Live Updates: ఈరోజు (23 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు శుక్రవారం | 23 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | సప్తమి మ.12-01 వరకు తదుపరి అష్టమి | పూర్వాషాఢ నక్షత్రం ఉ.06-46 వరకు తదుపరి ఉత్తరాషాఢ | వర్జ్యం: మ.02-43 నుంచి 04-18 వరకు | అమృత ఘడియలు రా.12-15 నుంచి 03-22 వరకు | దుర్ముహూర్తం: ఉ.08-15 నుంచి 09-02 వరకు తిరిగి మ.12-09 నుంచి 12-56 వరకు | రాహుకాలం: ఉ.10-30 నుంచి 12-00 వరకు | సూర్యోదయం: ఉ.05-59 | సూర్యాస్తమయం: సా.05-31
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 23 Oct 2020 6:51 AM GMT
విజయవాడ
ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మ ను దర్శించుకున్న శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి
శైవ క్షేత్ర పీఠాధిపతి శివస్వామి
కొండ చరియలు విరిగిపడిన వెంటనే సిఎం స్పందించడం అభినందనీయం
కాని ముందుగానే చర్యలు తీసుకుంటే బావుండేది
హిందూధర్మం పై దాడులు జరిగితే ప్రజల్లో తిరుగుబాటు ఎదురవుతుంది
హిందూ ధర్మం పై దాడుల జరుగుతుంటే పోలీసులు కేసులు పెట్టి ఎందుకు అరెస్ట్ చేయడం లేదు
ఇక్కడ గాజులు తొడుక్కొని ఎఎ్వరూ లేరు
నవంవర్ 2న రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో 30 సంస్ధలు కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం
హిందూ ధర్మం పై దాడులు జరగకుండా ప్రభుత్వం స్పందించాలి
మేం ఓట్లేస్తేనే ఆమంత్రి కి మంత్రి పదవి వచ్చింది..
దేవుళ్ళపై వ్యాఖ్యల నేపధ్యంలో ఆ మంత్రిని తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం
- 23 Oct 2020 6:50 AM GMT
తూ.గో జిల్లా పెద్దాపురం..
తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కామెంట్స్
ప్రభుత్వ ఖజానా నింపుకోలవడానికే మోటారు వాహన చట్టం లో మార్పులతో భారీగా జరిమానాలు..
కోటి 31 లక్షల మంది వాహనదారులపై ఏపీ ప్రభుత్వం భారం మోపింది
రవాణా రంగాన్ని వైసిపి ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టేస్తుంది
ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర పధకంలో డబ్బులిచ్చినట్లే ఇచ్చి జరిమానాలతో రెండో చేత్తో అంతకు రెండింతలు గుంజేస్తున్నారు..
భారీగా పెంచిన వాహనాల జరిమానాలతో ఆటో, లారీ వాహనదారులందరూ గగ్గోలు పెడుతున్నారు.
మోటారు వాహనాల చట్టంలోసా నిబంధనలను మరింత కఠినం చేయడం సామాన్యులపై భారీగా భారం మోపడమే.
ప్రస్తుతం కోవిడ్, వరదలు, వర్షాలతో ప్రజలు అనేక సమస్యలతో బాధపతుంటే భారీగా జరిమానాలు వేస్తారా
తెదేపా ప్రభుత్వ హయాంలో వాహాన చట్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించామే తప్ప జరిమానాలు భారీగా వడ్డించలేదు.
వాహనాలు నడపేటప్ఫుడు హెల్మెట్ ధరించకపోతే , సెల్ మాట్లాడితే జరిగే ప్రమాదాలపై ప్రజలలో చైతన్యం తీసుకురావాలి
గత 17 నెలల్లో కొత్తగా ఒక్క రోడ్డు కూడా వేయలేదు. రోడ్లు అభివృద్ధిపై ప్రభుత్వం శ్రద్ద చూపడం లేదు.
- 23 Oct 2020 6:50 AM GMT
అమరావతి
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహాణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు.
ఈ నెల 28న రాజకీయ పార్టీలతో భేటీ కానున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్.
మార్చి 7వ తేదీన స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.
మార్చి 15వ తేదీన కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేసిన ఎస్ఈసీ.
మొత్తం రెండు దశల్లో ఎంపీటీసి, జడ్పీటీసి ఎన్నికలు.
తొలి దశలో 333 జడ్పీటీసీలు, 5,352 ఎంపీటీసీలకు ఎన్నికలు.
17,494 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణ.
తొలి దశలో కోటి 45లక్షల మంది ఓటర్లు.
రెండో దశలో 327 జడ్పీటీసీలు, 4,960 ఎంపీటీసీలకు పోలింగ్.
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ వద్ద వాయిదా పడ్డ స్థానిక ఎన్నికలు.
2129 ఎంపీటీసీ, 125 జడ్పీటీసీ స్థానాల ఏకగ్రీవం.
ఏకగ్రీవాలను రద్దు చేయాలని ప్రతిపక్షాల డిమాండ్.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ నిబంధనలు సడలించడంతో ఎన్నికలు నిర్వహాణపై పార్టీల అభిప్రాయం కోరనున్న ఎస్ఈసీ.
గతంలో జరిగిన ఎన్నికల ప్రక్రియను రద్దు చేసి కొత్తగా మళ్లీ ప్రారంభించాలని డిమాండ్ చేస్తోన్న ప్రతిపక్షాలు.
అధికార పార్టీ బలవంతపు ఏకగ్రీవాలు చేయించిందని గతంలోనే ఎస్ఈసీకి ప్రతిపక్షాల ఫిర్యాదులు.
స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఎస్ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న అంశంపై ఆసక్తి.
- 23 Oct 2020 6:49 AM GMT
*విజయనగరం:
విజయనగరం పట్టణంలోని రైతు బజార్ వద్ద వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రాయితీపై ఉల్లి విక్రయాలు.
రాయితీపై ఉల్లి అమ్మకాలను ఆర్ అండ్ బి రైతుబజార్ వద్ద జాయింట్ కలెక్టర్ డా.జి.సి. కిషోర్ కుమార్ ప్రారంభించారు.
ఒక్కో వ్యక్తికి ఆధార్ కార్డుపై ఒక కిలో ఉల్లి 40 రూపాయలకే అందజేత.
- 23 Oct 2020 6:49 AM GMT
విశాఖ
బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ కామెంట్స్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిపాలనలో దేశం అన్ని విధాలా అభివృద్ధి చెందింది
దేశ ప్రజల సంక్షేమమే మోడీ ప్రధాన లక్ష్యము
కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు ప్రధాని చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలలోకి తప్పుడుగా తీసుకెళ్తున్నాయి
ట్రిపుల్ తలాక్ ను రద్దు చేయడం వల్ల ఉత్తరాది రాష్ట్రాలలో స్త్రీలకు ఎంతో మేలు జరిగింది
కనుకనే 309 సీట్లు ఇచ్చి బీజేపీ ని గెలిపించారు
ఎన్ ఆర్ సి చట్టం వలన మైనారిటీలకు నష్టం వాటిల్లుతున్నదని కాంగ్రెస్, వామపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయి
- 23 Oct 2020 6:47 AM GMT
విశాఖ
ఉల్లిపాయలు కోసం విశాఖ నగరంలో భారీ క్యూలైన్లు
సీతమ్మ ధార, పెందుర్తి రైతు బజార్ లో భారీగా క్యూ కడుతున్న జనాలు
సబ్సిడీ ఉల్లిపాయలు కేజీ రూ.40 కు విక్రయించడం భారీ క్యూ
దసరా దగ్గర పడటంతో ఉల్లిపాయలుకు భారీగా గిరాకి
- 23 Oct 2020 4:12 AM GMT
విజయవాడ
అమ్మవారిని దర్శించుకున్న మంత్రి గౌతమ్ రెడ్డి
అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి
మేకపాటి గౌతమ్ రెడ్డి మంత్రి
మహాలక్ష్మి రూపంలో కనకదుర్గమ్మను దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నా
కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవారిని దర్శనం చేసుకున్నా
రాష్ట్ర ప్రజలంతా ఇలాగే సుఖ సంతోషాలతో ఉండేలా ఆశీర్వదించాలని అమ్మవారిని ప్రార్థించా
- 23 Oct 2020 4:12 AM GMT
అమరావతి
నేటి నుంచి ఏపీలో సబ్సిడీపై ఉల్లి అమ్మకాలు.
రాష్ట్రంలో ప్రధానమైన పట్టణాలు, నగరాలలో ఉన్న అన్ని రైతు బజార్లలో సబ్సిడీపై 40రు లకు ఉల్లి అమ్మకాలు.
బహిరంగ మార్కెట్లో 80 నుంచి 120రులకు ఉల్లి అమ్మకాలు.
ధరలు అదుపులోకి వచ్చే వరకు సబ్సిడీపై ఉల్లిని సబ్సిడీపై అమ్మకాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయం.
- 23 Oct 2020 4:10 AM GMT
తిరుమల
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి.
కరోనా కారణంగా ఉత్సవాలను వైభవంగా ఏకాంతంగా శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో వాహన సేవలను టీటీడీ నిర్వహించింది.
8వ రోజు ఉదయం స్వర్ణరథం బదులుగా శ్రీ మలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి సర్వభూపాల వాహనంపై దర్శనమిస్తారు.
రాత్రి 7 గంటలకు అశ్వ వాహన సేవ
- 23 Oct 2020 4:10 AM GMT
తిరుమల సమాచారం
నిన్న శ్రీవారిని దర్శించుకున్న 17,752 మంది భక్తులు
తలనీలాలు సమర్పించిన 5,869 మంది భక్తులు
నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.33 కొట్లు
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire