Live Updates:ఈరోజు (జూన్-24) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 24 జూన్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు బుధవారం, 24 జూన్, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. ఆషాఢమాసం, శుక్లపక్షం, తదియ (ఉ.10:13 వరకు), పుష్యమి నక్షత్రం (మ.01:10వరకు) సూర్యోదయం 5:43am,సూర్యాస్తమయం 6:53 pm
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 24 Jun 2020 3:21 PM GMT
♦♦అమరావతి♦♦
- స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్‌ఈబీ)
- ఆంధ్రప్రదేశ్ SEB మరియు ఒడిశా పోలీసుల జాయింట్ ఆపరేషన్
- విశ్వసనీయ సమాచారం మేరకు సరిహద్దు ప్రాంతాల్లోని పలు గ్రామాల్లో సారా తయారీ స్థావరాలపై ముమ్మర దాడులు 30,200 లీటర్ల ఊటబెల్లం ధ్వసం, భారీగా నాటు సారా స్వాధీనం చేసుకున్న ఎస్‌ఈబీ, ఒడిశా పోలీసులు
- ఎస్‌ఈబీ ,ఒడిశా పోలీసుల అదుపులో నలుగురు.. అజ్ఞాతం లోకి మరికొంత మంది కీలక సభ్యులు..ముమ్మరంగా గాలిస్తున్న రెండు రాష్ట్రాల పోలీసులు..
- గత కొన్ని రోజులుగా గుట్టు చప్పుడు కాకుండా నాటుసారాను తయారీ చేస్తున్న ముఠా..
- సరిహద్దు గ్రామాల్లో భారీగా నిఘా ను ఏర్పాటు చేసిన ఎస్‌ఈబీ
- ఎస్‌ఈబీ అడిషనల్ ఎస్పీ శ్రీనివాస రావు నేతృత్వం లో కొనసాగిన జాయింట్ ఆపరేషన్
- 24 Jun 2020 3:20 PM GMT
♦♦అమరావతి♦♦
@చంద్రబాబు నాయుడు ట్విట్టర్
- పార్లమెంటు సభ్యునిగా కనబరిచిన అత్యుత్తమ పనితీరుకు, ఒక ఎంపీగా ప్రజాసమస్యల పరిష్కారానికి చూపిన చొరవకు గుర్తింపుగా "సంసద్‌రత్న" అవార్డుకు ఎంపికైన ఎంపీ @RamMNK కు అభినందనలు
- అతి చిన్న వయసులోనే ఈ అవార్డు అందుకోనున్న ఎంపీగా, ఇది మీకే కాదు తెలుగుదేశం పార్టీకి కూడా గర్వకారణం
- 24 Jun 2020 3:11 PM GMT
♦♦ పి వి పి అరెస్టుకు రంగం సిద్ధం ♦♦
- మరికాసేపట్లో అరెస్టును అధికారికంగా ప్రకటించనున్న బంజారాహిల్స్ పోలీసులు..
- ఇప్పటికే పలు సెక్షన్ల కింద పివి పై కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు.
- వైద్య పరీక్షల నిమిత్తం మరికాసేపట్లో పీవీపీ నీ ఆస్పత్రికి తరలించనున్న పోలీసులు..
- బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14 లో భూవివాదంలో తరలివచ్చిన పి వి పి.
- కైలాష్ ఇచ్చిన ఫిర్యాదుపై పీవీపీ పై కేసు నమోదు చేసిన అధికారులు..
- 24 Jun 2020 2:15 PM GMT
- రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ కామెంట్స్....
- యు జీ, పి. జీ పరీక్షలు రద్దు అనేది నిర్ణయం కాలేదు.
- కరోనా నేపథ్యంలో పరీక్షలు ఎలా నిర్వహించాలనే ఇప్పటివరకు ప్రయత్నాలు చేశాం.
- సాధ్యాసాధ్యాలపై అన్ని యూనివర్సిటీ ల ఉపకులపతులు, ఉన్నతాధికారులతో మాట్లాడి సూచనలు తీసుకున్నాం.
- అందరి నుంచి వచ్చిన అభిప్రాయాలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళతాం.
- ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి గారితో చర్చించిన తరువాత ఆయన ఆదేశాల మేరకు పరీక్షలు నిర్వహించడం, రద్దు చేయటం పై తుది నిర్ణయం వెల్లడిస్తాం.
**** శ్రీనివాస్, పి. ఆర్. ఓ టు ఎడ్యుకేషన్ మినిస్టర్.
- 24 Jun 2020 2:14 PM GMT
♦♦ తూర్పు గోదావరి జిల్లా♦♦
- మారేడుమిల్లి మండలం కుడూరు గ్రామంలో ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య..
- అక్రమ సంబంధం వద్దని భర్త హెచ్చరించినందుకు కర్రలతో బాది గొంతు నులిమి హతమార్చిన భార్య, ఆమె ప్రియుడు.
- ప్రియుడి వద్ద నుండి నాటు తుపాకి ,విల్లంభులను నాటు సారాను స్వాధీన పరచుకున్న మారేడుమిల్లి పోలీసులు.
- 24 Jun 2020 10:54 AM GMT
ఇళ్ల స్థలాల కేటాయింపులో అన్యాయం జరిగిందని మహిళలు ఆందోళన
- ఆకివీడు: మండలం చెరుకుమిల్లి గ్రామంలో ఇళ్ల స్థలాలు ఎంపిక లాటరీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ ఆకివీడు తహసీల్దార్ కార్యాలయం వద్ద మహిళలు ఆందోళనకు దిగారు.
- తమకు న్యాయం చేయాలని తహసీల్దార్ సీజేఎస్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు.
- న్యాయం జరిగేలా చూస్తానని మహిళలకు తహసీల్దార్ హామీ ఇచ్చారు.
- 24 Jun 2020 10:40 AM GMT
ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు వైసీపీ షోకాజ్ నోటీసు
- ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు ఆ పార్టీ షోకాజ్ నోటీసు జారీ చేసింది.
-వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పార్టీ తరపున షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
- పది రోజులుగా పార్టీ అధినాయకత్వానికి వ్యతిరేకంగా రఘురామ రాజు చేస్తున్న వ్యాఖ్యలను షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు.
- వైసీపీ ఎమ్మెల్యేలను కించ పరుస్తూ వ్యాఖ్యలు చేయడం, పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడడంపై పార్టీ అధినాయకత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది.
- పార్టీ నేతలపై చేసిన వ్యాఖ్యలకు వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు. లేదంటే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామంటూ షోకాజ్ నోటీసులో వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
- 24 Jun 2020 10:07 AM GMT
నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రి లో కలకలం
- కరోన పాజిటివ్ నమోదైన వ్యక్తి ఆస్పత్రి నుండి పరార్.
- ఆరోగ్యం బాగోక దగ్గు జలుబుతో విజయవాడకు చెందిన వ్యక్తి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స నిమిత్తం జాయిన్ అవ్వగా వైద్యపరీక్షల అనంతరం అతనికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో పరారైన వ్యక్తి.
- ప్రభుత్వ వైద్యుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు
- ఈ సందర్భంగా స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన.
- 24 Jun 2020 8:55 AM GMT
ఘాట్ రోడ్ లో లారీ బోల్తా..
- ఏజెన్సీ ఘాట్రోడ్డులో సిమెంటు ఇటుకల లారీ బోల్తా పడింది.
- విశాఖ నుంచి పాడేరు వస్తుండగా యేసు ప్రభు బొమ్మ మలుపు వద్ద అదుపు తప్పింది.
- ఈ ఘటలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
- క్షతగాత్రులను 108 వాహనంలో మాడుగుల ఆసుపత్రికి తరలించారు.
- మలుపు వద్ద ట్రాఫిక్ అంతరాయం కలిగింది.
- 24 Jun 2020 8:51 AM GMT
ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మాస్కులు ధరించాలి
- కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బయటకు వచ్చే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మాస్కులు ధరించాలని విశాఖ జిల్లా అనకాపల్లి ట్రాఫిక్ సీఐ బాబూజీ సూచించారు.
- మాస్కులు లేకుండా తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
- ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా శిరస్త్రాణం ధరించాలని చెప్పారు.
- నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire