Live Updates:ఈరోజు (జూన్-20) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు శనివారం, 20 జూన్, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, చతుర్దశి ( ఉ.11:51 వరకు), రోహిణి నక్షత్రం (మ.12:02వరకు) సూర్యోదయం 5:42 am,సూర్యాస్తమయం 6:52 pm

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 20 Jun 2020 4:17 AM GMT

    భారత్‌లో కొత్తగా 14,516 కరోనా పాజిటివ్‌ కేసులు

    - గడిచిన 24 గంటల్లో భారత్‌లో 14,516 కేసులు నమోదు కాగా, 375 మంది ప్రాణాలు విడిచారు.

    - కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో మొత్తం 3,95,048 కేసులు నమోదయ్యాయి.

    - ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,68,269 ఉండగా, 2,13,830 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు.

    - ఇదిలా ఉండగా 12,948 మంది కరోనా వ్యాధితో మరణించారు. 

  • 20 Jun 2020 4:15 AM GMT

    ఏపీలో పదో తరగతి పరీక్షలపై నేడో రేపో కీలక నిర్ణయం!

    - ఏపీలో పదో తరగతి పరీక్షలు విద్యార్థులను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

    - రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి విద్యార్థులు 6,30,804 మంది ఉన్నారు.

    - కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఉన్నతాధికారులు నేడో, రేపో కీలక నిర్ణయం ప్రకటించే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది.

    - పూర్తి వివరాలు 



  • 20 Jun 2020 2:44 AM GMT

    - సూర్యగ్రణం సందర్భంగా విజయవాడలో దుర్గమ్మ ఆలయం మూసివేత

    - నేడు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం మూసివేత..

    - సూర్యగ్రహణం కారణంగా రాత్రి 8గంటలకు ఆలయం మూసివేత

    - రేపు మ.3 గంటలకు ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ

    - సా.5 నుంచి భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతి..

  • 20 Jun 2020 2:43 AM GMT

    - రేపు సూర్యగ్రహణం సందర్భంగా శ్రీవారి ఆలయం మూసివేత..

    - నేటి రాత్రి 8.30 నుంచి రేపు మ.2.30 వరకు శ్రీవారి ఆలయం మూసివేత

    - రేపు మధ్యాహ్నం శ్రీవారి ఆలయంలో సంప్రోక్షణ.

    - అనంతరం శ్రీవారి దర్శనానికి భక్తులకు అనుమతి

  • 20 Jun 2020 2:42 AM GMT

    నేటి నుంచి తెలంగాణాలో పీజీ మెడికల్, డెంటల్ పరీక్షలు

    - నేటి నుంచి తెలంగాణాలో పీజీ మెడికల్, డెంటల్ పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.

    - వీటిని వాయిదా వేసేందుకు హైకోర్టు నిరాకరించడంతో పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది.

    - అయితే కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకుంటూ వీటిని నిర్వహిస్తున్నారు. 

    - ఈ నెల 20, 22, 24 తేదీలలో పీజీ డిప్లొమా పరీక్షలు.

    - జూన్ 20, 22, 24, 26 తేదీల్లో పీజీ డిగ్రీ పరీక్షలు జరగనున్నాయి.

    - ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు నిర్వహిస్తారు.

    - ఉదయం 8.30కి స్టూడెంట్స్ ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవాలి.

    - మొత్తం 13 సెంటర్లు ఉండగా.. గాంధీ మెడికల్ కాలేజీ సెంటర్‌ను కామినేని అకాడమీ - ఆఫ్ మెడికల్ సైన్సెస్ , ఎల్బీ నగర్, సికింద్రాబాద్‌కు తరలించారు.

    - 994 మంది పీజీ డిగ్రీ పరీక్షలు, 193 మంది పీజీ డిప్లొమా పరీక్షలు రాయనున్నారు.

    -పూర్తి వివరాలు 



  • 20 Jun 2020 2:41 AM GMT

    ఈరోజు వై.ఎస్‌.ఆర్‌. నేతన్న నేస్తం రెండో ఏడాది ఆర్ధిక సాయం విడుదల

    - కరోనా, లాక్‌డౌన్‌ నేపధ్యంలో ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న నేతన్నల కుటుంబాలను ఆదుకునేందుకు 6 నెలలు ముందుగానే ఆర్ధిక సాయం

    - క్యాంపు కార్యాలయంలో ఆన్‌లైన్‌ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం వైయస్‌.జగన్‌

    - సొంత మగ్గమున్న నేతన్నల కుటుంబాలకు ఏడాదికి రూ.24వేలు చొప్పున ఆర్ధిక సాయం.

    - మొత్తం 81,024 మంది లబ్ధిదార్లకు రూ.194.46 కోట్ల అర్ధిక సాయం అందజేయనున్న ప్రభుత్వం

    - చేనేత సహకార సంఘాలకు గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.103 కోట్లు చెల్లించేందుకు ఆప్కోకు నిధులు విడుదల చేసిన ప్రభుత్వం

    - కరోనా వైరస్‌ నివారణకై మాస్కుల తయారీకై ఆప్కో ద్వారా చేనేత సహకార సంఘాల నుంచి సేకరించిన వస్త్రాలకు రూ.109 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం.

    -పూర్తి వివరాలు 



Print Article
More On
Next Story
More Stories