Live Blog: ఈరోజు (మే-26-మంగళవారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 26మే 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు మంగళవారం, 26 మే, 2020 :
ఈరోజు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ లలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా వేడి గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ చెబుతోంది. బయటకు వెళ్ళినపుడు తగిన జాగ్రతలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 26 May 2020 4:03 PM GMT
టీటీడీ భూముల వ్యవహారం పై సీఎం జగన్‌కు నాగబాబు అభినందనలు
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిరర్థక ఆస్తుల అమ్మకాలపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని నిలుపుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సినీ నటుడు నాగబాబు స్పందించారు.
టీటీడీ భూముల అమ్మకాన్ని నిలివేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అభినందనలు తెలిపారు.
ఈ మేరకు ట్వీటర్‌లో ఓ పోస్ట్ చేశారు. ‘టీటీడీ భూముల అమ్మకాన్ని నిలిపివేసిన సీఎం జగన్‌మోహన్ రెడ్డి గారికి అభినందనలు. అలాగే పింక్ డైమండ్ గురించి కూడా ఎంక్విరీ చేసి నిజాలను నిగ్గు తేల్చండి. థాంక్యూ యు సీఎం గారు’ అని ట్వీట్ చేశారు.
Ttd భూముల అమ్మకాన్ని నిలిపివేసిన సీఎం జగన్‌మోహన్ రెడ్డి గారి కి అభినందనలు. అలాగే పింక్ డైమండ్ గురించి కూడా ఎంక్విరీ చేసి నిజాలను నిగ్గు తేల్చండి.థాంక్యూ యు సీఎం గారు
— Naga Babu Konidela (@NagaBabuOffl) May 26, 2020 - 26 May 2020 3:09 PM GMT
తెలంగాణలో నేడు కొత్తగా 71 కేసులు
* ఈ రోజు 71 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
* రాష్ట్రంలో కేసుల సంఖ్య 1,991కి చేరింది.
* ప్రస్తుతం 650 వివిద ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.
* ఈ రోజు 120 మంది డిశ్చార్జి
* మొత్తంగా 1284 మంది రికవరీ అయ్యారు.
* ఈ రోజు నమోదైన కేసుల్లో 38 జీహెచ్‌ఎంసీ పరిధిలోనివి
- 26 May 2020 2:26 PM GMT
తూర్పుగోదావరిజిల్లా లో గంజాయి పట్టివేత
- తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గంగండేపల్లి మండలం పరిధిలో 2 ఐ సర్ వ్యాను లపై తరలిస్తున్న గంజాయి పట్టివేత
- ఐదు లక్షలు విలువచేసే 200 కేజీల గంజాయిని పట్టుకున్న పోలీసులు
- నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు వీరి వద్దనుండి 150000 నగదు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు
- వీరిని మీడియా ముందు ప్రవేశపెట్టిన పెద్దాపురం డిఎస్పి అరిటాకులు శ్రీనివాస్, జగ్గంపేట సి ఐ వై రాంబాబు, ఎస్సై తిరుపతిరావు
- 26 May 2020 12:30 PM GMT
హైకోర్టు తీర్పుపై వైసీపీ నేతల విమర్శలు.. ఎంపీ సహా 49 మందికి నోటీసులు!
➡️నందిగం సురేష్, ఆమంచిలకు నోటీసులు
➡️నేతల వ్యాఖ్యలను పరిశీలించిన హైకోర్టు
➡️కోర్టు తీర్పులపై విమర్శలను తప్పు పట్టిన వైనం
- 26 May 2020 12:28 PM GMT
అర్చకులు, పాస్టర్లు, ఇమామ్ లకు 5వేల వన్ టైం సహాయం
- అర్చకులు, పాస్టర్లు, ఇమామ్‌లు, మౌజన్‌లకు రూ. 5 వేల చొప్పున వన్‌టైం సహాయం
- తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా వారి అకౌంట్లలో నగదు జమ చేసిన సీఎం వైఎస్ జగన్
- కార్యక్రమానికి హజరైన దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని, ప్రభుత్వ ఉన్నతాధికారులు, అర్చకులు, పాస్టర్లు, ఇమామ్‌లు, మౌజమ్‌లు
- ప్రత్యేక ప్రార్ధనలు చేసి సీఎం వైఎస్ జగన్‌ను ఆశీర్వదించిన అర్చకులు, పాస్టర్లు, ఇమామ్‌లు
- ఈ కార్యక్రమం ద్వారా 33,803 మంది అర్చకులు, 29,841 మంది పాస్టర్లు, 13,646 మంది ఇమామ్‌లు, మౌజమ్‌లకు లబ్ది, రూ. 37.71 కోట్ల నగదు సాయం అందించిన ప్రభుత్వం
- 26 May 2020 12:21 PM GMT
- టీడీపీ మహానాడు ఏర్పాట్లు పూర్తి
- కరోనా నేపథ్యంలో వర్చువల్ మహానాడు నిర్వహిస్తున్నాం
- 25 వేల మంది కార్యకర్తలు మహానాడును వీక్షించేలా ఏర్పాటు
- మహానాడులో 52 మంది నేతలు మాట్లాడతారు
- వివిధ అంశాలపై తీర్మానాలు
- మహానాడును టీడీపీ కార్యకర్తలు విజయవంతం చేయాలి : మాజీ మంత్రి చినరాజప్ప
- 26 May 2020 11:45 AM GMT
కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం ముత్యంపేట గ్రామ శివారులోగల ఇటుక బట్టీల్లో పనిచేసే 30 కుటుంబాల వలస కార్మికుల అందోళన
* ఇటుక బట్టీ యజమాని తమను పట్టించుకోకుండా పని ముగిసిన జీతాలు ఇవ్వకుండ స్వస్థలలాకు పంపడం లేదని డిస్పీ కార్యాలయం కు తరలివచ్చిన వలస కార్మికులు.
* తమకు న్యాయం చేయలని వేడుకుంటున్న వలస కార్మికులు.
* ఒరిస్సా జిల్లా బలింగర్ జిల్లా వలస కార్మికుల గా గుర్తింపు.
- 26 May 2020 8:50 AM GMT
నన్ను ఎవరూ కలవలేదు..మంత్రి బాలినేని
టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరుతారన్న ప్రచారాన్ని ఖండించిన మంత్రి బాలినేని ...
పర్చూరుఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు విషయంలో ఉదయం నుంచి వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు..
తనను ఏ నాయకుడు కలవలేదని .తనతో ఎవరు చర్చలు జరపలేదు అని స్పష్టం చేసిన మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి
- 26 May 2020 8:09 AM GMT
మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండల కేంద్రంలోని చిరు వ్యాపారులతో మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ , ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డిలు మాటా మంతి.
* తనే స్వయంగా నిమ్మకాయ సోడాను తయారు చేసిన మంత్రి.
* కరోనా సందర్భంగా తప్పకుండా మాస్క్ లు ధరించాలని, దూరాన్ని పాటించాలని సూచన.
* అనంతరం మాస్క్ లను పంపిణీ చేసిన మంత్రి
- 26 May 2020 7:57 AM GMT
- తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వార్త
- జగ్గంపేట పి హెచ్ సి లో దారుణం
- డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల పసికందు మరణం
- నైట్ డ్యూటీ ఉండవలసిన డాక్టర్ ఇంటికి వెళ్లి పోవడం తో డెలివరీ చేసిన నర్సులు
- డెలివరీ చేసిన వెంటనే పసికందు మృతి హుటాహుటిన తల్లితో పాటు పసికందుని తెల్లవారుజామున డిస్చార్జ్ చేయించిన నర్సులు
- పసికందు మృతదేహం తో హాస్పిటల్ వద్ద ధర్నాకు దిగిన బాధితులు
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire