Live Updates: ఈరోజు (సెప్టెంబర్-28) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు సోమవారం | 28 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | ద్వాదశి: రా.9-38 వరకు తదుపరి త్రయోదశి | ధనిష్ఠ నక్షత్రం రా.12-19 వరకు తదుపరి శతభిషం | వర్జ్యం: లేదు | అమృత ఘడియలు: మ.1-31 నుంచి 3-11 వరకు | దుర్ముహూర్తం: మ.12-15 నుంచి 1-03 వరకు తిరిగి మ.2-39 నుంచి 3-27 వరకు | రాహుకాలం: ఉ. 7-30 నుంచి 9-00 వరకు | సూర్యోదయం: ఉ.5-53 | సూర్యాస్తమయం: సా.5-51
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 28 Sep 2020 12:11 PM GMT
East Godavari updates: మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కు కరొనా పాజిటీవ్ నిర్ధారణ..
తూర్పుగోదావరి జిల్లా..
-రామచంద్రపురం లో కోవిడ్ టెస్ట్ చేయించుకున్న మంత్రి వేణుగోపాలకృష్ణ
-పాజిటీవ్ రావడంతో కాకినాడ ప్రైవేటు ఆస్పత్రిలో కొద్దిసేపటి క్రితం చేరిన వేణుగోపాలకృష్ణ
-నిన్న అంతర్వేది రథం ప్రారంభంలోనూ, జగ్గంపేటలో మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార సభలోనూ డిప్యూటీ సిఎం ధర్మానతో కలిసి పాల్గొన్న మంత్రి వేణు
-రాజమండ్రి ఆర్ అండ్ బి అతిధిగృహాంలో రాజమండ్రి- సిటీ, రూరల్ రాజానగరం నాయకులతో సమావేశమైన వేణు
-నిన్ననే జ్వరం తో బాధపడ్డ మంత్రి వేణు..
-నిన్న కోవిడ్ టెస్ట్లో నెగిటీవ్ ..జ్వరం అధికమవ్వడంతో నేడు చేయించుకున్న టెస్ట్ లో పాజిటీవ్ నిర్ధారణ
-నిన్న వేణుగోపాలకృష్ణ ను కలిసిన ఎమ్మెల్యేలు, నాయకులలో ఆందోళన ,
- 28 Sep 2020 8:44 AM GMT
KARNOOL NEWS: కర్నూలు కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్తత
కర్నూలు: CITU ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించిన భవన నిర్మాణ కార్మికులు..
వెల్ఫేర్ బోర్డు నిధులను దోచేస్తున్నారని.. సంక్షేమ పథకాలను ఆపేసారని నిరసన.
స్థానిక ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ అడ్డుకున్న భవణ నిర్మాణ కార్మికులు
పోలీసులకు భవన కార్మికులకు వాగ్వాదం.
- 28 Sep 2020 8:40 AM GMT
Boston consulting group report : ప్రాజెక్టులపై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదికలు
అమరావతి: బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నకు ఫీజు చెల్లించేందుకు పాలనా అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం.
బీసీజీకి 3 కోట్ల 51 లక్షల 5 వేల రూపాయల ఫీజును చెల్లించేందుకు ప్రణాళికా విభాగానికి అనుమతి మంజూరు.
పాలనా వికేంద్రీకరణ, రాష్ట్రంలో అభివృద్ధి ప్రాజెక్టులపై మూడు విడతలుగా నివేదిక ఇచ్చిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్.
బీసీజీకి ప్రోఫెషనల్ ఫీజు కింద గతంలోనే 7 కోట్ల 2 లక్షల 10 వేలను మంజూరు చేసిన ఆర్ధిక శాఖ.
- 28 Sep 2020 7:54 AM GMT
KAKINADA NEWS: కాకినాడ పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట.
తూర్పుగోదావరి : కాకినాడలో పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట.
కులాంతర వివాహం చేసుకున్న తమకు కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందంటూ జిల్లా ఎస్పీ కు ఫిర్యాదు చేసిన ప్రేమ జంట.
కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన జంగాల ఇషాదీపికను ప్రేమించిన తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నకు చెందిన బల్లిపాటి దుర్గ ప్రసాద్
ఇషా దీపిక, దుర్గాప్రసాద్ ప్రేమ పెళ్లి కి నిరాకరించిన ఇరు వర్గాల కుటుంబ సభ్యులు..
నర్సాపురం సమీపంలో పేరుపాలెం గుడిలో వివాహం చేసుకున్న ఇషా దీపిక, దుర్గాప్రసాద్..
తన కుమార్తె కనిపించడం లేదంటూ కంకిపాడు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇషా దీపిక తల్లిదండ్రులు..
మరోవైపు ఇషా దీపిక, దుర్గాప్రసాద్ ల ఆచూకీ కోసం బంధువులతో కలిసి గాలిస్తున్న ఇషా దీపిక తల్లిదండ్రులు..
తన కుటుంబ సభ్యులు దుర్గా ప్రసాద్ ను చంపేస్తామని బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇషా దీపిక..
తమకు రక్షణ కల్పించాలని ఎస్పీ ను కోరిన ప్రేమ జంట..
- 28 Sep 2020 7:54 AM GMT
KAKINADA NEWS: కాకినాడ పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట.
తూర్పుగోదావరి : కాకినాడలో పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట.
కులాంతర వివాహం చేసుకున్న తమకు కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందంటూ జిల్లా ఎస్పీ కు ఫిర్యాదు చేసిన ప్రేమ జంట.
కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన జంగాల ఇషాదీపికను ప్రేమించిన తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నకు చెందిన బల్లిపాటి దుర్గ ప్రసాద్
ఇషా దీపిక, దుర్గాప్రసాద్ ప్రేమ పెళ్లి కి నిరాకరించిన ఇరు వర్గాల కుటుంబ సభ్యులు..
నర్సాపురం సమీపంలో పేరుపాలెం గుడిలో వివాహం చేసుకున్న ఇషా దీపిక, దుర్గాప్రసాద్..
తన కుమార్తె కనిపించడం లేదంటూ కంకిపాడు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇషా దీపిక తల్లిదండ్రులు..
మరోవైపు ఇషా దీపిక, దుర్గాప్రసాద్ ల ఆచూకీ కోసం బంధువులతో కలిసి గాలిస్తున్న ఇషా దీపిక తల్లిదండ్రులు..
తన కుటుంబ సభ్యులు దుర్గా ప్రసాద్ ను చంపేస్తామని బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇషా దీపిక..
తమకు రక్షణ కల్పించాలని ఎస్పీ ను కోరిన ప్రేమ జంట..
- 28 Sep 2020 7:49 AM GMT
GANDI KOTA: గండికోట నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని దాఖలైన 4 పిటిషన్లు
అమరావతి: గండికోట నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని హైకోర్టులో దాఖలైన 4 పిటిషన్లను విచారించిన ఏపీ హైకోర్టు
అన్ని కేసుల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు
తదుపరి విచారణ అక్టోబరు 7 నాటికి వాయిదా
- 28 Sep 2020 7:43 AM GMT
YSR JALA KALA: వైఎస్సార్ జలకళ పథకం చరిత్రాత్మకం: అంబటి కృష్ణా రెడ్డి
కడప : అంబటి కృష్ణా రెడ్డి... రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారు
రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్తా...
తనపై నమ్మకముంచి ఇంతటి హోదా కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ధన్యవాదాలు..
ప్రతి రైతుకు న్యాయం జరిగేలా కృషి చేస్తా..
రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుంది..
వైఎస్సార్ జలకళ పథకం చరిత్రాత్మకం...
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉచితంగా బోర్ వేసి ఇవ్వడం శుభపరిణామం...
రైతులకు ఎరువులు, యూరియా సరసమైన ధరలకే అందేలా చర్యలు తీసుకుంటాం..
- 28 Sep 2020 7:39 AM GMT
SCAM: మరో స్కాం .. అక్రమంగా వాహనాల రిజిస్ట్రేషన్
అనంతపురం: డిటిసి శివరాం ప్రసాద్ పీసీ
బీఎస్ 3 వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ కేసు మరువక ముందే మరో స్కాం బయటపడింది.
ఇతర రాష్ట్రాల్లో ఖరీదైన వాహనాలు దొంగతనంగా తీసుకువచ్చి ఇక్కడ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారు.
ఆన్లైన్ వెసులుబాటు ను దుర్వినియోగం చేస్తూ... ఇక్కడ నకిలీ పాత్రలతో రిజిస్ట్రేషన్ చేశారు.
వాటిని తక్కువ ధరకు విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు.
వాహనాలు కొనుగొలువులో ప్రజలు అప్రమత్తంగా ఉండండి... అవసరమైతే రవాణాశాఖ ను సంప్రదించండి.
ఇంజన్, చాసి నెంబర్లను టాంపరింగ్ చేశారు.
కర్ణాటక నుంచి తెచ్చి అనంతపురం లో అక్రమ రిజిస్ట్రేషన్ తో విక్రయిస్తున్నారు.
ఇప్పటికే ఇద్దరిని సస్పెండ్ చేశాము.. పోలీసులుకు ఫిర్యాదు తో కేసు విచారణ కొనసాగుతోంది.
జిల్లా లో 60 నుంచి 70 వరకు ఇలాంటివి వచ్చినట్లు గుర్తించాం. పూర్తి ఆధారాలు సేకరించి సీజ్ చేస్తాం. కఠిన చర్యలు తీసుకుంటాం
- 28 Sep 2020 7:34 AM GMT
VIJAYAWADA NEWS: పారిశుధ్య కార్మికుల ధర్నా
విజయవాడ: సిఆర్డిఏ కార్యాలయం వద్ద రాజధాని అమరావతి పారిశుధ్య కార్మికులకు చెల్లించవలసిన 7 నెలల వేతన బకాయిలు తక్షణమే ఇవ్వాలని కోరుతూ
సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా.
పలువురు నాయకుల అరెస్టు ,సీపీఎం రాష్ట్ర నాయకుడు బాబు రావు గృహ నిర్బంధం
అరెస్ట్ చేసిన నాయకులు, కార్మికులను,కృష్ణలంక ,గవర్నర్పేట ,వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలింపు
అమరావతి నుండి కార్మికులు రాకుండా గ్రామాల్లోనే అడ్డుకున్న పోలీసులు
- 28 Sep 2020 7:31 AM GMT
Gurram Jashuva: గుఱ్ఱం జాషువా జయంతి ఉత్సవాలు
అమరావతి: గుఱ్ఱం జాషువా జయంతిని పురస్కరించుకొని విజయవాడలో తుమ్మపల్లి కళాక్షేత్రం వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పింన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెల కిషోర్ బాబు, రాష్ట్ర కార్యదర్శి శ్రీ పాతూరి నాగభూషణం ,రాష్ట్ర కోశాధికారి వామరాజు సత్యమూర్తి, అడ్డురి శ్రీరామ్,.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire