Live Updates:ఈరోజు (జూన్-20) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Live Updates:ఈరోజు (జూన్-20) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 20 జూన్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు శనివారం, 20 జూన్, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, చతుర్దశి ( ఉ.11:51 వరకు), రోహిణి నక్షత్రం (మ.12:02వరకు) సూర్యోదయం 5:42 am,సూర్యాస్తమయం 6:52 pm

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 20 Jun 2020 3:45 PM GMT

    » కాగితాలపురు రోడ్డు వద్ద ప్రమాదం

    - ఒకరికి తీవ్ర గాయాలు*

    - మనుబోలు మండల పరిధి లోని కాగితలపూర్ క్రాస్ రోడ్ వద్ద చిల్లకూరు కు చెందిన మల్లి అంకయ్య మోపెడ్ పై నెల్లూరు వైపు వెళ్తూ మార్గద్యంలో కాగితలపూర్ క్రాస్ రోడ్ వద్ద పెట్రోల్ కోసం మలుపు తిరుగుతుండగా అదే వైపున వస్తున్న కారు డీ కొంది. ఈ ప్రమాదంలో అంకయ్య కాలుకు తీవ్ర గాయాలైయ్యాయి

  • 20 Jun 2020 3:44 PM GMT

    »» జంగా గౌతమ్.  ఉపాధ్యక్షుడు, ఏపీసీసీ

    - 10 వ తరగతి పరీక్షలు రద్దు సరైన నిర్ణయం.

    - రాష్ట్రంలో కరోనా పెరుగుతున్నందున పది పరీక్షలు రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ అనేక రోజులుగా డిమాండ్ చేస్తూ వచ్చింది.

    - తెలంగాణ, తమిళనాడు, పంజాబ్ లు రద్దు చేసినప్పుడే ఏపీ ప్రభుత్వం కూడా రద్దు చేసి ఉండాల్సింది.

    - ఆలస్యంగా నైనా రద్దు నిర్ణయం చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది.

  • 20 Jun 2020 2:53 PM GMT

    కృష్ణాజిల్లా♦♦

    - నూజివీడు పట్టణంలో గోడుగువారి గూడెం కు చెందిన వై జగదీశ్వరి(25)సకాలంలో వైద్యం అందక మృతి.

    - గత రాత్రి జగదీశ్వరి కి ఫిట్స్ రావడంతో తో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా కరోనా నేపథ్యంలో నూజివీడు లో వైద్యం చేయకుండా నిరాకరించడంతో ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి

  • 20 Jun 2020 1:45 PM GMT

    ♦♦ బ్లేడ్ బ్యాచ్ అరెస్టు ♦♦

    -ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న బ్లేడ్ బ్యాచ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లాలోని గూడవల్లి గ్రామ సమీపంలో బ్లేడ్‌ బ్యాచ్‌ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రెండు రోజుల క్రితం లారీ డ్రైవర్‌పై బ్లేడ్‌ బ్యాచ్‌ దాడి చేసిందని పోలీసులు చెప్పారు. ఏలూరు నుంచి వస్తున్న నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి బ్లేడ్లు, బైక్‌, 4 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితులంతా విజయవాడకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు

  • 20 Jun 2020 1:44 PM GMT

    ♦ కృష్ణాజిల్లా ♦♦

    - నూజివీడు నియోజకవర్గంలోని ముసునూరు మండలం చింతపల్లి గ్రామంలో మైనర్ బాలిక (14) బ్లేడ్ తో చేతి మణికట్టు నరాలు కోసుకునీ ఆత్మహత్యాయత్నం

    - నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న వైద్యులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు

    - గత నాలుగు రోజులుగా గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి టార్చర్ చేస్తున్నాడు స్థానికంగా ఉండే తోటి బడ్డీకొట్టు నిర్వహించే మహిళ సహకారంతో అంటూ తండ్రి ఆవేదన నన్ను నా బిడ్డను చంపుతాను అంటూ ఫోన్లు చేస్తున్నాడు అతనెవరు తెలియదు అంటున్న తండ్రి,కూతురు

  • 20 Jun 2020 12:03 PM GMT

    పదో తరగతి, ఇంటర్ మీడియట్ విద్యార్థులందరూ ఉత్తీర్ణులైనట్టుగానే పరిగణిస్తాం: మంత్రి అధిములపు సురేష్

    - ప్రభుత్వం, విద్య శాఖ 10వ తరగతి పరీక్షలు నిర్వహించాలని షెడ్యూల్ విడుదల చేసాము.

    - జులై 10 నుంచి పరీక్షలు నిర్వహించలని నిర్ణయం తీసుకున్నాము.

    - కానీ కరోనా కారణంగా అనేక సార్లు పోస్ట్ ఫోన్ చేశాము.

    - 10వ తరగతి పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని భావించము.

    - విద్యార్థులను పరీక్షల ఆలోచన నుంచి తప్పించకుండా చేశాము.

    - 10వ తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నాము.

    - పరీక్షల మూలంగా ఒక్క విద్యార్థి కూడా కరోనా బారిన పడకూడదు అనే ఆలోచనతోనే రద్దు చేస్తున్నాము ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా రద్దు చేస్తున్నాము.

    - ఫస్ట్, సెకండ్ ఇయర్ లో ఫెయిల్ అయ్యిన వారు పాస్ చేస్తాము.

    - సప్లిమెంటరీ కోసం ఫీజ్ కట్టిన వారికి రీటన్ చేస్తాం.

    - పదో తరగతి, ఇంటర్ మీడియట్ విద్యార్థులందరూ ఉత్తీర్ణులైనట్టుగానే పరిగణిస్తాం.

    -ఈ ఏడాది ఫెయిల్ అయిన ఇంటర్ మొదటి, రెండో సంవత్సర విద్యార్థులంతా కూడా ఉత్తీర్ణులైనట్టే.

  • 20 Jun 2020 10:18 AM GMT

    బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ గన్‌మెన్‌కు కరోనా

    - తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే.. రాజాసింగ్‌ హోం క్వారంటైన్‌కు వెళ్లారు.

    - తన గన్‌మెన్‌కు కరోనా పాజిటివ్ రావడంతో.. ముందు జాగ్రత్త చర్యగా క్వారంటైన్‌లోకి వెళ్లారు.

    - ఇవాళ ఆయన కరోనా పరీక్షలు చేయించుకోనున్నారు.

    - ఇప్పటికే రాష్ట్రంలో పలువురు ప్రతినిధులు.. కరోనా బారిన పడ్డారు.  

  • 20 Jun 2020 10:13 AM GMT

    ఇంద్రపాలెంలో మరో మూడు పాజిటివ్ కేసులు నమోదు

    - ఇంద్రపాలెం విగ్నేశ్వర నగర్ లో ఒకే కుటుంబంలో ముగ్గురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

    - మొన్న 16వ తేదీన చేయించుకున్న పరీక్షలకు సంబంధం లేదు.

    - పాజిటివ్ వచ్చిన వారు అనుమానంతో నిన్న ప్రభుత్వ సామాన్య ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోగా నిర్ధారణ అయింది.

    - వీరు ప్రైమరీ కాంటాక్ట్ ద్వారా మరిన్ని కేసులు పెరిగే అవకాశం ఉంది.

    - ఇంద్రపాలెంలో ఒక్కసారిగా అధికారులు అప్రమత్తమై రక్షణ చర్యలు ప్రారంభించారు.

    - పారిశుద్ధ్య కార్మికులు శానిటేషన్ పనులను ప్రారంభించారు.

    - తప్పనిసరిగా అందరూ మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని సూచించారు. 



  • 20 Jun 2020 6:00 AM GMT

    కృష్ణా♦♦

    - ముగ్గురికి పాముకాటు

    - కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం గండ్రగూడెం లో ముగ్గురికి పాము కాటు

    - తమ పొలంలో పనిచేస్తున్న ముగ్గురు రైతులను కాటువేసిన రక్త పింజరి

    - హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన గ్రామస్తులు

    - సమయానికి ఆసుపత్రికి తీసుకురావడం తో ప్రమాదం తప్పిందన్న వైద్యుడు శొంఠి శివరామకృష్ణ

    - ఈ నెలలో ఇప్పటివరకు 19 పాము కాటు కేసులు నమోడయ్యాయన్న వైద్యులు

  • 20 Jun 2020 4:19 AM GMT

    టీఆర్ఎస్ ఎమ్మెల్యే గన్‌మెన్, డ్రైవర్‌కు కరోనా పాజిటివ్

    - తెలంగాణలో ప్రజాప్రతినిధులను కరోనా భయం వెంటాడుతోంది.

    - ముఖ‌్యంగా అధికార టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలను కోవిడ్ కంగారు పెడుతోంది. వరుసగా ముగ్గురు టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలకు కరోనా వైరస్ సోకింది..

    - వారితో పాటూ గన్‌మెన్‌లు, డ్రైవర్లు, ఇంట్లో పనిచేసేవారికి కూడా పాజిటివ్ తేలింది.

    - తాజాగా నిజామాబాద్‌ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ డ్రైవర్‌తో పాటు గన్‌మెన్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. 

    - పూర్తి వివరాలు 

Print Article
More On
Next Story
More Stories