Live Updates:ఈరోజు (జూన్-08) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 08 జూన్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు సోమవారం, 08 జూన్, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, తదియ (రాత్రి 07:55 వరకు), తదుపరి చవితి, పుర్వాషాడ నక్షత్రం (మధ్యాహ్నం 01.45 వరకు) సూర్యోదయం 5:41 am, సూర్యాస్తమయం 6:49 pm
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 8 Jun 2020 5:24 PM GMT
- ఏపీలో బార్ & రెస్టారెంట్లో మద్యం విక్రయాలకు అనుమతి
- ఏపీలో బార్ & రెస్టారెంట్లలో మద్యం విక్రయాలకు అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ.
- 8 Jun 2020 5:15 PM GMT
తెలంగాణలో కొత్తగా 92 కేసులు..
-తెలంగాణలో ఇవాళ కొత్తగా 92 పాజిటివ్ కేసులు నమోదు.
-ఐదుగురు కరోనాతో పోరాడి మరణించారు.
-రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో పోరాడి 142 మంది మరణించారు.
- 8 Jun 2020 12:13 PM GMT
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో పదవ తరగతి పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదు కనుక, ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.
- 8 Jun 2020 12:04 PM GMT
ముఖ్యమంత్రి KCR కి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ
ముఖ్యమంత్రి KCR కి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ
కరెంట్ బిల్లుల మదింపు పై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అసంతృప్తి
👉కరెంట్ బిల్లుల మదింపును సవరించాలి
👉లాక్డౌన్ కాలంగా ప్రజలు ఉపాధి కోల్పోయారు
👉ఈ బిల్లులు పేద ప్రజలను మరింత పెదవారిగా మారుస్తుంది.
👉ప్రజలపై రెండు,మూడింతల భారం తగదు
👉కరోన కష్ట కాలంలో ప్రజలపై ఇంత కక్ష్య సాధింపు చర్యలు ఎందుకు
👉కష్ట కాలంలో ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ప్రజలను పీడించి ఖజానా నింపుకోవాలని చూస్తుంది
👉యూనిట్ కు 7.12 రూపాయల చొప్పున 200 యూనిట్లు దాటితే అర్థం లేని స్లాబులా..
👉ప్రభుత్వ ఖజానా నింపడం కోసం పేద ప్రజల రక్తం పిలుస్తావా
👉అప్పులు చేసేది నువ్వు భారం ప్రజల పైనానా
👉వెంటనే బిల్లును సవరించి ప్రజలకు ఊరట కలిగించాలి
👉లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ తరుపున ఉద్యమిస్తాం
👉ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది
- 8 Jun 2020 12:01 PM GMT
మంత్రి జగదీశ్ రెడ్డి
-సాధారణంగా రొజులతో పోల్చుకుంటే..ఈ వేసవిలో విద్యుత్ డిమాండ్ పెరిగింది..
-సాధారణ రోజులతో పోల్చు కుంటే..ఎక్కువ విద్యుత్ వినియోగం జరిగింది...
-లాక్ డౌన్ సమయంలో విద్యుత్ శాఖలో ప్రతి విభాగంలోని ఉద్యోగులు సమర్థవంతంగా పనిచేశారు..
-లాక్ డౌన్ కారణంగా విద్యుత్ బిల్లుల రిడింగ్ తీయలేదు.
-లాక్ డౌన్ సమయంలో వచ్చిన విద్యుత్ బిల్లుల వసూలు కోసం దేశ వ్యాప్తంగా ఈ.ఆర్.సి నిబంధనల మేరకే రిడింగ్ తీశారు.
-విద్యుత్ బిల్లుల రిడింగ్ విషయంలో అనుమానాలు వద్దు
-నెలవారీ సగటుగానే రిడింగ్ తీశాము
-రిడింగ్ తీసేనే సమయంలో ఆ వినియోగదారుల కేటగిరీలు బట్టే విద్యుత్ బిల్లుల రిడింగ్ చేశారు.
-కేటగిరి స్లాబు ఆధారంగా నే బిల్లులు తీశాము.
-విద్యుత్ బిల్లుల విషయంలో వినియోగదారులకు అపోహలు వద్దు
-విద్యుత్ బిల్లులు అధికంగా.. వచ్చిన అంశంపై
సామాన్య ప్రజలే కాదు..
-మా ఎమ్మెల్యే కు విద్యుత్ బిల్లుల ఫై ఇలాంటి అనుమానాలే వచ్చాయి..
నేరుగా వాళ్ళ విద్యుత్ బిల్లులు తెప్పించి సందేహలు నివృత్తి చేశాము
-కేటగిరి మారడం వల్లనే విద్యుత్ బిల్లు పెరుగుతుంది.
విద్యుత్ బిల్లుల రిడింగ్ పై అనుమానాలు ఉంటే విద్యుత్ శాఖ అధికారుల వద్దకు వెళ్లి అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చు
- 8 Jun 2020 12:00 PM GMT
ఉత్తరాఖండ్ కు అధికారికంగా నేటి నుంచి మరో రాజధాని.
వేసవి రాజధానిగా గైర్ సైన్.
సమ్మర్ క్యాపిటల్ గా గైర్ సైన్ కు గవర్నర్ ఆమోద ముద్ర.
నోటిఫికేషన్ వెలువరించిన చీఫ్ సెక్రటరీ.
చమోలి జిల్లాలో ఉన్న గైర్ సైన్.
గైర్ సైన్ ను వేసవి రాజధానిగా చేస్తూ ఇటీవలి తీర్మానం చేసిన రాష్ట్ర అసెంబ్లీ.
నూతన రాజధాని ఏర్పాటు చారిత్రాత్మక మన్న సీఎం రావత్.
- 8 Jun 2020 11:57 AM GMT
కోవిడ్ -19 పై తెలంగాణ హైకోర్టులో విచారణ
కోవిడ్ -19 పై తెలంగాణ హైకోర్టులో విచారణ
పీపీఈ రక్షణ కిట్స్ ఎన్ని ఇచ్చారో గతంలో తెలపాలని అదేశించిన నివేదిక సమర్పించకపోవడాన్ని కోర్టు దిక్కరణగా భావిస్తామన్న హైకోర్టు.
ప్రతి హాస్పటల్ సూపరెండెంట్ ఎన్ని కిట్స్ వచ్చాయి. ఎన్ని పంచారు. ఎంత స్టాక్ ఉందో తెలపాలని అదేశం.
కోర్టు దిక్కరణగా ఈనెల 17న హెల్త్ డిఫార్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ.. డైరెక్టర్ శ్రీనివాస్ రావు హాజరుకావాలని అదేశం.
హైదరాబాద్ లోనే కొవిడ్ అస్పత్రులు ఉన్నాయి..? ప్రతి జిల్లాలో 100 పడకల కోవిడ్ అస్పత్రి అవసరమన్న పిటిషనర్.
ప్రతి జిల్లాలకు ఎంత వరకు అవసరం ఉందో నివేదిక సమర్పించాలన్న హైకోర్టు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనలు ఇచ్చారో తెలపాలన్న హైకోర్టు.
ప్రకటనలు ఇవ్వకుంటే.. లోకల్ భాషలో న్యూస్ పేపర్స్, ఛానల్స్ ద్వారా ఇవ్వాలని అదేశం.
కరోనా కేసుల రిపోర్టుల పై అగ్రహాం వ్యక్తం చేసిన హైకోర్టు.
ఒక్కొక్క రిపోర్టులో ఒక్కొక్క తీరుగా ఉందని అసహానం.
డెడ్ బాడీలకు టెస్ట్ లు చేయాలన్న తీర్పు పై సుప్రీంకి వెళ్లిన తెలంగాణ ప్రభుత్వం.
నోటీసులు రాన్నందున మేమే విచారిస్తామన్న హైకోర్టు...
ఎంత మంది బాడీలకు టెస్ట్ చేశారు మరియు కరోనాతో హాస్పటల్ లో ఎంత మంది చనిపోయారు.
భయట ఎంతమంది చనిపోయారో ఈనెల 26వ నివేదిక ఇవ్వాలన్న హైకోర్టు.
- 8 Jun 2020 11:56 AM GMT
రైతు బంధు చెల్లింపులు జరగలేదని హైకోర్టు లో పిల్ ధాఖలు.
పిల్ ధాఖలు చేసిన వరంగల్ జిల్లా రైతు.
2019,2020 సంవత్సరానికి రబీ ,ఖరీఫ్ సంబంధించిన విడతల వారి రైతుబంధు చెల్లించలేదని హైకోర్టు ను ఆశ్రయించిన రైతు.
ఎందుకు చెల్లించలేదో వివరణ ఇవ్వాలని ప్రభుత్వం కు హైకోర్టు నోటీసులు జారీ.
తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసిన హైకోర్టు.
- 8 Jun 2020 11:55 AM GMT
రైతు బంధు చెల్లింపులు జరగలేదని హైకోర్టు లో పిల్ ధాఖలు.
పిల్ ధాఖలు చేసిన వరంగల్ జిల్లా రైతు.
2019,2020 సంవత్సరానికి రబీ ,ఖరీఫ్ సంబంధించిన విడతల వారి రైతుబంధు చెల్లించలేదని హైకోర్టు ను ఆశ్రయించిన రైతు.
ఎందుకు చెల్లించలేదో వివరణ ఇవ్వాలని ప్రభుత్వం కు హైకోర్టు నోటీసులు జారీ.
తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసిన హైకోర్టు.
- 8 Jun 2020 11:55 AM GMT
కోవిడ్ 19 నేపధ్యంలో ప్రయాణికుల భద్రత కోసం రైల్వే స్టేషన్ లలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సికింద్రాబాద్ ,హైదరాబాద్ రైల్వే స్టేషన్ లలో బులెట్ థర్మల్ ఇమేజ్ స్క్రీనింగ్ కెమెరా ల ఏర్పాటు.
బులెట్ థర్మల్ ఇమేజ్ స్క్రినింగ్ కెమెరా లో ,నెట్వర్క్ వీడియో రికార్డర్ ,ఎల్ఈడి మానిటర్ లు అలారం మేకనిజం లు ఉన్నాయి.
రైల్వే ప్రయాణికుల ప్రయోజనం కోసం లక్షణాలు చూడడం కోసం మాములు థర్మల్ స్క్రినింగ్ ద్వారా అధిక సమయం పడుతున్నందున బులెట్ థర్మల్ ఇమేజ్ స్క్రినింగ్ ద్వారా ఒకేసారి 30 మందిని పరీక్షించగలదు.
ఈ థర్మల్ స్క్రినింగ్ ద్వారా కెమెరా రికార్డ్ చేసిన ప్రయాణికుల శరీర ఉష్ణోగ్రతలు అక్కడే ఎల్ఈడి స్క్రీన్ పై ప్రదర్శించబడి అలారం ద్వారా హెచ్చరికలు జరిచేస్తుంది.
ఇవి సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వే స్టేషన్ లో ఫ్లాట్ ఫామ్ 1 వద్ద ఏర్పాటు చేయబడ్డాయి.
ఈ సందర్భంగా పరికరాలు ఏర్పాటు చేసిన సిబ్బంది ని దక్షిణమధ్య రైల్వే జీఎం గజనన్ మాల్యా అభినందించారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire