ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 29 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శనివారం, 29 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం ఏకాదశి (ఉ. 9-45 వరకు) తదుపరి ద్వాదశి, పూర్వాషాఢ నక్షత్రం (మ. 3-21 వరకు) తదుపరి ఉత్తరాషాఢ, అమృత ఘడియలు (ఉ. 10-38 నుంచి 12-12 వరకు) వర్జ్యం (రాత్రి 11-24 నుంచి 1-01 వరకు) దుర్ముహూర్తం లేదు రాహుకాలం (ఉ. 9-00 నుంచి 10-30 వరకు) సూర్యోదయం: ఉ.5-48 సూర్యాస్తమయం: సా.6-౧౫
టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున పుట్టినరోజు నేడు
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 29 Aug 2020 3:34 PM GMT
TS ECET2020: ఈసెట్ ప్రవేశ పరీక్ష కు ఏర్పాట్లు
తెలంగాణలో ఈ నెల 31 న జరగబోయే ఈసెట్ ప్రవేశ పరీక్ష కు ఏర్పాట్లు పూర్తి
ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు రెండు విడతలుగా జరగనున్న పరిక్ష
కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేసిన జేఎన్టీయూ హైదరాబాద్
28015 మంది అభ్యర్థులు హాజరు కానున్న టి యస్ ఈసెట్
- 29 Aug 2020 2:26 PM GMT
Kondapochamma Project: కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్ట్ లో మరో అపశ్రుతి...
సిద్దిపేట జిల్లా:
కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్ట్ లో మరో అపశ్రుతి...
- ఒక్క సారిగా కూలిన రిజర్వాయర్ లో తూము వద్ద ఏర్పాటు చేసిన వంతెన
- కొండ పోచమ్మ సాగర్ నుండి సంగారెడ్డి కెనాల్ కు నీటిని విడుదల చేసే తూము వద్దకు వేసిన వంతెన కుప్పకూలింది..
-కొండపోచమ్మ రిజర్వాయర్ వద్దకు చేరుకుని , వంతెన కుప్ప కూలిన ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులు..
- సంఘటన స్థలానికి ప్రజాలేవరూ ఎవరూ రాకుండా అడ్డుకున్న పోలీసులు
- 29 Aug 2020 2:25 PM GMT
Jayshankar Bhupallapally District Updates: ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా :
- మహముత్తరాం మండల కేంద్రంలో ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- పట్టుబడ్డవారంతా గత కొంతకాలం క్రిందట ఛత్తీస్ గడ్ ఇతర ప్రాంతాలనుండి గుట్టుకోయగూడెంకు వలస వచ్చినవారే
- వారి వద్ద నుండి రెండు డిటోనేటర్లు,రెండు జిలేటన్ స్టిక్స్,రెండు టిఫిన్ బాక్స్ లు,పది మావోయిస్టు కరపత్రాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు
- సీపీఐ మావోయిస్టు పార్టీ ఏటూరునాగారం, మహాదేవపూర్ ఏరియా దళానికి నాయకత్వం వహిస్తున్న కంకణాల రాజిరెడ్డి&వెంకటేష్&ధర్మన్నకి పేలుడు పదార్థాలు, కరపత్రాలు అందించడానికి వెళ్తుండగా పట్టుబడినారు
- కాటారం డిఎస్పీ బోనాల కిషన్ మాట్లాడుతూ ప్రజలెవరు మావోయిస్టులకు సహకరించకూడదని, ప్రశాంతంగా ఉన్న గ్రామాలలో అలజడులు సృష్టించకూడదని, మావోయిస్టులకు
- సహకరించే వారి గురించి ఎటువంటి సమాచారం తెలిసిన తమకు తెలియజేయాలని అన్నారు.
- 29 Aug 2020 2:24 PM GMT
Kaleshwaram Updates: కాళేశ్వరం అంతరాష్ట్ర వంతెన వద్ద పోలీసుల తనిఖీ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా:
మహాదేవపూర్ మండలం కాళేశ్వరం అంతరాష్ట్ర వంతెన వద్ద పోలీసుల తనిఖీల్లో భాగంగా
అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తున్న 30 క్వింటాళ్ల పిడియస్ రైస్ పట్టుకున్న కాళేశ్వరం పోలీసులు
రెండు వాహనాలు సీజ్.
ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.
- 29 Aug 2020 2:24 PM GMT
Lorry Theft in Medak: లారీ ఎత్తుకెళ్లిన దుండగులు
మెదక్;
- తూప్రాన్ సమీపంలో లారీ డ్రైవర్ మూత్ర విసర్జన కు దిగగా వెనుక నుండి కారులో గుర్తు తెలియని దుండగులు లారీ ఎక్కి ఎత్తుకెళ్లారు...పోలీసులకు పిర్యాదు తో నాలుగు బృందాలు గాలింపు..
- 29 Aug 2020 2:22 PM GMT
Hyderabad Revenue Office: సర్కిల్ ఆఫీసులలో ప్రాపర్టి ట్యాక్స్ రెవెన్యూ మేళాలు
హైదరాబాద్
- హైదరాబాద్ లో ఈ నెల 30 నుండి సెప్టెంబర్ 13 వరకు అన్ని సర్కిల్ ఆఫీసులలో ప్రాపర్టి ట్యాక్స్ రెవెన్యూ మేళాలు - కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్
- ఆస్తిపన్ను సమస్యలు పరిష్కరించుటకై ప్రాపర్టి ట్యాక్స్ రెవెన్యూ మేళాలు - కమిషనర్
- 29 Aug 2020 2:21 PM GMT
CPI Venkat reddy letter to KCR: సీఎం కేసీఆర్ కు లేఖ రాసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి..
- సీఎం కేసీఆర్ కు లేఖ రాసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి....
- దళిత సంఘాలు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ చేయాలని అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు పోరాటాలు చేస్తున్న విషయం తెలిసిందే....
- ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాల చేసుకోవచ్చని ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీం కోర్టు బెంచ్ తీర్పు ఇచ్చింది..
- ఎస్సీ వర్గీకరణ మీ దృష్టిలో కూడా ఉంది రెండువేల సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు తీర్మానం చేయడం, కోర్టు ఆదేశాలతో నిలిచిపోయింది...
- తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా శాసన సభ తీర్మానం చేసింది
- ఎస్సీల రిజర్వేషన్ కు సంబంధించి మీరు ముందే వాగ్దానం చేసి ఉన్నారు...
- ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఎస్సీ వర్గీకరణకు రానున్న అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని కోరుతున్నాం....
- 29 Aug 2020 12:04 PM GMT
రంగారెడ్డి జిల్లా :ఆమనగల్ తహశీల్దార్ కార్యాలయం ముందు SC , ST ల అసైన్డ్ భూముల పరిరక్షణకై MRPS ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షకు సంగీభావం తెలిపిన మందకృష్ణ మాదిగ.
మహబూబ్ నగర్ జిల్లా : దేవరకద్ర మండలం లోని కోయిల్ సాగర్ ప్రాజెక్టు లో ఏడు లక్షల 70 వేల చేపపిల్లలను వదిలిన మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి.
నారాయణ పేట జిల్లా : కొండారెడ్డిపల్లి చెరువులో గురువారం గల్లంతైన ఇద్దరు యువకుల్లో మరో యువకుడు వెంకటేష్ గౌడ్ మృతదేహం లభ్యం.
- 29 Aug 2020 12:03 PM GMT
రాజ్ భవన్ లో గవర్నర్ తో భేటి అయిన సీఎం కేసీఆర్..
గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ ను పరామర్శించిన సీఎం కేసీఆర్...
రాష్ట్రం లో తాజా పరిణామాల పై గవర్నర్ తో సీఎం కేసీఆర్ చర్చ...
ఈ మధ్య కరోనా టెస్ట్ ల విషయం లో అసంతృప్తి వ్యక్తం చేసిన గవర్నర్...
అసెంబ్లీ సమావేశాల నిర్వహణ పై గవర్నర్ కి వివరిస్తున్న సీఎం కేసీఆర్...
- 29 Aug 2020 12:03 PM GMT
hmtv తో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఫ్రొ,, కోదండరాం..
వచ్చే ఉప ఎన్నికల్లో దుబ్బాక లో పోటీ చేయాలనే దానిపై రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకుంటుంది...
దుబ్బాక లో పోటీ ఇచ్చే బలమైన క్యాడర్ టీజేఏస్ కు ఉంది...
ఒంటరిగా పోటీ చేయాలా ,కలిసి పోటీ చేయాలా అని ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు...
పట్టబద్రుల ఎన్నికల్లో టీజేఏస్ పోటీ చేస్తుంది అభ్యర్థి ఎవరు అని ఇంకా ఇప్పుడే చెప్పలేము...
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత వామపక్షాలు ,అఖిల పక్షాలు ప్రజా సంఘాల తో కలిసి ప్రజా సమస్యల పై తెలంగాణ జనసమితి నిరంతరం పోరాడుతుంది...
ఆర్టీసీ సమ్మె తో మొదలు ఇంటర్మీడియట్ లో తప్పుల తడక రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ,నిరుద్యోగ సమస్య ,కోవిడ్ పై సౌకర్యాల లేమి లాంటి ప్రతి అంశంపై ప్రభుత్వాన్ని ప్రజల్లో నిలబెడుతున్నాం...
పార్టీ లో బూత్ స్థాయి నుండి క్యాడర్ బలోపేతానికి నియోజకవర్గ స్థాయిలో కమిటీ ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నాం..
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire