Live Updates: ఈరోజు (ఆగస్ట్-29) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు శనివారం, 29 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం ఏకాదశి (ఉ. 9-45 వరకు) తదుపరి ద్వాదశి, పూర్వాషాఢ నక్షత్రం (మ. 3-21 వరకు) తదుపరి ఉత్తరాషాఢ, అమృత ఘడియలు (ఉ. 10-38 నుంచి 12-12 వరకు) వర్జ్యం (రాత్రి 11-24 నుంచి 1-01 వరకు) దుర్ముహూర్తం లేదు రాహుకాలం (ఉ. 9-00 నుంచి 10-30 వరకు) సూర్యోదయం: ఉ.5-48 సూర్యాస్తమయం: సా.6-౧౫
టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున పుట్టినరోజు నేడు
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 29 Aug 2020 12:00 PM GMT
అమరావతి
బొండా ఉమామహేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే
అడ్డగోలు దోపిడీ తప్ప, అభివృద్ధి ఎక్కడుంది...?
కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులుగా ఉన్న ముగ్గురు మూర్ఖులు జోగిరమేశ్, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీ నివాస్ కాసుల కక్కుర్తి కోసం విజయవాడ నగరాన్ని నాశనం చేశారు.
కనకదుర్మమ్మ ఫ్లైఓవర్ కడతామంటే, ఆనాడు వద్దని ధర్నాలు చేసింది ఈ ముగ్గురు బఫూన్లు కాదా?
చంద్రబాబు ప్రతిపక్షనేతగా విజయవాడలో జరిగిన ధర్నాకు వచ్చి, ఫ్లైఓవర్ కడతానని హామీ ఇచ్చి, అధికారంలోకి రాగానే కట్టి చూపించారు.
ఎవరికో పుట్టిన బిడ్డకు పేరుపెట్టి, ఎత్తుకొని ఆడించినట్లుగా వైసీపీనేతలు దాన్ని మేమే కట్టామని చెప్పుకుంటున్నారు.
దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి గుడిని, గుడిలో లింగాన్ని మింగేసేలా తయారయ్యాడు.
సింహాచలం దేవాలయ భూములను, కనకదుర్గమ్మ గుడిలో కోట్లాది రూపాయలను, అన్నవరం సత్యదేవుని ఆలయంలో సొమ్ముని దిగమింగుతున్నారు.
శ్రీశైలం ఆలయంలో టిక్కెట్ల కుంభకోణంతో దండుకున్నారు.
గుంటూరు ఎమ్మెల్యే గుట్కా ప్యాకెట్లు అమ్ముకుంటున్నాడు.
కర్నూల్లో ఒకమంత్రి పేకాట క్లబ్ లు నిర్వహిస్తూ దండుకుంటున్నాడు.
విజయవాడలో మంత్రేమో కరోనా పేరుచెప్పి వ్యాపారుల నుంచి డబ్బులు వసూలుచేశారు.
ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా ప్రజలనుంచి, వ్యాపారుల నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు దోచుకుంటున్నారు.
- 29 Aug 2020 12:00 PM GMT
విజయవాడ
కరోనా మహమ్మారిని క్యాష్ చేసుకుంటున్న ప్రవేట్ హాస్పిటల్స్
ఆటోనగర్ లో జయశ్రీ లిబర్టీ హాస్పిటల్ లో కోవిడ్ చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
15 లక్షలు కట్టినా సరైన వైద్యం లేదని మృతుని కుటుంబ సభ్యుల ఆందోళన
లిబర్టీ హాస్పిటల్ నిర్లక్ష్యంపై పటమట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
విజయవాడ పోలీస్ కమీషనర్, జిల్లా కలెక్టర్ లకు ఫిర్యాదు
సరళ, మృతుని భార్య
రాజమండ్రి నుంచి ఇక్కడకు వచ్చి నా భర్తను లిబర్టీ ఆసుపత్రిలో చేర్చాం
ఆరు లక్షలు ముందు, విడతల వారీగా 15 లక్షలు తీసుకున్నారు
ఆక్సిజన్ అందించేందుకు సి.పాప్ మెషిన్ మా చేతే కొనుగోలు చేయించారు
డబ్బులు ఖర్చు చేసినా సరైన వైద్యం అందించకుండా నా భర్త ప్రాణాలు తీశారు
డాక్టర్ల నిర్లక్ష్యం, వైద్య పరికరాల కొరతతో నా భర్త చనిపోయారు
నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు చనిపోతే... రిపోర్ట్ లో ఐదు గంటలకు అని రాశారు
పేషెంట్ల ఆర్ధిక పరిస్థితి బట్టి ప్యాకేజీలతో దోచుకుంటున్నారు
మాకు జరిగిన అన్యాయం ఏ పేషేంట్ కు జరగకూడదు
- 29 Aug 2020 11:59 AM GMT
విశాఖ
టిడిపి మాజీ శాసన సభ్యులు వంగలపూడి అనిత కామెంట్స్
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అకృత్యాలు, దౌర్జన్యాలు పెరిగిపోయాయి.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేతగానితనం వలనే ఇలాంటివి జరుగుతున్నాయి.
పరిపాలన గాడితప్పింది.
దళితులపై దాడులు జరుగుతుంటే వైసీపీ శాసన సభ్యులు ఏంచేస్తున్నారు.
దళిత జాతిలో పుట్టినందుకు జాలివేస్తుంది.
దళితుల దాడులపై రాష్ట్రపతి జోక్యం చేసుకుంటేగాని ముఖ్యమంత్రి మాట్లాడారా?
పేరుకే డిప్యూటీ సిఏం సూచరిత.. ఆమె ఎవరో రాసిన స్క్రిప్ట్ చదవడం తప్పా ఆమె చేసేది ఎమి లేదు.
దళిత కార్డు పెట్టుకుని గెలిచిన శాసన సభ్యులు,ఎంపీలు దళితులకు న్యాయం చేయడానికి కృషి చేయండి.
దళితులపై దాడులు జరుగుతున్న హోంమంత్రి పట్టించుకోకపోవడం దారుణం
హోమ్ మంత్రికి స్వతంత లేదు. ఆవిడ ఒక రబ్బర్ స్టాంప్.
- 29 Aug 2020 11:59 AM GMT
నక్కా ఆనందబాబు మాజీ మంత్రి
దళితుల జుట్టంటే ప్రభుత్వానికి అంత వ్యామోహమా...?
దళితులపై వరుస శిరోముండనాలు జరుగుతున్నా పట్టించుకోనిది అందుకేనా...?
దళితులపై దాడులు, వేధింపులు, హత్యలు, అత్యాచారాలతో రాష్ట్రంలో జగన్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది.
మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు సిగ్గులేకుండా జరుగుతున్న దారుణాలను సమర్థించుకుంటున్నారు.
టీడీపీపాలనలో పార్టీకి, ప్రభుత్వానికి సంబంధం లేకుండా జరిగిన ఒకటి రెండు ఘటనలతో, ఇప్పుడు జరిగే ఆకృత్యాలను ముడిపెట్టాలని చూస్తున్నారు.
విశాఖలో దళితయువకుడు శ్రీకాంత్ కు శిరోముండనం చేసిన నూతన్ నాయుడు, అతని భార్యను తక్షణమే అరెస్ట్ చేయాలి.
ఓంప్రతాప్ మృతిపై ప్రభుత్వం సీబీఐ విచారణ జరిపించాలి.
- 29 Aug 2020 10:48 AM GMT
రాజధాని తరలింపు వ్యాజ్యాలలో కౌంటర్ దాఖలుకు నిర్ణయం
రాజధాని కోసం 33వేల ఎకరాలు ఇచ్చిన వేల మంది రైతులకు అన్యాయం జరగకూడదు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని తరలింపునకు సంబంధించి రాష్ట్ర హైకోర్టులో ఉన్న వ్యాజ్యాలలో కౌంటర్ దాఖలు చేయాలని జనసేన పార్టీ నిర్ణయం తీసుకుంది.
రాష్ట్ర హైకోర్టు రాజకీయ పార్టీలకు కౌంటర్ దాఖలు చేయాలని భావిస్తే మూడు వారాల్లో వేయాలని సూచించింది.
ఈ రోజు పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ నేతృత్వంలో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్,పార్టీ ప్రధాన కార్యదర్శులు తోట చంద్రశేఖర్ , టి.శివశంకర్, బొలిశెట్టి సత్య పాల్గున్నారు.
వారి అభిప్రాయాలను తెలుసుకున్నా పవన్ కళ్యాణ్
పవన్ కల్యాణ్
“రాజధాని తరలింపు, పాలన వికేంద్రీకరణ విషయంలో జనసేన పార్టీ తొలి నుంచి స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూనే వస్తోంది.
ప్రభుత్వాన్ని విశ్వసించి భూసమీకరణ ద్వారా 33 వేల ఎకరాలను 28వేల మందికి పైగా రైతులు తమ పంట పొలాలను ఇచ్చేశారు.
తమ భూములు ఇచ్చిన వేల మంది రైతులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగకూడదు అని జనసేన బలంగా చెబుతోంది.
అలాగే అక్కడి భూముల్లో ఇప్పటికే నిర్మాణాలు చేపట్టారు.
మరికొన్ని నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. అంటే ప్రజాధనాన్ని ఇప్పటికే రాజధాని కోసం వెచ్చించారు.
పర్యావరణహితమైన రాజధాని నిర్మాణం జరగాలి అని చెబుతూ వస్తున్నాం.
ప్రస్తుత తరుణంలో రాజధాని తరలింపు అంశంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి.
వాటికి సంబంధించి పరిణామాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉన్నాం.
గౌరవ హైకోర్టు ఈ వ్యాజ్యాలలో కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. కౌంటర్ దాఖలు చేస్తాం.
ఈ కేసులో తుది వరకూ బాధ్యతగా నిలబడతాం.
ఈ రోజు పార్టీ ముఖ్యుల అభిప్రాయాలూ తెలుసుకున్నాం.
న్యాయ నిపుణుల సలహాలు, వారి సహకారంతో గడువులోగా కౌంటర్ వేస్తాం”
- 29 Aug 2020 10:48 AM GMT
జాతీయ మానవ హక్కుల కమీషన్ కు ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ లేఖ
వైద్యులపై ఏపీ ప్రభుత్వం అన్యాయంగా కేసులు పెడుతోంది
కరోనా భయానక పరిస్ధితులలో తీసుకోవలసిన జాగ్రత్తలపై సలహా ఇచ్చినందుకు డాక్టర్లపై చర్యలు తీసుకుంటారు
ఏపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ గంగాధర్ పై కేసులు పెట్టడం అమానుషం
పీపీఈ కిట్లు, మాస్కులు, కోవిడ్ ఎక్విప్మెంట్ లేవని అన్నందుకు కేసులు పెట్టడం అమానుషం
ఈనెల 30 నాటికి సీఐడీ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని డాక్టర్ గంగాధర్ కు నోటీసులు ఇవ్వడం అన్యాయం
సరైనా వైద్య సౌకర్యాలు లేక అనేకమంది చనిపోతుంటే, వదిలేసి వైద్యులపై కేసులు పెడుతున్నారు
ఈ విషయంపై మానవహక్కుల సంఘం తగిన చర్యలు తీసుకోవాలి
- 29 Aug 2020 10:47 AM GMT
నిందితులతో జనసేనకు సంబంధం లేదు.
తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవు
విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో శిరోముండనం కేసులో ప్రధాన నిందితుడు జనసేన అధ్యక్షుడు శ్పవన్ కళ్యాణ్ అభిమాని అని, జనసేన పార్టీలో వున్నారని చేస్తున్న అసత్య, అసందర్భపు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంఘటనలో పవన్ కళ్యాణ్ పేరును తీసుకురావడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.
నిందితులు జనసేన పార్టీలో కనీసం సభ్యులు కూడా కారు.
పవన్ కళ్యాణ్ అన్యాయానికి కొమ్ము కాసే నేత కాదని ప్రతి ఒక్కరికీ తెలుసు.
అన్యాయం ఎక్కడ జరిగినా జనసేన వ్యతిరేకిస్తుంది.
బాధితులకు బాసటగా నిలుస్తుంది. ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ లో దళితులపై జరిగిన అకృత్యాలపై పవన్ కళ్యాణ్ బలంగా స్పందించిన విషయాన్ని ప్రజలు మరచిపోలేదన్న సంగతిని దుష్ప్రచారకులు గుర్తుంచుకోవాలి.
పవన్ కళ్యాణ్ లక్షలాది మంది అభిమానులు ఉన్నసుప్రసిద్ధ హీరో.
నిందితుడు ఆయన అభిమాని అయినంత మాత్రాన ఇటువంటి దురదృష్టకర సంఘటనలో ఆయన పేరు తీసుకు రావడం గర్హనీయం.
ఈ కేసులో తగిన విచారణ జరిపి దోషులను చట్టపరంగా శిక్షించాలని జనసేన కోరుతోంది.
ప్రమేయంలేని విషయాలలో పార్టీనిగాని లేదా పార్టీ అధ్యక్షులు, నాయకుల పేర్లను ప్రస్తావించిన పక్షంలో న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాము.
- 29 Aug 2020 9:46 AM GMT
ప్రకాశం జిల్లా...
జిల్లాలో ముగ్గురు ఎస్సైలను వీఆర్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా ఎస్పీ సిద్ధార్ధ్ కౌశల్..
ఎస్సై ఎస్.మల్లిఖార్జున రావు
కొమరోలు.
ఎస్సై.. షేక్.అబ్దుల్ రహామాను
దోర్నాల.
ఎస్సై... వై.పాండురంగారావు,
గుడ్లూరు
- 29 Aug 2020 9:45 AM GMT
ఎంపీ నందిగామ సురేష్
దళితులకు చంద్రబాబు చేసిన ద్రోహం, జగన్మోహన్ రెడ్డి చేసిన మంచిపై చర్చించాము..
దళితులపై దాడులు జరుగుతున్నాయని టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తున్నారు..
ఉమ్మడి రాష్ట్రంలో రెండు మంత్రి పదవులు ఇవ్వడానికి ఇబ్బంది పడ్డరు..
రాష్ట్రం విడిపోయాక ఐదు మంది దళితులకు మంత్రి పదవులు సీఎం జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టారు..
దళితుల అభివృద్ధి విషయంలో జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నక్కకు నాగలోకనికి ఉన్నంత తేడా ఉంది..
జగన్మోహన్ రెడ్డి కుటంబానికి దళిత కుటంబానికి బంధత్వం ఉంది..
టీడీపీ వెంటిలేటర్ మీద ఉన్న పార్టీ..
దళితులను మోసం చేసింది చంద్రబాబు నాయుడు..
దళితులల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారని చంద్రబాబు దళితులను అవమానించారు..
దళితులపై దాడులు చేసే వారిని క్షమించేది లేదని జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు..
దళితులపై దాడులు చేసి వారిపై వెంటనే చర్యలు తీసుకున్నారు..
చంద్రబాబు వైఖరికి నిరసనగా ప్రతి నియోజకవర్గంలో నిరసనలు తెలుపుతాము...
అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమార్పిస్తాము..
- 29 Aug 2020 9:45 AM GMT
మేరుగ నాగార్జున ...వైసీపీ ఎమ్మెల్యే
చంద్రబాబు హయాంలో దళితులపై జరిగిన దాడులపై చర్చించాము
సీఎం జగన్ పాలనలో దళితులకు జరిగిన సంక్షేమం, వాటిని ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లే అంశంపై చర్చించాము..
14 ఏళ్ళలో చంద్రబాబు దళితులను ఏమాత్రం పట్టించుకోలేదు..
దళితుల్లో ఎవరైనా పుడతారా అన్నప్పుడే చంద్రబాబు రాజ్యాంగాన్ని అవమానించారు..
దళిత చట్టాలను చుట్టాలుగా చంద్రబాబు మార్చారు..
చంద్రబాబు హయాంలో దళితులపై దాడుల్లో రాష్ట్రం నాలుగవ స్థానంలో ఉంది..
ఎస్సి ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను చంద్రబాబు మింగేశారు..
అధికారం పోయాక చంద్రబాబు దళితులపై కపట ప్రేమ చూపిస్తున్నారు..
దళితులను అడ్డంపెట్టుకుని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు..
అంబేద్కర్, బాబు జగజ్జివన్ రావు ఆశయాలను నెరవేర్చేది జగన్మోహన్ రెడ్డినే..
దళితులపై దాడులు చేసిన వారిపై వెంటనే సీఎం జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకున్నారు..
ఈ నెల 31 తేదీన జిల్లా కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకం చేసి చంద్రబాబు అకృత్యాలపై నిసరన తెలుపుతాము..
అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రం సమర్పిస్తాము..
సెప్టెంబర్ మొదటి వారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తాము..
ఈ సమావేశానికి మేధావులు, విద్య వేత్తలు, కుల సంఘాలు నేతలను ఆహ్వానిస్తాము..
చంద్రబాబు దళితులకు చేసిన మోసాన్ని ప్రజలకు వివరిస్తాము
చంద్రబాబు హయాంలో దళితులు భూములు లాక్కున్నారు..
కొంతమంది గుంట నక్కలను అడ్డం పెట్టుకొని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు..
చంద్రబాబు కుట్రలు పట్ల దళితులు జాగ్రత్తగా ఉండాలి..
దళితులకు జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి చంద్రబాబు చేసిన ద్రోహం వివారిస్తాము..
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire