Live Updates: ఈరోజు (సెప్టెంబర్-28) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Live Updates: ఈరోజు (సెప్టెంబర్-28) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 28 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు సోమవారం | 28 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | ద్వాదశి: రా.9-38 వరకు తదుపరి త్రయోదశి | ధనిష్ఠ నక్షత్రం రా.12-19 వరకు తదుపరి శతభిషం | వర్జ్యం: లేదు | అమృత ఘడియలు: మ.1-31 నుంచి 3-11 వరకు | దుర్ముహూర్తం: మ.12-15 నుంచి 1-03 వరకు తిరిగి మ.2-39 నుంచి 3-27 వరకు | రాహుకాలం: ఉ. 7-30 నుంచి 9-00 వరకు | సూర్యోదయం: ఉ.5-53 | సూర్యాస్తమయం: సా.5-51

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Amaravati updates: చేయూత పధకం కింద 18750 రూపాయలు నగదును మహిళలకు ఇచ్చాము..
    28 Sep 2020 4:00 PM GMT

    Amaravati updates: చేయూత పధకం కింద 18750 రూపాయలు నగదును మహిళలకు ఇచ్చాము..

    అమరావతి..

    మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రా రెడ్డి కామెంట్స్

    -మహిళలు ఆర్ధికంగా ఎదిగేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

    -మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి ఎంయన్సీ కంపెనీలతో ఎంవోయూ చేసుకున్నాం.

    -మహిళ ల స్వయం ఉపాధికి సహకరించాలని బ్యాంక్ అధికారులతో కూడా చర్చించాం.

    -చేయుత పధకం కింద అనేక చిన్న తరహా పరిశ్రమలకు,చేతి వృత్తులకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.

    -సెర్ప్ ద్వారా స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తున్నాం.

    -ఎస్సెల్బిసి చైర్మన్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకొని వెళ్ళాము.

    -వినూత్న ఆలోచనలతో కార్యక్రమాలను ప్రారంభిస్తున్నాం.

  • Amaravati updates: చేయూత పథకం పై రాష్ట్ర పంచాయతీ రాజ్ కార్యాలయంలో సమీక్ష.
    28 Sep 2020 3:57 PM GMT

    Amaravati updates: చేయూత పథకం పై రాష్ట్ర పంచాయతీ రాజ్ కార్యాలయంలో సమీక్ష.

    అమరావతి..

    -వివిధ ఎంఎన్సి కంపెనీల ప్రతినిధులతో భేటీ అయిన మంత్రులు

    -హాజరైన మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స సత్యనారాయణ, కన్నబాబు, సిదిరి అప్పలరాజు

  • Amaravati updates: బీసీ లను ఎప్పుడు చంద్రబాబు ఓటు బ్యాంకు రాజకీయాలకే వాడుకున్నాడు..
    28 Sep 2020 3:54 PM GMT

    Amaravati updates: బీసీ లను ఎప్పుడు చంద్రబాబు ఓటు బ్యాంకు రాజకీయాలకే వాడుకున్నాడు..

    అమరావతి..

    మోపిదేవి వెంకట రమణ రావు,ఎంపీ.. కామెంట్స్...

    -అధికారంలో ఉన్నప్పుడు అన్యాయం చేయడం అధికారం పోయినప్పుడు బీసీలను వాడుకోవడం చంద్రబాబు పని

    -ఇప్పుడు అధికారం లేదు కాబట్టి జెండాలు మోయటానికి, జై జైలు పలకడానికి, కేసులు పెట్టించుకోవడానికి చంద్రబాబు బీసీల జపం చేస్తున్నాడు

    -చంద్రబాబుది మొదటి నుంచి అదే పద్ధతి

    -అధికారంలో ఉన్నప్పుడు బీసీలను రాజకీయంగా ఆర్థికంగా, సామాజికంగా, అభివృద్ధి చేయాలన్న ఆలోచన చంద్రబాబుకు లేదు

    -చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు బీసీల అభివృద్ధికి ఒక్క పథకం కూడా అమలు చేయలేదు

    -ఎన్నికల ముందు వైయస్ జగన్మోహన్ రెడ్డి బీసీలను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు

    -ఇచ్చిన హామీని తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు

    -బీసీల కోసం 57 కార్పొరేష న్లు ఏర్పాటు చేశాం

    -వీటి ద్వారా 700 పైచిలుకు మందినికి నాయకత్వ లక్షణాలు పెంపొందించి అవకాశాలు కల్పిస్తున్నాం

    -చంద్రబాబు ఆలోచనలో బీసీల అభివృద్ధి అంటే నాలుగు గేదలు, ఒక ఇస్త్రీ పెట్టి

    -ఏడాదిన్నర కాలంలో రెండు కోట్ల మంది బీసీలు లబ్ధి పొందేలా 19750 కోట్ల రూపాయలు ఆర్థిక పరమైన చేయూత అందించాం

    -బీసీ వర్గానికి చెందిన జస్టిస్ ఈశ్వరయ్యకు చంద్రబాబు అన్యాయం చేశారు

    -చంద్రబాబు పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలకు ఏం న్యాయం జరిగిందో ఏడాది జగన్మోహన్ రెడ్డి పాలన లో బీసీలు ఎలా అభివృద్ధి చెందారో   చర్చకు సిద్ధ

  • Tirumala-Tirupati updates: సీబీఐ కేసులో శేఖర్ రెడ్డి నిర్దోషి.. సీబీఐ కోర్టు!
    28 Sep 2020 3:28 PM GMT

    Tirumala-Tirupati updates: సీబీఐ కేసులో శేఖర్ రెడ్డి నిర్దోషి.. సీబీఐ కోర్టు!

    తిరుపతి..

    -సిబిఐ కేసులో టిటిడి పాలక మండలి ప్రత్యేక ఆహ్వానితుడు శేఖర్ రెడ్డికి ఊరట..

    -సరైన సాక్ష్యాదారాలు లేకపోవడంతో ఆయనపై కేసును కొట్టేసిన సిబిఐ కోర్టు

    -పాతనోట్ల రద్సు సమయంలో 247కోట్లు దొడ్డిదారిన మార్చారన్న అభియోగంపై సిబిఐ కేసు నమోదు

    -పూర్తి విచారణ అనంతరం సాక్ష్యాదారాలు లేవని కేసు కొట్టేసిన సిబిఐ కోర్టు

  • Vijayawada updates: గ్రామ వార్డ్ సచివాలయ పరీక్షలకు 72.89% మంది హాజరయ్యారు..
    28 Sep 2020 2:52 PM GMT

    Vijayawada updates: గ్రామ వార్డ్ సచివాలయ పరీక్షలకు 72.89% మంది హాజరయ్యారు..

    విజయవాడ..

    కలెక్టర్ ఇంతియాజ్..

    -కరోన బాధితులకు ప్రత్యేక రూంలతో పాటి పీపీ కిట్స్ తో పరిక్షలు నిర్వహించం.

    -జిల్లాలో ఐదు క్లస్టర్లుగా ఏర్పాటు చేసి పరిక్షలు నిర్వహించం.

    -హెల్ప్ డెస్క్... కరోన ధర్మల్ స్క్రీనింగ్ చేసేకె పరీక్ష కేంద్రాలకు అనుమతి ఇచ్చాము.

    -32,405 మంది గైహాజరయ్యారు.

    -87,136 మంది హాజరయ్యారు.

    -పరీక్ష కేంద్రంలో గదికి 12 మందిని మాత్రమే అనుమతి ఇచ్చాము.

  • Amaravati updates: ఏపీ సీఎం జగన్ మోహన పాదయాత్రలో అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటానని మాట ఇచ్చారు.
    28 Sep 2020 2:34 PM GMT

    Amaravati updates: ఏపీ సీఎం జగన్ మోహన పాదయాత్రలో అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటానని మాట ఇచ్చారు.

    అమరావతి..

    సి.ఐ.డి ప్రధాన కార్యలయం మంగళగిరి

    -ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే గుంటూరులో అగ్రిగోల్డ్ డిపోజిటర్లకు ప్రభుత్వమే సొమ్మును తిరిగి చెల్లించే కార్యక్రమం   చేపట్టారు

    -మొదటి విడతలో 3,59,655 మంది డిపోజిటర్లకు 264 కోట్ల రూపాయలు G.O. Rt. No. 930, 01-11-2019 న కేటాయించి చెల్లించారు

    -మొత్తం 1150 కోట్ల రూపాయలు చెల్లించడం కోసం ప్రభుత్వం G.O.Rt. No. 913, 25-10-2019 న విడుదల చేసారు

    -హైదరాబాద్ హైకోర్ట్ పరిధిలో ఈ అంశం ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉంది

    -తొలివిడుత పదివేల పాయల నష్టపరిహారం కొద్ది మందికి అందలేదన్న విషయం సీఎం జగన్ దృష్టికి వచ్చింది

    -గత అక్టోబర్లోనే అలా మిగిలిన పదివేల రూపాయల లోపు డిపాజిటర్లకు, ఇరవై వేల రూపాయల డిపాజిటరచెల్లించాలని ఆదేశించి, హైదరాబాద్ హై కోర్ట్ కు   నివేదించారు

    -ఇరవై వేల రూపాయల డిపోజిట్ల పంపిణీకి విధి విధానాలు హైదరాబాద్ హై కోర్ట్ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాము

    -హైదరాబాద్ హై కోర్ట్ వారి ఆదేశాలు రాగానే, గతంలో చెల్లింపులు జరగని పదివేల రూపాయల డిపోజిటర్లకు కూడా చెల్లింపులు జరుగుతాయని     తెలియచేస్తున్నాము

  • Srkakulam updates: శ్రీకాకుళం జిల్లాలో 15 వేల బోరు బావులకు ప్రణాళికా సిద్ధం చేశారు..
    28 Sep 2020 1:41 PM GMT

    Srkakulam updates: శ్రీకాకుళం జిల్లాలో 15 వేల బోరు బావులకు ప్రణాళికా సిద్ధం చేశారు..

    శ్రీకాకుళం జిల్లా..

    -స్పీకర్ తమ్మినేని సీతారాం కామెంట్స్..

    -తన పాదయాత్రలో రైతుల కష్టాలను దగ్గరగా చూసిన జగన్ అధికారమలోకి రాగానే వారి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు..

    -అందులో భాగమే వైఎస్సార్ జలకళ పధకం..

    -జిల్లాలో 23 వేల మంది రైతులకి ఈ పధకం ద్వారా లబ్ధి చేకూరుతుంది..

    -రైతులకు బోర్లు తవ్వించడమే కాక మరో 1700 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు చేసి మోటర్లు అందించాలని సిఎం జగన్ నిర్ణయించారు..

    -దేశంలోనే ఉచితంగా బోరు బావులు తవ్విస్తున్న ప్రధమ రాష్ట్రం మనది..

    -జగన్ మాట ఇస్తే జరిగి తీరుతుంది..

    -జగన్మోహనాస్త్రాలలో జలకళ పధకం ఒకటి..

    -అన్నివర్గాల ప్రజల ఆకాంకాశాలను నెరవేస్తున్న ముఖ్యమంత్రి జగన్ కు అభినందనలు తెలియజేస్తున్నాను..

  • Amaravati updates: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చంద్రబాబు లేఖ..
    28 Sep 2020 12:50 PM GMT

    Amaravati updates: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చంద్రబాబు లేఖ..

    అమరావతి..

    -రాష్ట్రంలో వరుస వరద విపత్తులు- ఎడతెరిపిలేని భారీ వర్షాలు

    -రైతాంగానికి తీవ్ర నష్టం- పంటనష్టం అంచనాలను శీఘ్రగతిన చేపట్టడం

    -వరద బాధితులకు నష్ట పరిహారం తక్షణమే అందించడం-కనీస మద్దతు ధర చెల్లించడం

    -వరదల్లో దెబ్బతిన్న పంట ఉత్పత్తుల కొనుగోళ్ల గురించి...లేఖలో వివరించిన చంద్రబాబు

  • Visakha updates: మిదిలాపూరి ఊడా కాలని లో ఏపి రాజధాని పాస్టర్స్ అసోసియేషన్ కార్యక్రమానికి హాజరైన మంద కృష్ణ మాదిగ..
    28 Sep 2020 12:35 PM GMT

    Visakha updates: మిదిలాపూరి ఊడా కాలని లో ఏపి రాజధాని పాస్టర్స్ అసోసియేషన్ కార్యక్రమానికి హాజరైన మంద కృష్ణ మాదిగ..

    విశాఖ..

    -మంద కృష్ణ మాదిగ కామెంట్స్

    -నాకు కులం కన్నా మతం కన్నా మానవత్వం వైపే నా ప్రయాణం

    -మాదిగ హాక్కుల పోరాటమే A,B,C,Dల వర్గీకరణ.

    -సుప్రీం కోర్టు వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వం లోని ఆంశం అని చెప్పి నెల రోజులైనా జగన్ ఇప్పటి వరకు స్పందించ లేదు

    -తన తండ్రి ఆశయ సాధన కోసం పోరాడాతానని చెప్పిన ముఖ్య మంత్రి మాట నిలబెట్టుకోవాలి

    -తన తండ్రి గతంలో నే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి ఎస్సీ వర్గీకరణ కోసం ఆమోదం తెలిపారు

    -తండ్రి ఆశయం నెరవెర్చుకోవటం కోసం దేవుని నమ్మిన వ్యక్తి గా ఆయన ఆశయం అడుగుజాడల్లో నడవాలి.

  • Rajahmundry updates: సి.ఎం జగన్ ఢిల్లీ పర్యటన సహా తిరుమలలో శ్రీవారికి పట్టు వస్త్రాల సమర్పణపై టి.డి.పి. అనవసర రాద్ధాంతం చేస్తుంది..
    28 Sep 2020 12:32 PM GMT

    Rajahmundry updates: సి.ఎం జగన్ ఢిల్లీ పర్యటన సహా తిరుమలలో శ్రీవారికి పట్టు వస్త్రాల సమర్పణపై టి.డి.పి. అనవసర రాద్ధాంతం చేస్తుంది..

    తూర్పుగోదావరి -రాజమండ్రి

    -రాజమండ్రి ఎం.పి. మార్గాని భరత్ రామ్..

    -రాష్ట్రానికి రావల్సిన జి.ఎస్.టి. బకాయిలు, విభజన హామీల కోసం కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి కలిస్తే

    -ఎ.పి.కి అప్రదిష్ట తెచ్చేలా చంద్రబాబు అబద్ధపు ప్రచారం చేస్తున్నారు

    -తిరుమలలో శ్రీవారి తిరునామాన్ని తన నుదుటన ధరించటం కంటే

    -సి.ఎం. జగన్ ఇవ్వాల్సిన డిక్లరేషన్ ఇంకేమి ఉంటుంది

    -రాజమండ్రిలో ,భగత్ సింగ్ 114వ జయంతి సందర్భంగా నివాళి కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ భరత్

Print Article
Next Story
More Stories