Live Updates:ఈరోజు (జూలై-13) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు సోమవారం, 13 జూలై, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. ఉత్తరాయణం.. ఆషాఢ మాసం, కృష్ణపక్షం అష్టమి(సా. 4-36 వరకు) తర్వాత నవమి, రేవతి నక్షత్రం (ఉ.10-45 వరకు) తర్వాత అశ్విని నక్షత్రం.. అమృత ఘడియలు (తె. 5-21 నుంచి 9-51 వరకు), వర్జ్యం లేదు. దుర్ముహూర్తం (మ. 12-31 నుంచి 1-23 వరకు) రాహుకాలం (ఉ. 7-30 నుంచి 9-00 వరకు) సూర్యోదయం ఉ.5-36 సూర్యాస్తమయం సా.6-35
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 13 July 2020 2:21 PM GMT
జగన్ వల్ల వర్షాలు కురుస్తున్నాయని మంత్రి కన్నబాబు చెప్పడం హాస్యాస్యపదంగా ఉంది: నిమ్మకాయల చినరాజప్ప, మాజీ మంత్రి
అమరావతి:రాష్ట్రంలో కరోనా కేసులు కూడా జగన్ వల్లే పెరుగుతున్నాయని అంగీకరిస్తారా?
- ఇలాంటి చేతగాని మాటలు మాట్లాడి మంత్రి స్థానానికే విలువను దిగజార్చుతున్నారు.
- రైతులకు జగన్ చేస్తున్న ద్రోహం మంత్రి కన్నబాబు కి కనపడటం లేదా?
- ఏడాది పాలనలో అన్ని వర్గాలను నిలువునా మోసం చేశారు
- జగన్ మాటల్లో రైతు సంక్షేమం కాదు రైతు ద్రోహం ఉన్నది
- జగన్ ఏడాది పాలనలో 600 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
- ఆఖరికి జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో వేణుగోపాల్ రెడ్డి అనే రైతు ఆత్మహత్య చేసుకోవడం రైతులకు జగన్ చేస్తున్న ద్రోహానికి అద్దం పడుతోంది.
- వైఎస్ హయాంలో కోనసీమలో క్రాప్ హాలీడేలు ప్రకటించిన సంగతి గోదావరి వాసి కన్నబాబు కు తెలిసి అబద్దం చెబుతున్నారు.
- 13 July 2020 1:57 PM GMT
ఏపీలో ఎంసెట్ సహా అన్ని కామన్ ఎంట్రెన్స్ పరీక్షలు వాయిదా!
ఏపీలో ఎంసెట్ సహా అన్ని కామన్ ఎంట్రెన్స్ పరీక్షలు వాయిదా పడ్డాయి. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఎంసెట్ ఈసెట్, ఐసెట్ సహా ఎనమిది సెట్ల పరీక్షలను వాయిదా వేస్తున్నట్లుగా విద్యాశాఖమంత్రి అదిమూలపు సురేష్ ప్రకటించారు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత కొత్త పరీక్షల తేదీలను ప్రకటిస్తామని అయన వెల్లడించారు. అంచనా ప్రకారం సెప్టెంబర్ మూడవ వారంలో ఎంసెట్ పరీక్ష జరిగే అవకాశం ఉందని అన్నారు.
- 13 July 2020 1:50 PM GMT
ఈ నెల 16వ తేది నుంచి ప్రజల పక్షాన TDP పొరాటం
- విజయవాడ మొగల్రాజపురం లో మాజీ శాసన సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ఇంటివద్ద విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం లో బొండా ఉమా మాట్లాడుతూ YSRCP ప్రభుత్వ పని తీరుపై మండిపడ్డారు. లాక్ డౌన్ కారణంగా రాష్ట్రంలో రోజు వారి పనిచెసుకునే కార్మికులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారొ ముఖ్యమంత్రికి కనబడడం లేదా అని ప్రశ్నించారు. లాక్ డౌన్ కారణంగా పనులు లేక అసంగ్హటిత రంగ కార్మికులు అనేక ఇబ్బందులు పడుతూంటే కరెంటు చార్జీలు పెంచి వారిపై మరింత భారం వెసారని అన్నారు. అలాగే ప్రైవేట్ స్కూల్ లో పనిచేస్తున్న టీచర్లు 3నెలలుగా జీతాలు లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ టిఫిన్ బండ్లు పెట్టుకుని బ్రతికే దుస్టిథి ఒచ్చింది అని వెంటనే వారిని ఆధుకుని కనీసం సగం జీతం అయినా వారికి ఇచ్చెట్లుగా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యానికి ఆదేశాలు జారి చెయ్యలని అన్నారు. అలాగే కరొనా లాక్ డౌన్ కారణంగా రాష్ట్రంలో ప్రజలకు తక్షణమే 5000 రూపాయలు సాయం అలాగే నిత్యావసర సరుకులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో అర్బన్ అధికార ప్రతినిధి నవనీతం సాంబశివరావు, మాజీ క్కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి పాల్గున్నారు.
- 13 July 2020 1:36 PM GMT
నిర్మలా సీతారామన్‌తో టీటీడీ ఛైర్మన్ భేటీ
కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌తో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సోమవారం భేటీ అయ్యారు. ఢిల్లీలోని ఆర్ధిక శాఖా కార్యాలయంలోకి వెళ్లిన సుబ్బారెడ్డి నిర్మలా సీతారామన్ తో టీటీడీకి సంబంధించిన విషయాలపై చర్చించినట్టు తెలుస్తోంది. విన్నపాలు ఇచ్చినట్టు టీటీడీ వద్ద ఉన్న పాత నోట్లు, భక్తుల కానుకలను డబ్బుల రూపంలో మార్చేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రమంత్రిని కోరారు సుబ్బారెడ్డి.
- 13 July 2020 11:59 AM GMT
ఇళ్ళు కూలి ఇరుక్కుపోయిన వృద్ధురాలు
- కృష్ణాజిల్లా కైకలూరు మండలంలో ఇళ్ళు కూలి వృద్దురాలికి తీవ్ర గాయాలు.
- ఈ గోపవరం గ్రామం లో రాత్రి కురిసిన వర్షానికి పెంకుటిల్లు కూలి గోడల మధ్య ఇరుక్కుపోయిన సీతా మహాలక్ష్మి ( 80).
- హుటాహుటిన స్పందించిన స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.
- వృద్దురాలిని బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలింపు.
- 13 July 2020 11:24 AM GMT
సెక్రెటేరియట్ కూల్చివేతపై హైకోర్ట్ స్టే
తెలంగాణ సచివాలయ కుల్చివేతపై స్టే పొడిగింపు. ఈ నెల 15 వరకు పనులు ఆపాలని హైకోర్ట్ ఆదేశం. కాబినెట్ నిర్ణయాన్ని సీల్డ్ కవర్ లో సమర్పించాలన్న హైకోర్ట్. తదుపరి విచారణ ఈ నెల 15కి వాయిదా.
- 13 July 2020 9:46 AM GMT
జూలై 15 లోపు సిబిఎస్‌ఈ 10, 12వ తరగతి ఫలితాలు
- సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్‌ఇ) ఈ ఏడాది 10, 12 వ పరీక్షలకు మెరిట్ జాబితాను జారీ చేసే అవకాశం కనిపించడం లేదు.
- అలాగే CISCE కూడా ఈ సంవత్సరం మెరిట్ జాబితాను విడుదల చేయలేదు.
- ఈ తరుణంలో సిబిఎస్‌ఇ 10, 12వ తరగతి ఫలితాలను జూలై 15 లోపు ఎప్పుడైనా ప్రకటించాలని అధికారులు భావిస్తున్నారు.
- 13 July 2020 9:29 AM GMT
వైసీపీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు
ఎన్నికల సంఘం, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ(వైసీపీ)కి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
తమ పార్టీ పేరును పోలివున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలంటూ అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్ పై ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది ఢిల్లీ హైకోర్టు.
- 13 July 2020 8:45 AM GMT
కడప జిల్లాలో మద్యం షాపు లో చోరీ ....
కడప జిల్లా : బద్వేలు పట్టణంలోని ఓ ప్రభుత్వ మద్యం షాపులో చోరీ ....
- తొమ్మిది లక్షల రూపాయలు అపహరణకు గురైనట్లు చెబుతున్న దుకాణ సిబ్బంది..
- శుక్ర,శని,ఆదివారాలకు సంబంధించిన నగదును షాపు లాకర్లో ఉంచామని చెబుతున్న సిబ్బంది...
- ఇంటి దొంగల పనేనని అనుమానం ...
- కేసు నమోదు చేసుకుని విచారిస్తున్న బద్వేల్ అర్బన్ పోలీసులు...
- 13 July 2020 5:47 AM GMT
- టీపీసీసీ కార్యదర్శి నరేందర్ యాదవ్ మృతి పట్ల ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంతాపం..
- టీపీసీసీ కార్యదర్శి నరేందర్ యాదవ్ మృతి పట్ల ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంతాపం..
- మంచి క్రమశిక్షణ గల నాయకున్ని కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది.
- కరోనో వైరస్ నివారణ విషయంలో ప్రభుత్వం విఫలం అయ్యింది.
- కార్పొరేట్ ఆసుపత్రులలో సరైన వైద్యం లేదు, ప్రభుత్వ నియంత్రణ లేదు..
- ప్రభుత్వం ప్రజలకు భరోసా కల్పించడంలో విఫలం అవుతుంది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire