Live Updates: ఈరోజు (27 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు మంగళవారం | 27 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | ఏకాదశి మ.12-03 వరకు తదుపరి ద్వాదశి | శతభిష నక్షత్రం ఉ.8-54 వరకు తదుపరి పూర్వాభాద్ర | వర్జ్యం: మ.3-46 నుంచి 5-29 వరకు | అమృత ఘడియలు రా.2-04 నుంచి 3-47 వరకు | దుర్ముహూర్తం: ఉ.8-17 నుంచి 9-03 వరకు తిరిగి రా.10-29 నుంచి 11-19 వరకు | రాహుకాలం: మ.3-00 నుంచి 4-30 వరకు | సూర్యోదయం: ఉ.05-59 | సూర్యాస్తమయం: సా.05-౩౧
Live Updates
- 27 Oct 2020 11:06 AM GMT
Cinema Shooting in Nizam College:పరీక్షలు జరుగుతున్న సమయంలో సినిమా షూటింగ్....
హైదరాబాద్ నిజాం కాలేజ్ లో సినిమా షూటింగ్.
విద్యార్థులకు పరిక్షలు జరుగుతున్న తరుణంలో షూటింగ్ నిర్వహించడం పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విద్యార్థి సంఘం నాయకులు.
పరీక్షలు జరుగుతున్న సమయంలో నిజాం కాలేజ్ ప్రిన్సిపాల్ ఎలా అనుమతి ఇస్తారు.
వెంటనే షూటింగ్ నిలిపివేయాలని డిమాండ్.
- 27 Oct 2020 10:51 AM GMT
Telangana Updates: " తెలంగాణ రాష్ట్ర స్టాటిస్టికల్ అబ్ స్ట్రాక్ట్ " పుస్తకాన్ని ఆవిష్కరించిన వినోద్ కుమార్...
# ప్రభుత్వ పాలనలో ప్రణాళికా శాఖ పాత్ర కీలకం
#ఇతర శాఖలకు దిక్సూచి ప్రణాళికా శాఖ
#ప్రణాళికా శాఖ వెబ్సైట్ ను ప్రజా ప్రతినిధులు విధిగా ఉపయోగించాలి
#గణాంక భవన్ లో " తెలంగాణ రాష్ట్ర స్టాటిస్టికల్ అబ్ స్ట్రాక్ట్ " పుస్తకాన్ని రాష్ట్ర ఆర్ధిక, ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి వినోద్ కుమార్ ఆవిష్కరించారు.
#రాష్ట్రానికి సంబంధించిన జీఎస్డీపీ అంచనాలు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వివిధ పథకాలు, పలు సర్వే గణాంక సమాచారం, రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతి వివరాలను ఈ పుస్తకంలో పొందుపర్చారు.
#రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ప్రణాళికా శాఖ ముఖ్య భూమికను పోషిస్తోందని తెలిపారు.
#రాష్ట్ర సమగ్ర కార్యాచరణ సమాచారాన్ని క్రోడీకరించి పుస్తక రూపంలో అందుబాటులోకి తీసుకుని రావడం గొప్ప విషయం
#ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు విధిగా ఈ వెబ్ సైటు ను డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించాలి
# సమావేశాల్లో ఈ గణాంకాలను ప్రజలకు వివరించాలి
#గ్రామ స్థాయి సమగ్ర సమాచారంతో ప్రత్యేకంగా పుస్తకాన్ని తీసుకుని రావాల్సిన అవసరం ఉంది
#రోడ్ అట్లాస్ పై దృష్టిని సారించాలి
- 27 Oct 2020 10:35 AM GMT
Mahabubabad Updates: మంద సాగర్ ని నాలుగు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చిన కోర్టు..
మహబూబాబాద్ జిల్లా...
* మహబూబాబాద్ లో 9 ఏళ్ల బాలుడి కిడ్నప్ హత్య కేసులో నిందితుడు మంద సాగర్ ని నాలుగు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చిన కోర్టు
* ఐదు రోజుకు కస్టడీ కావాలంటూ కోర్టులో పిటిషన్ వేసిన పోలీసులు
* నాలుగు రోజుకు కస్టడీకి అనుమతి ఇచ్చిన కోర్టు. 31 వరకు కస్టడీ అనుమతి.
* మహబూబాబాద్ సబ్ జైల్ నుండి ఈరోజు సాయంత్రం నిందితుడు సాగర్ ని కస్టడీ లోకి తీసుకోనున్న పోలీసులు
* బాలుడి హత్య వెనుక ఉన్న కారణలను నిందితుడి నుండి మరిన్ని వివరాలు రాబట్టనున్న పోలీసు
- 27 Oct 2020 10:27 AM GMT
Telangana Updates: తెలంగాణ రాష్ట్రానికి మరో రెండు భారీ పెట్టుబడులు....
తెలంగాణ
#ఒకే రోజు తమ పెట్టుబడులను ప్రకటించిన రెండు కంపెనీలు
#మంత్రి కేటీఆర్ ని ప్రగతి భవన్లో కలిసి ఈ మేరకు ప్రకటన చేసిన లారస్ ల్యాబ్స్, గ్రాన్యూల్స్ ఇండియా ప్రతినిధులు
#సుమారు 700 కోట్ల రూపాయల పెట్టుబడులను ప్రకటించిన రెండు కంపెనీలు
#తమ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ల కోసం 400 కోట్లు గ్రాన్యూల్స్ ఇండియా, మరో 300 కోట్లు లారస్ ల్యాబ్స్ పెట్టుబడిగా పెట్టనున్నాయి
#రెండు కంపెనీలకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి కేటీఆర్
#అన్ని రకాలుగా ప్రభుత్వ సహకారం అందిస్తామని హామీ
- 27 Oct 2020 10:15 AM GMT
Krishna Saagar Rao: పోలీసులు చూపిన అత్యుత్సాహం, తప్పుడు ప్రవర్తనను బీజేపీ ఖండిస్తోంది...
// కె.కృష్ణసాగర్ రావు...బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి.
// బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ని బలవంతంగా అరెస్టు చేయడంలో పోలీసులు చూపిన అత్యుత్సాహం, తప్పుడు ప్రవర్తనను బీజేపీ ఖండిస్తోంది.
// ఎంపీ బండి సంజయ్ పోలీసులపై ఎదురుదాడి చేయలేదు,అరెస్ట్ ను అడ్డుకోలేదు అయినా కూడా వారిపై భౌతిక దాడి చేయడం వారిని పోలీస్ వాహనాల్లోకి నెట్టివేయడం, బల ప్రయోగం చేయడం తీవ్రంగా ఖండించాల్సిన విషయం
// నిజంగా పోలీసుల దగ్గర ఈ అరెస్టుకు సరైన కారణం ఉండుంటే, వారు ఇంత బలవంతంగా కాకుండా సాధారణంగానే అరెస్టు చేసుండేవారు. పోలీసుల బలవంతపు, దుర్మార్గపు ప్రవర్తన ప్రధాన, సోషల్ మీడియాల్లో స్పష్టంగా కనిపించింది.
// బీజేపీ దుబ్బాక అభ్యర్థి రఘునందన రావును లక్ష్యంగా చేసుకని పోలీసులు చేస్తోన్న అక్రమ దాడులను బీజేపీ ఖండిస్తోంది .రాష్ట్ర ఎన్నికల సంఘం కేసీఆర్ చేతుల్లో కీలు బొమ్మ అయ్యిందేమో అనిపిస్తోంది.
// ఎన్నికల కోడ్ ఉన్న అమలులో ఉన్న ఈ సమయంలో తెలంగాణ పోలీసులు ఎన్నికల సంఘం చెప్పినట్టు చేస్తున్నారా లేకపోతే స్వతంత్ర్యంగా వ్యవహరిస్తున్నారా? ఏ చట్టం ప్రకారం పోలీసులు ఒక పార్టీ అభ్యర్థి కుటుంబ సభ్యుల హక్కులు హరించేసి, వారిని కనీసం ఫోన్లు కూడా చేయనీయకుండా ఆపారు? పోలీసులు ఎన్నికల సంఘం కోసం పనిచేస్తున్నారా? లేకపోతే టిఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తున్నారా? వాళ్లు ఎవరి మెప్పు పొందాలనుకుంటున్నారు?
// దుబ్బాకలో పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతోంది. ఉప ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థికి సమాన అవకాశాలు కల్పించకుండా, అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తూ, పోలీసులు వేధిస్తూ పెత్తనం చేస్తున్నారు. ఇప్పటికైనా ఎన్నికల సంఘం నిద్ర లేచి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలు చేయాలి.
- 27 Oct 2020 10:10 AM GMT
Karimnagar District Updates: బండి సంజయ్ కి వైద్య పరీక్షలు..
కరీంనగర్ జిల్లా...
-- తగ్గిన షుగర్ లెవల్స్.
-- స్వీయ నిర్బంధం లో కొనసాగుతున్న నిరసన దీక్ష
- 27 Oct 2020 9:57 AM GMT
Revanth Reddy: టిఆర్ఎస్ బుట్టలో పాములాంటిది...
ఏ.రేవంత్ రెడ్డి, ఎంపీ, చిట్ చాట్
#బీజేపీ కి తన వరకు వస్తే గాని తత్వం బోధపడలేదు
#టిఆర్ఎస్ తన బుట్టలోనిదే అని బీజేపీ ఇన్నిరోజులు భావించింది.
#ఒక పార్టీ అధ్యక్షుడిని గొంతుపిసికి చంపే ప్రయత్నం చేశారు.
#బీజేపీలో కేసీఆర్ అనుకూల, వ్యతిరేక వర్గం ఉంది..
#బండి సంజయ్ ను పరామర్శించడానికి మురళీధర్ రావు, విద్యాసాగర్ రావు ఎందుకు వెళ్ళలేదు..
#కలెక్టర్, పోలీస్ కమిషనర్ ను పిలిచి రివ్యూ పెట్టే అధికారం ఉన్నా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు చేయలేదు.
#కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి విచారణకు ఎందుకు అదేశించలేదు.
#టిఆర్ఎస్ తో కిషన్ రెడ్డి కి ఉన్న మ్యాచ్ ఫిక్సింగ్ ఏంటి?
#డబ్బులు ఉంటే సోదాలు చేయాల్సింది ఐటి డిపార్ట్ మెంట్
#పోలీస్ లకు సోదాలు చేసే అధికారం ఎక్కడిది..
#రఘురామ రాజుకు సెక్యురిటి ఇచ్చిన కేంద్రం తమ సొంత ఎంపీ రాష్ట్ర అధ్యక్షుడికి ఎందుకు ఇవ్వలేదు.
#బండి సంజయ్ ని మొదటిసారి కొట్టినప్పుడు పోలీస్ ల మీద చర్యలు తీసుకోలేదు కాబట్టే ఇప్పుడు మళ్ళీ చంపే ప్రయత్నం చేశారు.
- 27 Oct 2020 9:42 AM GMT
ACB Court Updates: ఓటుకు నోటు కేసు పై ఏసీబీ కోర్ట్ విచారణ...
ఏసీబీ కోర్ట్......
-తమ పేర్లు తొలగించాలని సండ్ర వెంకట వీరయ్య, ఉదయ సింహా డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు..
-ఏసీబీ ధాఖలు చేసిన కౌంటర్ పిటీషన్ల పై విచారణ చేపట్టిన ఏసీబీ కోర్ట్...
-నిందితులు ధాఖలు చేసిన డిశ్చార్జ్ పిటీషన్ లను అనుమతించవద్దని వాదనలు వినిపించిన ఏసీబీ తరపు న్యాయవాది..
-నిందితుల ఆడియో , వీడియో లు స్పష్టంగా ఉన్నాయని కోర్టుకు తెలిపిన ఏసీబీ.
-తప్పు చేసి కేసుల నుండి తప్పించుకోవడానికి డిశ్చార్జ్ పిటీషన్ దాఖలు చేశారన్న ఏసీబీ..
-నిందితుల తరపు వాదనలకు కేసు విచారణ రేపటికి వాయిదా వేసిన ఏసీబీ కోర్ట్.
- 27 Oct 2020 9:35 AM GMT
Kotha Prabakar reddy: డి.శ్రీనివాస్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి...
ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి
....పాల్గొన్న మంత్రి హరీష్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, దుబ్బాక టీఆరెస్ అభ్యర్థి సుజాత
.... రాజ్య సభ సభ్యుడు డి.శ్రీనివాస్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి
.... డి.శ్రీనివాస్ కు టీఆరెస్ పార్టీ లో ఉంటూ బీజేపీ లో ఉన్న కొడుకు ఎంపీ అరవింద్ కు సపోర్ట్ చేస్తున్నాడు..
..... డి.శ్రీనివాస్ కు సిగ్గూ, శరం ఉంటే రాజ్య సభ సభ్యత్వానికి, టీఆరెస్ పార్టీకి రాజీనామా చేయాలి
- 27 Oct 2020 9:22 AM GMT
Sangareddy Updates: గాంధీ విగ్రహం వద్ద బీజేపీ నాయకుల నిరసన....
సంగారెడ్డి జిల్లా...
// పారిశ్రామిక వాడ బొల్లారం లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
// బండి సంజయ్ అరెస్ట్ కు నిరసిస్తూ గాంధీ విగ్రహం వద్ద బీజేపీ నాయకుల నిరసన.
// సంగారెడ్డి జిల్లా ఝరాసంగం యంపి బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా ఝరాసంగం ప్రధాన రహదారిపై బీజేపీ నాయకులు ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire