Horoscope Today: ఈ రోజు మీ రాశిఫలం ఎలా ఉందో చెక్ చేసుకున్నారా?
Horoscope Today: ఈ రోజు మీ రాశిఫలం ఎలా ఉందో చెక్ చేసుకున్నారా?
(తేది 01-06-2024 : శనివారం)
కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత రుతువు, కృష్ణ పక్షం
తిధి : నవమి ఉదయం గం.7.24 వరకు ఆ తర్వాత దశమి (జూన్ 2వ తేదీ తె.వా.గం.5.04 వరకు)
నక్షత్రం: ఉత్తరాభాద్ర (మర్నాడు తె.వా. గం.3.16 ని.ల వరకు)
అమృతఘడియలు: రాత్రి గం. 10.46 ని.ల నుంచి అర్ధరాత్రి గం.12.16 ని.ల వరకు
వర్జ్యం: మధ్యాహ్నం గం.1.47 ని. ల నుంచి గం.3.17 ని.ల వరకు
దుర్ముహూర్తం : తె.వా.గం.5.41 ని.ల నుంచి గం.7.26 ని.ల వరకు
రాహుకాలం : ఉదయం గం.8.58 ని.ల నుంచి గం.10.36 ని.ల వరకు
సూర్యోదయం : తె.వా. గం. 5.41 ని.లకు
సూర్యాస్తమయం : సా. గం. 6.47 ని.లకు
మేషం :
మనసుకి కష్టం కలిగే ఘటనలను ఆత్మధైర్యంతో అధిగమించండి. బంధువుల నుంచి ఆశించిన సహకారం లభించదు. అనూహ్య ఖర్చులు చికాకు పెడతాయి. ఇబ్బందులు పోవడానికి శనికి ప్రదక్షిణలు చేయండి.
వృషభం :
సుఖమయంగా ఉంటుంది. ఆత్మీయులతో వినోదాల్లో పాల్గొంటారు. శుభకార్యాచరణ దిశగా ఆలోచనలు సాగుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కీలక కార్యంలో ఇతరులూ చక్కగా సహకరిస్తారు.
మిథునం :
అన్నింటా అనుకూలంగా ఉంటుంది. పనులు అనుకున్నట్లుగానే సాగుతాయి. అధికారుల ప్రశంసలు పొందుతారు. మర్యాద పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
కర్కాటకం:
పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. తండ్రితో సఖ్యత చెడుతుంది. వారసత్వ ఆస్తి వ్యవహారాలు చికాకు పెడతాయి. దూర ప్రాంతానికి వెళ్లాల్సి రావచ్చు. త్వరగా అలసిపోతారు. నవగ్రహారాధన మేలు చేస్తుంది.
సింహం :
మనసును నియంత్రించుకోవాలి. ముఖ్యంగా ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి. అధికారుల కోపానికి గురయ్యే సూచన ఉంది. పైత్య సంబంధ ఆరోగ్య సమస్యలుంటాయి. శ్రీవేంకటేశ్వరుని పూజించండి.
కన్య :
ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. ఇరుగు పొరుగుతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. బంధు, మిత్రులతో వినోదాల్లో పాల్గొంటారు. శారీరక, మానసిక సౌఖ్యాన్ని పొందుతారు.
తుల :
శుభ ఫలితాలను పొందుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. బంధువులు తోడుగా నిలుస్తారు. డబ్బు చేతికి అందుతారు. ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. కీర్తి పెరుగుతుంది. పుణ్యకార్యాల్లో పాల్గొంటారు.
వృశ్చికం :
పనులకు ఆటంకాలు ఏర్పడతాయి. అనుమానాల వల్ల ఆలోచనలు వక్రమార్గంలో సాగుతాయి. వృథాఖర్చులు మితిమీరతాయి. నిరాశ కలుగుతుంది. బద్ధకాన్ని వీడండి. లక్ష్మీనృసింహుణ్ణి పూజించండి.
ధనుస్సు :
కార్యనష్టం గోచరిస్తోంది. బుద్ధి నిలకడగా ఉండదు. అయినవారితోనే విభేదాలొస్తాయి. ఇరుగుపొరుగు వారితోనూ సఖ్యత చెడుతుంది. మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి. శ్రీదత్తాత్రేయ స్వామిని దర్శించండి.
మకరం :
అన్ని విధాలా మంచే జరుగుతుంది. మానసిక సౌఖ్యాన్ని పొందుతారు. కీలక సమాచారం ఆత్మశాంతిని కలుగజేస్తుంది. ఆదాయం మెరుగవుతుంది. ఆత్మీయులను కలుస్తారు. నూతన వస్త్రాలు కొనే సూచన ఉంది.
కుంభం :
బ్యాంకులతో వ్యవహారాలు అనుకూలించవు. మాటకు విలువ తగ్గుతుంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం వద్దు. ఆస్తి అమ్మే ఆలోచన వాయిదా వేయండి. బంధువులను కలుస్తారు. వేళకు భోజనం ఉండదు.
మీనం :
రోజంతా ఉల్లాసంగా గడుపుతారు. ఆశించిన ఫలితాలను పొందుతారు. విందుల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు శుభవార్త అందే సూచన ఉంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. గౌరవం వృద్ధి చెందుతుంది.