Horoscope Today: 16-06-2024 శనివారం.. నేటి రాశి ఫలాలు...

Horoscope Today: 16-06-2024 శనివారం.. నేటి రాశి ఫలాలు...

Update: 2024-06-16 01:30 GMT

Horoscope Today: 16-06-2024 శనివారం.. నేటి రాశి ఫలాలు...

తేది: 16-06-2024 (ఆదివారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, జ్యేష్ట మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ రుతువు, శుక్ల పక్షం

తిధి : దశమి రేపు తె.వా. గం.4.43 ని.ల వరకు ఆ తర్వాత ఏకాదశి

నక్షత్రం: హస్త ఉదయం గం.11.13 ని.ల వరకు తర్వాత చిత్త

అమృతఘడియలు: --

వర్జ్యం: రాత్రి గం.8.05 ని.ల నుంచి గం.9.52 ని.ల వరకు

దుర్ముహూర్తం : సాయంత్రం గం.5.07 ని.ల నుంచి గం.5.59 ని.ల వరకు

రాహుకాలం : సాయంత్రం గం.5.13 ని.ల నుంచి గం.6.52 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం 5.42 ని.లకు

సూర్యాస్తమయం :సా. గం.6.52 ని.లకు


మేషం :

తలపెట్టిన పనులు అనుకున్నట్లుగానే పూర్తవుతాయి. స్వస్థాన ప్రాప్తి ఉంది. ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. బంధువులను కలుస్తారు. విందుల్లో పాల్గొంటారు. కొత్త వస్తువులు కొంటారు. ప్రశంసలను పొందుతారు.  


వృషభం :

ఇష్టమైన కార్యం నెరవేరదు. ఇరుగు పొరుగుతో విరోధం గోచరిస్తోంది. మీ సమర్థతకు తగిన గుర్తింపు లభించదు. ఖర్చులు అదుపు తప్పుతాయి. వాత సంబంధ సమస్యలుంటాయి. షణ్ముఖుడిని పూజించండి.


మిథునం :

పనులు నెరవేరక పోవడంతో మనసు నిలకడగా ఉండదు. అవమానాలు ఒత్తిడికి గురి చేస్తాయి. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవాలి. శత్రువులపై ఓ కన్నేసి ఉంచాలి. దుర్గమ్మను పూజించండి.  


కర్కాటకం:

అభీష్టం నెరవేరుతుంది. ఎదురు చూస్తున్న సమాచారం అందుతుంది. కుటుంబం సంతోషంగా ఉంటుంది. దగ్గరి ప్రయాణాలు లాభిస్తాయి. అవసరానికి సరిపడా డబ్బు సమకూరుతుంది. ఆత్మధైర్యం పెరుగుతుంది.  


సింహం :

తొందరపడి ఎవరికీ మాట ఇవ్వకండి. ఆర్థిక లావాదేవీలు ముఖ్యంగా బ్యాంకు వ్యవహారాలు అశాంతిని మిగులుస్తాయి. కుటుంబంలో చికాకులొస్తాయి. వేళకు భోజనం ఉండదు. శివుణ్ణి పూజించడం వల్ల శుభం. 


కన్య :

వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. మీ పనితీరుతో ప్రశంసలను పొందుతారు. ధనలాభం ఉంది. విందుల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. గౌరవం పెరుగుతుంది.


తుల :

పనులు సజావుగా సాగవు. ఇతరుల వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి. అనవసరపు ప్రయాణాలు మానుకోండి. ధననష్టం, శారీరక శ్రమ మిగులుతాయి. బద్ధకం వల్ల చిక్కులొస్తాయి. గణపతిని పూజించండి. 


వృశ్చికం :

ఆకాంక్ష నెరవేరుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. చక్కటి సౌకర్యాలు సమకూరతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. శారీరక, మానసిక శాంతిని పొందుతారు. శుభకార్య నిర్వహణ గురించి చర్చిస్తారు.


ధనుస్సు :

అన్నింటా అనుకూలంగా ఉంటుంది. కొత్త బాధ్యతలు చేపడతారు. స్థిరచిత్తంతో విజయాలు సాధిస్తారు. పెద్దల ఆశీస్సులను పొందుతారు. అవకాశాలను చేజార్చుకోకండి. గౌరవం పెరుగుతుంది. గృహశాంతి ఉంటుంది.


మకరం :

పిత్రార్జిత వ్యవహారాలు చికాకు పెడతాయి. బంధువులే శత్రువులుగా వ్యవహరించడం ఆందోళనను పెంచుతుంది. శత్రుపీడ పెరుగుతుంది. ఖర్చులు మితిమీరతాయి. ఆంజనేయ స్వామిని పూజించడం మేలు.  


కుంభం :

కార్యసాధనకు బాగా శ్రమించాల్సి ఉంటుంది. అపోహల వల్ల కార్యనష్టం. తగాదాలుంటాయి. పెద్దల ఆగ్రహానికి గురవుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. సాంత్వనకు నవగ్రహాలను పూజించండి.


మీనం :

ఉత్సాహంగా గడుపుతారు. ఇరుగుపొరుగుతో సత్సంబంధాలుంటాయి. బంధువులను కలుస్తారు. ధనలాభం ఉంది. జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. కీర్తి పెరుగుతుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది.

Tags:    

Similar News