Live Updates:ఈరోజు (జూన్-08) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు సోమవారం, 08 జూన్, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, తదియ (రాత్రి 07:55 వరకు), తదుపరి చవితి, పుర్వాషాడ నక్షత్రం (మధ్యాహ్నం 01.45 వరకు) సూర్యోదయం 5:41 am, సూర్యాస్తమయం 6:49 pm

ఈరోజు తాజా వార్తలు




Show Full Article

Live Updates

  • 8 Jun 2020 11:54 AM GMT

    కోవిడ్ 19 మార్గదర్శకాలు, లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ రాష్ట్రంలో సినిమా, టివి కార్యక్రమాల షూటింగులు కొనసాగించుకోవడానికి ముఖ్యమంత్రి కెసీఆర్ అనుమతి. దీనికి సంబంధించిన ఫైలుపై సంతకం చేసిన సీఎం కేసీఆర్.

    రాష్ట్రంలో పరిమిత సిబ్బందితో, ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ సినిమా/టివి కార్యక్రమాల షూటింగులు నిర్వహించుకోవచ్చని, షూటింగులు పూర్తయిన వాటి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వెంటనే నిర్వహించుకోవచ్చని ముఖ్యమంత్రి స్పష్టం.

  • 8 Jun 2020 11:25 AM GMT

    ఏపీలో అసమర్థ పాలన నడుస్తోంది: ఎమ్మెల్సీ మాధవ్

    విశాఖపట్నం: రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఉన్న ఇసుక సంక్షోభం కొనసాగుతోందని ఎమ్మెల్సీ మాధవ్ వ్యాఖ్యానించారు. విశాఖలో ఉన్న యాడ్లలో ఇసుక దొరకడం లేదన్న ఆన్‌లైన్ మొత్తం మాఫియా చేతిలో ఉందని విమర్శించారు. ఆన్‌లైన్ తెరిచినా ఉపయోగం లేదని... అందులో ఇసుక ఉండాలి కదా అని ఎద్దేవా చేశారు. భవన నిర్మాణ కార్మికులు కాంట్రాక్ట్‌లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వైసీపీ, టీడీపీ ప్రభుత్వం మధ్య వ్యత్యాసం లేదని... ఏపీలో అసమర్థ పాలన నడుస్తుందని విమర్శించారు. రెండు పార్టీల వ్యాపార దృక్పథం, రాష్ట్ర ప్రజల తరఫున ఆలోచించడం లేదన్నారు. మద్యనిషేధం పేరుతో రకరకాల బ్రాండ్ తీసుకొచ్చి అమ్ముతున్నారని ఎమ్మెల్సీ మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 



     

     

  • 8 Jun 2020 10:39 AM GMT

    పేదల కరెంటు బిల్లును ప్రభుత్వమే చెల్లించాలి అదుకోవాలి

    కరీంనగర్ టౌన్: ఈరోజు తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో లాక్ డౌన్ సమయంలో, మూడు నెలల నుండి కరెంట్ బిల్లులు కరెంటు సిబ్బంది బిల్లులు, మూడు నెలలది ఒకేసారి ఇవ్వడం ద్వారా మూడు నెలల రీడింగ్ మూడింతల పేద ప్రజల పైన, అధిక భారం పడుతున్నదని తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు. మూడు నెలల నుండి పేద ప్రజలు తినడానికి ఇబ్బంది పడుతున్న ఆ సమయంలో, మూడు నెలల బిల్లు అధిక భారం ఐపోతుంది. కావున ఈ ఒక్క మూడు నెలల బిల్లు ప్రభుత్వమే చెల్లించి, పేద ప్రజలను కాపాడాలని ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు ఆర్డిఓ కి వినతి పత్రం సమర్పించారు. ఈ ఒక వినతిపత్రం ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలని పేదలను అదుకోవాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ ఉపాధ్యక్షులు అయితే హరీష్, పార్లమెంట్ కోశాధికారి ఎస్కె ఫయాజ్, పట్టణ అధ్యక్షుడు రామగిరి అంకుస్, ప్రతాప రాజు, ఇల్లందుల రమేష్, లింగారావు తదితరులు పాల్గొన్నారు.



     


  • 8 Jun 2020 10:10 AM GMT

    స్వదేశానికి చేరుకున్న మరో 700 మంది భారతీయులు

    విశాఖపట్నం: మాల్దీవులో చిక్కుకున్న భారతీయులను ఆపరేషన్ సముద్ర సేతులో వందే భారత్​ మిషన్​ ద్వారా స్వదేశానికి తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగా 700 మంది భారతీయులను నౌకాదళం భారత భూభాగానికి తీసుకువచ్చింది. వీరంతా మాల్దీవుల నుంచి ట్యూటీకొరన్ పోర్టుకు చేరుకున్నారు. ఇప్పటి వరకు 2 వేల 874 మంది భారతీయులను జలాస్వ స్వదేశానికి తీసుకొచ్చింది. ఈ నౌక శ్రీలంక, మాల్దీవుల నుంచి భారతీయులను భారత భూభాగానికి చేర్చింది. కోవిడ్ నియంత్రణ పద్ధతులను పాటిస్తూ వారందరికి ప్రత్యేక పరీక్షలు నిర్వహించి స్వస్థలాలకు వెళ్లేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.



     


  • 8 Jun 2020 10:08 AM GMT

    చోడవరం స్వయంభూ ఆలయాలలో దర్శనాలు

    చోడవరం: రెండు స్వయంభూ ఆలయాలైన గౌరీశ్వర, వినాయక ఆలయాలను ప్రాత:కాలాన్నే తెరిచారు. శానిటైజర్ ఏర్పాట్లు చేశారు. భక్తులను థర్మోస్కానింగ్ చేసి మరీ ఆలయ ప్రవేశం కల్పించారు. దేవాదాయ శాఖ కార్యనిర్వాహక అధికారులు ట్రస్టు బోర్డు ప్రతిపాదిత ఛైర్మన్లు, సభ్యులు ఆయా ఆలయాల్లో ప్రథమ పూజలు చేశారు. దర్శనానికి వచ్చే భక్తులకు బౌతిక దూరం పాటించే విధంగా ఏర్పాట్లు చేశారు. రెండున్నర నెలల తర్వాత ఆలయాల ప్రవేశం కల్పించడంపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 



     


  • 8 Jun 2020 8:27 AM GMT

    తిరుపతి: అలిపిరి పాదాల మండపం, సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద భద్రత పెంపు.

    -శానిటైజర్స్ తో చేతులు శుభ్రం చేసుకుంటున్న టిటిడి ఉద్యోగస్తులు, సిబ్బంది.

    -టిటిడి పర్మినెంట్ ఉద్యోగస్తులకు ఆన్ లైన్ ద్వారా, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు దర్శన టోకెన్లను అందించిన టిటిడి.

    -80రోజుల తరువాత స్వామివారిని దర్సిమచుకోవడంతో సంతోషంలో టిటిడి ఉద్యోగస్తుల కుటుంబ సభ్యులు.




  • 8 Jun 2020 8:24 AM GMT

    న్యూ ఢిల్లీ: సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌.

    -సమావేశాలన్నీ రద్దు చేసుకున్న సీఎం కేజ్రీ..

    -జ్వరం, గొంతునొప్పితో బాధపడుతున్న సీఎం కేజ్రీవాల్‌..

    -రేపు కరోనా పరీక్షలు చేయించుకోనున్న సీఎం కేజ్రీవాల్.‌

  • 8 Jun 2020 8:22 AM GMT

    -శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయంలో దర్శనాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ముందుగా దేవస్థానం ఉద్యోగులకు మాత్రమే దర్శన అవకాశం కల్పించారు.

    -సామాజిక దూరం పాటిస్తూ క్యూలైన్లలో భ్రమరాంబ మల్లికార్జునస్వామి వారిని దర్శించుకుంటున్నారు.

    -క్యూలైన్లలో  ముందు థర్మల్ స్కానింగ్ నిర్వహించిన అనంతరం మాస్కలు ధరించిన వారిని మాత్రమే అధికారులు దర్శనానికి అనుమతి ఇస్తున్నారు.

    -భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకునేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

  • 8 Jun 2020 8:21 AM GMT

    ఏపీ కరోనా కేసుల తాజా స్థితి పై ప్రభుత్వ బులిటిన్:




     

  • 8 Jun 2020 8:20 AM GMT

    కృష్ణాజిల్లా : గన్నవరం మండలం బలిపర్రు గ్రామానికి చెందిన 26 ఏళ్లు సొంగా స్వప్న కుమారి అనే మహిళ ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి.



Print Article
More On
Next Story
More Stories