Live Updates:ఈరోజు (జూన్-15) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు సోమవారం, 15 జూన్, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, దశమి ( తె.05:49 వరకు), రేవతీ నక్షత్రం (తే.03.17 వరకు) సూర్యోదయం 5:41 am, సూర్యాస్తమయం 6:51 pm 3

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 15 Jun 2020 2:25 PM GMT

    చింతమనేని ప్రభాకర్ కు బెయిల్

    - చింతమనేని ప్రభాకర్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. నిన్న అచ్చెన్నాయుడు అరెస్ట్‌ను నిరసిస్తూ కలపర్రు టోల్‌గేట్ దగ్గర చింతమనేని అందోళన కు సిద్దమయ్యారు. దీంతో చింతమనేని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్నటి నుంచి ఏలూరు పోలీస్‌ స్టేషన్‌లోనే చింతమనేని ఉన్నారు. ఈరోజు ఉదయం చింతమనేనిని కోర్టులో పోలీసులు హాజరుపరచడంతో 14 రోజుల రిమాండ్ విధించారు. అయితే మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆయన వెంట ఉన్న మరో ఎనిమిది మందికి బెయిల్ మంజూరు అయింది. ఈ రోజు బెయిల్ మంజూరు కాగా ఆయన రిలీజ్ ఈరోజే అవుతారా రేపు రిలీజ్ చేస్తారా ? అనేది తెలియాల్సి ఉంది.

  • 15 Jun 2020 2:04 PM GMT

    కరోనా పరీక్షలు ప్రభుత్వానికి ఇప్పుడు గుర్తొచ్చాయా? : బండి సంజయ్,బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు.



    - మేం కోరినప్పుడు సర్కారు బేషజాలకు ఎందుకు పోయింది

    - ఆలస్యంగా మేల్కొని హడావుడి చర్యలకు దిగుతోంది

    - కేంద్రం రంగంలోకి దిగిన తర్వాతే కేసీఆర్‌ మేల్కొన్నారు

    - ప్రజాప్రతినిధులు, అధికారులకు సోకిన తర్వాత తీవ్రత అర్థమైందా..?

    - కరోనా వ్యాధి తీవ్రంగా విజృంభిస్తోందని, టెస్టులు చేసి వ్యాప్తిని అరికట్టాలని ఎంత విజ్ఞప్తి చేసినా రాష్ట్ర సర్కారు పట్టించుకోలేదు

    - కేవలం మూడు నెలల్లో 39 వేల మందికి మాత్రమే టెస్టులు చేసిన ప్రభుత్వం ఇప్పుడు 50 వేల మందికి టెస్టులు చేస్తామని చెప్పడం సమ్మశక్యంగా లేదు

    - హడావుడి చర్యలతో మభ్య పెట్టకుండా చిత్తశుద్ధితో కరోనా పరీక్షలు నిర్వహించాలి.

  • 15 Jun 2020 1:56 PM GMT

    - సిఎం కేసీఆర్;  రాబోయే రోజుల్లో కాళేశ్వరం, సీతారామ, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టులు పూర్తయి కోటి 30 లక్షల ఎకరాలలో బంగారు పంటలు పండించే దిశగా తెలంగాణ పురోగమిస్తున్నది.

    - ఇబ్బడిముబ్బడిగా ధాన్యం ఉత్పత్తి కాబోతున్న నేపథ్యంలో రాబోయే పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నియంత్రిత పంటల సాగు విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది

    - ఈ విధానం తెలంగాణ వ్యవసాయ రంగంలో చేయబోయే ఉజ్వల ప్రస్థానానికి నాంది పలుకుతుంది.

    - గతంలో పంజాబ్ రాష్ట్రం వ్యవసాయరంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించి, దేశంలోనే ప్రథమ స్థానాన్ని సాధించింది.

    - అయితే పంటల మార్పిడి విధానం అవలంబించకపోవడంవల్ల పంజాబ్ లో వ్యవసాయ వైపరీత్యం (పంజాబ్ డిజాస్టర్) సంభవించింది.

    - పంజాబ్ అనుభవం ద్వారా వచ్చిన గుణపాఠాలను అధ్యయనం చేసిన రాష్ట్ర ప్రభుత్వం అటువంటి సమస్యలేవీ తెలంగాణలో ఉత్పన్నం కాకుండా ఉండేవిధంగా నియంత్రిత సాగు విధానానికి రూపకల్పన చేసింది.

  • 15 Jun 2020 1:53 PM GMT



    - రాష్ట్రంలో రైతులందరూ ప్రభుత్వం సూచించిన మేరకు నియంత్రిత పద్ధతిలోనే పంటల సాగుకు అంగీకరించి, దాని ప్రకారమే విత్తనాలు వేసుకోవడానికి సిద్ధం కావడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం.

    - రాష్ట్రమంతా రైతాంగం నియంత్రిత పద్ధతిలో పంటల సాగుకు సిద్ధమైనందన వెంటనే రైతులందరికీ రైతుంబంధు సాయం అందించాలని సిఎం అధికారులను ఆదేశం

     - ఒక్క ఎకరా మిగలకుండా, ఒక్క రైతును వదలకుండా అందరికీ వారం, పది రోజుల్లోగా రైతుబంధు సాయాన్ని బ్యాంకు అకౌంట్లలో జమ చేయాలి

    - ఈ ఏడాది 1,25,45,061 ఎకరాల్లో రైతులు నియంత్రిత పద్ధతిలో పంట సాగు విధానం

    - ప్రభుత్వం చెప్పిన విధంగానే రైతులు వర్షాకాంలో 41,76,778 ఎకరాల్లో వరి పంట

    - 12,31,284 ఎకరాల్లో కంది సాగు

    - 4,68,216 ఎకరాల్లో సోయాబీన్

    -  60,16,079 ఎకరాల్లో పత్తి

    - 1,53,565 ఎకరాల్లో జొన్నలను,

    - 1,88,466 ఎకరాల్లో పెసర్ల

    - 54,121 ఎకరాల్లో మినుములు,

    - 92,994 ఎకరాల్లో ఆముదాలు,

    - 41,667 ఎకరాల్లో వేరుశనగ (పల్లి)

    - 67,438 ఎకరాల్లో చెరుకు,

    - 54,353 ఎకరాల్లో ఇతర పంటలు

  • 15 Jun 2020 1:45 PM GMT

    - తెలంగాణ లో ఇంటర్మీడియట్ ఫలితాల విడుదల కు సిద్ధం చేస్తున్న ఇంటర్ బోర్డ్

    - రేపు సీఎం కేసీఆర్ కు ఫలితాల నివేదిక ఇవ్వనున్న అధికారులు

    - ఫలితాలు ఎప్పుడు ప్రకటించాలో ఫైనల్ చేయనున్న సీఎం కేసీఆర్

  • 15 Jun 2020 1:12 PM GMT

    విశాఖ గాజువాక: ఆటోనగర్ E బ్లాక్ సీకాన్ ఫేబ్రికేషన్ పరిశ్రమలో ప్రమాదం.

    - ఒన్ టౌన్ ఎరియాకు చెందిన ఎస్ కె దాస్ అక్కడికక్కడే మృతి. మరో కార్మికుడు సత్యనారాయణకు తీవ్రగాయాలు చికిత్స నిమిత్తం స్ధానిక ఆసుపత్రికి తరలింపు.

    - పరిశ్రమలో మూలన పడివున్న పాత పెయింట్ డబ్బాను మృతుడు ఎకె దాసు తీసి రాడ్ తో కొడుతున్న సమయంలో ఒక్కసారిగా పేలడంతో తునాతునకలయ్యాడు.

    - మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్ధలానికి దువ్వాడ సిఐ లక్ష్మి చేరుకుని ప్రమాద స్ధలాన్ని పరిశీలించి ఎలా జరిగింది అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

    - మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కెజిహెచ్ కు తరలించారు. క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరిస్తామని సిఐ తెలిపారు.

  • 15 Jun 2020 12:57 PM GMT

    విశాఖ : నాతవరం మండలంలో నిర్వహిస్తున్న కోడిపందేలపై పోలీసుల దాడులు.

    - మండలంలోని వడపర్తికి సమీపంలో పందాలు ఆడుతున్న 5గురు అరెస్టు.

    - 3 కోడిపుంజులు, రూ. 1,720ల నగదు స్వాధీనం.

  • 15 Jun 2020 12:32 PM GMT

    అమరావతి: ఎంపీ రఘు రామ కృష్ణం రాజు వ్యవహారం పై జగన్ సీరియస్.

    - నుంచి సస్పెండ్ చేసే యోచనలో సీఎం జగన్.

    - రఘు రామకృష్ణమ రాజు వ్యవహారం రేపు నిర్ణయం తీసుకోనున్న సీఎం జగన్.

  • 15 Jun 2020 12:28 PM GMT

    బిగ్ బ్రేకింగ్

    తమిళనాడులో మరోమారు లాక్ డౌన్..ఈ నెల 19 నుండి 30 దాకా సంపూర్ణ లాక్ డౌన్..కేవలం నాలుగు జిల్లాలకే లాక్ డౌన్ పరిమితం..చెన్నై, కాంచీపురం, తిరువళ్ళూరు, చెంగల్పట్టులో లాక్ డౌన్..ఉ-6 నుండి మ-2 గంటల దాకా నిత్యావసరాలకు అనుమతి..ఆ జిల్లాల్లో రవాణాకు అనుమతి నిరాకరణ...

  • 15 Jun 2020 9:50 AM GMT

    ముగిసిన టీడీఎల్పీ సమావేశం

    - రేపు నల్ల చొక్కాలతో అసెంబ్లీకి హాజరు కావాలని నిర్ణయం.

    - అసెంబ్లీ కి వెళ్లవద్దని సూచించిన పలువురు ఎమ్మెల్యేలు

    - వెళ్లకపోతే మండలిలో కొన్ని బిల్లులు ఆమోదించుకునే ప్రమాదం ఉందని చెప్పిన కొందరు నేతలు.

    - అవసరం అయితే పరిస్థితి ని బట్టి వాక్ ఔట్ చేసి రావాలని అన్న మరికొందరు ఎమ్మెల్యేలు.

    - అసెంబ్లీ జరిగిన అన్ని రోజులు నల్ల చొక్కాలతో వెళ్లాలని నిర్ణయం.




Print Article
More On
Next Story
More Stories