారాలు చెడతాయి. మాట తప్పడం వల్ల నిందలొస్తాయి. శ్రీమన్నారాయణుడిని పూజించండి.
మకరం :
అన్ని రంగాల్లోని వారికీ శుభప్రదంగా ఉంది. చేపట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. ధనలాభం ఉంది. గృహోపకరణాలను కొంటారు. బాధ్యతల నిర్వహణలు కీర్తిని పొందుతారు. రెట్టింపు ఆనందం కలుగుతుంది.
కుంభం :
బద్ధకమే ఇబ్బందులకు కారణమవుతుంది. వృథాఖర్చులు ఉంటాయి. బంధువులతో సఖ్యత చెడుతుంది. అనవసర జోక్యాలు వద్దు. ప్రయాణాలు లాభించవు. దిగులు కలుగుతుంది. ఆదిత్యహృదయం పఠించండి.
మీనం :
శుభప్రదంగా ఉంటుంది. ఆత్మీయులను కలుస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. రుణ విముక్తి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంతాన వ్యవహారాలు ఆనందాన్నిస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.