Live Updates:ఈరోజు (ఆగస్టు-04)ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు మంగళవారం, 04 ఆగస్టు, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం పాడ్యమి (రాత్రి 8-52 వరకు) తదుపరి విదియ, శ్రవణ నక్షత్రం (ఉ. 8-15 వరకు) తర్వాత ధనిష్ఠ నక్షత్రం.. అమృత ఘడియలు ( రాత్రి 10-29 నుంచి 12-09 వరకు), వర్జ్యం (మ. 12-26 నుంచి 2-06 వరకు) దుర్ముహూర్తం (ఉ. 8-15 నుంచి 9-06 వరకు తిరిగి రాత్రి 10-58 నుంచి 11-43 వరకు) రాహుకాలం (మ. 3-00 నుంచి 4-30 వరకు) సూర్యోదయం ఉ.5-42 సూర్యాస్తమయం సా.6-29
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 4 Aug 2020 10:50 AM GMT
ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం
అమరావతి :
- 3 రాజధానుల అంశంపై హైకోర్టు లో విచారణ..
- రాజధాని తరలింపుపై స్టే ఇచ్చిన హైకోర్టు
- గవర్నర్ గెజిట్ పై స్టే ఇచ్చిన ఏపీ హైకోర్ట్
- రిప్లై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశం .
- విచారణ 14కు వాయిదా వేసిన హైకోర్టు..
- 4 Aug 2020 10:45 AM GMT
పద్మావతి నిలయం క్వారన్ టైన్ నుండి ౨౦౦ విడ్ బాధితులు డిశ్చార్జ్
తిరుపతి:
తిరుపతి ( తిరుచానూరు) పద్మావతి నిలయం క్వారన్ టైన్ నుండి సుమారు 200 మంది కోవిడ్ బాధితులు డిశ్చార్జ్
- 4 Aug 2020 10:44 AM GMT
వజ్రకరూరు మండలం పవన్ ఫార్మర్స్ వేర్ గోదాం ముందు రైతులు ఆందోళన..
అనంతపురం:
- వజ్రకరూరు మండలం పవన్ ఫార్మర్స్ వేర్ గోదాం ముందు జాతీయ రహదారిపై రైతులు ఆందోళన.
- భారీగా నిలిచిపోయిన వాహనాలు.
- గోదాం లో ధాన్యం నిల్వ ఉంచిన రైతులు.
- గోడౌన్ యాజమాని ఎంసీఎంఎల్ కంపెనీకి రుణం చెల్లించలేదని కు తాళం వేసిన కంపెనీ ప్రతినిధులు.
- గోడౌన్ లో నిల్వ ఉంచిన సరుకును ఇవ్వాలని రైతుల ఆందోళన.
- 4 Aug 2020 10:43 AM GMT
అరకు లోయలో 14 రోజుల సంపూర్ణ లాక్ డౌన్
విశాఖ:
- అరకు లోయలో 7 వ తేది నుండి 20 వ తేది వరకు లాక్ డౌన్..
- గిరిజన వ్యాపార సంఘ జేఏసి సభ్యులతో చర్చలు జరిపిన స్థానిక ఏమ్మేల్యే ఫాల్గుణ, అధికారులు..
- అరకు లోయలో 14 రోజుల సంపూర్ణ లాక్ డౌన్ కు తీర్మానం..
- కరోనా నియంత్రణ కు ఏజేన్సీ ప్రాంతాలలో స్వచ్ఛందంగా లాక్ డౌన్ అమలు కు గిరిజనులు సన్నాహాలు...
- 4 Aug 2020 10:42 AM GMT
ప్రధాన కార్యదర్శి విశ్వహిందు పరిషత్: బండారి రమేష్
- గత 500 సంవత్సరాలుగా రామజన్మభూమి కోసం పోరాటం చేస్తున్నాము
- లక్షలాది మంది విహెచ్ పీ భజరంగ్ ధల్ కార్యకర్తలు త్యాగలు చేశారు
- బాబర్ సేనాని మీర్ బాక్రీ రామ మందిరం కూల్చి మసీదు కట్టాడు.
- దశాబ్దాల న్యాయ పోరాటం తర్వాత సుఫ్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
- రేపు విశ్వహిందు పరిషత్తు ఆధ్వర్యంలో ఆయోధ్యలో భూమి పూజ కార్యక్రమం ఉంది
- రేపు ప్రజలంతా ఎవరి కుటుంబంలో వారు రామ నామ జపం పూజలు చేయాలి.
- రేపు ఉదయం ఆయోధ్య నుంచి ప్రత్యక్ష ప్రసారం వస్తుంది ప్రజలంతా చూడాలి.
- ప్రజలంతా ఆయోధ్య వైపు తిరిగి అటంకాలు లేకుండా గుడి నిర్మాణం జరగాలని పూలు చల్లాలి.
- సాయంకాలం దివ్వెలు వెలిగించాలి. పాటాసులు ఖల్చాలి. మిఠాయిలు పంచుకోవాలి.
- రేపు విహెచ్ పీ కార్యాలయంలో రామ యజ్ఞం జరుగుతుంది. శ్రీరామ పట్టాభిషేక నిర్వహిస్తున్నాము.
సుభాష్ భజరంగ్ దల్ కన్వీనర్:
- భజరంగ్ దల్ ఏర్పాటు రామజన్మభూమి కోసమే ఏర్పడింది.
- బాబ్రీ మసీదు పై బజరంగ్దళ్ కార్యకర్తలు కొటారి సోదరులు కాషాయ ధ్వంసం ఎగరవేశారు.
- నాడు మందిరం కోసం పోరాటం చేసిన వారిని ములాయం సింగ్ కాల్చి చంపించారు..
- ఈరోజు ములయాం బెడ్ మీద ఉన్నాడు... మోడీ శంకుస్థాపన చేస్తున్నారు.
- రామమందిర భూమి పూజ పండుగ లా చేసుకోవాలి.
- ప్రతి ఇంటి పై కాషాయ జెండా ఎగరవేయాలి.
- 4 Aug 2020 10:34 AM GMT
బిల్డింగ్ అనుమతులు ఇవ్వడాని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్
అమరావతి:
- గ్రామ,వార్డు సచివాలయాల్లో వార్డు ప్లానింగ్ రెగ్యులేషన్ సెక్రటరీలు అనాధరైజ్డ్ గా బిల్డింగ్ అనుమతులు ఇవ్వడాని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేసిన లైసెన్డ్ టెక్నికల్ పర్సన్స్
- 119 జీఓ కి విరుద్దంగా తమ సంతకాలు..లైసెన్స్ నంబర్లు లేకుండా అప్లికేషన్ ప్రాసెస్ చేస్తున్నట్లు ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చిన లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్స్
- అనుభవం లేని గ్రామ,వార్డు రెగ్యులేషన్ సెక్రటరీలు ఇచ్చే అనుమతుల కారణంగా భవిష్యత్ లో ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారన్న పిటిషనర్స్
- జీవో 119ప్రకారం నడుచుకోవాలని ప్రభుత్వానికి తెలిపిన ధర్మాసనం
- దీనితో రాష్ట్రవ్యాప్తంగా గ్రామ..వార్డు సచివాలయాల్లో నిలిచిపొనున్న ప్లానింగ్ అనుమతులు
- పిటిషనర్స్ తరుపున వాదనలు వినిపించిన న్యాయవాది తిరుమాని విష్ణుతేజ
- 4 వారాలు సమయం కోరిన ప్రభుత్వం
- వాయిదా వేసిన హైకోర్టు
- 4 Aug 2020 9:45 AM GMT
తిరుపతి
తిరుపతి పట్టణంలో రేపటితో ముగియనున్న లాక్ డౌన్
లాక్ డౌన్ వల్ల మెరుగైన ఫలితాలొచ్చాయి.
30శాతం కేసులు తగ్గాయి.
మరో పదిరోజుల పాటు లాక్ డౌన్ అమలులో ఉంటుంది.
అయితే పనివేళలు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పెంచుతున్నాం.
చిత్తూరు జిల్లాలో కరోనా వైద్యం చేయడం కోసం ప్రైవేటు ఆసుపత్రులు ముందుకొస్తున్నాయి.
మదనపల్లెలోనూ ప్రైవేటు వారిని సిద్దం చేస్తున్నాము
రానున్న రోజుల్లో కేసుల సంఖ్య పెరగే అవకాశం ఉంది, దానికి తగ్గట్టుగా బెట్లు సిద్దం చేస్తున్నాం.
టెస్టు ఫలితాల జాప్యం ఇక ఉండదు, అన్ని ఫలితాలు వచ్చేసాయి. ఒకటిన్నర రోజులోనే ఫలితాలు ఇస్తాము.
లక్షణాలు లేకుండా పాజిటివ్ వచ్చిన వారు హోం ఐసోలేషన్ లో ఉండడానికి సిద్దంగా ఉండి సహకరించండి
హెచ్ ఎం టి వితో చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ గుప్త
- 4 Aug 2020 9:44 AM GMT
విశాఖ
మంత్రి అవంతి శ్రీనివాసరావు కామెంట్స్
పేదవారి గుండెచప్పుడు వంగపండు గారు.
వంగపండు తన పాట ద్వారా జీవితాంత ఎంతో మంది చైతన్యవంతులు చేశారు.
జానపద చరిత్ర,పాట ఉన్నంత కాలం వంగపండుగారిని ప్రజలు మరిచిపారు.
వంగపండు పేరు చిరస్థాయిలో గుర్తు ఉండేలా ప్రభుత్వం తరుపున కృషి చేస్తాం.
వంగపండు కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటాం.
పదవులు,పేరు ప్రఖ్యాతలు కోసం వంగపండు ఎప్పుడు ఆశించలేదు.
నా వ్యక్తిగతంగా వంగపండు కుటుంబానికి సహాయ సహాకారాలు అందిస్తాను.
- 4 Aug 2020 8:27 AM GMT
అమరావతి
నాడు–నేడు (మనబడి)పై సీఎం వైయస్ జగన్ సమీక్ష
విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌తో పాటు, ఆర్థిక, విద్యా శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు హాజరు
స్కూళ్లు తెరిచే నాటికి సర్వం సిద్ధంగా ఉండాలి
నాడు–నేడులో చేపట్టిన పనులన్నీ పూర్తి కావాలి
ప్రతి స్కూల్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి
అందమైన వాల్ పెయింటింగ్స్, బొమ్మలు వేయాలి
విద్యార్థులను ఆకట్టుకునేలా ప్రతి స్కూల్ ఉండాలి
సెప్టెంబరు 5న స్కూళ్లు ప్రారంభించాలి
దానిపై అధికారులు మరింత ఫోకస్డ్‌గా పని చేయాలి
సమీక్షలో సీఎం వైయస్ జగన్ ఆదేశం
జగనన్న విద్యాకానుక కిట్ పరిశీలించిన సీఎం
అధికారులని అభినందించి ప్రశంసించిన సీఎం
నాడు–నేడు (మనబడి) మిగిలిన దశ పనులపైనా సమీక్ష
సకాలంలో ఆయా పనులు చేపట్టాలన్న సీఎం
నిధులకు కొరత లేకుండా చూస్తామని వెల్లడి
- 4 Aug 2020 8:27 AM GMT
విజయవాడ
బోండా ఉమా మాజీ MLA
తెలుగుదేశం పార్టీ సవాల్ పై జగన్ స్పందించాలి
వైసిపి మూడు రాజధానులు ఆంటీ అసెంబ్లీ నీ రద్దు చేసిప్రజాభిప్రాయాన్ని కోరాలి
ఎన్నికల ముందు అమరావతి నీ రాజధాని గా వుంటుంది అని అన్నారా లేదా ?
ఒక్క రాజధాని నీ కట్టలేని వాళ్ళు మూడు రాజధానులు ఎలా కడతారు
విశాఖ రాజదాని రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే
అమరావతి అందరి ఆమోదం తో పెట్టింది దీన్ని మార్చటం 5 కోట్ల ప్రజలను మోసం చ్యేయటమే
అధికారంలో వున్న మని ఎలా ఆంటీ అల చేయటానికి కోర్టులు ఒప్పుకోవు
CRDA తో రైతులచేసుకున్నఒప్పందం
న్యాయపరంగా బలమైనది దాన్ని ఎవరూ రద్దు చేయలేరు
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire