Live Updates:ఈరోజు (జూన్-15) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 15 జూన్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు సోమవారం, 15 జూన్, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, దశమి ( తె.05:49 వరకు), రేవతీ నక్షత్రం (తే.03.17 వరకు) సూర్యోదయం 5:41 am, సూర్యాస్తమయం 6:51 pm 3
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 15 Jun 2020 4:51 PM GMT
♦ ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ప్రశంసలు
- అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై రాష్ట్ర హైకోర్టు ప్రశంసలు కురిపించింది. విశాఖ గ్యాస్ లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వం గొప్పగా వ్యవహరించిందని గుర్తు చేసింది. గ్యాస్ లీకేజీ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు రూ.కోటి తక్షణ పరిహారం ఇవ్వడం గొప్ప విషయమని పేర్కొంది. ప్రభుత్వం మానవతా దృక్పథం, దయార్థ హృదయాన్ని అభినందిస్తున్నామని హైకోర్టు వ్యాఖ్యానించింది.
- న్యాయవాదులను ఆదుకోవాలి : లాక్‌డౌన్‌తో ఇబ్బంది పడుతున్న న్యాయవాదులను ఆదుకోవాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
- 15 Jun 2020 4:47 PM GMT
♦ తెలంగాణలో కొత్తగా 219 కేసులు..
- తెలంగాణలో ఈ రోజు 219 కొత్తగా కేసులు నమోదు.
- కరోనాతో పోరాడి రాష్ట్రంలో ఇప్పటి వరకు 2766 మంది కోలుకున్నారు.
- ప్రస్తుతం రాష్ట్రంలో 2240 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
- ఇప్పటి వరకు కరోనాతో 187 మంది ప్రాణాలు కోల్పోయారు.
- 15 Jun 2020 4:30 PM GMT
♦కృష్ణాజిల్లా♦
- రాష్ట్రంలో తెలుగుదేశం నాయకులు అక్రమ అరెస్టులకు నిరసనగా నూజివీడు పట్టణంలో తెలుగుదేశం కార్యాలయం వద్ద నియోజకవర్గ ఇంచార్జ్ ముద్దరబోయిన.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కాగడాలతో అర్ధనగ్న ప్రదర్శన
- పాల్గొన్న స్థానిక తెలుగుదేశం నాయకులు,కార్యకర్తలు తక్షణం అక్రమ అరెస్టులు నిలిపేయాలంటూ నినాదాలు
- 15 Jun 2020 4:02 PM GMT
» ఆంధ్రప్రదేశ్ సామాజిక, ఆర్థిక సర్వే 2019-20 నివేదికను విడుదల చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
- ప్రస్తుత ధరల్లో 2019-20 ఏడాది 12.73 శాతం పెరిగిన రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)
- 1.10 లక్షల కోట్ల రూపాయల జీఎస్‌డీపీ పెరుగుదల
- వ్యవసాయంలో అనుకూల వాతావరణం వల్ల 18.96 శాతం పెరిగిన వ్యవసాయ రంగం గ్రాస్ వాల్యూయాడెడ్ (జీవీఏ)
- 11.67 శాతం పెరిగిన ఉద్యాన శాఖ జీవీఏ
- పరిశ్రమల రంగంలో స్థిర ధరల వద్ద 5.67 శాతం వృద్ధి
- సేవా రంగంలో 9.11 శాతం వృద్ధి
- రాష్ట్ర తలసరి ఆశయం 1.51 లక్షల నుంచి 1.69 లక్షలకు పెరుగుదల
- తలసరి ఆదాయంలో 12.14 శాతం పెరుగుదల
- 15 Jun 2020 3:58 PM GMT
కోవిడ్- 19 టెస్టులు, ట్రీట్మెంట్ల కోసం ఛార్జీలపై క్యాప్ విధిస్తూ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
- మార్గదర్శకాలతో జీవో ఆర్టీ 248 ని జారీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ.
- ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా పరీక్ష ధర రూ. 2,200.
- ఒకరోజుకు వెంటిలేటర్‌పై లేకుండా ఐసీయూలో ఉంచితే రూ.7,500
- వెంటిలేటర్‌పై ఉంచితే రూ. 9 వేల ఛార్జీ
* కరోనా లక్షణాలు లేనివారికి పరీక్షలు చేయరు, లక్షణాలు ఉన్నవారికే పరీక్షలు*
- 15 Jun 2020 3:55 PM GMT
- తిరుమల: కల్యాణ వేదిక వద్ద 10 అడుగుల కొండ చిలువ హాల్ చల్
- చాకచక్యంగా పట్టుకొని అడవిలో వదిలి పెట్టిన స్థానికుడు బాబు....
- 15 Jun 2020 3:49 PM GMT
విశాఖలో టీడీపీ నేతలపై కేసు నమోదు
- విశాఖ : కోవిద్ 19 నిబంధనలకు విరుద్దంగా కార్యక్రమం నిర్వహించారనే కారణంతో టీడీపీ నాయకులపై కేసు నమోదు.
- కార్యక్రమ నిర్వహకుడు గవిరెడ్డి వెంకటరమణ తదితరులను కేసులో చేర్చిన పోలీసులు.
- 188,169,270 సెక్షన్ల క్రింద కేసు నమోదు
- 15 Jun 2020 3:46 PM GMT
- కరీంనగర్ జిల్లా:
👉 రాష్ట్రం లో కరోనా వ్యాప్తి నేపథ్యం లో స్వచ్చందంగా లాక్ డౌన్ విధించుకుంటున్న వ్యాపార వాణిజ్య సంస్థలు..
👉 జమ్మికుంట పట్టణం లో ఈ నెల 17 నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకే షాప్ లు తెరిచి ఉంచాలని తీర్మానించుకున్న వ్యాపారులు..
- 15 Jun 2020 3:45 PM GMT
- గంజాయి పట్టివేత
- కాజ టోల్ గేట్ వద్ద పనస కాయల లోడుతో విశాఖపట్నం వెళ్తున్న లారీలో 90 కేజీలు గంజాయిని చాకచక్యంగా ఛేదించి పట్టుకున్న మంగళగిరి రూరల్ సీఐ బృందం ...
- ఇద్దరు అరెస్టు
- 15 Jun 2020 2:32 PM GMT
- అవినీతికి తావులేని పాలన చేస్తానని సీఎం జగన్ చెప్పారు : అంబటి రాంబాబు .....వైసీపీ ఎమ్మెల్యే
- గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి ని వెతికి తిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు..
- అవినీతిపై ఏమి చేసారని టీడీపీ నేతలు సవాల్ చేశారు..
- అవినీతిపై తొలి అడుగు ప్రభాకర్ రెడ్డి, అచ్చెన్నాయుడుల అరెస్ట్..
- అచ్చెన్నాయుడు, ప్రభాకర్ రెడ్డి అవినీతిపై లభించిన ఆధారాలతోనే అరెస్టు జరిగింది..
- టీడీపీపై కక్ష్య సాధించడానికి టీడీపీ ఏమైనా బలమైన పార్టీనా..?
- అక్రమంగా టీడీపీ నేతలను అరెస్ట్ చేస్తే టీడీపీకి సానుభూతి రాదా..?
- పక్క ఆధారాలతోనే టీడీపీ నేతలను అరెస్ట్ చేశారు..
- దొంగల ముఠాకు నాయకుడు చంద్రబాబు..
- హెరిటేజ్ లో కోట్ల రూపాయల పెట్టి నెయ్యి కొనుగోలు చేశారు..
- చంద్రన్న కానుకుల్లో కోట్ల రూపాయలు కాజేశారు..
- అమరావతిలో అనేది పెద్ద స్కాం..
- ఇందులో ఎంతమంది పెద్దలు శ్రీకృష్ణ జన్మస్థానంకు వెళ్తారో త్వరలో తెలుస్తోంది..
- టీడీపీ నేతలకు ముందుంది ముసళ్ల పండగ..
- కనకపు సింహాసనమునా శునకంను కూర్చోబెట్టినట్లు ఉంది లోకేష్ పరిస్థితి
- జగన్మోహన్ రెడ్డి గురించే మాట్లాడే అర్హత లోకేష్ కు ఉందా
- ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా తెలుపు రాదన్నట్లు లోకేష్ ఎప్పటికి మారడు..
- రాజారెడ్డిని ఎప్పుడైనా దగ్గరుండి లోకేష్ ఎప్పుడైనా చూశావా..
- లోకేష్ చంద్రబాబు, లోకేష్ తాతా రాజారెడ్డి మీసంలో వెంట్రుక లాంటి వారు..
- రాజశేఖర్ రెడ్డి లాంటి సింహాన్ని కన్ననేత రాజారెడ్డి..
- సింహం లాంటి జగన్ కు రాజారెడ్డి తాత.
- జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, రాజా రెడ్డి గురించి మాట్లాడే అర్హత లోకేష్ కు లేదు..
- వడ్డీతో సహా ఇచ్చేయాదానికి ఇదేమైనా హెరిటేజ్ కంపిణిలో అప్పునా...?
- అసెంబ్లీ సమావేశాల్లో కరోనా నిబంధనలు ప్రకారం లోకేష్ చంద్రబాబు నడుసుకోపోకపోతే చర్యలు తప్పవు..
- ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించించాలనే ఆలోచన చంద్రబాబుకు లేదు..
- అవినీతి పరులు మీద ఉన్న శ్రద్ధ ఎల్జీ పాలిమర్స్ బాధితుల మీద లేదు..
- రఘురామ కృష్ణమారాజు ఎప్పుడు అలానే మాట్లాడుతారు..
- ఆయన మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు..
- ఆయన తేడా మనిషి
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire