US Election 2024 Results Live Updates: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎక్స్‌క్లూజీవ్ న్యూస్ లైవ్ అప్‌డేట్స్

US Elections 2024 Live Updates in Telugu
x

US Elections 2024 Live Updates in Telugu

Highlights

US Election Results 2024 Live Updates in Telugu: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. అమెరికా ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.

US Election Results 2024 Live Updates in Telugu: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ప్రస్తుతం అమెరికాలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఓట్లు లెక్కిస్తున్నారు. ఇప్పటికే రిపబ్లికన్ అభ్యర్థి డోనల్డ్ ట్రంప్ 270 స్థానాలతో భారీ ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారీస్ 214 స్థానాలతో వెనుకంజలో ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ట్రంప్ స్పందించారు. అమెరికా బంగారు భవిష్యత్‌కు తనది పూచీ అని రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనల్డ్ ట్రంప్ చెప్పారు. పోలింగ్ తర్వాత తన మద్దతుదారులనుద్దేశించి ఆయన మాట్లాడారు. అమెరికా ఇలాంటి విజయం ఎన్నడూ చూడలేదని ఆయన అన్నారు. అమెరికన్లకు స్వర్ణ యుగం రాబోతోందన్నారు. అమెరికా ప్రజల కోసం నిత్యం పనిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు.తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు చెప్పారు.

Show Full Article

Live Updates

  • Donald Trump is 47th President of USA: అమెరికా 47వ అధ్యక్షుడిగా డోనల్డ్ ట్రంప్
    6 Nov 2024 9:49 AM GMT

    Donald Trump is 47th President of USA: అమెరికా 47వ అధ్యక్షుడిగా డోనల్డ్ ట్రంప్

    US Elections 224 Results Live Updates: అమెరికా అధ్యక్షుడిగా డోనల్డ్ ట్రంప్ ఎన్నిక దాదాపు ఖాయమైపోయింది. ఇక మిగిలిందల్లా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అమెరికా కాంగ్రెస్‌లో మొత్తం 538 సభ్యులు ఉన్నారు. అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలంటే అందులో 270 మంది మద్దతు అవసరం. ఇప్పటికే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల్లో 267 మంది విజయం సాధించారు. మరోవైపు కమలా హారీస్‌కు ఓటు వేయాల్సిన డెమొక్రాట్స్ 224 స్థానాల్లోనే గెలుపొందారు. డోనల్డ్ ట్రంప్ సొంతం చేసుకున్న మెజారిటీకి ఆమె దరిదాపుల్లో కూడా లేరు. దీంతో ఇక ట్రంప్ విజయం సాధించినట్లేనని అమెరికన్స్ ఒక నిర్ణయానికొచ్చేశారు.

    డోనల్డ్ ట్రంప్ సైతం తనని తాను అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. ఫ్లోరిడాలోని పామ్ బీచ్ కౌంటీ కన్వెన్షన్ సెంటర్ లో తన మద్దతుదారులు, అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ ట్రంప్ ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు 45 అధ్యక్షుడిని తానే.. అలాగే 47వ అధ్యక్షుడు కూడా తానేనని అన్నారు. అమెరికా ఫెడరల్ చట్టాల ప్రకారం డోనల్డ్ ట్రంప్ విజయాన్ని అధికారికంగా ప్రకటించేందుకు ఇక మిగిలిందల్లా ఎలక్టోరల్ కాలేజ్ ప్రక్రియ మాత్రమే.

    ఇదిలావుంటే డోనల్డ్ ట్రంప్ ను అభినందిస్తూ ప్రపంచ దేశాల అధినేతలు ఆయనకు కంగ్రాట్స్ చెబుతున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా "హార్టియెస్ట్ కంగ్రాచ్యులేషన్స్ మై ఫ్రెండ్" అంటూ శుభాకాంక్షలు తెలిపారు.


  • Donald Trump To JD Vance: జేడి వాన్స్, ఆయన భార్య ఉషా చిలుకూరి వాన్స్ వైపు తిరిగి కిక్కిచ్చే మాట చెప్పిన డోనల్డ్ ట్రంప్.. ఇంతకీ ఆయనేం చెప్పారు?
    6 Nov 2024 9:05 AM GMT

    Donald Trump To JD Vance: జేడి వాన్స్, ఆయన భార్య ఉషా చిలుకూరి వాన్స్ వైపు తిరిగి కిక్కిచ్చే మాట చెప్పిన డోనల్డ్ ట్రంప్.. ఇంతకీ ఆయనేం చెప్పారు?

    Donald Trump Shoutouts To JD Vance After US Election 2024 Results: అమెరికా అధ్యక్షుడిగా గెలిచానన్న ఆనందంలో డోనల్డ్ ట్రంప్ ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ట్రంప్ భారీ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. అదే ఆనందంలో ఫ్లోరిడాలోని పామ్ బీచ్ కౌంటీ కన్వెన్షన్ సెంటర్ వద్ద భారీ సంఖ్యలో గుడిగూడిన తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు. అమెరికా మనకు భారీ మద్దతును ఇచ్చిందన్నారు. తనకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ ఆయన ధన్యావాదాలు చెప్పారు. ఆ క్రమంలోనే రిపబ్లికన్స్ పార్టీ తరపున వైస్ ప్రెసిడెంట్ రేసులో ఉన్న జేడి వాన్స్‌ని కూడా ఆయన ప్రశంసించారు. ఇకపై మిమ్మల్ని వైస్ ప్రెసిడెంట్ అని పిలవొచ్చు అని వ్యాఖ్యానించారు.

    రిపబ్లికన్స్ విజయం కోసం జేడి వాన్స్ పనిచేసిన తీరును అభినందించారు. జెడి వాన్స్, ఆయన భార్య ఉష చిలుకూరి వాన్స్ ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉష చిలుకూరి వాన్స్ భారత సంతతి మహిళ అనే విషయం తెలిసిందే. జేడి వాన్స్‌ని వైస్ ప్రెసిడెంట్ అని పిలిచిన అనంతరం, అదే వేదికపై ఆయన అభిప్రాయం చెప్పాల్సిందిగా మైక్ వద్దకు ఆహ్వానించారు. ఈ వార్త ప్రచురించేటప్పటి వరకు అందుబాటులో ఉన్న డేటా ప్రకారం డోనల్డ్ ట్రంప్ 270 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారీస్ 214 స్థానాల వద్ద ఉన్నారు.

  • Donald Trump: అమెరికన్లకు స్వర్ణ యుగం రాబోతోంది.. ఓట్ల లెక్కింపు, ఫలితాల నేపథ్యంలో తొలిసారి మీడియాతో ట్రంప్
    6 Nov 2024 7:59 AM GMT

    Donald Trump: అమెరికన్లకు స్వర్ణ యుగం రాబోతోంది.. ఓట్ల లెక్కింపు, ఫలితాల నేపథ్యంలో తొలిసారి మీడియాతో ట్రంప్

    Donald Trump after US Elections 2024 Results: అమెరికా బంగారు భవిష్యత్ కు తనది పూచీ అని రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనల్డ్ ట్రంప్ చెప్పారు. పోలింగ్ తర్వాత తన మద్దతుదారులనుద్దేశించి ఆయన మాట్లాడారు. అమెరికా ఇలాంటి విజయం ఎన్నడూ చూడలేదని ఆయన అన్నారు. అమెరికన్లకు స్వర్ణ యుగం రాబోతోందన్నారు. అమెరికా ప్రజల కోసం నిత్యం పనిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు.తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు చెప్పారు. కొత్త చట్టాలు తెచ్చేందుకు ఇబ్బందులు రావన్నారు. తన విజయంలో మెలానియా కీలకపాత్ర పోషించారని ట్రంప్ చెప్పారు. వేదికపైనే ప్రసంగించారు. అమెరికా ప్రజలు ఇలాంటి విజయాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు.

  • US Election Results 2024: అమెరికా కాంగ్రెస్ కు తొలి ట్రాన్స్ జెండర్: ఎవరీ సారా మెక్ బ్రైడ్?
    6 Nov 2024 7:56 AM GMT

    US Election Results 2024: అమెరికా కాంగ్రెస్ కు తొలి ట్రాన్స్ జెండర్: ఎవరీ సారా మెక్ బ్రైడ్?

    US Election Results 2024: అమెరికా కాంగ్రెస్ కు ట్రాన్స్ జెండర్ తొలిసారి ఎన్నికయ్యారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధిగా డెలవేర్ లోని ఎట్ లార్జ్ హౌస్ డిస్ట్రిక్ట్ నుంచి సారా మెక్ బ్రైడ్ గెలిచారు. రిపబ్లిక్ పార్టీ తరపున జాన్ వేలెన్ 3 తో ఆమె పోటీ పడ్డారు. సారాకు 95 శాతం ఓట్లు పోలయ్యాయి. వేలేన్ కు 57.9 శాతం ఓట్లు మాత్రమే దక్కాయి. డెలవేర్ లో మార్పు కోసం తాను కృషి చేస్తానని చెప్పారు. ఆరోగ్య సంరక్షణ, పిల్లల సంరక్షణ, పునరుత్పత్తికి సంబంధించిన పాలసీలపై ఫోకస్ చేస్తానని తెలిపారు.

    ఎల్ జీ బీ టీ క్యూ జాతీయ కార్యకర్తగా సారా వ్యవహరిస్తున్నారు. ఎన్నికలకు 3 మిలియన్లకు పైగా విరాళాలు సేకరించారు. 2016లో డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ లో ఓ ప్రధాన పార్టీ నిర్వహించిన సమావేశంలో ట్రాన్స్ జెండర్ గా ఆమె గుర్తింపు పొందారు. 2020లో డెలవేర్ లో తొలి ట్రాన్స్ స్టేట్ సెనెటర్ గా వ్యవహరించారు. 2010 నుంచి డెలవేరియన్ ఓటర్లు డెమోక్రట్లకే మద్దతిస్తున్నవారు.

    ఎవరీ సారా? 1990 ఆగస్టు 9న సారా విల్మింగ్టన్ లో పుట్టారు. తండ్రి డేవిడ్, తల్లి సాల్లే మెక్ బ్రైడ్. తండ్రి లాయర్. క్యాబ్ కల్లోవే స్కూల్ ఆఫ్ ది ఆర్ట్స్ కు ఫౌండర్. 2009లో ఆమె గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. 2013లో అమెరికన్ యూనివర్శిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పొందారు. 2011లో అమెరికన్ యూనివర్శిటీ స్టూడెంట్ గవర్నమెంట్ అధ్యక్ష పదవికి ఎన్నికయ్యారు. చిన్నతనం నుంచి ఆమెకు రాజకీయాలపై ఆసక్తి ఉండేది. డెలవేర్ లో పలు రాజకీయ ప్రచారాల్లో ఆమె పాల్గొన్నారు.

  • Why Joe Biden Dropped: అమెరికా ఎన్నికల్లో జో బైడెన్ మరోసారి ఎందుకు పోటీ చేయలేదు?
    6 Nov 2024 7:53 AM GMT

    Why Joe Biden Dropped: అమెరికా ఎన్నికల్లో జో బైడెన్ మరోసారి ఎందుకు పోటీ చేయలేదు?

    Why Joe Biden Dropped From US Presidential Election 2024: ప్రస్తుతం ప్రపంచం అంతా అమెరికా ఎన్నికల చుట్టే తిరుగుతోంది. అమెరికాలో ఎన్నికల ప్రక్రియ ఎంత వరకు వచ్చింది? ఓట్ల లెక్కింపు ఎంత వరకు వచ్చింది? అమెరికా అధ్యక్షుడిగా గెలిచేది ఎవరు? అనే అంశాలపైనే ప్రస్తుతం అందరి దృష్టి ఉంది. అదే సమయంలో కొంతమందికి ఇంకో డౌట్ కూడా వస్తోంది. అదేంటంటే.. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఈసారి ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదని? వారికి అలా సందేహం రావడానికి కారణం కూడా లేకపోలేదు.

    భారత్‌లో ఎన్నికల సరళి, ఇక్కడి రాజకీయాల్లో ఒకసారి ముఖ్యమంత్రిగా, ప్రధాన మంత్రిగా గెలిచిన వాళ్లు వీలైనంత వరకు ఆ స్థానాన్ని అలాగే పదిలం చేసుకోవాలనే ధోరణిలో ఉంటారనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. ఏదైనా బలమైన కారణం ఉంటేనో లేక పార్టీ అధిష్టానం వారిని పక్కకు పెడితేనో తప్ప ఒకసారి ఆ స్థాయికి వచ్చిన నాయకులు ఎవ్వరూ రెండోసారి ఆ పదవివి దూరంగా ఉండాలని అనుకోరు. అలాంటప్పుడు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎందుకు రెండోసారి పోటీ చేయడం లేదు? గతంలో జార్జి డబ్లూ బుష్, బరాక్ ఒబామా సహా పది మందికిపైగా అధ్యక్షులు రెండు పర్యాయాలు అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన వాళ్లు ఉన్నారు. మరి జో బైడెన్ ఎందుకు పోటీ చేయడం లేదనేది వారి సందేహం.

    ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం విషయానికొద్దాం. అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో తాను నిలబడటం లేదని జో బైడెన్ ఈ ఏడాది జులై 21వ తేదీనే పబ్లిక్గా ప్రకటించారు. అందుకు కారణం కూడా చెప్పారు. తమ సొంత పార్టీ అయిన డెమొక్రటికా పార్టీలోనే తన అభ్యర్థిత్వంపై కొన్ని బిన్నాభిప్రాయాలున్నాయి. పార్టీలో అంతర్గతంగా విభేదాలు ఉన్నప్పుడు పోటీ చేస్తే అది ప్రత్యర్థికి ప్లస్ పాయింట్ అవుతుంది. కానీ తన లక్ష్యం తాను మరోసారి అమెరికా అధ్యక్షుడు అవడం కాదు. డోనాల్డ్ ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడు అవకుండా చూడటమే తన ప్రధాన కర్తవ్యం అని జో బైడెన్ చెప్పారు. అందుకే తాను పోటీ చేయకుండా తమ పార్టీ తరపున కమలా హారీస్ ని అమెరికా ప్రెసిడెంట్‌గా గెలిపించేందుకు కృషి చేస్తానని ఆయన స్పష్టంచేశారు.

    అది తప్పుడు ప్రచారమన్న బైడెన్

    జో బైడెన్ ఎందుకు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం లేదనే విషయంలో రకరకాల కామెంట్స్ వినిపించాయి. ఆయనకు వయసైపోయిందని, ఆరోగ్యం సహకరించడం లేదని రకరకాలుగా ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రచారంలో నిజం లేదని జో బైడెన్ తేల్చిచెప్పారు. తన ఆరోగ్యం, మానసిక పరిస్థితి అంతా బాగానే ఉందని బైడెన్ వివరించారు. పోటీ చేయకపోవడానికి గల కారణాలను చెప్పే క్రమంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు.

  • Us Elections 2024 Results: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో దూసుకుపోతున్న ట్రంప్ .. 23 రాష్ట్రాల్లో విజయం.. కమలా హారీస్ పరిస్థితి ఏంటి?
    6 Nov 2024 7:39 AM GMT

    Us Elections 2024 Results: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో దూసుకుపోతున్న ట్రంప్ .. 23 రాష్ట్రాల్లో విజయం.. కమలా హారీస్ పరిస్థితి ఏంటి?

    US Elections 2024 results: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ హవా కొనసాగుతోంది. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో 23 రాష్ట్రాల్లో జయకేతం ఎగురవేసిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రపం, మరో 7 రాష్ట్రాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. డెమోక్రటిక్ పార్టీ కమలా హారిస్ 13 రాష్ట్రాలో విజయం సాధించారు. మరో 5 రాష్ట్రాల్లో ముందంజలో ఉన్నారు. 7 స్వింగ్ రాష్ట్రాలకు గాను ఆరింటిలోనూ ట్రంప్ ముందంజలో ఉన్నారు. అభ్యర్థుల గెలుపోటముల్లో ఈ రాష్ట్రాలు ప్రభావితం కానున్నాయి. పాపులర్ ఓట్లలోనూ ట్రంపే ముందున్నారు. ట్రంప్ నుకు 52శాతం, కమలా హారిస్ కు 46.2 శాతం పాపులర్ ఓట్లు వచ్చాయి.

    ఇప్పటి వరకు 23 రాష్ట్రాల్లో ట్రంప్, మరో 13 రాష్ట్రాల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ విజయఢాంకా మోగిస్తున్నారు. మిస్సిసిపి, సౌత్ కరోలినా, టెన్నెసీ, వర్జీనియా, ఇండియానా , ఫ్లోరిడా, ఆర్కాన్సస్, ఒహియో, వ్యోమింగ్,నార్త్ డకోట, సౌత్ డకోట, నెబ్రాస్కా, ఒక్లహామా, లుసియానా, వెస్ట్ వర్జీనియా, అలబామా, టెక్సాస్, మిస్సోరీ, మోంటానా, కాన్సస్, ఒక్లాహామా, అయోవా, ఐడా హో రాష్ట్రాల్లో ట్రంప్ విజయం సాధించారు.

    డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్ ఇల్లినాయిస్, మేరీలాండ్, వెర్ మౌంట్, న్యూయార్స్, మస్సాచుసెట్స్, కన్నెటిక్టికట్, రోడ్ ఐలాండ్ లో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లు ఉంటాయి. శ్వేతసౌధంలో అడుగుపెట్టాలంటే 270 ఎలక్టోరల్ ఓట్లు అవసరం. ఇంతవరకు 393 ఎలక్టోరల్ ఓట్ల ఫలితాలు వెలువడగా..అందులో 214 ఓట్లు రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, 179 ఎలక్ట్రోరల్ ఓట్లు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలాహారీస్ కు వచ్చాయి. 

  • US Election Counting: కమలా వర్సెస్ ట్రంప్..18 రాష్ట్రాల్లోట్రంప్ ..9 రాష్ట్రాల్లో కమలా హ్యారిస్ విజయం
    6 Nov 2024 7:35 AM GMT

    US Election Counting: కమలా వర్సెస్ ట్రంప్..18 రాష్ట్రాల్లోట్రంప్ ..9 రాష్ట్రాల్లో కమలా హ్యారిస్ విజయం

    US Election Counting: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వచ్చేస్తున్నాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలను చూసినట్లయితే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన నార్త్ డకోటా, వయోమింగ్, సౌత్ డకోటా, నెబ్రాస్కా, ఓక్లహోమా, టెక్సాస్, ఆర్కాన్సాస్, లూసియానా, ఇండియానా, కెంటకీ, టెన్నెసీ, మిస్సోరి, మిసిసిపి, ఒహాయో, వెస్ట్ వర్జీనియా, అలబామా, సౌత్ కరోలినా, ఫ్లోరిడా 18 రాష్ట్రాల్లో గెలుపొందారు. దీంతో ట్రంప్ నకు 188 ఎలక్టోరల్ సీట్లు వచ్చాయి.

    డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ ప్రస్తుతం 9 రాష్ట్రాలను సొంతం చేసుకున్నారు. ఆమెకు ఇల్లినోయి, న్యూజెర్సీ, మేరీల్యాండ్, వెర్మొంట్, న్యూయార్క్, కనెక్టికట్, డెలవేర్, మసాచుసెట్స్, రోడ్ ఐల్యాండ్ రాష్ట్రాల్లోని 99 సీట్లు లభించాయి.

    అత్యంత కీలకమైన స్వింగ్ స్టేట్ జార్జియాలో కమలా ఎదురీదుతున్నారు. 2020 ఎన్నికల్లో ఈ స్టేట్ డెమోక్రట్లకు 16 ఎలక్టోరల్ ఓట్లను తీసుకువచ్చింది. అదే సమయంలో పెన్సిల్వేనియాలో మాత్రం కీలకమైన పిట్స్ బర్గ్, ఫిలడెల్ఫియాలో కమలా ముందున్నారు. దీంతో ఇప్పుడు తీవ్రమైన ఉత్కంఠ రేపుతోంది.

  • US Elections 2024 first result: అమెరికాలో ఫస్ట్ రిజల్ట్ వచ్చేసింది.. ఆ ఊర్లో అర్ధరాత్రే ఓటింగ్ సంప్రదాయం
    5 Nov 2024 4:48 PM GMT

    US Elections 2024 first result: అమెరికాలో ఫస్ట్ రిజల్ట్ వచ్చేసింది.. ఆ ఊర్లో అర్ధరాత్రే ఓటింగ్ సంప్రదాయం

    US Elections 2024 first result: అమెరికాలో ఓవైపు అధ్యక్ష ఎన్నికలు జరుగుతుండగానే మరోవైపు ఆ ఊర్లో ఎన్నికల ఫలితం వచ్చేసింది. ఇంకా ఆశ్చర్యకమైన విషయం ఏంటంటే... అమెరికాలో అంతటా తెల్లవారి 6 గంటలకు, ఇంకొన్ని చోట్ల 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైతే, ఆ ఊరిలో మాత్రం అర్థరాత్రే పోలింగ్ అయిపోయింది. ఆ తరువాత 12 నిమిషాలకే ఫలితం కూడా ప్రకటించారు.

    న్యూ హ్యాంప్‌షైర్ రాష్ట్రంలోని డిక్స్‌విల్లే నాచ్ అనే చిన్న ఊరు గురించే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. ఈ ఊరిలో ఆరుగురు ఓటర్లు మాత్రమే ఉన్నారు. వారిలో ముగ్గురు డెమొక్రట్స్ తరపున పోటీ చేసిన కమలా హారీస్‌కు ఓటు వేశారు. మరో ముగ్గురు రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డోనల్డ్ ట్రంప్‌కు ఓటు వేశారు. ఉన్న ఆరుగురు ఓటర్లలో ముగ్గురు అటు, ముగ్గురు ఇటు ఓటు వేయడంతో అక్కడి ఫలితం టై అయింది.

    న్యూ హ్యాంప్‌షైర్ రాష్ట్రంలో ఎన్నికల నిబంధనల ప్రకారం, 100 మంది కంటే తక్కువ ఓటర్లు ఉన్న మునిసిపాలిటీలలో అర్థరాత్రే పోలింగ్ ప్రారంభించుకునే వెసులుబాటు ఉంది. 1960 లో తొలిసారిగా అక్కడ ఇలా అర్ధరాత్రి పోలింగ్ నిర్వహించే సంప్రదాయం మొదలైంది. అమెరికా ఫెడరల్ చట్టాలు, నిబంధనల ప్రకారం పోలింగ్ ముగియగానే కౌంటింగ్ చేపడతారు. అలా ఇక్కడి ఫలితం నిమిషాల్లోనే తేలిపోతుంది. అమెరికా అంతటా తెల్లారాక ఓటేస్తే.. ఇక్కడ మాత్రం అర్ధరాత్రే ఫలితం కూడా తేలిపోతుంది. అందుకే అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరిగే ప్రతీసారి ఇక్కడి ఫలితం వార్తల్లోకెక్కుతుంది.

    2020 లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ విజయం సాధించినప్పుడు కూడా ఈ డిక్స్‌విల్లె నాచ్ ఊరి ఓటింగ్ సరళిపై వార్తలొచ్చాయి. అప్పుడు ఇక్కడున్న ఆరుగురు ఓటర్లు జో బైడెన్‌కే ఓటు వేశారు. కానీ ఈసారి మాత్రం వారి తీర్పులో కమలా హారీస్‌కు, డోనల్డ్ ట్రంప్‌కు చెరో సగం ఇచ్చారు.

  • 5 Nov 2024 1:35 PM GMT

    When will we know about who will be the next US President: అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. అమెరికా ప్రెసిడెంట్ పదవి కోసం రిపబ్లికన్స్ పార్టీ తరపున అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ పోటీ పడుతున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా వైస్ ప్రెసిడెంట్ కమల హారిస్ పోటీ చేస్తున్నారు. నవంబర్ 5 న ఎన్నికలు జరిగితే మరి ఎవరు గెలిచారో ఎప్పుడు తెలుస్తుంది?

    అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనే విషయంలో అక్కడి మీడియా కూడా అంచనాలను వెల్లడిస్తుంది. కొన్నిసార్లు ఎన్నికలు ముగిసిన గంటల వ్యవధిలోనే ఈ ప్రెడిక్షన్స్ మొదలవుతాయి. కానీ ఈసారి కమల హారిస్ కు, డోనల్డ్ ట్రంప్ కు మధ్య గట్టి పోటీ నెలకుంది. ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారు అని కచ్చితమైన అంచనా వేయడం కష్టమే అనే భావన వ్యక్తమవుతోంది.

    పెన్సిల్వేనియాలో రికౌంటింగ్‌కి వెళ్తే?

    అసలు కౌంటింగే జరగనప్పుడు అప్పుడే పెన్సిల్వేనియాలో రీకౌంటింగ్ అనే మాట ఎక్కడి నుండి వస్తుంది అని డౌట్ రావచ్చు. కానీ అందుకు కూడా ఓ కారణం ఉంది. అదేంటంటే.. 2020 ఎన్నికల్లో పెన్సిల్వేనియాలో ఎలక్టర్‌గా గెలిచిన వారికి, ఓడిన వారికి మధ్య ఓటింగ్ తేడా 1.1 శాతమే ఉంది.

    ఈసారి కూడా అక్కడ పోటీ గట్టిగానే ఉందంటున్నారు. గట్టి పోటీ కారణంగా ఒకవేళ గెలుపు, ఓటముల మధ్య తేడా.05 శాతమే ఉన్నట్లయితే.. అక్కడ ఓడిన వారు రీకౌంటింగ్‌కు పట్టుబట్టే అవకాశం ఉందని అక్కడి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే కానీ జరిగితే అది అంతిమ ఫలితం పై ప్రభావం చూపిస్తుందనేది వారి ఉద్దేశం. పైగా పెన్సిల్వేనియాలో ఓటర్ నమోదుపై తమకు అనుమానాలు ఉన్నాయని రిపబ్లికన్స్ ఎన్నికలకు ముందే 100 కు పైగా పిటిషన్లు దాఖలు చేశారు.

    పోలింగ్ కేంద్రాల వద్ద ఏదైనా సమస్యలు తలెత్తిన సందర్భాల్లోనూ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడంలోనూ కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.

    గత ఎన్నికల్లో ఫలితాలను ఎప్పుడు వెల్లడించారు?

    2020 లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 3న జరిగాయి. కానీ అమెరికా టీవీ ఛానెల్స్ మాత్రం నవంబర్ 7వ తేదీ ఉదయాన పెన్సిల్వేనియాలో ఫలితం తేలే వరకు వేచిచూశాయి. ఆ తరువాతే జో బైడెన్ గెలుస్తారని ప్రకటించాయి.

    2016 లో డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా గెలిచారు. ఆ సందర్భంలో అమెరికా కాలమానం ప్రకారం ఎన్నికలు ముగిసిన మరునాడు తెల్లవారుజామున 3 గంటలప్పుడు ఫలితం గురించి అమెరికా మీడియా ప్రకటించింది.

    ఇవన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్ తరహాలోనే భావించాల్సి ఉంటుంది. కానీ అధికారిక ప్రకటన మాత్రం ఎలక్టోరల్ కాలేజ్ ఓటింగ్‌లో నమోదైన ఓట్లను లెక్కించిన తరువాతే తేలుతుంది. అందుకు సంబంధించిన పూర్తి వీడియో కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • 5 Nov 2024 1:35 PM GMT

    When will we know about who will be the next US President: అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. అమెరికా ప్రెసిడెంట్ పదవి కోసం రిపబ్లికన్స్ పార్టీ తరపున అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ పోటీ పడుతున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా వైస్ ప్రెసిడెంట్ కమల హారిస్ పోటీ చేస్తున్నారు. నవంబర్ 5 న ఎన్నికలు జరిగితే మరి ఎవరు గెలిచారో ఎప్పుడు తెలుస్తుంది?

    అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనే విషయంలో అక్కడి మీడియా కూడా అంచనాలను వెల్లడిస్తుంది. కొన్నిసార్లు ఎన్నికలు ముగిసిన గంటల వ్యవధిలోనే ఈ ప్రెడిక్షన్స్ మొదలవుతాయి. కానీ ఈసారి కమల హారిస్ కు, డోనల్డ్ ట్రంప్ కు మధ్య గట్టి పోటీ నెలకుంది. ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారు అని కచ్చితమైన అంచనా వేయడం కష్టమే అనే భావన వ్యక్తమవుతోంది.

    పెన్సిల్వేనియాలో రికౌంటింగ్‌కి వెళ్తే?

    అసలు కౌంటింగే జరగనప్పుడు అప్పుడే పెన్సిల్వేనియాలో రీకౌంటింగ్ అనే మాట ఎక్కడి నుండి వస్తుంది అని డౌట్ రావచ్చు. కానీ అందుకు కూడా ఓ కారణం ఉంది. అదేంటంటే.. 2020 ఎన్నికల్లో పెన్సిల్వేనియాలో ఎలక్టర్‌గా గెలిచిన వారికి, ఓడిన వారికి మధ్య ఓటింగ్ తేడా 1.1 శాతమే ఉంది.

    ఈసారి కూడా అక్కడ పోటీ గట్టిగానే ఉందంటున్నారు. గట్టి పోటీ కారణంగా ఒకవేళ గెలుపు, ఓటముల మధ్య తేడా.05 శాతమే ఉన్నట్లయితే.. అక్కడ ఓడిన వారు రీకౌంటింగ్‌కు పట్టుబట్టే అవకాశం ఉందని అక్కడి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే కానీ జరిగితే అది అంతిమ ఫలితం పై ప్రభావం చూపిస్తుందనేది వారి ఉద్దేశం. పైగా పెన్సిల్వేనియాలో ఓటర్ నమోదుపై తమకు అనుమానాలు ఉన్నాయని రిపబ్లికన్స్ ఎన్నికలకు ముందే 100 కు పైగా పిటిషన్లు దాఖలు చేశారు.

    పోలింగ్ కేంద్రాల వద్ద ఏదైనా సమస్యలు తలెత్తిన సందర్భాల్లోనూ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడంలోనూ కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.

    గత ఎన్నికల్లో ఫలితాలను ఎప్పుడు వెల్లడించారు?

    2020 లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 3న జరిగాయి. కానీ అమెరికా టీవీ ఛానెల్స్ మాత్రం నవంబర్ 7వ తేదీ ఉదయాన పెన్సిల్వేనియాలో ఫలితం తేలే వరకు వేచిచూశాయి. ఆ తరువాతే జో బైడెన్ గెలుస్తారని ప్రకటించాయి.

    2016 లో డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా గెలిచారు. ఆ సందర్భంలో అమెరికా కాలమానం ప్రకారం ఎన్నికలు ముగిసిన మరునాడు తెల్లవారుజామున 3 గంటలప్పుడు ఫలితం గురించి అమెరికా మీడియా ప్రకటించింది.

    ఇవన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్ తరహాలోనే భావించాల్సి ఉంటుంది. కానీ అధికారిక ప్రకటన మాత్రం ఎలక్టోరల్ కాలేజ్ ఓటింగ్‌లో నమోదైన ఓట్లను లెక్కించిన తరువాతే తేలుతుంది. అందుకు సంబంధించిన పూర్తి వీడియో కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Print Article
Next Story
More Stories