Live Updates: ఈరోజు (27 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 27 అక్టోబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు మంగళవారం | 27 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | ఏకాదశి మ.12-03 వరకు తదుపరి ద్వాదశి | శతభిష నక్షత్రం ఉ.8-54 వరకు తదుపరి పూర్వాభాద్ర | వర్జ్యం: మ.3-46 నుంచి 5-29 వరకు | అమృత ఘడియలు రా.2-04 నుంచి 3-47 వరకు | దుర్ముహూర్తం: ఉ.8-17 నుంచి 9-03 వరకు తిరిగి రా.10-29 నుంచి 11-19 వరకు | రాహుకాలం: మ.3-00 నుంచి 4-30 వరకు | సూర్యోదయం: ఉ.05-59 | సూర్యాస్తమయం: సా.05-౩౧
Live Updates
- 27 Oct 2020 4:23 PM GMT
Nizamabad Updates: సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వేచేసి రైతులను ఆదుకోవాలి...
నిజామాబాద్
-అకాల వర్షాలు, దోమ పోటు వల్ల నష్టపోయిన వరి పంటలను పరిశీలించిన తెలంగాణ టిడిపి అధ్యక్షులు ఎల్ రమణ కామెంట్స్..
-వారితో పాటు పత్తి రైతులను కూడా వర్షాలు కోలుకోలేని దెబ్బ తీశాయి
-మంత్రులు, ఎమ్మెల్యేలు తిరగాల్సింది దుబ్బాకలో కాదు పంటపొలాల్లో
-సీఎం కేసీఆర్‌కు దుబ్బాక ఉప ఎన్నికపై ఉన్న ప్రేమ రైతులపై లేదు
- 27 Oct 2020 4:06 PM GMT
Karimnagar Updates: బండి సంజయ్ ది దొంగ దీక్ష....
కరీంనగర్ :.
* సుడా ఛైర్మెన్ జివి రామకృష్ణ కామెంట్స్
* బండి సంజయ్ ది దొంగ దీక్ష , మీ పార్టీ కార్యకర్తలకు డబ్బులతో ఓట్లను కొనండి అని ప్రోత్సహించడానికా మీ దీక్ష...
* మీ చిల్లర రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం ఈ దీక్ష,
* మంత్రి హరీష్ రావు గారి సవాలును ఎదుర్కునే దమ్ము లేక ఈ వేషాలు వేస్తున్నారు...
* ఎలక్షన్స్ దుబ్బాకలో జరిగితే దీక్ష రాజకీయాలు కరీంనగర్ లో చేస్తున్నారు ...
* దుబ్బాకలో ప్రచారం చేసే పరిస్థితి లేక కరీంనగర్లో దొంగ దీక్ష చేస్తున్నారు
- 27 Oct 2020 3:54 PM GMT
Siddipet Updates: రాష్ట్ర నాయకుడు విరాహత్ అలీ వ్యాఖ్యలు..
సిద్ధిపేట జిల్లా...
*మీడియా,పత్రికా సంస్థల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన BJP జిల్లా అధ్యక్షుడు బండి సంజయ్ ,దుబ్బాక BJP అభ్యర్థి రఘునందన్ రావు పై TUWJ (I JU) మండిపాటు..
* సిద్ధిపేట ప్రెస్ క్లబ్ లో TUWJ (I JU) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, జిల్లా అధ్యక్షుడు కె. రంగాచారి,మీడియా అకాడమీ సభ్యులు కె.అంజయ్య తో పాటు సిద్ధిపేట జర్నలిస్టు ల ప్రెస్ మీట్.
* మీడియాపై,పత్రికల పై అనుచిత వ్యాఖ్యలు BJP అధ్యక్షుడు బండి సంజయ్ తన స్థాయిని దిగజార్చు కున్నారు...
* జర్నలిస్టుల ను మీడియా సంస్థలను బెదిరిస్తూ మాట్లాడడం అప్రజాస్వామికం..
* బండి సంజయ్ తన స్థాయిని రాష్ట్ర స్థాయి నుండి గల్లీ స్థాయికి దిగజార్చుకున్నారు...
* సిద్ధిపేట లో జరిగిన ఘటనను మీడియా సంస్థలకు,అక్కడి జర్నలిస్టు లకు అంటగట్టడం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనం..
* తన వ్యాఖ్యల పై బండి సంజయ్ మీడియాకు,జర్నలిస్టులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి..
* సిద్ధిపేట జర్నలిస్టు ల పై BJP అభ్యర్థి రఘునందన్ రావు బెదిరింపులకు దిగడం,దుర్భాశలాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం..
* రఘునందన్ రావు,ఆయన అనుచరులు సిద్ధిపేట జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలి..
- 27 Oct 2020 3:46 PM GMT
Telangana Updates: వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ అధికారి పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తి అరెస్ట్....
- చంచలగుడ జైల్ కి రిమాండ్ కి తరలింపు.
- అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం శాంపూర్ గ్రామానికి చెందిన కునమల్ల శ్రీనివాస రావు అనే వ్యక్తి వైద్య ఆరోగ్య శాఖ పేరు చెప్పి మోసం.
- కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కు ఫోన్ చేసి తాను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కార్యాలయంలో పని చేస్తున్న అధికారిగా పరిచయం చేసుకుంటున్నాడు.
- ముఖ్యంగా మహిళలకు ఫోన్ చేసి వారిలో కొంతమందిని పర్మినెంట్ చేయబోతున్నామని అందుకు గాను కొంత ఖర్చు అవుతుందని చెప్తున్నాడు.
- అలా ఫోన లు వచ్చిన కొంతమని మంత్రి ఈటెల దృష్టికి తీసుకురావడంతో అతని మీద ఫిర్యాదు చేయాలని మినిస్టర్ PS కు ఆదేశించారు.
- ఆ ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసు లు శ్రీనివాస్ ను అరెస్ట్ చేసి చంచలగుడా జైల్ కి తరలించారు.
- శ్రీనివాస్ మీద గతంలో 5 కేసులు ఉన్నట్టు పోలీస్ లు తెలిపారు.
- వైద్య ఆరోగ్యశాఖ లో పనిచేస్తున్న డాక్టర్స్, వైద్య సిబ్బంది , కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు , ట్రాన్స్ఫర్ లు, పోస్టింగ్స్ ఇప్పిస్తామని ఇలాంటి ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి
- ఇలాంటివి నమ్మకూడదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కార్యాలయం విజ్ఞప్తి చేసింది.
- ఇలాంటి కాల్స్ వస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.
- పోలీస్ లకు ఫిర్యాదు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.
- 27 Oct 2020 3:41 PM GMT
Karimnagar Updates: బండి సంజయ్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది...
కరీంనగర్ :
- బిజెపి అధికారప్రతినిది రాకేష్ కామెంట్స్
- షుగర్ లెవల్స్ భారీగా పడిపోతున్నాయి ..
- కావాలనే ప్రభుత్వం స్పందిచకుండా బండి సంజయ్ ని హత్య చేయాలనీ చూస్తోంది
- ఇప్పటివరకు ప్రభుత్వ వైద్యులు ఎవరు ఎంపీ గా ఉన్న సంజయ్ ఆరోగ్యం పై ఆరా తీయలేదు...
- కార్యకర్తలు ఆందోళన చెందాలిసిన అవసరంలేదు....
- ప్రభుత్వం పై పోరాటం కొనసాగుతుంది
- 27 Oct 2020 3:37 PM GMT
Dubbaka Updates: ఎం ఆర్ పి ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు....
సిద్దిపేట జిల్లా //
- దుబ్బాక రెడ్డి సంక్షేమ భవన్ లో టి ఆర్ ఎస్ కు మద్దతు గా తెలంగాణ ఎం ఆర్ పి ఎస్ ఆత్మీయ సమ్మేళనం పాల్గొన్న మంత్రి హరీష్ రావు గారు
- ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు గారు మాట్లాడుతూ..
- చేగుంట లో తన వ్యవసాయ బావులో ఎండిన పంటను తగలబెట్టి పంట లు ఎండయి అనడం సిగ్గు చేటని షబ్బీర్ అలీ పై మంత్రి హరిష్ రావు పైర్...
- ఇంత దిగజారిన రాజకీయాలు చేయడం సిగ్గు చేటాని మండి పడ్డారు..
- మీతో ఎంతో అనుబంధం ఉంది.. నాడు ఉద్యమం లో ఒకరికి ఒకరు చేదోడు వాదోడుగా ఉన్నాం..
- టి ఆర్ ఎస్ ప్రభుత్వం వచ్చాక వర్గీకరణ కు మద్దతు ఇవ్వాలి అని అసెంబ్లీ తీర్మానం పెట్టి.. కేంద్రానికి పంపితే ఎలాంటి స్పందన లేదు.. తెలంగాణ ప్రభుత్వం వర్గీకరణ పై పూర్తి స్పష్టత తో ఉంది..
- తెలంగాణ ఉద్యమంలో సింహాల లాగ గర్జించిన ఘనత మాదిగలది..
- కాంగ్రెస్, బిజెపి లు ఇదివరకు చేసింది లేదు.. ఇకముందు చేసేదేమి లేదు..
- అబద్దాలతో దుబ్బాక ప్రజలను మబ్యపెట్టే ప్రయత్నం బిజెపి చేస్తుంది.
- మిరుదొడ్డి లో బిజెపి కార్యకర్త చనిపోతే కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు రఘునందన్ ..
- ఒక కార్యకర్తను కాపాడుకోలేని అభ్యర్థి రేపు ప్రజలకు ఏమి న్యాయం చేస్తాడు..
- పైసలు పోలీసులు తెచ్చిండ్రని నిన్న సిద్దిపేట లో ఆక్షన్ చేస్తే.. అసలు రంగు ఈరోజు బయట పడింది..
- ఆక్టింగ్ లో బిజెపి కి ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిందే..
- కెసిఆర్ ప్రభుత్వం లో 230 సోషల్ వెల్ఫేర్ స్కూల్ ప్రారంభించారు..
- ఏక కాలంలో 30 మహిళా ఎస్సీ డిగ్రీ కళాశాలలు ప్రారంభించారు
- 27 Oct 2020 3:18 PM GMT
Laxmi Barrage Updates: లక్ష్మీ బ్యారేజ్ కి కొనసాగుతున్న వరద...
జయశంకర్ భూపాలపల్లి జిల్లా
-24 గేట్లు ఎత్తిన అధికారులు
-పూర్తి సామర్థ్యం 100.00 మీటర్లు
-ప్రస్తుత సామర్థ్యం 95,50 మీటర్లు
-ఇన్ ఫ్లో 49,000 క్యూసెక్కులు
-ఔట్ ఫ్లో 27,500 క్యూసెక్కులు
- 27 Oct 2020 3:00 PM GMT
Mahabubnagar Updates: దివిటిపల్లిలో ఐటీ పార్క్ టవర్ నిర్మాణ పనులు పరిశీలించిన మంత్రి శ్రీనినాస్ గౌడ్, కలెక్టర్ వెంకట్ రావు..
మహబూబ్ నగర్--
-మంత్రి శ్రీనివాస్ గౌడ్ కామెంట్స్...
-మహబూబ్ నగర్ పట్టణానికి ఉపాదినిచ్చే పరిశ్రమలు లేకపోయేవి.
400 ఎకరాల్లో ఐటీ కారిడార్ నిర్మిస్తున్నాం.
-పట్టణాన్ని అభివృద్ది పథంగా తీర్చిదిద్దుతున్నాం.
-ఐటి కారిడార్ మహబూబ్ నగర్ పట్టణానికే తలమానికంగా మారుతుంది.
-భూ నిర్వాసితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేశాం.
-మరో కొత్త ప్రాజెక్టును మహబూబ్ నగర్ కు తీసుకొస్తున్నాం... దీపావళి రోజున ప్రకటిస్తాం..
-ప్రాజెక్టుల పేర్లు ముందే చెప్తే రియర్టర్లు వాలిపోతున్నారు.
-మహబూబ్ నగర్ పట్టణాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దడమే మా లక్ష్యం.
-పేద ప్రజలను మోసం చేసే వారిని ఎప్పుటికీ ఉపేక్షించబోం..
-పెద్దపెద్ద కంపెనీలు హైద్రాబాద్ నుంచి మహబూబ్ నగర్ కు తరలివస్తున్నాయి.. వారి కోసం వెయ్యెకరాలు సేకరించబోతున్నాం..
-ఐదు వేలవకోటేల పెట్టుబడులను ఆశిస్తున్నాం... ఇప్పటికి వెయ్యి కోట్లు పెట్టేందుకు కంపెనీలు రెడీ అయ్యాయి.
- 27 Oct 2020 2:53 PM GMT
National Updates: బండి సంజయ్ పై పోలీసుల దురుసు ప్రవర్తనపై జాతీయ బీసీ కమిషన్ సుమోటో కేసు..
జాతీయం..
-బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పై పోలీసుల దురుసు ప్రవర్తనపై జాతీయ బీసీ కమిషన్ సుమోటో కేసు
-తెలంగాణ చీఫ్ సెక్రటరీ, డీజీపీకి నోటీసులు
-ఈ ఘటనపై నవంబర్ 5లోగా పూర్తి వివరాలు అందించాలని ఆదేశం
-దాడికి పాల్పడిన అధికారులు, పోలీసుల ఎందుకు కేసు నమోదు చేయకూడదో చెప్పాలని షోకాజ్ నోటీసు
-బీసీ వర్గానికి చెందిన బండి సంజయ్ హక్కులను రక్షించడమే బీసీ కమిషన్ రాజ్యాంగ విధి అని నోటీసులో స్పష్టం చేసిన బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి
- 27 Oct 2020 2:45 PM GMT
Hyderabad Updates: నిషేదిత చరాస్ ను సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు...
హైదరాబాద్..
-వారి నుంచి 40 గ్రాముల చరాస్ స్వాధీనం..
-మగళహట్ పోలీస్టేషన్ పరిధిలో అమ్ముతుండగా సూరజ్ సింగ్, లలిత్ కుమార్ లను పట్టుకున్న పోలీసులు..
-పది గ్రాములు 1800 రుపాయాలకు అమ్ముతున్నట్లు గుర్తించిన పోలీసులు ..
-మంగళహాట్ పోలీసులకు అప్పగించిన టాస్క్ఫోర్స్ పోలీసులు...
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire