live blog : ఈరోజు (మే-23-శనివారం) తాజా వార్తలు..ఎప్పటికప్పుడు!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 23 మే 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు తాజావార్తలు
Live Updates
- 23 May 2020 9:37 AM GMT
రాష‌్ట్రంలో ట్రెండీగా సీఎం కేసీఆర్ కండువా
మాటలో అయినా.. చేతలో అయినా.. కేసీఆర్ అంటేనే ఒక ట్రెండ్. అలాగే ఆయనలో వచ్చిన ఓ మార్పు కూడా ఇప్పుడు ట్రెండీగా మారింది. ఇటీవల జరిగిన ప్రెస్‌మీట్ నుంచి ఆయన డ్రెస్సింగ్‌పై జోరుగా చర్చ జరుగుతోంది.
- 23 May 2020 8:21 AM GMT
వైఎస్ రాజారెడ్డికి కుటుంబసభ్యుల నివాళి
వైఎస్ రాజారెడ్డి 22వ వర్ధంతి సందర్భంగా ఆయనకు కుటుంబసభ్యులు శనివారం ఘనంగా నివాళులు అర్పించారు.
- పులివెందుల రాజారెడ్డి ఘాట్‌లోని వైఎస్ జయమ్మ, రాజారెడ్డి సమాధుల వద్ద వైఎస్సార్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతో పాటు కుటుంబసభ్యులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
- అనంతరం రాజారెడ్డి మెమోరియల్ పార్కులోని ఆయన విగ్రహం వద్ద అంజలి ఘటించారు. జీసెస్ చారిటీస్‌లోని చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
-ఈ కార్యక్రమంలో వైఎస్ సౌభాగ్యమ్మ, వైఎస్ మనోహర్ రెడ్డి, దివంగత వివేకానందరెడ్డి కుమార్తె సునీత,అల్లుడు రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- 23 May 2020 7:22 AM GMT
- విశాఖ జిల్లా, పాడేరు సబ్ కలెక్టర్, ఇన్చార్జి ఐటీడీఏ పీవోగా భాద్యతలు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లును పూర్తిస్థాయి పీవోగా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు.
- సబ్ కలెక్టర్ పోస్టుకు ఇన్చార్జిగా ఆయనకే భాద్యతలు .
- 23 May 2020 7:17 AM GMT
- మహబూబ్ నగర్ పట్టణం ఏనుగొండ లోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ (KGBV) కు రూ.205 లక్షలతో నిర్మించనున్న అదనపు తరగతి గదులు నిర్మాణానికి నిధులు మంజూరు.
- ఈరోజు శంకుస్థాపన చేసిన మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్.
- 23 May 2020 7:11 AM GMT
- కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం, దేమికలాన్ గ్రామంలో ఉపాధి హామీ కూలీలపై అడవి పందుల దాడి.
- ముగ్గురికి తీవ్ర గాయాలు
- 23 May 2020 7:08 AM GMT
మేయర్ కు జరిమానా విధించిన మంత్రి కేటీఆర్
పర్యావరణాన్ని పరిరక్షించేందుకు, బ్యానర్ల కారణంగా జరిగే ప్రమాదాలను అరికట్టేందుకు ప్లెక్సీల నియంత్రణకు జీహెచ్ఎంసీ కంకణం కట్టుకుంది. నగరంలో అనధికారికంగా పెట్టే ప్లెక్సీలు, బ్యానర్ల ఏర్పాట్లను నిషేధించాలని గతేడాది జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ సూచించిన విషయం తెలిసిందే.
- 23 May 2020 6:04 AM GMT
- మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం లో కరోనా పాజిటివ్ గ్రామాలను సందర్శించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
- మహారాష్ట్ర నుండి వచ్చిన వలస కార్మికులతోనే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి...
- పాజిటివ్ వ్యక్తుల నుండి స్థానికులకు వ్యాధి ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశం.
- కరుణ పాజిటివ్ గ్రామాలలో ఇతర మండలాల నుండి పోలీస్ ,ఆరోగ్య శాఖ సిబ్బందిని నియమించాలని మంత్రిని కోరిన అధికారులు.
- 23 May 2020 4:32 AM GMT
రష్యాను దాటిపోయిన బ్రెజిల్
- కరోనా పాజిటివ్ కేసుల్లో శుక్రవారం రష్యాను బ్రెజిల్ దాటిపోయింది.
- ఇప్పుడు ఈ దక్షిణ అమెరికా దేశంలో 3,30,890 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 21,048 మరణాలు సంభవించాయి.
- బ్రెజిల్ లో 24 గంటల వ్యవధిలో 1,001 మరణాలు సంభవించాయి. గత నాలుగురోజుల్లో మూడు రోజులు ఇక్కడ మరణాల సంఖ్య 1000 దాటింది.
-
- 23 May 2020 3:31 AM GMT
- వైసీపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్బంగా వాడవాడలా వేడుకలు.
- పాడేరు లో వైస్సార్ విగ్రహనికి నివాళి అర్పించిన ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి
- జిల్లా ఆసుపత్రిలో రోగులకు పాలు పండ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
- 23 May 2020 3:23 AM GMT
ఏపీలో రాకపోకలకు అనుమతులు అవసరం లేదు - డీజీపీ
- ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వ్యక్తిగత వాహనాల్లో వెళ్లేందుకు ప్రత్యేక అనుమతులు అవసరం లేదన్నారు డీజీపీ గౌతమ్ సవాంగ్.
- జిల్లాల సరిహద్దుల్లో వాహనాలు ఆపవద్దని ఎస్పీలకు ఆదేశాలు ఇచ్చామని చెప్పారు.
- కారుల్లో ముగ్గురికి మించకుండా ప్రయాణించడం మాస్కులు ధరించడం వంటి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు..
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire