live blog : ఈరోజు (మే-23-శనివారం) తాజా వార్తలు..ఎప్పటికప్పుడు!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 23 మే 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు తాజావార్తలు





Show Full Article

Live Updates

  • 23 May 2020 2:36 AM GMT

    కృష్ణా జిల్లలో కార్టన్ సెర్చ్

    - కృష్ణాజిల్లా  విస్సన్నపేట మండలంలో పోలీసులు, ఎక్సైజ్ శాఖల ఆధ్వర్యంలో సంయుక్తంగా కార్డన్ సెర్చ్..

    - జిల్లా ఎస్పీ ఆదేశాలతో స్పెషల్ ఇన్ఫోర్స్మెంట్ బ్యూరో, ఏఎస్పీ వకుల్ జిందాల్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దాడులు..

    - తాతకుంట్ల తండా,వేమిరెడ్డిపల్లి తండా,బాణవాతు తండా,చంద్రుపట్ల తండా,కొర్ర తండాల్లో జల్లెడ పట్టిన పోలీసులు..

    - 120,లీటర్ల నాటు సారా స్వాధీనం, 3,500 వేల లీటర్ల బెల్లం ఊట ధ్వసం చేసిన పోలీసులు.

    - 70 కిలోల బెల్లం పట్టివేత.21 మందిని అరెస్ట్..

    - ఈ కార్యక్రమంలో నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు ఈ.ఎస్ ఎం.మనోహ, సబ్ డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్సైలు,సిబ్బంది పాల్గొన్నారు. 

  • 23 May 2020 2:29 AM GMT

    - కామారెడ్డి జిల్లా కేంద్రం గొల్లవాడ లో దారుణం .

    - కట్టుకున్న బార్య ఆకృతి రజిత (23) ఫై భర్త శ్రీకాంత్ తో సహా ఆడపడుచుల దాడి .

    - తీవ్రంగా గాయపడిన రజిత

    - చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించగా అస్పత్రిలో రజిత మృతి

    - భర్త, ఆడపడుచులు దాడి చేయడం వల్లే రజిత మృతి చెందిందని బంధువులు ఆరోపణ.

    -  కామారెడ్డి ఏరియా ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన.

  • 23 May 2020 2:28 AM GMT

    - రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మండలం లొని హాల్ హబీబ్ కాలేజీ వద్ద బైక్ ను ఢీ కొన్న సిమెంట్ లారీ

    - బైక్ నడుపుతున్న వ్యక్తి మృతి.

    - మృతుడు అలుర్ గ్రామానికి చెందిన యండి జవీద్(38 )గా గుర్తింపు.

  • 23 May 2020 2:27 AM GMT

    - మంచిర్యాల జిల్లా..బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ శివారులోని తిరుమల హిల్స్ సమీపంలో రెండు బైకులు ఢీ..

    - నలుగురిలో ఇద్దరికి స్వల్ప గాయాలు, ఇద్దరికి తీవ్ర గాయాలు..

    - బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు,

  • వన్డే భారత్ మిషన్ ద్వారా విశాఖ విమానాశ్రయానికి 59 మంది తెలుగు వారు
    23 May 2020 2:22 AM GMT

    వన్డే భారత్ మిషన్ ద్వారా విశాఖ విమానాశ్రయానికి 59 మంది తెలుగు వారు

    - కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ వాసులు 59 మందిని వందే భారత్ మిషన్ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ విమానాశ్రయానికి తీసుకువచ్చారు.

    - ప్రత్యేక ఎయిర్ ఇండియా విమానంలో శుక్రవారం రాత్రి మలేషియా నుండి విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు.

    - మొత్తం 59 మంది లో కర్నూలు జిల్లా ఒకరు, తూర్పు గోదావరి జిల్లా 4, పశ్చిమగోదావరి ఆరుగురు, గుంటూరు 12 మంది, కృష్ణాజిల్లా 7, నెల్లూరు 2, ప్రకాశం ఇద్దరూ, శ్రీకాకుళం ఆరుగురు, విజయనగరం నలుగురు, విశాఖపట్నం 15 మంది, ఉన్నారు.

    - మలేషియా నుండి వచ్చిన వారిలో ఆరుగురు గర్భిణి స్త్రీలు ఉన్నారు.

    - ఆయా జిల్లాల వారిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సులో గవర్నమెంట్ మరియు సైడ్ కోరం ట్రైన్ కి పోలీస్ కార్టూన్ నడుమ విశాఖ విమానాశ్రయం నుండి బయలుదేరారు.

    - మలేషియా నుండి ఢిల్లీ మీదుగా వచ్చిన ఎయిరిండియా ప్రత్యేక విమానంలో ఆయా జిల్లాల వారు విశాఖ విమానాశ్రయం నుండి తిరిగి ఈరోజు రాత్రి పన్నెండున్నర గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. వారు అక్కడ నుండి ( యు ఎస్ ఏ ) బయలుదేరనున్నారు.

  • Eid-ul-Fitr 2020: చంద్ర దర్శనం కాకపోవడంతో 24 వతేదీ రంజాన్ పండుగ జరుపుకోనున్న సౌదీ అరేబియా
    23 May 2020 2:08 AM GMT

    Eid-ul-Fitr 2020: చంద్ర దర్శనం కాకపోవడంతో 24 వతేదీ రంజాన్ పండుగ జరుపుకోనున్న సౌదీ అరేబియా

    పవిత్రమైన రంజాన్ పండుగను ఈరోజు(మే 23) ముస్లిం సోదరులు జరుపుకోవలసి ఉంది.

    అయితే, 30 రోజుల ఉపవాస దీక్ష తరువాత కావలసిన చంద్రుని దర్శనం ఈరోజు కాకపోవడంతో రంజాన్ పండుగను రేపు అంటే మే 24 వ తేదీన జరుపుకోవాలని ముస్లిం సోదరులకు సౌదీ అరేబియాకు చెందిన ఉన్నత న్యాయ వ్యవస్థ ప్రకటించింది.

    ఈద్-ఉల్-ఫితర్ అదేవిధంగా షవ్వాల్ మొదటి రోజు ఉత్సవాలను ఎప్పుడు జరుపుకోవాలనే అంశాలను ఈరోజు (మే 23) చంద్ర దర్శన కమిటీ చంద్రుని చూసిన వెంటనే వెల్లడిస్తారు.

    -పూర్తి కథనం 

Print Article
More On
Next Story
More Stories