Live Updates: ఈరోజు (28 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 28 అక్టోబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు బుధవారం | 28 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | ద్వాదశి మ.1-17 తదుపరి త్రయోదశి | పూర్వాభాద్ర నక్షత్రం ఉ.10-39 తదుపరి ఉత్తరాభాద్ర | వర్జ్యం: రా.9-06 నుంచి 10-51 వరకు | అమృత ఘడియలు లేవు | దుర్ముహూర్తం: ఉ.11-21 నుంచి 12-06 వరకు | రాహుకాలం: మ.12-00 నుంచి 1-30 వరకు | సూర్యోదయం: ఉ.05-59 | సూర్యాస్తమయం: సా.05-31
Live Updates
- 28 Oct 2020 4:35 PM GMT
Visakha Updates: కూర్మన్నపాలేం లో విషాదం...
విశాఖ
- ఎద్దు వెనుక నుంచి పొడవడంతో నల్లి వసంతరావు అనే వృద్దుడు మృతి
- కూర్మన్నపాలేం వద్ద కొబ్బరిబొండాలు అమ్ముతుండగా ఘటన
- ఆసుపత్రికి తరిలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టరు వెల్లడి
- 28 Oct 2020 4:33 PM GMT
Nellore District Updates: నెల్లూరు జిల్లాలో వివాదంగా మారిన ఓ హెలికాప్టర్ ల్యాండింగ్...
నెల్లూరు :--
-అనంతసాగరం మండలం రేవూరు గ్రామంలో తమ బంధువుల వివాహానికి హెలికాప్టర్ లో వచ్చి హాజరైన హైదరాబాద్ కు చెందిన ఓ కుటుంబం.
-ఎటువంటి అనుమతులు లేకుండా గ్రామంలోని హై స్కూల్ ప్రాంగణంలో హెలికాప్టర్ ల్యాండ్ అయిన విషయంపై సీరియస్ అయిన జిల్లా ఉన్నతాధికారులు.
-హెలికాప్టర్ ల్యాండ్ అయిన రేవూరు హైస్కూల్ హెడ్ మాస్టర్ మరియు హెలికాప్టర్ లో వచ్చిన వారిపై కేసు నమోదు చేసేందుకు విచారణ చేపట్టిన పోలీసులు..
- 28 Oct 2020 4:31 PM GMT
Amaravati Updates: క్యాంపు కార్యాలయంలో సీఎం ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి వేణుగోపాలకృష్ణ...
అమరావతి
-బీసీ సంక్షేమ కృషీవలుడు సి.ఎం. జగన్మోహన్ రెడ్డి:
-బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ
- బీసీ కార్పోరేషన్లు, బీసీ సంక్షేమ పధకాలు, శాఖపరమైన సమస్యలపై చర్చించిన మంత్రి.
-కొత్తగా ఏర్పాటు చేసిన బీసీ కార్పోరేషన్లకు సంబంధించి సి.ఎం. జగన్మోహన్ రెడ్డితో చర్చించిన మంత్రి
-వెనుబడిక వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, బీసీల అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు
-56 బీసీ కార్పోరేషన్లకు 56 ఛైర్మన్లు, 672 మంది డైరెక్టర్లు కలిపి మొత్తం 720 మంది బీసీలకు ప్రభుత్వంలో సి.ఎం. జగన్మోహన్ రెడ్డి భాగస్వామ్యం కల్పించారు.
-సి.ఎం జగన్మోహన్ రెడ్డి బడుగుబలహీన వర్గాల మనస్సులో చిరస్ధాయిగా నిలిచిపోతారు : మంత్రి వేణు
- 28 Oct 2020 4:28 PM GMT
Krishna District Updates: అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత...
కృష్ణాజిల్లా
- ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్గేట్ సమీపంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత
- ఏలూరు నుండి విజయవాడ వైపు తరలిస్తున్న గంజాయి
- పోలీసులను చూసి భయంతో కారు వదిలి పరారైన దుండగులు
- 28 Oct 2020 4:27 PM GMT
Amaravati Updates: వసంతవాడ వాగు ప్రమాదంపై స్పందించిన ఏపీ ప్రభుత్వo...
అమరావతి
*ఒక్కోి కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటన
*వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ద్వారా ఆరుగురు మృతుల కుటుంబాలకు రూ.18 లక్షలు అందజేయనున్న ప్రభుత్వం
*మృతి చెందిన ఆరుగురు కూడా విద్యార్థులు, యువకులు కావడంతో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని భరోసా...
*జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలు రాజు, SP నారాయణ నాయక్, పోలవరం MLA తెల్లం బాలరాజు తో ఫోన్ లో మాట్లాడి ఘటన పై మంత్రి ఆళ్ల నాని ఆరా...
*ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగానికి మంత్రి ఆళ్ల నాని ఆదేశం...
- 28 Oct 2020 2:48 PM GMT
Amaravati Updates: ఎస్ఈసీ-సీఎస్ భేటీలో రాష్ట్రంలోని కరోనా పరిస్థితిపై చర్చ...
అమరావతి
- వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వోద్యోగులు కరోనా బారిన పడ్డారని ఎస్ఈసీ లెక్కలతో వివరించిన సీఎస్.
- కీలకమైన పోలీసు శాఖలో వేల సంఖ్యలో కరోనా కేసులున్నట్టు ఎస్ఈసీ దృష్టికి తెచ్చిన సీఎస్.
- ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక ఎన్నికల నిర్వహాణ అనేది కష్టమనే భావనను వ్యక్తం చేసిన సీఎస్ నీలం సాహ్నీ.
- పరిస్థితులు కుదటపడగానే ఎస్ఈసీని సంప్రదిస్తామని వెల్లడి.
- కరోనా పరిస్థితులను ఎస్ఈసీకి ఎప్పటికప్పుడు వివరిస్తామన్న సీఎస్.
- 28 Oct 2020 2:46 PM GMT
Somu Veerraju: దళిత, బిసి రైతుల పై అక్రమంగా పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలి...
అమరావతి
* సోము వీర్రాజు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు
* రాజధాని ప్రాంత రైతులను బేషరతుగా విడుదల చేయాలి
* అమరావతి కోసం ఉద్యమం చేస్తున్న రైతులు తమ గోడు చెప్పుకోవడాన్ని నేరంగా భావించడం సరి కాదు
* ప్రజా స్వామ్యంలో తమ సమస్య లను చెప్పుకునే హక్కు అందరకీ ఉంటుంది
* తీవ్రమైన నేరం చేసిన వారిలా.. ఉగ్రవాదుల్లా సంకెళ్లతో తీసుకెళ్లడం అప్రజాస్వామికం
- 28 Oct 2020 2:39 PM GMT
Visakha updates: విశాఖ విద్యుత్ ,ట్రాఫిక్ సమస్యలు తీర్చే యోచనలో ప్రభుత్వం వుంది....
విశాఖ
- మంత్రి అవంతి శ్రీనివాసరావు కామెంట్స్
- త్వరలో ఎన్ ఏ. డి ఫ్లై ఓవర్ పూర్తి చేసి సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తాం.
- బీచ్ కారిడార్ అభివృద్ధి పనులపై ప్రత్యేక శ్రద్ద వుంది.
- బీచ్ ట్రాఫిక్ తగ్గించేందుకు మల్టీ లెవెల్ పార్కింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం.
- విశాఖ పరిపాలన రాజధానితో పాటు టూరిజం రాజధానిగా చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన.
- 28 Oct 2020 2:08 PM GMT
Amaravati Updates: విద్యార్థుల మృతి పట్ల గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ సంతాపం...
అమరావతి
// విద్యార్థుల మృతి పట్ల గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ సంతాపం
// పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడు మండలంలో ఆరుగురు విద్యార్థులు మృతి చెందిన విషాద సంఘటన పట్ల గవర్న ర్ బిశ్వ భూషణ్ హరి చందన్ తీవ్ర దిగ్ర్భాంతి
// వసంతవాడ సమీపంలో బుధవారం ఈ సంఘటన చోటు చేసుకోగా, ఈత కొట్టేందుకు వాగులోకి వెళ్ళిన చిన్నారులు ప్రాణాలు కోల్పోవటం బాధాకరం
// భూదేవిపేట గ్రామానికి చెందిన పలు కుటుంబాలు వన భోజనాలు చేసేందుకు పెదవాగుకు వెళ్లాగా, సరదాగా ఈత కొట్టేందుకు వాగులోకి దిగిన గొట్టుపర్తిమనోజ్(16), కోనవరపు రాధాకృష్ణ(16), కర్నాటి రంజిత్(16), శ్రీరాముల శివాజి(17), గంగాధర్ వెంకట్(17), చల్లా భువన్(18) గల్లంతయ్యారు.
// గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చేపట్టి గల్లంతైన వారి మృతదేహాలను వెలికితీశారు.
// విద్యార్థుల తల్లిదండ్రులకు తన సానుభూతిని ప్రకటించిన గవర్నర్ హరి చందన్
// పిల్లల విషయంలో ఏమరుపాటు తగదని హితవు
- 28 Oct 2020 1:58 PM GMT
Srikakulam Updates: అధికారులు పై స్పీకర్ తమ్మినేని సీతారాం వివాదాస్పద వ్యాఖ్యలు..
శ్రీకాకుళం జిల్లా..
-- సంక్షేమ పథకాలు అమలులో అధికారులు అక్రమాలకు పాలపడితే తొక్కతీస్తాం అంటూ వార్నింగ్..
-- అర్హులైన లబ్ధిదారులకు అన్యాయం జరిగితే అధికారులకు తొక్కలూడతీస్తాం అంటూ హెచ్చరికలు..
-- ప్రభుత్వ పథకాలు ప్రతీ లబ్ధిదారుడికి చేరాలని ఆదేశం..
-- టాంపరింగ్ లకు పాల్పడుతూ అర్హులకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు..
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire