US Election 2024 Results Live Updates: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు లైవ్ అప్‌డేట్స్.. అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్
US Election Results 2024 Live Updates in Telugu: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ప్రస్తుతం అమెరికాలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఓట్లు లెక్కిస్తున్నారు. ఇప్పటికే రిపబ్లికన్ అభ్యర్థి డోనల్డ్ ట్రంప్ 270 స్థానాలతో భారీ ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారీస్ 224 స్థానాలతో వెనుకంజలో ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ట్రంప్ స్పందించారు. అమెరికాకు 45వ అధ్యక్షుడు తానే, అలాగే 47వ అధ్యక్షుడు కూడా తానేనన్నారు. తన క్యాంపెయిన్ పార్ట్‌నర్ జేడి వాన్స్‌ను ఇకపై వైస్ ప్రెసిడెంట్ అని పిలవొచ్చు అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
బంగారు భవిష్యత్‌కు తనది పూచీ అని రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనల్డ్ ట్రంప్ చెప్పారు. పోలింగ్ తర్వాత తన మద్దతుదారులనుద్దేశించి ఆయన మాట్లాడారు. అమెరికా ఇలాంటి విజయం ఎన్నడూ చూడలేదని ఆయన అన్నారు. అమెరికన్లకు స్వర్ణ యుగం రాబోతోందన్నారు. అమెరికా ప్రజల కోసం నిత్యం పనిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు.తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు చెప్పారు.
Live Updates
- 6 Nov 2024 7:35 AM GMT
US Election Counting: కమలా వర్సెస్ ట్రంప్..18 రాష్ట్రాల్లోట్రంప్ ..9 రాష్ట్రాల్లో కమలా హ్యారిస్ విజయం
US Election Counting: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వచ్చేస్తున్నాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలను చూసినట్లయితే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన నార్త్ డకోటా, వయోమింగ్, సౌత్ డకోటా, నెబ్రాస్కా, ఓక్లహోమా, టెక్సాస్, ఆర్కాన్సాస్, లూసియానా, ఇండియానా, కెంటకీ, టెన్నెసీ, మిస్సోరి, మిసిసిపి, ఒహాయో, వెస్ట్ వర్జీనియా, అలబామా, సౌత్ కరోలినా, ఫ్లోరిడా 18 రాష్ట్రాల్లో గెలుపొందారు. దీంతో ట్రంప్ నకు 188 ఎలక్టోరల్ సీట్లు వచ్చాయి.
డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ ప్రస్తుతం 9 రాష్ట్రాలను సొంతం చేసుకున్నారు. ఆమెకు ఇల్లినోయి, న్యూజెర్సీ, మేరీల్యాండ్, వెర్మొంట్, న్యూయార్క్, కనెక్టికట్, డెలవేర్, మసాచుసెట్స్, రోడ్ ఐల్యాండ్ రాష్ట్రాల్లోని 99 సీట్లు లభించాయి.
అత్యంత కీలకమైన స్వింగ్ స్టేట్ జార్జియాలో కమలా ఎదురీదుతున్నారు. 2020 ఎన్నికల్లో ఈ స్టేట్ డెమోక్రట్లకు 16 ఎలక్టోరల్ ఓట్లను తీసుకువచ్చింది. అదే సమయంలో పెన్సిల్వేనియాలో మాత్రం కీలకమైన పిట్స్ బర్గ్, ఫిలడెల్ఫియాలో కమలా ముందున్నారు. దీంతో ఇప్పుడు తీవ్రమైన ఉత్కంఠ రేపుతోంది.
- 5 Nov 2024 4:48 PM GMT
US Elections 2024 first result: అమెరికాలో ఫస్ట్ రిజల్ట్ వచ్చేసింది.. ఆ ఊర్లో అర్ధరాత్రే ఓటింగ్ సంప్రదాయం
US Elections 2024 first result: అమెరికాలో ఓవైపు అధ్యక్ష ఎన్నికలు జరుగుతుండగానే మరోవైపు ఆ ఊర్లో ఎన్నికల ఫలితం వచ్చేసింది. ఇంకా ఆశ్చర్యకమైన విషయం ఏంటంటే... అమెరికాలో అంతటా తెల్లవారి 6 గంటలకు, ఇంకొన్ని చోట్ల 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైతే, ఆ ఊరిలో మాత్రం అర్థరాత్రే పోలింగ్ అయిపోయింది. ఆ తరువాత 12 నిమిషాలకే ఫలితం కూడా ప్రకటించారు.
న్యూ హ్యాంప్‌షైర్ రాష్ట్రంలోని డిక్స్‌విల్లే నాచ్ అనే చిన్న ఊరు గురించే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. ఈ ఊరిలో ఆరుగురు ఓటర్లు మాత్రమే ఉన్నారు. వారిలో ముగ్గురు డెమొక్రట్స్ తరపున పోటీ చేసిన కమలా హారీస్‌కు ఓటు వేశారు. మరో ముగ్గురు రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డోనల్డ్ ట్రంప్‌కు ఓటు వేశారు. ఉన్న ఆరుగురు ఓటర్లలో ముగ్గురు అటు, ముగ్గురు ఇటు ఓటు వేయడంతో అక్కడి ఫలితం టై అయింది.
న్యూ హ్యాంప్‌షైర్ రాష్ట్రంలో ఎన్నికల నిబంధనల ప్రకారం, 100 మంది కంటే తక్కువ ఓటర్లు ఉన్న మునిసిపాలిటీలలో అర్థరాత్రే పోలింగ్ ప్రారంభించుకునే వెసులుబాటు ఉంది. 1960 లో తొలిసారిగా అక్కడ ఇలా అర్ధరాత్రి పోలింగ్ నిర్వహించే సంప్రదాయం మొదలైంది. అమెరికా ఫెడరల్ చట్టాలు, నిబంధనల ప్రకారం పోలింగ్ ముగియగానే కౌంటింగ్ చేపడతారు. అలా ఇక్కడి ఫలితం నిమిషాల్లోనే తేలిపోతుంది. అమెరికా అంతటా తెల్లారాక ఓటేస్తే.. ఇక్కడ మాత్రం అర్ధరాత్రే ఫలితం కూడా తేలిపోతుంది. అందుకే అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరిగే ప్రతీసారి ఇక్కడి ఫలితం వార్తల్లోకెక్కుతుంది.
2020 లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ విజయం సాధించినప్పుడు కూడా ఈ డిక్స్‌విల్లె నాచ్ ఊరి ఓటింగ్ సరళిపై వార్తలొచ్చాయి. అప్పుడు ఇక్కడున్న ఆరుగురు ఓటర్లు జో బైడెన్‌కే ఓటు వేశారు. కానీ ఈసారి మాత్రం వారి తీర్పులో కమలా హారీస్‌కు, డోనల్డ్ ట్రంప్‌కు చెరో సగం ఇచ్చారు.
- 5 Nov 2024 1:35 PM GMT
When will we know about who will be the next US President: అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. అమెరికా ప్రెసిడెంట్ పదవి కోసం రిపబ్లికన్స్ పార్టీ తరపున అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ పోటీ పడుతున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా వైస్ ప్రెసిడెంట్ కమల హారిస్ పోటీ చేస్తున్నారు. నవంబర్ 5 న ఎన్నికలు జరిగితే మరి ఎవరు గెలిచారో ఎప్పుడు తెలుస్తుంది?
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనే విషయంలో అక్కడి మీడియా కూడా అంచనాలను వెల్లడిస్తుంది. కొన్నిసార్లు ఎన్నికలు ముగిసిన గంటల వ్యవధిలోనే ఈ ప్రెడిక్షన్స్ మొదలవుతాయి. కానీ ఈసారి కమల హారిస్ కు, డోనల్డ్ ట్రంప్ కు మధ్య గట్టి పోటీ నెలకుంది. ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారు అని కచ్చితమైన అంచనా వేయడం కష్టమే అనే భావన వ్యక్తమవుతోంది.
పెన్సిల్వేనియాలో రికౌంటింగ్‌కి వెళ్తే?
అసలు కౌంటింగే జరగనప్పుడు అప్పుడే పెన్సిల్వేనియాలో రీకౌంటింగ్ అనే మాట ఎక్కడి నుండి వస్తుంది అని డౌట్ రావచ్చు. కానీ అందుకు కూడా ఓ కారణం ఉంది. అదేంటంటే.. 2020 ఎన్నికల్లో పెన్సిల్వేనియాలో ఎలక్టర్‌గా గెలిచిన వారికి, ఓడిన వారికి మధ్య ఓటింగ్ తేడా 1.1 శాతమే ఉంది.
ఈసారి కూడా అక్కడ పోటీ గట్టిగానే ఉందంటున్నారు. గట్టి పోటీ కారణంగా ఒకవేళ గెలుపు, ఓటముల మధ్య తేడా.05 శాతమే ఉన్నట్లయితే.. అక్కడ ఓడిన వారు రీకౌంటింగ్‌కు పట్టుబట్టే అవకాశం ఉందని అక్కడి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే కానీ జరిగితే అది అంతిమ ఫలితం పై ప్రభావం చూపిస్తుందనేది వారి ఉద్దేశం. పైగా పెన్సిల్వేనియాలో ఓటర్ నమోదుపై తమకు అనుమానాలు ఉన్నాయని రిపబ్లికన్స్ ఎన్నికలకు ముందే 100 కు పైగా పిటిషన్లు దాఖలు చేశారు.
పోలింగ్ కేంద్రాల వద్ద ఏదైనా సమస్యలు తలెత్తిన సందర్భాల్లోనూ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడంలోనూ కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
గత ఎన్నికల్లో ఫలితాలను ఎప్పుడు వెల్లడించారు?
2020 లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 3న జరిగాయి. కానీ అమెరికా టీవీ ఛానెల్స్ మాత్రం నవంబర్ 7వ తేదీ ఉదయాన పెన్సిల్వేనియాలో ఫలితం తేలే వరకు వేచిచూశాయి. ఆ తరువాతే జో బైడెన్ గెలుస్తారని ప్రకటించాయి.
2016 లో డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా గెలిచారు. ఆ సందర్భంలో అమెరికా కాలమానం ప్రకారం ఎన్నికలు ముగిసిన మరునాడు తెల్లవారుజామున 3 గంటలప్పుడు ఫలితం గురించి అమెరికా మీడియా ప్రకటించింది.
ఇవన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్ తరహాలోనే భావించాల్సి ఉంటుంది. కానీ అధికారిక ప్రకటన మాత్రం ఎలక్టోరల్ కాలేజ్ ఓటింగ్‌లో నమోదైన ఓట్లను లెక్కించిన తరువాతే తేలుతుంది. అందుకు సంబంధించిన పూర్తి వీడియో కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

- 5 Nov 2024 8:39 AM GMT
US Elections 2024: అమెరికా ప్రెసిడెంట్ ఎవరో అప్పుడే చెప్పేసిన బేబి హిప్పో
Thailand baby pygmy hippo Moo Deng predicted US presidential election results: ఇప్పుడు అందరి దృష్టి అమెరికా అధ్యక్ష ఎన్నికలపైనే నెలకొంది. అమెరికా అధ్యక్షురాలిగా గెలిచి కమల హరీస్ చరిత్ర సృష్టిస్తారా? లేదంటే మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికై శ్వేత సౌధంలో అడుగుపెట్టాలన్న డొనాల్డ్ ట్రంప్ ఆశలు ఫలిస్తాయా? అనే విషయంపై అమెరికన్లు తమ ఓటు హక్కుతో తీర్పు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. థాయ్‌లాండ్ జూలోని పిగ్మీ హిస్పో (నీటి గుర్రం) అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో జోస్యం చెప్పేసింది.
ఈ హిప్పోను అక్కడి జనం చాలా మంది నమ్ముతారు. గతంలో పలు సందర్భాల్లో హిప్పో చెప్పిన జోస్యం నిజమైన సందర్భాలు కూడా ఉన్నాయనేది వారి వాదన. ఇవాళ అమెరికా ఎన్నికల నేపథ్యంలో డోనల్డ్ ట్రంప్, కమలా హరీస్‌లలో ఎవరు గెలుస్తారో అని రెండు పుచ్చకాయల కేకులను సెపరేట్‌గా ఉంచారు. ఒక దానిపై డోనల్డ్ ట్రంప్, మరోదాని పై కమలా హరీస్ పేరును రాసి హిప్పో ముందు ఉంచారు. అప్పుడు హిప్పో ఏం చేసిందనే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 5 Nov 2024 7:57 AM GMT
US Elections 2024: అమెరికా ప్రెసిడెంట్‌గా ఎవరు గెలుస్తారు, భారత్‌తో సంబంధాలు ఎలా ఉంటాయి? స్పందించిన విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్
US Elections 2024 Live Updates in Telugu: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనల్డ్ ట్రంప్ వైస్ కమలా హారీస్ మధ్య పోటీ హోరాహోరీగా నడుస్తోంది. అసలు ఈ ఇద్దరిలో ఎవరు గెలిస్తారు? ఎవరు గెలిస్తే ఎలా ఉంటుంది అనే అంశంలో చాలా చర్చలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అమెరికాతో భారత్ సంబంధాలు ఎలా ఉండబోతున్నాయనే కోణంలో ఆసక్తికరమైన చర్చలు నడుస్తున్నాయి. అమెరికా ప్రభుత్వం తీసుకునే ఇమ్మిగ్రేషన్ పాలసీ నిర్ణయాలు అమెరికాకు ఉన్నత చదువుల కోసం, ఉద్యోగాల కోసం వెళ్లే వారిపై ప్రభావం చూపిస్తుంటాయి. అమెరికా ప్రెసిడెంట్ తీసుకునే నిర్ణయాలను బట్టి ఆ ప్రభావం భారతీయులకు అనుకూలంగా ఉంటుందా లేక ప్రతికూలంగా ఉంటుందా అనేది ఆధారపడి ఉంటుంది. అందుకే రాబోయే ప్రెసిడెంట్ ఎవరైతే అమెరికా - భారత్ సంబంధాలు ఎలా ఉంటాయనే అంశంపై భారతీయులు చర్చించుకుంటున్నారు. తాజాగా ఇదే అంశంపై విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ స్పందించారు. ఆ పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire