ఈరోజు పంచాంగం
ఈరోజు శనివారం, 29 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం ఏకాదశి (ఉ. 9-45 వరకు) తదుపరి ద్వాదశి, పూర్వాషాఢ నక్షత్రం (మ. 3-21 వరకు) తదుపరి ఉత్తరాషాఢ, అమృత ఘడియలు (ఉ. 10-38 నుంచి 12-12 వరకు) వర్జ్యం (రాత్రి 11-24 నుంచి 1-01 వరకు) దుర్ముహూర్తం లేదు రాహుకాలం (ఉ. 9-00 నుంచి 10-30 వరకు) సూర్యోదయం: ఉ.5-48 సూర్యాస్తమయం: సా.6-౧౫
టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున పుట్టినరోజు నేడు
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 29 Aug 2020 12:02 PM GMT
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వంట ఛార్జీలు పెంపు
విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వంట ఛార్జీలను ప్రభుత్వం పెంచింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వంట ధరలు పెంచారు
ప్రాథమిక పాఠశాలలో ఒక్కో విద్యార్థి వంటధరను రూ.4.48 నుంచి రూ. 4.97కు పెంచారు
ప్రాథమికోన్నత పాఠశాలల్లో వంట ధర రూ.6.71 నుంచి రూ.7.45కు పెంచారు
తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు కూడా ప్రాథమికోన్నత పాఠశాలల తరహాలోనే వంటధరను 6.71 నుంచి 7.45 రూపాయలకు పెంచారు. గుడ్డు ధర రోజుకు రెండు రూపాయలు అదనం
పెరిగిన ధరలు 2020 ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది
- 29 Aug 2020 12:02 PM GMT
దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్లో ఒక్కరోజులోనే పూర్తయిన 6.76 కి.మీ. రైలు మార్గాల పునరుద్ధరణ ...
దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ రికార్డు స్థాయిలో ఒక్కరోజులోనే 6.76 కి.మీ. రైలు పట్టాల పునరుద్ధరణ సాధించిన డివిజన్‌గా సికింద్రాబాద్ కి పేరొచ్చింది...
ఆగస్ట్ 24 మరియు 25 తేదీలలో మొత్తం 13.25 కి.మీ. ట్రాక్ రిన్యూవల్ , 24 న 6.50 కి.మీ. 25 న 6.75 కి.మీ ఒకే సమయంలో పూర్తి చేయడం జరిగింది...
తగ్గిన ట్రాఫిక్ ప్రవాహాన్ని చక్కగా వినియోగించుకొని ఈ డివిజన్ ఒక్కరోజులోనే 6.76 కి.మీ. రైలు పట్టాల పునరుద్ధరణ పూర్తి చేసి రికార్డు స్థాయి టిఆర్ఆర్ సాధించింది....
100 % భద్రతతో ఈ పని పూర్తిచేయడం జరిగింది 25 % పని రైల్వే కార్మికుల ద్వారానే చేపట్టడం జరిగింది...
ప్రతి సంవత్సరం సికింద్రాబాద్ డివిజన్ సుమారు 130 నుండి 150 కి.మీ. రైలు పట్టాల మరమ్మత్తు చేపడుతుంటుంది...
ఒకే సమయంలో డివిజన్లోని 5 విభిన్న స్థలాలలో పనిని చేపట్టి , ఈ రికార్డు సాధించడం జరిగింది మహబూబాబాద్ , తాండూర్ , బెల్లంపల్లి , బీబీనగర్, మధిర . సికింద్రాబాద్ డివిజన్ సాధించిన ఈ రికార్డుకు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రశంసలు లభించాయి...
- 29 Aug 2020 10:46 AM GMT
కరీంనగర్ : బండి సంజయ్ కుమార్,కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు,బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కామెంట్స్
🔸కరీంనగర్ ట్రాన్స్ కో సబ్ స్టేషన్ వద్ద అగ్ని ప్రమాదం ఘటన వివరాలను కరీంనగర్ ఎం.పి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ తెలుసుకున్నారు.
🔸ట్రాన్స్ కో కరీంనగర్ సూపరిండెంట్ ఇంజనీర్ తో ఢిల్లీ నుంచి నేడు ఉదయం ఫోన్ లో మాట్లాడి, ప్రమాదం జరిగిన తీరుపై వివరాలు తెలుసుకున్న బండి సంజయ్.
🔸ఇలాంటి ప్రమాదాలు మరోసారి జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి: బండి సంజయ్.
🔸ప్రత్యామ్నాయ ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని ట్రాన్స్ కో ఎస్.ఈ ని బండి సంజయ్ ఆదేశించారు.
- 29 Aug 2020 10:46 AM GMT
అదిలాబాద్ జిల్లా,:-
ఆదివాసులను సమిధలుగా వాడుకుంటూ తెలంగాణలో తిష్ట వేయాలని చూస్తున్న మావోయిస్టులు !
- తమ స్వార్ధం కోసం అమాయక ఆదివాసులను తప్పుదోవ పట్టిస్తున్న కొందరు ఆదివాసుల నాయకులు !
- భాస్కర్ డైరీలో లభ్యమైన పూర్తి సమాచారం – బూటకపు ఆదివాసుల నాయకుల గుట్టు బట్టబయలు!!
పోలీసులు మావోయిస్టులకుసహకరించే కొద్ది మంది ఆదివాసి ప్రజలపైన నిరంతరం నిఘా పెట్టి, కచ్చితమైనా సమాచారము సేకరిస్తున్నారు.
నిషిద్ద సంస్థకు చెందినా మావోయిస్టులు వారికి సహకరిస్తున్న సంఘ విద్రోహక శక్తులు పైన చట్ట ప్రకారము కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
బాస్కర్ డైరీని స్వాదీనం తిర్యాని మండలం గుండాల అడవులలో స్వాదీనం చేసుకున్న పోలీసులు
జూలై లో డైరీని స్వాదీనం చేసుకున్న పోలీసులు
బాస్కర్ మరియు ఇతర మావోయిస్టుల డైరీలు, సాహిత్యము, నోటుబుక్స్ మొదలగునవి పోలీసు వారు స్వాధీనం చేసుకున్నా పోలీసులు
ఆదివాసీ నాయకులుగా చలామణి అవుతూ, తెరవెనుక రహస్యంగా మావోయిస్టులకు పూర్తి సహకారం అందజేస్తూ, మావోయిస్టుల ఎజెండాను అమలు చేస్తున్నారు .
మావోయిస్టు నాయకుల పంచన చేరిన ఈ ఆదివాసీ నాయకులు , భాస్కర్ చెప్పినట్లు మావోయిస్టు ప్రజా సంఘాలు చేయడం , ఇట్టి సంఘాలలో భాస్కర్ సూచించిన వారినే సభ్యులుగా నియమించడం చేస్తున్నారు.
మావోయిస్టు భాస్కర్ డైరీలొ పేర్లు, మత్తాడిగూడ గ్రామానికి చెందిన సీడమ్ జంగదేవ్ , సులుగు పల్లికి చెందిన సోయం చిన్నయ్య, రొంపల్లికి చెందిన చంద్ర శేఖర్, చాల్ బడి గోవిందరావు, పార్వతిగూడ హనుమంతరావు, చోర్ పల్లి జగ్గారావు, తుడుందెబ్బకు చెందిన మహేశ్, డి.టి.ఎఫ్.కు చెందిన రమేశ్, ఆదివాసి విద్యార్థి సంఘానికి చెందిన వివేక్ మరియు దీపక్ లు ఇంకా కొంతమంది మావోయిస్టు నాయకులు భాస్కరుతో సంబంధాలు పెట్టుకొని,
అతడు ఇచ్చిన ఆదేశాల మేరకు మావోయిస్టు కార్యక్రమాలు రహస్యంగా అమలు చేస్తున్నారు.
అమాయక ఆదివాసి యువతీ, యువకులను మభ్యపెట్టి మావోయిస్టు పార్టీలో చేరాలని ఉసికొల్పుతున్నారు.
మావోలకు సహకరిస్తున్నా వారిపై చర్యలు తీసుకుంటాం విష్ణు . వారియర్
ఎస్పీ ఆదిలాబాద్ జిల్లా
- 29 Aug 2020 10:45 AM GMT
సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్
ముఖ్యమైన అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను అరెస్టు చేశాం..
ఉత్తరప్రదేశ్ కు చెందిన 10 మంది కాకర్ల గ్యాంగ్ ను అరెస్ట్ చేసాము..
బంగారం షాప్ లను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్నారు..
సఖి అహ్మద్ ఈ గ్యాంగ్ లీడర్..
హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న బంగారం షాపులో దొంగతనాలు చేసేందుకు 10 ముఠా గా ఏర్పడ్డరు..
పఠాన్ చెరువు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బంగారం షాప్ లో దొంగతనం చేయడానికి షాప్ వెనుక గోడను పగులగొట్టారు..
ఒక వ్యక్తి గమనించడంతో అతని పై కాల్పులు జరిపి అక్కడి నుండి పారిపోయారు..
గ్యాంగ్ సభ్యులు ఎదురు తిరిగిన వారిని చంపడానికి కూడా వెనుకాడరు..
హైదరాబాద్ లోని బంగారు షాప్ లల్లో భారీగా దొంగతనాలకు చేయడనికి ఓ DCM లో ఉత్తర్ ప్రదేశ్ నుండి వచ్చారు..
తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలల్లో కూడా నేరాలకు పాల్పడ్డ ముఠా సభ్యులు..
15 రోజులలో రెండు బంగారు షాప్ లలో దొంగతనానికి ప్రయత్నం చేశారు..
మూడో ప్రయత్నంలో మాకున్న క్లూస్,CCTV కెమెరాల ఆధారంగా ఈ ముఠాను పట్టుకున్నాము..
15 రోజుల క్రితం హైదరాబాద్ కు వచ్చి దొంగతనాలు చేయడానికి ప్రయత్నించారు..
బంగారం షాపు యజమానులు సెక్యూరిటీ సిస్టం, అలారం ఏర్పాటు చేసుకోవాలి, ప్రతి షాప్ దగ్గర సెక్యూరిటీ తో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి.
- 29 Aug 2020 9:42 AM GMT
జయశంకర్ భూపాలపల్లి జిల్లా
మల్హార్ మండలం మల్లారంలో ఇటీవల హత్యకు గురైన రెవెల్లి రాజబాబు కుటుంబ సభ్యులను పరామర్శించి, 4 లక్షల 12 వేల చెక్కును అందించిన తెలంగాణ రాష్ట్ర ఎస్సి,ఎస్టి కమిషన్ చైర్మన్ శ్రీ ఎర్రోళ్ల శ్రీనివాస్..
పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత,భూపాలపల్లి, పెద్దపల్లి జడ్పి చైర్మన్లు జక్కు శ్రీహర్షిని,పుట్ట మదుకర్ లు పాల్గొన్నారు..
- 29 Aug 2020 9:42 AM GMT
రాచకొండ పోలీసు కమిషనరేట్ లిమిట్ లోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో సుసైడ్ కలకలం...
నాగ మల్ల వెంకట నర్సయ్య అనే వ్యక్తి ఓ లాడ్జిలో ఆత్మహత్య...
నిన్న రాత్రి కరీంనగర్ నుంచి వచ్చి లాడ్జీలో దిగిన నర్సయ్య
ఆర్ధిక కారణాల వల్లనే వెంకట నర్సయ్య ఆత్యహత్యకు పాల్పడినట్లు పోలీసుల అనుమానం
మృతిదేహాన్ని పోస్టు మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలింపు
గతంలో మాజీ ఎఎస్సై మోహన్ రెడ్డి మోసం చేసిన భాదితుల్లో ఒక్కరు వెంకట నర్సయ్య
వెంకట నర్సయ్య తన కోటి రూపాయల విలువైన ఇల్లు ను మోహన్ రెడ్డి భార్య బొబ్బల లత పేర అక్రమంగా రిజిస్టర్ చేసుకున్నాడని అప్పట్లో ఫిర్యాదు చేసిన బాధితుడు..
దీనిపై గతంలో కేసు నమోదు చేసిన ఏసీబీ...
- 29 Aug 2020 9:41 AM GMT
ఎంపి కేకే కు ఫోన్ చేసి కేటీఆర్ పేరు వాడుకుని మోసం చేసిన యువకుడి కేస్ లో మరో ట్విస్ట్....
ఎంపి అరవింద్ ను సైతం ఇలాగే బురిడీ కొట్టించిన సైబర్ నేరగస్తుడు...
కేంద్ర పథకం అంటూ నమ్మించి 12 మంది దగ్గర
పిఏ తో డబ్బులు వసూలు చేయించిన ఎంపి అరవింద్..
తిరిగి అది మోసం అని తెలియడంతో డబ్బు తిరిగి ఇచ్చేసిన ఎం పి అరవింద్.
ఈ ఘటన పై పోలీస్ లకు ఫిర్యాదు చేయని ఎం పి అరవింద్..
ఇదే తరహాలో మోసపోయిన కేకే సైబర్ కేటుగాల పై పోలీస్ లకు ఫిర్యాదు...
కేకే కేసులో నిన్న పోలీసుల ముందు లొంగిపోయిన మహేష్, సంజీవ్ అనే యువకులు....
- 29 Aug 2020 9:41 AM GMT
శ్రీశైలం జెన్కో ప్రమాదం పై కొనసాగుతున్న సీఐడీ దర్యాప్తు...
గత మూడు రోజుల నుండి సంఘటన స్థలం దగ్గర ఉండి ఆధారాలు సేకరిస్తున్న సీఐడి..
ఒకటి, రెండు యూనిట్ల లో పునరుద్ధరణ పనులలో వేగం పెంచిన జెన్కో...
ప్రమాదం జరిగిన ప్యానెల్ బోర్డ్ ప్రాంతంలో నీళ్లను తొలగించిన అధికారులు..
ప్యానెల్ బోర్డ్ దగ్గర జరిగిన ప్రమాదం పై పూర్తి వివరాలు సేకరిస్తున్న సీఐడి.
త్వరలో ప్రభుత్వానికి నివేదికను సమర్పించనున్న సీఐడి....
- 29 Aug 2020 9:41 AM GMT
మహబూబ్ నగర్:
జూరాల తగ్గిన కృష్ణమ్మ జల ప్రవాహం...
జూరాల ప్రాజెక్టు అన్ని గేట్లు మూసివేత...
ఇన్‌ప్లో 41,000 క్యూసెకులు...
జల విద్యుత్పతి ద్వారా 32,323 క్యూసెకులు దిగువకు విడుదల.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire