Live Updates: ఈరోజు (23 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు శుక్రవారం | 23 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | సప్తమి మ.12-01 వరకు తదుపరి అష్టమి | పూర్వాషాఢ నక్షత్రం ఉ.06-46 వరకు తదుపరి ఉత్తరాషాఢ | వర్జ్యం: మ.02-43 నుంచి 04-18 వరకు | అమృత ఘడియలు రా.12-15 నుంచి 03-22 వరకు | దుర్ముహూర్తం: ఉ.08-15 నుంచి 09-02 వరకు తిరిగి మ.12-09 నుంచి 12-56 వరకు | రాహుకాలం: ఉ.10-30 నుంచి 12-00 వరకు | సూర్యోదయం: ఉ.05-59 | సూర్యాస్తమయం: సా.05-31

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 23 Oct 2020 4:09 AM GMT

    అనంతపురం: జిల్లాలో నారా లోకేష్ పర్యటన

    ఉదయం 10 గంటలకు గుత్తి మండలం కరిడికొండ కు చేరుకొనున్న లోకేష్

    అక్కడ రైతులతో సమావేశం

    11 45 గంటలకు పెద్దవడుగూరు మండలం మిడుతూరు లో నష్టపోయిన పంటపొలాలను పరిశీలిస్తారు.

    అక్కడ రైతులతో సమావేశం కానున్న లోకేష్ సాయంత్రం 03:15 గార్లదిన్నె మండలం రామదాసు పేట లో పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు

    నాలుగు గంటలకు అనంతపురం గ్రామీణ మండలం కామారుపల్లి లో రైతులతో ముఖాముఖి అనంతరం తిరిగి హైదరాబాద్కు పయనం

  • 23 Oct 2020 4:09 AM GMT

    కర్నూలు జిల్లా

    శ్రీశైలంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న దసరా మహోత్సవాలు

    7వ రోజుకు చేరుకున్న ఉస్సవాలు, నేడు అమ్మవారికి కాళరాత్రి అలంకారం, స్వామిఅమ్మవార్లకు గజవాహనసేవ

    ఉత్సవాలలో భాగంగా శ్రీస్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం,అమ్మవారికి శ్రీచక్రార్చన, నవావరణార్చన, విశేష కుంకుమార్చనలు

    స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు రుద్రహోమము చండీహోమములు

  • 23 Oct 2020 4:09 AM GMT

    కర్నూలు జిల్లా....

    శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

    10 గేట్లు 15 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల

    ఇన్ ఫ్లో : 2,77,090 క్యూసెక్కులు

    ఔట్ ఫ్లో : 4,13,367 క్యూసెక్కులు

    పూర్తి స్థాయి నీటి మట్టం: 885.00 అడుగులు

    ప్రస్తుతం : 884.60 అడుగులు

    పూర్తిస్దాయి నీటి నిల్వ : 215.8070 టిఎంసీలు

    ప్రస్తుతం: 213.4011 టీఎంసీలు

    కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

  • 23 Oct 2020 4:08 AM GMT

    విశాఖ..

    నేటి నుండి రైతుబజార్ల లో సబ్సీడీ ఉల్లి విక్రయాలు .

    కిలో 40/- చొప్పున ఒక్కోక్కరికి ఒక కిలో అందించే ఏర్నాట్లు.

  • 23 Oct 2020 4:08 AM GMT

    విశాఖ...

    వెదర్ అప్ డేట్

    బంగాళాఖాతంలో వాయుగుండం...

    బంగ్లాదేశ్, బెంగాల్ వైపు పయనిస్తోండడంతో ఏపి కి తప్పిన ముప్పు

    పారాదీప్ (ఒడిశ్శా) కు 150 కీ.మీ, సాగర్ దీవులు (పశ్చిమ బెంగాల్) కు 320, బంగ్లాదేశ్ కు 490 కీ.మీ. దూరంలో కేంద్రీకృతం..

    ఒడిశ్శా వద్ద 24 గంటలలో తీరం దాటుతుంది...

    బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావం.

    వాయుగుండం ప్రభావం ఏపి పై పెద్దగా లేనప్పటికీ ఉత్తరాంధ్ర లో వర్షాలు పడే సూచనలు...

    ఉత్తర కోస్తా తీరం అలజడి

    2.3 మీటర్ల ఎత్తుకు అలలు ఎగసిపడే అవకాశం

    మత్స్యకారులు కు కొనసాగుతున్న హెచ్చరికలు..

  • 23 Oct 2020 4:08 AM GMT

    విజయవాడ

    7వ రోజుకి చేరుకున్న దసరా శరన్నవరాత్రి వేడుకలు

    నేడు అమ్మవారు శ్రీ మహాలక్ష్మిగా భక్తులకు దర్శనం

    తెల్లవారుజాము 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శనం

    కోవిడ్ నిబంధనలు మధ్య కొనసాగుతున్న శరన్నవరాత్రి వేడుకలు

Print Article
Next Story
More Stories