Live Blog: ఈరోజు (మే-26-మంగళవారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు మంగళవారం, 26 మే, 2020 :
ఈరోజు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ లలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా వేడి గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ చెబుతోంది. బయటకు వెళ్ళినపుడు తగిన జాగ్రతలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 26 May 2020 6:55 AM GMT
తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్ తగలబోతోందా?
- ఒంగోలులోని మంత్రి బాలినేని నివాసంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అనగాని సత్య ప్రసాద్, ఏలూరి సాంబశివరావు భేటీ అయినట్టు తెలుస్తోంది
- కాసేపట్లో వారు తాడేపల్లి బయలుదేరతారని చెబుతున్నారు.
- సాయంత్రం లోపు సీఎం జగన్ సమక్షంలో టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరే అవకాశం ఉందని పరిశీలకుల అంచనా!
- పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- 26 May 2020 6:30 AM GMT
ఏపీలో కొత్తగా 48 కరోనా పాజిటివ్ కేసులు
- ఏపీలో కరోనా మృతుల సంఖ్య 57కి చేరింది.
- తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో కరోనాతో ఒకరు మృతి చెందారు.
- గడిచిన 24 గంటల్లో 8,148 నమూనాలను పరీక్షించగా.. 48 పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు.
- కొవిడ్ నుంచి కోలుకుని తాజాగా 55 మంది డిశ్చార్జి అయ్యారు.
- ప్రస్తుతం 759 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
- 26 May 2020 6:28 AM GMT
హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం
- శాసనమండలి తీర్మానాన్ని అమలు చేయడం లేదంటూ హైకోర్టులో పిటిషన్
- హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‍రెడ్డి
- సెలక్ట్ కమిటీ వేయకుండా మండలి కార్యదర్శి నిబంధనలు ఉల్లంఘించారని హైకోర్టులో పిటిషన్
- అధికార పక్షానికి మండలి సెక్రటరీ అనుకూలంగా వ్యవహరిస్తున్నారు
- క్విడ్‍ప్రోకో కింద మండలి సెక్రటరీ పదవీకాలం కూడా పొడిగించారు
- ప్రతివాదులుగా మండలి కార్యదర్శి, ప్రభుత్వం, సహాయ కార్యదర్శి పేర్లు
- దీపక్ రెడ్డి పిటిషన్‍పై కాసేపట్లో విచారణ చేపట్టనున్న ఏపీ హైకోర్టు
- 26 May 2020 6:21 AM GMT
- విశాఖ జిల్లా, పాడేరులో జీవో 3పై కొనసాగుతున్న ఆందోళన.
- దీనిపై కేంద్ర, రాష్ర్టప్రభుత్వాలు జూన్ 8 లోపు స్పష్టమైన ప్రకటన చెయ్యాలి.
- లేదంటే జూన్ 9 ఏజెన్సీ బంద్.
-గిరిజన సంఘం.
- 26 May 2020 6:17 AM GMT
మహాబూబ్ నగర్ జిల్లా.... జడ్చర్ల మండలం, మల్లె బోయిన్ పల్లి వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం
- ట్రాక్టర్ ను ఢీ కొన్న లారీ
- ఒకరి మృతి
- 26 May 2020 5:34 AM GMT
విశాఖపట్నం:
ఉత్తరాంధ్ర పొలిటికల్ జేఏసీ కన్వీనర్ జేటీ రామారావును పోలీసులు అరెస్ట్ చేశారు.
కోవిడ్ 19 కారు పాసులను తయారు చేసి విక్రయిస్తున్నాడని..జేటీ రామారావును మహారాణిపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జేటీ రామారావు అరెస్ట్ కావడం ఇది మూడోసారి.
2016లో విజిలెన్స్ అధికారినంటూ డబ్బులు వసూలు చేసిన కేసులో అరెస్ట్ అవగా...
ఈ ఏడాది ఫ్రిబ్రవరి 25న చంద్రబాబు విశాఖ ఎయిర్‌పోర్టుకు వచ్చిన సమయంలో ఆత్మహత్యాయత్నమంటూ హల్‌చల్ చేసిన సందర్భంలో రెండోసారి జేటీ అరెస్ట్ అయ్యారు.
- 26 May 2020 5:34 AM GMT
విశాఖపట్నం :
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్, బి.ఫార్మశీ, ఎం.ఫార్మశీ, ఎమ్.ఆర్క్ కోర్సుల్లో ప్రవేశానికిగాను ఆన్‌లైన్ విధానంలో ఇటీవల నిర్వహించిన పరీక్షల ఫలితాలను సోమవారం ఉప కులపతి కె.శివరామకృష్ణ విడుదల చేశారు.
దాదాపు 50 వేల మంది ఈ ప్రవేశ పరీక్షలు రాశారని, ప్రతిభ కనబరచిన విద్యార్థులకు ఫీజులో రాయితీ ఉంటుందన్నారు.
జూన్ ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు వెల్లడించారు.
- 26 May 2020 5:33 AM GMT
గన్నవరం విమానాశ్రయం లో గన్నవరం నుండి బెంగళూరు వెళ్లేందుకు ఎయిర్ పోర్ట్ కి చేరుకున్న ప్రయాణికులు.
కరోన వైరస్ కారణంగా శానిటేషన్ అంతరం ప్రయాణికులను లోపలికి పంపుతున్న విమానాశ్రయ అధికారులు.
శానిటేషన్ చేయించుకోవడానికి బారులు తీరిన ప్రయాణికులు.
గన్నవరం ఎయిర్పోర్ట్ పోర్టులో కరోనా వైరస్ పై భద్రత విభాగాన్ని పరిశీలించిన విజయవాడ సబ్ కలెక్టర్ ధ్యాన చందర్.
- 26 May 2020 5:32 AM GMT
సీఎం జగన్మోహన్ రెడ్డికి స్వామి పరిపూర్ణానంద బహిరంగ లేఖ
-హిందూ బంధువుల ఆందోళన రాకముందే వేలం నిలిపి నందుకు కృతజ్ఞతలు
-ఇప్పటిదాకా పని చేసిన సీఎంలు దేవుళ్లకు హిందువులకు ఒరగబెట్టింది ఏమీలేదు
-వారి నిర్వాకం వల్లే 5 లక్షల కోట్ల పంట భూములు లెక్కలేని ఆభరణాలు దోపిడీ కాబడ్డాయి అన్నది అక్షర సత్యం
-దేవాలయ ఆస్తులు పై శ్వేతపత్రం విడుదల చేయండి
-ప్రజలు అందించిన ఆస్తులు వివరాలు వారికి తెలియ చెప్పడంలో తప్పులేదు
-ఇప్పటి వరకు ఎవరు చెయ్యని ఈ పని మీరు చేస్తే నమ్మి ఓటు వేసిన హిందువులందరికీ న్యాయం చేసినవారవుతారు చరిత్రలో మిగిలిపోతారు
-స్వామి పరిపూర్ణానంద
- 26 May 2020 4:46 AM GMT
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం
- సౌత్‌ఈస్ట్ ఢిల్లీలోని తుగ్లక్‌బాద్ ఏరియాలో సోమవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది.
- ఈ ప్రమాదంలో దాదాపు 1500 గుడిసెలు దగ్ధమయ్యాయి.
- దీంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
- అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని సౌత్ ఈస్ట్ ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రసాద్ మీనా చెప్పారు.
- దాదాపు 15 ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపుచేశా
- ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఆస్తి నష్టాన్ని అంచనా వేస్తున్నారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire