Live Updates:ఈరోజు (జూన్-24) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బుధవారం, 24 జూన్, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. ఆషాఢమాసం, శుక్లపక్షం, తదియ (ఉ.10:13 వరకు), పుష్యమి నక్షత్రం (మ.01:10వరకు) సూర్యోదయం 5:43am,సూర్యాస్తమయం 6:53 pm
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 24 Jun 2020 8:08 AM GMT
కాకినాడలో మళ్లీ లాక్ డౌన్..ప్రజలు సహకరించాలి: మేయర్ పావని
- ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు నమోదవుతున్నందున ప్రజలంతా ప్రభుత్వ నిబంధనలు పాటించి లాక్ డౌన్ కు సహకరించాలని కాకినాడ నగర మేయర్ సుంకర పావనీ తిరుమల కుమార్ అన్నారు. నగర పాలక సంస్థ లోని మేయర్ చాంబరులో ఆమె విలేకరులతో మాట్లాడారు. కాకినాడ లో కేసులు అధికం అవుతున్నందున ఈనెల 25 నుండి తిరిగి లాక్ డౌన్ మొదలవుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పని ఉంటేనే బయటకు రావాలని, లేనిపక్షంలో ఇంటికే పరిమితం కావాలన్నారు. ఆరోగ్యం తో ఉంటేనే ఇతర కార్యకలాపాలకు అవకాశం ఉంటుందని, ప్రభుత్వ ఆదేశాలు పాటిద్దామని సూచించారు. కరోనా నేపథ్యంలో తమ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది బాగా పనిచేశారని కొనియాడారు.
- 24 Jun 2020 7:11 AM GMT
♦♦తూర్పుగోదావరి కాకినాడ♦♦
- కలెక్టర్ కార్యాలయం లో వైస్సార్ కాపు నేస్తం పథకం కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పిల్లి శుభాషచంద్రబాస్, మంత్రి పినెపే విశ్వరూప్
- జిల్లాలో రాష్ట్ర మొత్తంలో ఎక్కువ సంఖ్యలో లభ్డిదారులు 76,284 మంది కి 114.43 కోట్ల రూపాయల లభ్ది.
- 24 Jun 2020 6:57 AM GMT
♦♦ముంబై ♦♦
- బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ తీవ్ర అనారోగ్యంతో ముంబైలోని ఆసుపత్రిలో చేరారు.
- 71 ఏళ్ల సరోజ్ ఖాన్ శ్వాస కోస సమస్యలతో బాండ్రాలోని గురునానక్ ఆసుపత్రిలో చేరారు.
- సరోజ్ ఖాన్ శ్వాసకోస సంబంధ సమస్యలతో బాధపడుతుండటంతో వైద్యులు ఆమెకు కరోనా పరీక్షలు చేయగా నెగిటివ్ అని రిపోర్టు వచ్చింది.
- వైద్యులు చికిత్స చేస్తుండటంతో సరోజ్ ఖాన్ క్రమంగా కోలుకుంటున్నారని ఆమె కుటుంబసభ్యులు చెప్పారు.
- రెండు, మూడు రోజుల్లో సరోజ్ ఖాన్ ను డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు చెప్పారు.
- సరోజ్ ఖాన్ నాలుగు దశాబ్దాలుగా 2వేల సినిమా పాటలకు కొరియోగ్రఫీ చేశారు.
- దేవదాస్ సినిమాలోని ‘దోలా రే దోలా’, తేజాబ్ లో మాధురీ దీక్షిత్ నర్తించిన ‘ఏక్ దో తీన్’, జబ్ వీ మెట్ సినిమాలోని ‘యే ఇష్క్ హై’ పాటల కొరియోగ్రఫీకి సరోజ్ ఖాన్ కు జాతీయ అవార్డులు లభించాయి.
- 24 Jun 2020 6:52 AM GMT
♦♦అమరావతి♦♦
- హైకోర్టుకు హాజరుకానున్న ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్
- అక్రమరవాణా కేసులో సీజ్ చేసిన వెహికల్స్ ను విడుదల చేసే అంశంపై హైకోర్టులో విచారణ..
- వెహికల్స్ విడుదలలో అధికారులు నిబంధనలు పాటించలేదని పిటిషనర్ తరఫున న్యాయవాది వాదనలు
- ప్రభుత్వ న్యాయవాది వివరణతో సంతృప్తిచెందని హైకోర్టు
- ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు కోర్టుకు హాజరుకావాలని నిన్న ఆదేశం
- నేడు మరోసారి కొనసాగనున్న వాదనలు.
- 24 Jun 2020 6:37 AM GMT
»» భూ వివాదంలో పీవీపీ(పొట్లూరి వర ప్రసాద్)
- బంజారాహిల్స్ పీఎస్ లో పీవీపీ పై ఫిర్యాదు చేసిన కైలాష్ విక్రం..
- తనపై పీవీపీ గుండాలతో దౌర్జన్యానికి దిగాడని పీవీపీ పై ఫిర్యాదు..
- పీవీపీ ని బంజారాహిల్స్ పీఎస్ లో విచారిస్తున్న పోలీసులు...
- టెర్రస్ పై గార్డెన్ కట్టొద్దని పీవీపీ బెదిరింపు..
- ఈరోజు 40 మంది అనుచరులతో కైలాష్ విక్రమ్ ఇంటి పై దాడి..
- పివిపి పైన మొత్తం మూడు ఫిర్యాదులు..
- కేస్ నమోదు చేసుకుని పీవీపీ ని విచారిస్తున్న పోలీసులు..
- 24 Jun 2020 5:22 AM GMT
» తిరుమల:
- శ్రీవారి దర్శనానికి బ్రేక్ దర్శనం టిక్కెట్లు..
- శ్రీవారి ట్రస్టుకు రూ.10వేలు చెలిస్తే స్వామివారి బ్రేక్ దర్శనం..
- జూన్ 24 నుంచి 30 వరకు అందుబాటులో బ్రేక్ దర్శనం టికెట్లు
- ఈరోజు నుంచే టిక్కెట్లు బుక్ చేసుకునే సదుపాయం..
- 24 Jun 2020 5:20 AM GMT
» »తూర్పు గోదావరి జిల్లాలో కలకలం
- భీమవరంలో డ్రగ్స్ మాఫియా
- భీమవరంలో డ్రగ్స్ మాఫియా గుట్టువిప్పారు పోలీసులు. కురెళ్ళ భానుచందర్ అనే వ్యక్తి నెదర్లాండ్స్ నుండి భీమవరంకు డ్రగ్స్ తెప్పించి సరఫరా చేస్తున్నాడు. డ్రగ్స్, గంజాయి వ్యాపారం చేస్తున్న భానుచందర్ కు అతని తోడల్లుడు పూర్ణచంద్రరావు సహకరిస్తున్నాడు. భానుచందర్, పూర్ణచంద్రరావు దగ్గర నుండి డ్రగ్స్, గంజాయి కొనుగోలు చేస్తున్న మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
- వీరి వద్దనుండి సుమారు ఏడు కిలోల గంజాయి, 2 మోటార్ సైకిళ్లు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసిన పోలీసులు..
- 24 Jun 2020 4:02 AM GMT
తిరుమలేశుని హుండీ ఆదాయం రూ.57లక్షలు..
- శ్రీవారిని దర్శించుకున్న 9వేల మందిపైగా భక్తులు
- కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ మినహాయింపుల్లో భాగంగా ఈ నెల 8వ తేదీ నుంచి దేవాలయాలు, మాల్స్, వ్యాపార సంస్థలు తెరిచేందుకు అనుమతులు ఇచ్చింది.
- ఈ నేపథ్యంలో దేవాలయాలు తెరుచుకున్నాయి.
- దీంతో భక్తులను దర్శనలకు అనుమతి ఇస్తున్నారు.
- తిరుమలలోని శ్రీవారి దర్శనానికి తిరుమల తిరపతి దేవస్థానం పరిమిత సంఖ్యలోనే భక్తులకు అనుమతిస్తోంది.
- 24 Jun 2020 3:20 AM GMT
ఏపీలోని మరో రెండు జిల్లాల పరిధిలో లాక్‌డౌన్
- ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. రోజురోజుకూ పెరుగుతున్న కోవిడ్ కేసులు ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.
- రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది.
- కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో ఆయా జిల్లాల్లోని కొన్ని పట్టణాల్లో లాక్‌డౌన్ విధించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
- 24 Jun 2020 3:12 AM GMT
కరోనా టెస్టులకు ఐ మాస్క్ బస్సులు రెడీ..!
- సామాజిక వ్యాప్తి ద్వారా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇంటింటా కోవిడ్ పరీక్షలు నిర్వహించేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
- వైద్య ఆరోగ్య శాఖ కోవిడ్ -19 ఐ మాస్క్ ట్రేడ్ మార్క్ తో అత్యాధునిక సాంకేతిక వైద్య పరిజ్ఞానం కలిగిన కోవిడ్ టెస్టు కిట్లు , వైద్య పరికరాలతో కూడిన మొబైల్ బస్సులను రెడీ చేశారు.
- రాష్ట్రంలో కరోనా మహమ్మారివిజృంభణ నేపథ్యంలో వైరస్ కట్టడికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైద్య శాఖాధికారులను ఆదేశించి బడ్జెట్ ను కేటాయిస్తు అధిక మొత్తంలో నిధులు మంజూరు చేశారు.
- వలస జీవుల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైరస్ వ్యాప్తి చెందిన నేపథ్యంలో కట్టడి కోసం లాక్ డౌన్ విధించారు.
- వైద్య శాఖ ఆధ్వర్యంలో ఇంటెలిజెన్స్ మోనటరింగ్ ఎనలైసిస్ సర్వీస్ క్వారంటైన్ పేరుతో కోవిడ్ -19 ఐ మాస్క్ బస్సులు రోడ్డెక్కనున్నాయి. పల్లెల్లో సైతం కరోనా వైరస్ సామాజికంగా వ్యాప్తి చెందటంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
- పెరుగుతున్న కేసుల దృష్ట్యా ప్రజలందరికి కోవిడ్ పరిక్షలు చేసేందుకు కోవిడ్ ఐ మాస్క్ మొబైల్ బస్సులు పట్టణాలతో పాటు పల్లెల్లో సంచరించి వైద్య సేవలందించనున్నాయి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire