Horoscope Today: నేటి రాశి ఫలాలు.. బంధువులే శత్రువులుగా మారే సూచనలు.. ఈ రాశి వారు అప్రమత్తంగా ఉండాల్సిందే..

Horoscope Today: నేటి రాశి ఫలాలు.. బంధువులే శత్రువులుగా మారే సూచనలు.. ఈ రాశి వారు అప్రమత్తంగా ఉండాల్సిందే..

Update: 2024-05-22 00:30 GMT

Horoscope Today: నేటి రాశి ఫలాలు.. బంధువులే శత్రువులుగా మారే సూచనలు.. ఈ రాశి వారు అప్రమత్తంగా ఉండాల్సిందే..

తేది: 22-05-2024, బుధవారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత రుతువు, శుక్లపక్షం

తిధి : చతుర్దశి సాయంత్రం గం.6.47 ని.ల వరకు తర్వాత పౌర్ణమి

నక్షత్రం: స్వాతి ఉదయం గం.7.47 ని.ల వరకు తర్వాత విశాఖ

అమృతఘడియలు: రాత్రి 11.53 ని.ల నుంచి అర్ధరాత్రి గం.1.36 ని.ల వరకు

వర్జ్యం: మధ్యాహ్నం గం.1.43 ని.ల నుంచి గం.3.25 ని.ల వరకు

దుర్ముహూర్తం : ఉదయం గం.11.47 ని.ల నుంచి గం.12.39 ని.ల వరకు

రాహుకాలం : మధ్యాహ్నం గం.12.13 ని.ల నుంచి గం.1.51 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా.గం. 5.42 ని.లకు

సూర్యాస్తమయం : సా. గం.6.44 ని.లకు


మేషం : జీవిత భాగస్వామి పేరిట సాగే ఆర్థిక లావాదేవీలు చిక్కులను తెస్తాయి. శత్రువుల బెడద పెరుగుతుంది. శారీరక, మానసిక అశాంతి పెరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త. శ్రీమన్నారాయణుడిని పూజించండి.  


వృషభం : న్యాయపర అంశాలు అనుకూలంగా ఉంటాయి. ప్రయాణాల్లో ఆటంకాలను చాకచక్యంగా అధిగమిస్తారు. బంధువులను కలుస్తారు. కొత్తవారితో సత్సంబంధాలు నెలకొంటాయి. మానసిక ప్రశాంతతను పొందుతారు.


మిథునం : బ్యాంకు రుణం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పని చేసే చోట పరిస్థితులు అనుకూలంగా మారతాయి. ఆహారపుటలవాట్లను మార్చుకోవాల్సి వస్తుంది. ఇతరుల తప్పులను ఎత్తిచూపకండి. 


కర్కాటకం: ప్రేమ వ్యవహారాల్లో చికాకులు తలెత్తుతాయి. సంతానం కోసం ఎదురు చూసే వారికి శుభవార్త అందుతుంది. సొంత తెలివితేటలను ప్రదర్శించకండి. మిత్రుల తోడ్పాటు మేలు చేస్తుంది. ఆధ్యాత్మిక ధోరణి పెరుగుతుంది. 


సింహం : కుటుంబంలో చికాకులు తలెత్తుతాయి. కొన్ని రహస్యాలు దిగ్భ్రాంతికి గురి చేస్తాయి. విద్యాసంబంధ విషయాల్లో ఆశించిన పురోగతి ఉండదు. ఆస్తి క్రయవిక్రయాలూ లాభించవు. శ్రీనివాసుడిని పూజించండి. 


కన్య : ప్రచురణ, టీవీ రంగాల్లోని వారికి మేలిమి దినం. కుటుంబ అవసరాలను తీరుస్తారు. వదంతులను నమ్మకండి. మానసిక దృఢత్వం పెరుగుతుంది. తండ్రి ఆరోగ్యంపై శ్రద్ధ పెడతారు. సోదరులు తోడుగా నిలుస్తారు.  


తుల : దగ్గరి బంధువులే శత్రువులుగా మారే సూచన ఉంది. తగాదాలకు దూరంగా ఉండండి. బ్యాంకు వ్యవహారాలు అనుకూలించవు. మాట తప్పాల్సిరావడం అవమానానికి గురి చేస్తుంది. నృసింహస్వామిని పూజించండి.  


వృశ్చికం: చేపట్టిన పని విజయవంతం అవుతుంది. వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. మీ నడవడిక పెద్దల అభిమానాన్ని సంపాదించిపెడుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. విందుల్లోపాల్గొంటారు. మానసిక శాంతిని పొందుతారు.


ధనుస్సు : కోర్టు వ్యవహారాల్లో నిర్లక్ష్యం వద్దు. ఇంటికి దూరంగా వెళ్లాల్సి రావచ్చు. జంతువుల నుంచి ప్రమాదం సూచిస్తోంది. దొంగల వల్ల భయం ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త. శ్రీవేంకటేశ్వర స్వామిని పూజించండి. 


మకరం : మానవ సంబంధాలు మెరుగవుతాయి. ఆత్మీయులను కలుస్తారు. మిత్రుల తోడ్పాటు లభిస్తుంది. సంతాన సంబంధ శుభ వార్తను వింటారు. ఇంటికి అవసరమైన వస్తువులు కొంటారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.  


కుంభం : అభీష్టం నెరవేరుతుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. అధికారుల అభిమానాన్ని పొందుతారు. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. విందుల్లో పాల్గొంటారు.  


మీనం : కార్యసాధనలో ఆటంకాలను అధిగమిస్తారు. ఆలోచనలు ఉన్నతంగా సాగుతాయి. జీవిత భాగస్వామి సోదరులతో సఖ్యత లోపిస్తుంది. విడాకుల వ్యవహారంలో కదలిక వస్తుంది. ఆధ్యాత్మికత పెరుగుతుంది.

Tags:    

Similar News