Live Updates:ఈరోజు (ఆగస్టు-04)ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 04 ఆగస్టు, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జాతీయ, అంతర్జాతీయ వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు మంగళవారం, 04 ఆగస్టు, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం పాడ్యమి (రాత్రి 8-52 వరకు) తదుపరి విదియ, శ్రవణ నక్షత్రం (ఉ. 8-15 వరకు) తర్వాత ధనిష్ఠ నక్షత్రం.. అమృత ఘడియలు ( రాత్రి 10-29 నుంచి 12-09 వరకు), వర్జ్యం (మ. 12-26 నుంచి 2-06 వరకు) దుర్ముహూర్తం (ఉ. 8-15 నుంచి 9-06 వరకు తిరిగి రాత్రి 10-58 నుంచి 11-43 వరకు) రాహుకాలం (మ. 3-00 నుంచి 4-30 వరకు) సూర్యోదయం ఉ.5-42 సూర్యాస్తమయం సా.6-29
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 4 Aug 2020 4:57 PM GMT
ఏపీ పంచాయితీరాజ్ చట్టంపై మరోమారు ఆర్డినెన్సు జారీ
అమరావతి: పంచాయితీరాజ్ చట్టంలో సవరణలు తీసుకువస్తు ఇచ్చిన ఆర్డినెన్సు కాలపరిమితి ముగిసిపోవటంతో మరోమారు ఆర్డినెన్సు జారీ చేసిన ప్రభుత్వం
- ఆరు నెలల్లో చట్ట రూపం దాల్చకపోవటంతో మళ్లీ ఆర్డినెన్సు జారీ
- స్థానిక సంస్థల ఎన్నికల్లో సంస్కరణల పై గతంలో తీసుకువచ్చిన అర్డినెన్సుకు ముగిసిన కాలపరిమమితి
- ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు , సర్పంచ్ లు ఎన్నికల ప్రక్రియ వ్యవధిని 13 నుంచి 15 రోజులను కుదిస్తూ గతంలో ఆర్డినెన్సు జారీ
- స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ చేసిన అభ్యర్ధులపై అనర్హతా వేటు వేసేలా ఆర్డినెన్సు
- 4 Aug 2020 4:28 PM GMT
అతి చిన్న పుంగనూరు ఆవు దూడ
తూర్పు గోదావరి: మలికిపురం మం. పడమటి పాలెం లో జన్మించిన అతి చిన్న పుంగనూరు ఆవు దూడ-
పడమటి పాలెం కి చెందిన గుండా బత్తుల మధు అనే జంతు ప్రేమికుడు పెంచుతున్న దేశీయ ఆవుకు అరుదైన పుంగనూరు దూడకి జన్మనిచ్చింది.
కేవలం 15 అంగుళాల ఎత్తు మాత్రమే వుంది.
సాధారణంగా పొట్టిగా వుండటం ఈ పుంగనూరు ఆవుల లక్షణం
అయితే దూడ మరీ పొట్టిగా వుండటంతో ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది
- 4 Aug 2020 12:20 PM GMT
నెల్లూరు:
- నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్న కరోనా విలయం.
- తాజాగా ఈ వాళ మరో 557 పాజిటివ్ కేసులు నమోదు.
- జిల్లాలో మొత్తం 9899 కి చేరిన బాధితుల సంఖ్య.
- 4 Aug 2020 12:18 PM GMT
కర్నూలు జిల్లా:
- వెలుగోడు అత్యాచారం కేసులో ఇద్దరు ముద్దాయిల అరెస్ట్..
- ఇద్దరు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలిసులు..
- వైద్య పరిక్షల అనంతరం రిమాండ్ కు తరలింపు..
- పరారిలో ఉన్న ఇంకొక నిందితుని కోసం గాలిస్తున్నాం..త్వరలోనే అరెస్టు చేస్తాం ఆత్మకూరు DSP వెంకటరావు..
- 4 Aug 2020 12:17 PM GMT
పారిశ్రామిక ప్రమాదాలపై క్యాంపుకార్యాలయంలో సమీక్షా సమావేశంలో సీఎం
అమరావతి:
- పారిశ్రామిక ప్రమాదాలపై క్యాంపుకార్యాలయంలో సమీక్షా సమావేశంలో సీఎం
- పారిశ్రామిక ప్రమాదాల నివారణకు ఇండస్ట్రియల్ సేఫ్టీ పాలసీ
- సేఫ్టీ పాలసీని ప్రతిపాదించిన అధికారులు
- పరిశ్రమల భద్రత కోసం ప్రస్తుతమున్న రెగ్యులేటరీ వ్యవస్థలన్నీ సేఫ్టీ పాలసీ కిందకు
- ఏడాదికి రెండు సార్లు కాంప్లియన్స్ నివేదికలు
- నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
- ఫ్యాక్టరీలపై బలమైన పర్యవేక్షణ యంత్రాంగం
- థర్డ్‌పార్టీ తనిఖీలు
- 4 Aug 2020 12:16 PM GMT
ప్లాస్మా పై ప్రజల్లో చైతన్యం పెరగాలి.
నెల్లూరు:
- వెంకటగిరి లో జిల్లా కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు ఆకస్మిక పర్యటన.
- కోవిడ్ ప్రభావం పై అధికారులు, వాలంటీర్ లతో సమావేశం.
- కారోనా కట్టడికోసం అందరూ జాగ్రత్తలు పాటించాలి.
- ప్లాస్మా పై ప్రజల్లో చైతన్యం పెరగాలి.
- ప్లాస్మా చేసినవారికి ప్రభుత్వం రూ.5వేలు ప్రోత్సాహకాలు
- ప్లాస్మా దానంతో సత్వరం కరోనా బాధితులు కోలుకుంటారు..జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు.
- 4 Aug 2020 12:15 PM GMT
ప్రవైట్ హాస్పిటల్స్ పై కొనసాగుతున్న చర్యలు
- ఇప్పటికే డెక్కన్ హాస్పిటల్ కు కరోన ట్రీట్మెంట్ అనుమతి రద్దు
- ఇవాళ మరో రెండు ఆస్పత్రులపై చర్యలు.తీసుకోనున్న వైద్య ఆరోగ్య శాఖ
- వైద్య ఆరోగ్య శాఖ వాట్స్ up నెంబర్ కు ఫిర్యాదుల వెల్లువ
- ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీలు
- తప్పు చేసినట్లు రుజువు అయితే చర్యలు తీసుకుంటామని స్పష్టం
- 4 Aug 2020 12:13 PM GMT
పొన్నాల లక్ష్మయ్య మాజీ మంత్రి
- ఏపీ సీఎం కృష్ణ నీళ్లను రాయలసీమకు తరలిస్తామని అంటే.. తెలంగాణ సీఎం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
- మేము గట్టిగా మాట్లాడితే అపెక్స్ కౌన్సిల్కు ఫిర్యాదు చేస్తామన్నారు.
- తీర అపెక్స్ కౌన్సిల్ సమావేశం పెడితే వాయిదా వేయమన్నాడు.
- కెసిఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాడు.
- క్షమించరాని చారిత్రక తప్పిదాలు చేస్తున్నాడు కేసీఆర్.
- జగన్ కెసిఆర్ కలిసే పనిచేస్తున్నారనే అనుమానాలున్నాయి.
- ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా నదిపై మేము ప్రతిపాదించిన ప్రాజెక్టుల ను కేసీఆర్ సీఎం అయ్యాక పక్కన పెట్టారు.
- దుమ్ముగూడెం, కంతాల పల్లి ప్రాజెక్టు లను పక్కన పెట్టాడు.
- రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటానికి ఆనాడు మేము
- అఖిల పక్ష నేతలను తీసుకెళ్లి బాబ్లీపై కేంద్రానికి ఫిర్యాదు చేశాము.
- కానీ కెసిఆర్ ఎవరితోనూ సంప్రదించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడు.
- 10 లక్షల ఎకరాలకు నీరు అందించే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు వెంటనే పూర్తి చేయాలి.
- పక్క రాష్ట్ర ఆగడాలను అరికట్టాలి.
- కెసిఆర్ కు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా తన వ్యక్తిగత ప్రయోజనాలు ముఖ్యమా..
- 4 Aug 2020 12:12 PM GMT
జిల్లాలో ప్రారంభమైన విద్యావారధి వాహనం..
శ్రీకాకుళం జిల్లా:
- ఎటువంటి సాంకేతిక సదుపాయం లేని విద్యార్థులకు ఎల్.ఈ.డి పై పాఠాల బోధన..
- గిరిజన, షెడ్యూల్డ్, మత్స్యకార, తీర ప్రాంతాల్లో విద్యార్థులకు ప్రాధాన్యం..
- ఈ వాహనం ద్వారా విద్యార్థులకు బోధన అందుబాటులోకి తెచ్చిన అధికారులు..
- వయస్సు బట్టి పాఠాలు, వీడియోలు, కథలు, ప్రసాలు బోధించనున్న ఉపాద్యాయులు..
- 4 Aug 2020 12:11 PM GMT
మూడు రాజధానులపై శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం కామెంట్స్
తూర్పుగోదావరి జిల్లా:
కొత్తపేట: మూడు రాజధానులపై శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం కామెంట్స్
◆ మూడు రాజధానులు కావాలంటే ప్రజాతీర్పు కావాలి◆
◆ మూడు రాజధానుల విషయంలో చంద్రబాబు విసిరిన సవాల్ స్వీకరించాలి◆
◆ ఆనాడు జగన్మోహనరెడ్డి ప్రతిపక్షంలో అమరావతిని సమ్మతించి నేడు అధికారంలోకి వచ్చిన తరువాత మాట తప్పి మడమ తిప్పుతారా◆
◆ దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేత శంకుస్థాపన చేసి ఇప్పటికే వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి అనేక భవంతులు నిర్మిస్తే మార్పు దేనికోసం ఎవరికోసం◆
◆ వైసీపీ నేతలు మినహా అన్నిరాజకీయ పక్షాలు మూడు రాజధానులు నిర్ణయానికి వ్యతిరేకం◆
◆ మూడు రాజధానులు కావాలంటే అసెంబ్లీ రద్దు చేసి ప్రజా తీర్పు కోరాలి లేదంటే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి◆
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire