Live Updates: ఈరోజు (ఆగస్ట్-29) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు శనివారం, 29 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం ఏకాదశి (ఉ. 9-45 వరకు) తదుపరి ద్వాదశి, పూర్వాషాఢ నక్షత్రం (మ. 3-21 వరకు) తదుపరి ఉత్తరాషాఢ, అమృత ఘడియలు (ఉ. 10-38 నుంచి 12-12 వరకు) వర్జ్యం (రాత్రి 11-24 నుంచి 1-01 వరకు) దుర్ముహూర్తం లేదు రాహుకాలం (ఉ. 9-00 నుంచి 10-30 వరకు) సూర్యోదయం: ఉ.5-48 సూర్యాస్తమయం: సా.6-౧౫
టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున పుట్టినరోజు నేడు
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 29 Aug 2020 9:44 AM GMT
కడప :
పులివెందులలో అక్రమ మద్యాన్ని తరలిస్తున్న వాహనాన్ని చేధించిన ఎస్సై గోపినాధ్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించిన జిల్లా ఎస్పీ అన్బురాజన్, సెబ్ ఎఎస్పీ చక్రవర్తి, పులివెందుల డిఎస్పీ వాసుదేవన్...
ఎస్సై గోపినాధ్ రెడ్డి డీజీపీ గౌతమ్ సవాంగ్ సైతం అభినందించి అత్యున్నత ప్రశంసా పత్రాన్ని అందజేయనున్నట్లు తెలిపిన ఎస్పీ అన్బురాజన్...
- 29 Aug 2020 9:44 AM GMT
కడప :
జమ్మలమడుగు పట్టణం లోని ఆర్డిఓ ఆఫీస్ ఎదురుగా అక్రమంగా తరలిస్తున్న 48 మద్యం బాటిళ్లను, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం...
2014లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన పాముల బ్రహ్మానంద రెడ్డిని అదుపులోనికి తీసుకున్న జమ్మలమడుగు ఎక్సైజ్ శాఖ పోలీసులు...
- 29 Aug 2020 9:44 AM GMT
విశాఖ
బాధితుడు శ్రీకాంత్ కామెంట్స్
నేను నూతన నాయుడు ఇంట్లో ఉద్యోగం మానేశా.
ఫోన్ దొంగతనం చేశారాని నింద మోపి కర్రలతో కొట్టారు
వాళ్ళఆ ఇంట్లో ఉద్యోగం మానేసి ఒక్క నెల అయ్యింది.
మా ముందు తిరుగుతున్నాడని నూతన నాయుడు కక్ష పెంచుకున్నారు
అందుకే ఈ వ్యహారం పై పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాం.
వాళ్ళకి నాకు ఎటువంటి గొడవలు లేవు.
ఇది నాపై ప్లాన్ వేసి దారుణానికి ఒడిగట్టారు.
- 29 Aug 2020 9:43 AM GMT
విశాఖ
శీరో ధార్యం శ్రీకాంత్ కేసులో నిందితుల పై విశాఖ పోలీసులు కేసు నమోదు
నగర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా కామెంట్స్.
ఈ కేసు లో అన్ని ఆధారాలు సేకరణ చేసాం.
7 గురుగా నిండుతులు గుర్తించాం.
సీసీ ఫోటేజ్ ద్వారా వేగంగా ఈ కేసును దర్యాప్తు చేయగలిగం.
ఏ1 గా మధు ప్రియ నూతన నాయుడు భార్య.
మీగత వారి కుటుంబలో ఉన్న సహాయకులు.
నిన్న రాత్రి నుండి కేసును ప్రతి విషయం పై పరీశీలిన చేశాం.
వీళ్ళందరు నూతన నాయుడు ఇంట్లో ఉద్యోగులు పని చేస్తున్నారు.
బాధితుడు శ్రీకాంత్ వెంట్రుకలు కూడా సేకరించడం జరిగింది.
- 29 Aug 2020 9:43 AM GMT
తిరుపతి
తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కి కరోనా పోసిటివ్
అస్వస్థతతో చెన్నై అపోలో ఆసుపత్రికి తరలింపు
- 29 Aug 2020 8:28 AM GMT
Guntur updates: గుట్కా డాన్ కామేశ్వరరావును అదుపులోకి తీసుకున్న పోలీసులు..
గుంటూరు..
-గుట్కా డాన్ కామేశ్వరరావును అదుపులోకి తీసుకున్న పోలీసులు.
-ఇప్పటికే కామేశ్వరరావు పై పలు గుట్కా అక్రమ రవాణా కేసులు...
-ఇటీవలే ఓ వైసిపి ఎమ్మెల్యే గొడౌన్ పై దాడి.
-గుట్కా తయారీ కేంద్రాన్ని సీజ్ చేసిన పెదకాకాని పోలీసులు
-తాజాగా కామేశ్వరరావు గోడౌన్ పై దాడి. గుట్కా పట్టివేత.
-సాయంత్రం అరెస్ట్ చూపే అవకాశం.
-ఒకరి పై ఒకరు పరస్పరం ఫిర్యాదులతో కదులుతున్న డొంకలు.
-పోలీసులకు కలిసి వస్తున్న గుట్కా వ్యాపారుల ఆదిపత్యపోరు ..
- 29 Aug 2020 8:25 AM GMT
Visakha updates: తెలుగు భాష దినోత్సవాన్ని పురస్కరించుకొని బీచ్ రోడ్ లోని తెలుగుతల్లి విగ్రహానికి పూలమాలవేసిన మంత్రి అవంతి శ్రీనివాసరావు.
విశాఖ....
-తెలుగు భాష దినోత్సవాన్ని పురస్కరించుకొని బీచ్ రోడ్ లోని తెలుగుతల్లి విగ్రహానికి పూలమాలవేసిన మంత్రి అవంతి శ్రీనివాసరావు.
-పాల్గున్న ఎమ్మెల్యే ధర్మ శ్రీ,యార్లగడ్డ లక్ష్మిప్రసాద్,వంగపండు పద్మ,
-మంత్రి అవంతి శ్రీనివాసరావు కామెంట్స్
-ప్రపంచంలో ఉన్న తెలుగు వారికి తెలుగు భాష దినోత్సవం శుభాకాంక్షలు.
-మనం ఎక్కడ ఉన్న కన్నా తల్లీని మర్చిపోలేం,మాతృభాషను మర్చిపోలేము.
-మాతృభాషను పరిరక్షించుకోవలసిన బాధ్యత మనపై ఉంది.
-తెలుగు భాషకు ప్రాచీన చరిత్ర ఉంది.
-ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలుగు భాషకు పెద్ద పీట వేస్తున్నారు.
-ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాంద్యం ప్రెవేశపెట్టినంత మాత్రాన తెలుగును నిర్లక్ష్యం చేసినట్లు కాదు.
-ప్రజాధనం ద్వురినియోగం అవ్వకూడదని గెస్ట్ హౌస్ ను విశాఖలో నిర్మిస్తున్నాం.
-గెస్ట్ హౌస్ పై కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారు.
-విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని ఏర్పాటు చేయడం తధ్యం.
-చంద్రబాబు నాయుడు ఎన్ని కుతంత్రాలు పన్నిన విశాఖలో పరిపాలన రాజధానిని ఆపలేరు.
- 29 Aug 2020 7:56 AM GMT
Amaravati updates: పవన్ కళ్యాణ్....జనసేన అధినేత..
అమరావతి..
-పవన్ కళ్యాణ్....జనసేన అధినేత
-తెలుగు భాషకు పట్టం కట్టడమే గిడుగు వారికి నిజమైన నివాళి
-ఈ రోజు వ్యావహారిక భాషోద్యమ మూలపురుషుడు గిడుగు వెంకట రామమూర్తి గారి జయంతి
-దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీ కృష్ణదేవరాయలు కీర్తించిన మన తెలుగు భాషను గ్రాంథికం నుంచి వాడుకకు తీసుకువచ్చిన మహనీయులు శ్రీ గిడుగు వెంకట రామమూర్తి గారు.
-ప్రజల వాడుకలో ఉన్న భాషనే గ్రంథ రచనలోకి తీసుకువచ్చేందుకు చిత్తశుద్ధితో ఉద్యమించిన వ్యవహారిక భాషా ప్రేమికుడాయన.
-గిడుగు వెంకట రామమూర్తిగారు చేపట్టిన వ్యావహారిక భాషోద్యమం వల్లే పల్లె పల్లెకు చదువు అందింది.
-అది మన మాతృభాషలో... అందునా వాడుక భాషలో చదువుకోవడం మూలంగా ఎక్కువ మందికి విద్యాబుద్ధులు అందాయి.
-ఈ సందర్భంగా నా తరఫున, జనసేన పక్షాన హృదయపూర్వకంగా వారికి అంజలి ఘటిస్తున్నాను.
-గిడుగు వెంకట రామమూర్తి గారి లాంటి ఎందరో భాషా ప్రేమికులు, కవులు, రచయితలు ఇచ్చిన స్పూర్తితోనే తెలుగు భాషలోని తీయదనాన్ని నవ తరానికి, భావి తరాలకు అందించే సదుద్దేశంతో జనసేన మన నుడి మన నది కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
-కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానంలో ప్రాథమిక విద్యా బోధన మాతృభాషలోనే సాగాలని స్పష్టంగా చెప్పింది.
-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిన్నారులకు మాతృభాష దూరం కాకుండా చూడటం అవసరం.
-అదే విధంగా ప్రభుత్వ వ్యవహారాలను తెలుగు భాషలో సాగించడమే కాదు అందులో వాడుక భాషను తీసుకురావలసిన అవసరం ఎంతైనా ఉంది.
-ప్రభుత్వం ఉత్తర్వులు, అధికారిక ఉత్తరప్రత్యుత్తరాల్లోని భాష కొరుకుడుపడని విధంగా ఉంటోంది.
-అందరికీ అర్థమయ్యే రీతిలో ఆ భాష ఉండాలి.
-ప్రభుత్వ కార్యకలాపాల్లోనే కాకుండా ప్రతి ఒక్కరం నిత్య వ్యవహారాల్లో తెలుగు భాషకు పట్టం కట్టినప్పుడే గిడుగు వారికి నిజమైన నివాళిని ఇచ్చినట్లు అవుతుంది.
-ఈ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు.
- 29 Aug 2020 7:51 AM GMT
Amaravati updates: కిమిడి కళా వెంకట్రావు మాజీ మంత్రి వర్యులు..
అమరావతి....
-కిమిడి కళా వెంకట్రావు మాజీ మంత్రి వర్యులు..
-చైతన్య రథ సారధి సేవలు చిరస్మరణీయం..
-తెలుగుదేశం పార్టీకి చైతన్య రథ సారధిగా నందమూరి హరికృష్ణ అందించిన సేవలు చిరస్మరణీయం.
-సినీ నటుడుగా, మంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా తెలుగు ప్రజల మధిలో నిలిచారు.
-తెలుగు ప్రజల వాణిని పార్లమెంటులో వినిపించిన ధైర్యశీలి.
-పేదలకు అండగా నిలిచి ఆపన్న హస్తం అందించిన శక్తి హరికృష్ణ.
-పార్టీకి ఆయన అందించిన సేవలు ఎనలేనివి.
-తెలుగు నేలకు దూరమై రెండేళ్లు అయినా ప్రజల గుండెల్లో ఆయన ప్రతిరూపం ఇంకా మెదిలాడుతూనే ఉంది.
-తెలుగు ప్రజలకు హరికృష్ణ చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పిస్తున్నాను.
- 29 Aug 2020 7:45 AM GMT
Amaravati updates: గిడుగు రామ్మూర్తిగారి జయంతి సందర్భంగా...
అమరావతి....
-ట్విట్టర్లో టీడీపీ అధినేత చంద్రబాబు...
-గిడుగు రామ్మూర్తిగారి జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్న ప్రపంచవ్యాప్త తెలుగు వారందరికీ శుభాకాంక్షలు
-గిడుగు రామ్మూర్తి వంటి ఎందరో మహానుభావులు తెలుగు భాషను సామాన్యులకు చేరువచేసేందుకు తమ జీవితాలను త్యాగం చేసారు.
-కానీ ఈరోజు తెలుగును తెలుగువారి నుంచే దూరం చేసే ప్రయత్నం జరుగుతోంది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire