Live Updates:ఈరోజు (ఆగస్ట్-25) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు మంగళవారం, 25 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం సప్తమి: (సా. 4-47 వరకు) తదుపరి అష్టమి; విశాఖ నక్షత్రం (రా. 7-05 వరకు) తదుపరి అనూరాధ; అమృత ఘడియలు (ఉ. 10-50 నుంచి 12-20 వరకు) వర్జ్యం (రా. 10-51 నుంచి 12-21 వరకు) దుర్ముహూర్తం (ఉ. 8-17 నుంచి 9-07 వరకు తిరిగి రా. 10-53 నుంచి 11-39 వరకు) రాహుకాలం (మ. 3-00 నుంచి 4-30 వరకు) సూర్యోదయం: ఉ.5-48 సూర్యాస్తమయం: సా.6-17
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 25 Aug 2020 10:57 AM GMT
Srisailam: అనుమానాస్పద మృతి
కర్నూలు జిల్లా: శ్రీశైల క్షేత్రానికి కూతవేటు దూరంలో ఉన్న రామయ్య టర్నింగ్ అటవీ సమీపాన ఒక వ్యక్తి అనుమానాస్పద మృతి
మృతి చెందిన వ్యక్తి పాములపాడు మండలం వేంపెంట గ్రామానికి చెందిన తోట నరసింహారావు( 38)గా గుర్తించిన శ్రీశైలం పోలీసులు
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు
- 25 Aug 2020 10:53 AM GMT
కరోనాపై జాగ్రత్తలు తీసుకోవాలని డి ఐ జి సూచన.
అనంతపురం: శింగనమల నియోజకవర్గం పుట్లూరు సర్కిల్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన డి ఐ జి క్రాంతి రాణా టాటా .కరోనా వైరస్ పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని డిఎస్పి,సిఐలు,ఎస్ఐలకు సూచన.
- 25 Aug 2020 10:48 AM GMT
ESI Scam Upadates: ఏపీ ఈఎస్ఐ స్కాంలో తొలి బెయిల్
అమరావతి: ఏపీ ESI స్కాంలో తొలి బెయిల్ ఉత్తర్వులు
ఏ14 మెడికల్ డీలర్ కార్తీక్ కు బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు
ఇప్పటి వరకు 12 మందిని అరెస్టు చేసిన ఏసీబీ ఈఎస్ఐ
- 25 Aug 2020 10:44 AM GMT
Guntur: గుంటూరులో వైసిపి నేతల ఘర్షణ
గుంటూరు: కొల్లిపర మండలం మున్నంగి లో వైసిపి నేతల ఘర్షణ...
ఓ గౌడ కులస్తుడికు పరాభవం.
బార్యతో కలసి పొలం వెళ్ళి వస్తున్న వ్యక్తి పట్ల యువకులు దురుస ప్రవర్తన.
మద్యం మత్తులో మహిళను కించపరిచే వ్యాఖ్యలు.....
యువకుడును ప్రతిఘటించిన భర్త శొంటి సాంబశివరావు.
సాంబశివరావు ను రాత్రికి ఓ డెన్ కు పిలిపించిన స్దానిక వైసిపి నేతలు.
నీ గౌడ కులం కుడా ఓ కులమనా అంటూ హేలనా.
మా కులం యువకుడుని ఎదురించి మీరు గ్రామం లో బ్రతకగలరా అంటూ బెదిరింపులు....
ఫిర్యాదు చేసిన భాధితుడు....
కేసు నమోదు చేసిన పోలీసులు
- 25 Aug 2020 10:27 AM GMT
విజయవాడ
- స్వర్ణా ప్యాలెస్ అగ్ని ప్రమాదంలో అరెస్టు కాబడిన ముగ్గురి బెయిల్ పిటిషన్ కొట్టేసిన కృష్ణా జిల్లా కోర్టు
- ప్రమాదానికి కారకులుగా రమేష్ ఆసుపత్రి డాక్టర్లు రాజగోపాల్, సుదర్శన్, వెంకటేష్ లను అరెస్టు చేసిన పోలీసులు
- ముగ్గురి కస్టడీ పిటిషన్ అనుమతించి, బెయిల్ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం
- 25 Aug 2020 9:38 AM GMT
Kapada: పోరుమామిళ్ల అటవీలో అదికారుల తనిఖీలు
కడప : పోరుమామిళ్ల అటవీ ప్రాంతం లో ఫారెస్ట్ అదికారుల తనిఖీలు .....
అనుమానాస్సాదంగా తిరుగుతున్న ఆరుగులు అరెస్టు .... మరికోందరు పరార్ ....
పరారైన వారి కోసం కొనసాగుతున్న గాలింపు ....
23 దుంగలు.... ఒక వాహానం స్వాధీనం
- 25 Aug 2020 9:33 AM GMT
HMTV Effect: జగనన్న హరితహారం పేరుతో మొక్కలు అక్రమ రవాణా
పశ్చిమ గోదావరి: HMTv ఎఫెక్ట్....
జిల్లాలో జగనన్న హరితహారం పేరుతో మొక్కలు అక్రమ రవాణా..
ఫారెస్ట్ అధికారుల దందా పై వరుస కధనాలు ప్రసారం చేసిన hmtv
స్పందించిన జిల్లా ఫారెస్ట్ శాఖ ఉన్నతాధికారులు.
మల్లేకుంట నర్సరీకి చేరుకున్న జిల్లా డిఎఫ్ ఓ,రాజమండ్రి స్కాడ్ డిఎఫ్ ఓ, ఫారెస్ట్ రేజ్ ఆఫీసర్..
లక్షలాది మొక్కలు అక్రమ తరలింపు పై కొనసాగుతున్న విచారణ..
కీలక సూత్రదారి ఎఫ్ ఎస్ ఓ గోపీకుమార్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..
మొక్కలను కొన్న దళారీలను విచారిస్తున్న అధికారులు..
- 25 Aug 2020 9:23 AM GMT
ప్రచార పిచ్చితో పసివాళ్ల ప్రాణాలు తీస్తారా ?: వంగలపూడి అనిత
అమరావతి: ప్రచార పిచ్చితో పసివాళ్ల ప్రాణాలు తీస్తారా..అని తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు.
వైసీపీ రంగులేసిన స్కూలుబ్యాగులు, యూనిఫామ్ పంపిణీ కోసం పాఠశాలలు తెరవాలనుకోవడం ప్రభుత్వ మూర్ఖత్వం
కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్నసమయంలో ప్రభుత్వం ప్రచారార్భాటంతో స్కూళ్లు తెరవాలనుకుంటోంది
ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులే మాస్కులు లేకుండా తిరుగుతుంటే, చిన్నపిల్లలు ఎలా ధరిస్తారు?
విద్యార్థుల భవిష్యత్ గురించి పాలకులు అంతగా ఆలోచిస్తుంటే, వాలంటీర్ల ద్వారా పుస్తకాలు, బ్యాగులు, పంపిణీ చేయాలి.
ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీల వారు ఆన్ లైన్లో క్లాసులు నిర్వహిస్తుంటే, ప్రభుత్వం ఆ దిశగా ఎందుకు ఆలోచించదు
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సెల్ ఫోన్లు పంపిణీచేసి, ఆన్ లైన్ విధానంలో బోధన చేయాలి.
కరోనా వ్యాక్సిన్ వచ్చేవరకు ప్రభుత్వం ఇటువంటి తలతిక్క ఆలోచనలు చేయడం మానుకుంటే మంచిది.
- 25 Aug 2020 9:19 AM GMT
Ganja Seized: భారీగా గంజాయి పట్టివేత
కృష్ణాజిల్లా : _తెలంగాణ రాష్ట్రం నుండి బీదర్ కు తరలిస్తున్నట్లు సమాచారం.
_నందిగామ మండలం జొన్నలగడ్డ చెక్ పోస్ట్ వద్ద స్కోడా కారులో గంజాయి పట్టివేత.
సుమారు 100 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న నందిగామ పోలీసులు.
_కారులో నలుగురు వ్యక్తులు ఉన్నట్లు వారిలో ఇద్దరు మహిళలు ఉండగా కారు డ్రైవర్ పరారీ లో ఉన్నట్లు సమాచారం.
పట్టుబడిన ముగ్గురు వ్యక్తులతో పాటు కారును నందిగామ పోలీస్ స్టేషన్ కు తరలించి విచారిస్తూన్న పోలీసులు.
- 25 Aug 2020 8:20 AM GMT
Srisailam Temple: శ్రీశైల దేవస్థానంలో అంతర్గత బదిలీలు
కర్నూలు జిల్లా: శ్రీశైల దేవస్థానంలో అంతర్గత బదిలీలు జరుగుతున్నాయి
దేవస్థానం పరిపాలన విభాగాల సౌలభ్యం కోసం సుమారు 40 మందిని బదిలీ ఉత్తరువులు జారీ చేసిన కార్యనిర్వాహన అధికారి కే ఎస్. రామారావు
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire