రేగుపండ్లు తింటున్నారా?... అయితే, ఈ అద్భుత ప్రయోజనాలు ఇప్పుడే తెలుసుకోండి..!
విటమిన్ సీ ఇందులో ఉంటుంది. అంతే కాదు రేగు పండు చుండ్రును కూడా అరికడుతుందట.
జలుబు, దగ్గు, జ్వరముతో అంటూ ఉండే వారికి రేగు పండు చాలా ఉపశమనాన్ని ఇస్తుందని అంటున్నారు నిపుణులు.
ఎనీమియాగా పిలిచే రక్త హీనత సమస్య నుంచీ మనల్ని కాపాడతాయి రేగు పండ్లు. రక్త ప్రసరణ సాఫీగా సాగాలంటే రేగు పండ్లు మన శరీరానికి అవసరం.
పొట్టలో గ్యాస్ వంటి సమస్యలు ఉంటే... రేగు పండ్లు తినడం మంచిది.
ఈ పండ్లు రక్తాన్ని శుభ్రం చేస్తుంది. ఆకలి లేమి, రక్తహీనత, నీరసం, గొంతునొప్పి వంటి సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది.