Live Updates:ఈరోజు (జూలై-15) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 15 జూలై, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు బుధవారం, 15 జూలై, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. ఉత్తరాయణం.. ఆషాఢ మాసం, కృష్ణపక్షం దశమి(రా. 8-18 వరకు) తర్వాత ఏకాదశి, భరణి నక్షత్రం (మ. 03-46 వరకు) తర్వాత కృత్తిక నక్షత్రం.. అమృత ఘడియలు (ఉ. 10-29 నుంచి 12-14 వరకు), వర్జ్యం (తె. 4-49 నుంచి ఉ.07-40 వరకు) దుర్ముహూర్తం (ఉ. 11-39 నుంచి మ. 12-30 వరకు) రాహుకాలం (ఉ. 12-00 నుంచి 1-30 వరకు) సూర్యోదయం ఉ.5-36 సూర్యాస్తమయం సా.6-34
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 15 July 2020 5:10 PM GMT
రాష్ట్రంలో ఐఏఎస్‌ల బదిలీలు
- 15 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
- అడిషనల్ సీఈవో-జ్యోతి బుద్ధప్రకాష్
- వైద్య ఆరోగ్యశాఖ, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి-సయ్యద్ అలీ ముర్తుజా రజీ
- అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా-శాంతికుమారి
- ఈపీటీఆర్‌ఐ డైరెక్టర్ జనరల్-అదర్ సిన్హా
- నాగర్‌కర్నూల్ కలెక్టర్-ఎల్ శర్మన్
- పాఠశాల విద్యా డైరెక్టర్-శ్రీదేవసేన
-హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్-వాకాటి కరుణ
- పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి-కేఎస్ శ్రీనివాసరాజు
- సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి-విజయ్‌కుమార్
- సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్-యోగితా రాణా
- సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా కొనసాగింపు
- ఆదిలాబాద్ కలెక్టర్-సిక్తా పట్నాయక్
- పెద్దపల్లి ఇంచార్జ్ కలెక్టర్-భారతీ హోలీకేరి
- గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి-ఇ. శ్రీధర్
- కార్మిక, ఉపాధి కల్పనశాఖ కార్యదర్శి-రాణి కుముదిని దేవి
- తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు..
- పర్యావరణ శాస్త్ర సాంకేతిక అదనపు బాధ్యతలు రజత్‌కుమార్‌కు అప్పగింత
- 15 July 2020 1:03 PM GMT
ప్రకాశం బ్యారేజ్‌కు భారీగా చేరుకుంటున్న వరదనీరు
విజయవాడ: ప్రకాశం బ్యారేజ్‌కు వరద నీరు భారీగా చేరుతోంది. బ్యారేజ్‌కి చెందిన 15 గేట్లను 2 అడుగుల మేర ఎత్తి.. 14 వేల క్కుసేకుల నీటిని అధికారులు సముద్రంలోకి అధికారులు విడుదల చేశారు.
- మున్నేరు, వైరా, కట్లేరు, కీసర నుంచి భారీగా ప్రకాశం బ్యారేజ్‌కి వరద నీరు చేరుకుంటోంది.
- ఈ రోజు సాయంత్రానికి 30 వేలకు చేరుకునే అవకాశం ఉంది.
- ఈ నేపథ్యంలో నది పరివాహ ప్రాంత పరిధిలోని ఎమ్మార్వోలను అధికారులు అప్రమత్తం చేశారు
- 15 July 2020 10:42 AM GMT
శ్రీశైలానికి కృష్ణమ్మ జలాలు..
- జూరాల గేట్లు తెరిచిన అధికారులు..
- శ్రీశైలానికి పరుగులు తీస్తున్న కృష్ణమ్మ..
- ఎగువ నుంచి ఇన్ ఫ్లో పెరగడం తో జూరాల ప్రాజెక్ట్ ఐదు గేట్లు తెరిచిన నీటి పారుదల శాఖ అధికారులు..
- 15 July 2020 6:43 AM GMT
- రెండో రోజు గాంధీ వద్ద అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సామూహిక ఆందోళన..
- రోడ్ బైటాయించిన నాల్గవ తరగతి ఉద్యోగులు..
- మరోపక్క ఆరో రోజుకు చేరిన, నర్సుల ఆందోళన
- 15 July 2020 6:43 AM GMT
పిడుగురాళ్ల రూరల్ సిఐ రత్తయ్య పై చర్యలు ..
గుంటూరు ః పిడుగురాళ్ల రూరల్ సిఐ రత్తయ్య పై చర్యలు ..
- రాజుపాలెం మండలం బలిజేపల్లి గుడారి సుబ్బయ్య హత్య కేసు
- దర్యాప్తులో నిర్లక్ష్యం పై ఆగ్రహం.
- సిఐ రత్తయ్య ను విఆర్ కు పంపిన ఐజీ ప్రభాకర్ రావు
- హత్యకేసులో ప్రధాన నిందితుడ్ని అరెస్ట్ చేయకలేకపోవడం పై సీరియస్ ...
- 15 July 2020 6:40 AM GMT
>> అమరావతి
- ప్రారంభము అయ్యిన క్యాబినెట్
- అంజాద్ బాషా మినహా అందరూ మంత్రులు హాజరు
- 15 July 2020 6:38 AM GMT
గాంధీ భవన్ కు కరోనా ఎఫెక్ట్
- తెలంగాణ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం గాంధీభవన్లో కరోనా కాటు.
- కరోనా కంట్రోల్ రూమ్ లో
- నిత్యం పని చేస్తున్న పలువురు నాయకులకు సోకిన కరోనా వైరస్.
- ఇప్పటికే పార్టీ కార్యదర్శి నరేందర్ యాదవ్ కరోనా వైరస్ బారిన పడి మృతి.
- గాంధీభవన్ ను శానిటైజ్ చేస్తున్న జిహెచ్ఎంసి సిబ్బంది.
- వారం రోజుల పాటు గాంధీభవన్ మూసివేతకు ఆదేశాలు జారీ చేసిన కార్యాలయ కార్యదర్శి.
- లాక్ డౌన్ సమయం లో ప్రెస్ మీట్లు, సహాయ కార్యక్రమాలతో బిజీ బిజీ గా మారిన గాంధీభవన్.
- ఇప్పటికే పార్టీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి ,
- వి. హనుమంత రావు లు కరోనా బారిన పడి కోలుకున్నారు.
- 15 July 2020 6:34 AM GMT
తూర్పుగోదావరిలో వివాదస్పదమవుతోన్న కొందరు పోలీసు అధికారుల తీరు..
తూర్పుగోదావరి: జిల్లా వివాదస్పదమవుతోన్న కొందరు పోలీసు అధికారుల తీరు.. నిందితుల తో కుమ్మక్కై బాధితుడ్ని మోసం చేసిన పిఠాపురం పోలీసులు..
రైస్ పుల్లింగ్ యంత్రం పేరుతో పిఠాపురం మం. చిత్రాడ యువకుడికి పది లక్షలు టోకరా పెట్టిన అనంతపురం జిల్లా రాయదుర్గం కు చెందిన వ్యక్తి..
పిఠాపురం పోలీసులను ఆశ్రయించిన బాధితుడు.. బాధితుడి ఫిర్యాదుతో రాయదుర్గం వెళ్ళి నిందితుడ్ని పట్టుకున్న పిఠాపురం పోలీసులు..
నిందితుడి వద్ద నుంచి పదిన్నర లక్షలు రూపాయిలు రికవరీ చేసి కేసు నమోదు చేయకుండా వదిలిపెట్టిన పోలీసులు..
బాధితుడికి మూడు లక్షలు ఇచ్చి మిగిలింది తన తమ జేబులో వేసుకున్న ఓ పోలీస్ అధికారి..
వేరొక కేసులో రాయదుర్గం రైస్ పుల్లింగ్ నిందితుడ్ని అరెస్ట్ చేసిన రాజమండ్రి క్రైమ్ పోలీసులు..
రాజమండ్రి అర్బన్ ఎస్పీ షిమోషి బాజ్ పాయ్ విచారణలో బయటపడ్డ పిఠాపురం పోలీసుల బాగోతం..
జిల్లా ఎస్పీ నయీమ్ అస్మి కు ఫిర్యాదు చేసిన రాజమండ్రి అర్బన్ ఎస్పీ షిమోషి బాజ్ పాయ్..
అంతర్గత విచారణ పేరుతో విషయం బయటకు రానీయకుండా జాగ్రత్త పడుతున్న జిల్లా పోలీసు ఉన్నతాధికారులు..
- 15 July 2020 6:32 AM GMT
- ప్రభుత్వ ఆస్పత్రుల తో పాటూ ప్రయివేట్ మెడికల్ కాలేజీల్లో కరోనాకు ట్రీట్మెంట్
- ప్రయివేట్ మెడికల్ కాలేజీల్లో కరోనా టెస్టులు, చికిత్స ఉచితం
- మొదట మూడు ప్రయివేట్ మెడికల్ కాలేజీల్లో కరోనా చికిత్స..
- మల్లారెడ్డి, మమత, కామినేని, మెడికల్ కాలేజీల్లో కరోనా చికిత్స
- 15 July 2020 6:30 AM GMT
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు అడవుల్లో కాల్పులు
- మల్లెపల్లి తొగు అటవీప్రాంతంలో పోలీసు బృందాలకు ఎదురుపడిన మావోయిస్టులు
- పోలీసులు... మావోల మధ్యలో ఎదురు కాల్పులు
- తృటిలో తప్పించుకున్న మావోయిస్టులు
- తెలంగాణ రాష్ట్రంలోకి మావోయిస్టులు ప్రవేశించారనే విశ్వసనీయ సమాచారం మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు అటవీ ప్రాంతంలో 500 మంది పోలీసులు 25 బృందాలుగా ఏర్పడి కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఈ రోజు ఉదయం 9గంటలకు మల్లెపల్లితోగు అటవీప్రాంతంలో మావోయిస్టులకు మరియు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.అనంతరం పోలీసులను చూసి వారికి సంబంధించిన సామాగ్రిని వదిలిపెట్టి పారిపోయిన మావోయిస్టుల కోసం ముమ్మరంగా కొనసాగుతున్న గాలింపు చర్యలు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire