Live Updates:ఈరోజు (జూలై-13) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు సోమవారం, 13 జూలై, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. ఉత్తరాయణం.. ఆషాఢ మాసం, కృష్ణపక్షం అష్టమి(సా. 4-36 వరకు) తర్వాత నవమి, రేవతి నక్షత్రం (ఉ.10-45 వరకు) తర్వాత అశ్విని నక్షత్రం.. అమృత ఘడియలు (తె. 5-21 నుంచి 9-51 వరకు), వర్జ్యం లేదు. దుర్ముహూర్తం (మ. 12-31 నుంచి 1-23 వరకు) రాహుకాలం (ఉ. 7-30 నుంచి 9-00 వరకు) సూర్యోదయం ఉ.5-36 సూర్యాస్తమయం సా.6-35

ఈరోజు తాజా వార్తలు


Show Full Article

Live Updates

  • గన్ పార్క్ కు వచ్చిన జన సమితి అధ్యక్షుడు కోదండరాం అరెస్ట్
    13 July 2020 5:44 AM GMT

    గన్ పార్క్ కు వచ్చిన జన సమితి అధ్యక్షుడు కోదండరాం అరెస్ట్

    సచివాలయంలోని భవనాల కూల్చివేతను నిరసిస్తూ ఈరోజు ప్రతిపక్ష నేతలు చలో గన్ పార్క్...

    గన్ పార్క్ అమర వీరుల స్థూపం వద్ద నిరసన తెలపాలని పిలుపునిచ్చిన కాంగ్రెస్, సీపీఐ, జన సమితి పార్టీ.

    గన్ పార్క్ వద్ద భారీగా చేరుకున్న పోలీసులు...

    గన్ పార్క్ చేరుకున్న జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం..

    ఎలాంటి అనుమతి లేదంటున్న పోలీసులు.

  • ఖైదీలను విడుదల చేయాలని హైకోర్టు లో పిల్
    13 July 2020 5:43 AM GMT

    ఖైదీలను విడుదల చేయాలని హైకోర్టు లో పిల్

    TS High Court :- కరోనా వైరస్ నేపద్యంలో జైల్ లో ఉన్న ఖైదీలను విడుదల చేయాలని హైకోర్టు లో పిల్

    రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జైల్లో ఖైదీలను పెరోల్ పై విడుదల చేయాలంటూ పిల్ లో పేర్కొన్న పిటిషనర్ లింగయ్య

    ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పెరోల్ పై విడుదల చేస్తున్నారని, తెలంగాణలో కూడా విడుదల చేసేలా

    ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొన్న పిటిషనర్

    మరి కొద్ది సేపటిలో విచారణ చేయున్న హైకోర్టు

  • వాతావరణ సమాచారం
    13 July 2020 5:34 AM GMT

    వాతావరణ సమాచారం

    - ఈ రోజు సాయంత్రం వరకూ తెలంగాణలో పిడుగులు పడే అవకాశం

    - ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన వాతావరణ శాఖ

    - కోస్తాంధ్ర రాయలసీమల్లో ఉరుములతో కూడిన వర్షాలు.

    - రేపు తెలంగాణ రాయలసీమలకు భారీ వర్షాలు.

    - రేపు కోస్తాంధ్రలో ఉరుములు పిడుగులతో చెదురుమదురుగా వర్షాలు

  • 13 July 2020 5:07 AM GMT

    ఔట్ సోర్సింగ్ నర్సులకు వేతనాలు పెంపు..

    - కరోనా వైరస్ వ్యాప్తిలో పనిచేయడం ఎంత కష్టమో అందరికీ తెలిసిందే.

    - కొంతరైతే ఏకంగా సెలవులు పెట్టి ఇంటి దారి పడుతున్నారు.

    - మరికొంత మంది ఇంటి ముఖం చూడకుండా రోజులు తరబడి ఆస్పత్రిలోనే ఉండి రోగులకు సేవలందింస్తున్నారు.

    - ఈ పరిస్థితుల్లో మరికొంతమంది వ్యాధి బారిన పడిన సందర్భాలున్నాయి.

    - పూర్తి వివరాలు 

  • 13 July 2020 4:59 AM GMT

    రోడ్డు ప్రమాదం.. లారీ క్యాబిన్​లో చిక్కుకున్న డ్రైవర్, క్లీనర్

    ఎలమంచిలి: మండలం మర్రిబంద సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న లారీని, వెనుక నుంచి వస్తున్న మరో లారీ బలంగా ఢీకొంది. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్ లారీ క్యాబిన్​లో చిక్కుకుపోయారు. పోలీసులు క్రేన్​ సహాయంతో లారీలను విడదీసి వారిని బయటకు తీసేందుకు యత్నిస్తున్నారు. ప్రమాదం వల్ల ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది.



  • 13 July 2020 4:56 AM GMT

    అక్రమంగా నిల్వ ఉంచిన గుట్కా స్వాధీనం

    మచిలీపట్నం: సబ్ డివిజన్ లోని ఉల్లిపాలెంలో అక్రమ గుట్కా నిల్వల మీద కోడూరు పోలీసులు దాడి చేసి మొత్తం 13,020 రూపాయల విలువ గల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు కోడూరు ఎస్ఐ రమేష్ తెలిపారు. అనంతరం ఎస్ఐ రమేష్ మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎవరైనా నిషేధిత గుట్కా ప్యాకెట్లు అమ్మినా, రవాణా చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. 

  • 13 July 2020 4:55 AM GMT

    త్రాగు నీటి కోసం ఆందోళనకు దిగిన గ్రామస్తులు

    నూజివీడు: నియోజకవర్గ పరిధిలోని ముసునూరు మండలం రమణక్కపేట గ్రామంలో తాగునీటి కోసం ఆందోళనకి దిగిన గ్రామస్థులు సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగం లోకి దిగి గ్రామస్థులతో చర్చిస్తున్నారు.

    - గత కొంత కాలంగా నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

    - ఎస్ఐ రాజారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆందోళనకు దిగరాదని, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని గ్రామస్తులతో చేస్తున్నారు.



  • 13 July 2020 4:48 AM GMT

    లాక్ డౌన్ దిశగా కర్నూలు..

    కర్నూలు: లాక్ డౌన్ దిశగా కర్నూలు..

    - కరోనా కేసులు పెరుగుతున్న నేపద్యంలో లాక్ డౌన్ విదేంచుకు అధికారులు సన్నాహాలు..

    - నగరంలో కంటైన్మంట్ జోన్ లో ఎర్పాటు చేసిన బారికేడ్లు..

    - పూర్తి లాక్ డౌన్ చేస్తారా లేదా.. కంటైన్మంట్ జోన్ లో మాత్రమే లాక్ డౌన్ చేస్తారా అనేది మద్యాహ్నం నిర్ణయం తీసుకొనున్న జిల్లా కలెక్టర్ వీరపాండియాన్..

  • 13 July 2020 4:48 AM GMT

    కాపు సోదర, సోదరమణులకు లేఖ రాసిన మాజీమంత్రి కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం

    తూర్పుగోదావరి -రాజమండ్రి.. కాపు సోదర, సోదరమణులకు లేఖ రాసిన మాజీమంత్రి కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం

    - కొందరు పెద్దలు నన్ను తిట్టించే పరిణామాలకు కలత చెంది ఉద్యమం నుంచి ప్రక్కకు తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను..

    - ఈమధ్య పెద్దవారు చాలా మంది మన సోదరుల చేత మానసికంగా కృంగిపోయేలా సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నాపై దాడులు చేయిస్తున్నారు..

    - ఈవిధంగా దాడులు చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందో నాకైతే అర్ధం కావడం లేదు..

    - నేను ఉద్యమం లోకి రావడానికి ముఖ్యకారణం చంద్రబాబే..

    - మన జాతికి బిసీ రిజర్వేషన్లు ఇస్తానని హామీ కోసమే ఉద్యమం చేపట్టాం

    - దీని ద్వారా పదవులుకానీ, డబ్బుకానీ పొందాలని ఎనాడు అనుకోలేధదు

    - ఉద్యమంలోకి వచ్చాక ఆర్ధికంగా, రాజకీయంగా ,

    - ఆరోగ్యపరంగా చాలా నష్టపోయాను..

    - రాజకీయంగా ఎంత నష్టపోయానో మీ అందరికీ తెలుసు, అయితే ఏరోజు దానికోసం చింతించలేదు

    - తుని సభ,పాదయాత్ర ఘనంగా జరగడానికి నా గొప్పకాదు . మన జాతి ఆకలి అన్న అంశం గమనించాలి

    - నా రాజకీయ జీవితంలో అనేక పార్టీలు,కుల సభలు చూశాను..

    - తుని సభకు రెండురోజుల ముందే జనం చేరుకోవడం ఆనందాన్నిచ్చింది

    - రిజర్వేషన్లు ఇచ్చేస్తే ఆ పేరు నాకే వచ్చేస్తుందని ఆశించేవాడ్ని కాదు..

    - రిజర్వేషన్లు ఇచ్చేస్తే నేను గొప్పవాడ్ని అయిపోతానని అభిప్రాయాలు పడ్డారు.

    - జేఏసీ, అడ్వకేట్స్, మేధావుల సూచనలమేరకే ఉద్యమాన్ని నడిపాను

    - ఉద్యమం లో మెరుగైన ఫలితాలు కోసం రకరకాల ఆలోచనలతో ముందుకు వెళతాం

    - ఒకే ఆలోచన తో ఏ ఉద్యమం ముందుకు సాగదు

    - ఏదో రూపంలో జాతికి మంచి జరగాలన్నదానిపై ఎన్నో ప్రయత్నాలు , ఉద్యమాలు చేశాం

    - అవన్నీ కూడా తప్పు అనడం న్యాయం గా లేదు..

    - కులద్రోహి, గజదొంగలా మాట్లాడారట

    - తప్పదు పోస్టింగులు పెడుతున్నారు

    - ఇవన్నీ చూసి కలత చెంది ఉద్యమం నుంచి ప్రక్కకు తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను..

    - ఉద్యమం ద్వారా నేనేమి సాధించలేదని, రోజూ పేరు చెప్పకుండా పదిమందితో తిట్టిస్తున్నారు.

    - డ్రైవరు సీటులో వారే కూర్చుని జాతికి నేను తీసుకురాలేని రిజర్వేషన్లు వచ్చేలా చేయమని, మడుగులో కూర్చుని ఇతరులచేత నన్ను తిట్టించే వారిని కోరుతున్నాను


  • 13 July 2020 4:46 AM GMT

    విజయనగరం జిల్లా వాసులను కలవరానికి గురిచేస్తున్న కరోనా..

    విజయనగరం: జిల్లా వాసులను కలవరానికి గురిచేస్తున్న కరోనా..

    - రోజు రోజుకు వందల సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడంతో ఆందోళన చెందుతున్న అధికారులు.

    - మళ్ళీ లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్న అధికారులు.

    - జిల్లాలో వ్యాపార సంఘాలు, ముఖ్య నేతలతో నేడు జిల్లా కలక్టర్, ఎస్పీలు అత్యవసర సమావేశం.

    - సంపూర్ణ లాక్ డౌన్ అమలుకు మక్కవ చూపుతున్న పలు వర్తక సంఘాలు.

    - ఇప్పటికే కరోనాతో జిల్లాలో 8 మంది మృతి.

Print Article
Next Story
More Stories