Live Updates:ఈరోజు (జూలై-15) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బుధవారం, 15 జూలై, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. ఉత్తరాయణం.. ఆషాఢ మాసం, కృష్ణపక్షం దశమి(రా. 8-18 వరకు) తర్వాత ఏకాదశి, భరణి నక్షత్రం (మ. 03-46 వరకు) తర్వాత కృత్తిక నక్షత్రం.. అమృత ఘడియలు (ఉ. 10-29 నుంచి 12-14 వరకు), వర్జ్యం (తె. 4-49 నుంచి ఉ.07-40 వరకు) దుర్ముహూర్తం (ఉ. 11-39 నుంచి మ. 12-30 వరకు) రాహుకాలం (ఉ. 12-00 నుంచి 1-30 వరకు) సూర్యోదయం ఉ.5-36 సూర్యాస్తమయం సా.6-34
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 15 July 2020 6:27 AM GMT
ఆర్టీసీ ఈడి వేంకటేశ్వర రావు గుండెపోటుతో మృతి
- హైదరాబాద్: ఆర్టీసీ ఈడి(అడ్మిన్, హైదరాబాద్) వేంకటేశ్వర రావు గుండెపోటుతో మృతి
- వారి మృతి పట్ల సంతాపం తెలిపిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.
- వారి కుటుంబానికి తమ ప్రగాడ సానుభూతి ప్రకటించి.... వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించిన మంత్రి పువ్వాడ
- 15 July 2020 6:23 AM GMT
జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన
విశాఖ: జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన
- రాంకి ఆధ్వర్యంలో నడుస్తున్న విశాఖ సాల్వెంట్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్
- సీపీఎం నేత నర్సింగరావు కామెంట్స్
- ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకున్నట్టే సాయినార్, సాల్వెంట్ యాజమాన్యంపైనా తీసుకోవాలి.
- సాల్వెంట్ కంపెనీలో మృతుడు కుటుంబాలకు కోటి రూపాయలు నష్ట పరిహారం ప్రకటించాలి
- 15 July 2020 5:53 AM GMT
ఆగష్టు 1 నుంచి పర్యాటకం.. ఏపీ మంత్రి అవంతి వెల్లడి
- కరోనా వైరస్ నియంత్రణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు పాటిస్తూ ఆగస్టు 1 నుంచి రాష్ట్రంలోని అన్ని పర్యాటక ప్రాంతాలను తెరవనున్నట్లు మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు.
- ఆ ప్రాంతాల్లో సందర్శకులను అనుమతిస్తామని తెలిపారు. సచివాలయంలోని తన కార్యాలయంలో టూరిజం, శిల్పారామం, సాంస్కృతిక విభాగాలపై ఆయన సమీక్ష జరిపారు.
- అనంతరం విలేకరులతో మాట్లాడారు. కరోనా లాక్ డౌన్ కారణంగా గత మూడు నెలల నుంచి అన్ని పర్యాటక ప్రదేశాలను మూసివేసిన విషయం విదితమే.
- ఇటీవల విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ ఆంధ్రప్రదేశ్ లోని అన్ని పర్యాటక ప్రదేశాలను ఆగస్టు 1 నుంచి సందర్శకుల కోసం తెరుస్తామని ఆ రాష్ర్ట పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ రావు మంగళవారం మీడియాకు వెల్లడించారు.
- 15 July 2020 5:51 AM GMT
నేటి నుంచి వారం రోజుల పాటు దర్శనాలు నిలిపివేత..
-,శ్రీశైలం దేవాలయంపై కరోనా ఎఫెక్ట్ పడింది.
- అక్కడ కేసులు ఎక్కువ కావడంతో పాటు ఆలయ అర్చకులు ఇతర సిబ్బందికి కరోనా సోకడంతో వారం రోజల పాటు దర్శనాలు నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.
- వీటికి సంబంధించి అదుపులోకి వచ్చిన తరువాతే తిరిగి దర్శనాలను పున:ప్రారంభిస్తామని ఆలయ ఈవో రామారావు తెలిపారు.
- 15 July 2020 5:49 AM GMT
సుస్థిరమైన అభివృద్ధిలో ఏపీ ముందంజ.. ప్రకటించిన నీతి అయోగ్
సుస్థిరమైన అభివృద్ధిలో ఏపీ ముందంజ.. ప్రకటించిన నీతి అయోగ్ ఏపీలో పేద కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు అన్ని రంగాల్లో మెరుగైన పనితీరు కనబర్చడంలో ముందడుగు వేసింది. ఇతర అంశాల్లో సైతం ఇది మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కాస్త ముందంజలో ఉన్నట్టు నీతి అయోగ్ ప్రకటించింది. సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాల్లో ఆంధ్రప్రదేశ్ అనేక రంగాల్లో ముందడుగు వేసింది. 2018–19 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2019–20లో ఎంతో మెరుగైన రీతిలో పనితీరు కనబర్చింది.
- 15 July 2020 5:48 AM GMT
ఏపీ ప్రజలకు అరోగ్యశ్రీ అండ..
ఏపీ ప్రజలకు ఆరోగ్యశ్రీ అండగా నిలుస్తోంది... బిడ్డ పుట్టినదగ్గర్నుంచి ఇటీవల కాలంలో విలయం సృష్టిస్తున్న కరోనా వైరస్ వరకు ఏ వ్యాధికైనా ప్రభుత్వం అండగా ఉంటోంది. దీంతో పాటు దీర్ఘకాలిక రోగాలు ఉండే వారికి ప్రత్యేకంగా పింఛన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ విధంగా ఎందరో పేదలకు అండగా నిలిచిన వైఎస్సార్ పేరుతో ఏర్పాటయిన ఆరోగ్యశ్రీ అన్ని కుటుంబాలకు ఏపీలో భరోసాగా నిలిచింది.
- 15 July 2020 5:47 AM GMT
నేటి నుంచి విస్తరించనున్న ఆర్టీసీ సర్వీసులు..
ఇప్పటివరకు ప్రధాన పట్టణాలకే పరిమితమైన ఆర్టీసీని పల్లెలకు విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే గతంలో మాదిరి కాకుండా కండక్టర్లను బస్సుల్లోనే ఉంచి, సర్వీసులు తిప్పేలా ప్రణాళికలు చేస్తున్నారు. దీంతో పాటు కరోనా నేపథ్యంలో ఎటువంటి సమస్య తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటూనే ముందుకు పోవాలని ఎండీ కృష్ణబాబు ఆదేశించారు.
- 15 July 2020 4:42 AM GMT
ప్రైవేటు యూనివర్సిటీల పరీక్షలు రద్దు..
ఇప్పటికే దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అన్ని వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. ప్రధానంగా విద్యా వ్యవస్థపై కోలుకోలేని దెబ్బ కొట్టిందనే చెప్పాలి. విద్యార్థులకు సంబంధించి దాదాపుగా అన్ని పరీక్షలను ప్రభుత్వాలు రద్దు చేశాయి. అదే బాటలో ప్రైవేటు యూనివర్సిటీల్లో ముందంజలో ఉన్న విట్, ఎస్.ఆర్.ఎం సైతం పయనిస్తున్నాయి.
- 15 July 2020 4:40 AM GMT
అప్రమత్తంగా లేకే ప్రమాదం..
సాల్వెంట్ లిమిటెడ్ ఫార్మా పరిశ్రమలో సోమవారం అర్ధరాత్రి సంభవించిన ప్రమాదం నిర్వహణలోపంతోనే జరిగినట్టు నిపుణుల కమిటీ ప్రాధమికంగా నిర్ణయానికొచ్చింది. ఇక్కడ జరిగే రోజూవారీ ప్ర్రకియను గమనించకపోవడం వల్లే ఈ దుర్గతి పట్టిందని కమిటీ వివరించింది.
- 15 July 2020 3:29 AM GMT
తిరుపతి లో కరోనా విశ్వరూపం..
చిత్తూరు జిల్లా: తిరుపతి లో కరోనా విశ్వరూపం.
- తిరుపతిలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు
- తిరుపతి అర్బన్ లో మరో 75 కరోనా కేసులు నమోదు
- తిరిగి మళ్ళీ లోక్డౌన్ దిశలో తిరుపతి నగరం
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire